indian national flag
-
కాకినాడలో 300 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ
-
.. కింద మేడిన్ చైనా అని వుంది..!
.. కింద మేడిన్ చైనా అని వుంది..! -
Nature Tricolor Photo: ప్రకృతి దిద్దిన మువ్వన్నెల జెండా
ప్రకృతి చిత్రవిచిత్రాలు చేస్తుంది. అందుకు నిదర్శనం ఈ చిత్రం. అస్తమయానికి ముందుగా సూర్యుడు పులుముకున్న సింధూరం. సముద్రపు అలల నురగల శ్వేతవర్ణం. సాగర తీరాన పరుచుకున్న పచ్చదనం. ఆకాశం, నీరు, నేల.. ప్రకృతి సమస్తం మువ్వన్నెల జెండాను ప్రతిబింబిస్తోంది కదా! ఈ చిత్రాన్ని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ప్రకృతి రూపొందించిన మన త్రివర్ణ పతాకం’అంటూ కామెంట్‌ను జత చేశారు. Our Pride, Our Tiranga! 🇮🇳 #AmritMahotsav #MomentsWithTiranga #HarGharTiranga Image Courtesy: @singhsanjeevku2 pic.twitter.com/pUdBNt8C03 — MyGovIndia (@mygovindia) July 10, 2022 -
పాలిస్టర్ జాతీయ జెండా అమ్మకాలపై జీఎస్టీ మినహాయింపు
న్యూఢిల్లీ: పాలిస్టర్ లేదా యంత్రంపై తయారైన భారత జాతీయ జెండా అమ్మకంపైనా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపు లభించనుంది. ఆర్థికశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. చేతితో నేసిన లేదా అల్లిన పత్తి, పట్టు, ఉన్ని లేదా ఖాదీ జాతీయ జెండాలు ఇప్పటికే జీఎస్టీ నుండి మినహాయింపు పొందుతున్నాయి. అయితే పాలిస్టర్, యంత్రంపై తయారైన జాతీయ పతాకాన్నీ జీఎస్టీ నుంచి తాజాగా మినహాయిస్తున్నట్లు తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి తాజా వివరణ వెలువడింది. -
గల్వాన్‌లో మువ్వన్నెల జెండా
న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని గల్వాన్‌లోయలో భారీ భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న ఆర్మీ బలగాల ఫొటోలను రక్షణ వర్గాలు విడుదల చేశాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా భారత సైనిక బలగాలు లోయలో భారత జెండాతో ప్రదర్శన నిర్వహించాయి. ఈ లోయ తమ అదీనంలో ఉన్నట్లు చూపుతూ చైనా ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలను తిప్పికొట్టేందుకే భారతీయ రక్షణ వర్గాలు తాజా ఫొటోలు విడుదల చేశాయి. చైనా బలగాలు చైనా జాతీయ జెండాతో గల్వాన్‌లోయలో ఉన్నట్లు చూపే చిత్రాలను ఆదేశం మూడు రోజుల కిందట విడుదల చేసింది. దీంతో ఈ ప్రాంతం మొత్తం చైనా అధీనంలోకి వచ్చిందన్న దుమారం రేగింది. అయితే ఇవన్నీ చైనా వక్రబుద్ధికి చిహ్నాలని, ఆ ప్రాంతంపై చైనా పట్టు లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. చైనా విడుదల చేసిన చిత్రాలు గల్వాన్ లోయ అవతలి ప్రాంతంలోనివని, ఫొటోల్లోని ప్రాంతం నిస్సైనిక మండలం దగ్గరలో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో భారతీయ ఆర్మీ గల్వాన్‌లోయలో ఉన్న చిత్రాలు విడుదలయ్యాయి. న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు సైతం తన ట్విట్టర్ అకౌంట్లో ఈ చిత్రాలను పోస్ట్ చేశారు. నూతన సంవత్సర సందర్భంగా గల్వాన్‌లోయలో వీర భారతీయ సైనికులు అని ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. భారతీయ వర్గాలు విడుదల చేసిన ఫొటోలను ఈనెల 1న గల్వాన్‌లోయలో తీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక ఫొటోలో అసాల్ట్ రైఫిళ్లు ధరించిన దాదాపు 30 మంది భారతీయ సైనికులు జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. మరో ఫొటోలో నలుగురు సైనికులు భారతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. ఇందులో డోగ్రా రెజిమెంట్ జెండా కూడా కనిపిస్తోంది. నూతన సంవత్సర సందర్భంగా సరిహద్దుల్లో భారతీయ రక్షణ వర్గాలు చైనా సైనికులకు స్వీట్లు పంచి సహృద్భా వం చాటారు. కానీ చైనా మాత్రం కుయుక్తితో నకిలీ ఫొటోలను, అభూత వీడియోను విడుదల చేసింది. -
పులకించిన కిలిమంజారో
కిలిమంజారో పర్వతం. ఓ దశాబ్దంగా వార్తల్లో తరచూ కనిపిస్తున్న ఈ పర్వతం మీదనున్న ఉహురు శిఖరం ఎత్తు 5895 మీటర్లు. ఆఫ్రికా ఖండంలో ఎల్తైన పర్వతం ఇది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎల్తైన ఏడు పర్వతశిఖరాల్లో నాలుగవది. ఈ శిఖరం మీద అక్టోబర్ మూడవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు మన భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మౌంటనియర్ పదమూడేళ్ల పులకిత హస్వి మన తెలుగమ్మాయి. ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో అధిరోహించాలనే కోరిక ఇంత చిన్న వయసులో ఎందుకు కలిగి ఉంటుంది... అనే సందేహం రావడం సహజమే. ఇది హస్వికి కోవిడ్ కాలంలో రేకెత్తిన ఆలోచన. లాక్డౌన్ కారణంగా స్కూళ్లు లేవు. పులకిత హస్వి ఇష్టంగా నేర్చుకుంటున్న బ్యాడ్మింటన్‌ను కూడా విరామం తప్పలేదు. ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలు చూడడమే పనిగా ఉన్న సమయం అది. ఆ చూడడంలో ఎవరెస్ట్ అనే ఇంగ్లిష్ సినిమాను చూడడం కాకతాళీయమే. కానీ ఆ చూడడం ఈ అమ్మాయి అభిరుచిని, గమనాన్ని మార్చేసింది. ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు నడిపించింది. ఆ తర్వాత కిలిమంజారో శిఖరానికి చేర్చింది. ఇదంతా ఈ ఏడాదిలో జరిగిన పురోగతి మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా చూసింది, ఎవరెస్ట్ అధిరోహిస్తానని అమ్మానాన్నలను అడిగింది. ఏప్రిల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రోజు రాత్రి అమ్మానాన్నలతో ‘సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేస్తాన’ని తన తర్వాతి లక్ష్యాన్ని బయటపెట్టింది పులకిత హస్వి. అలాగే కిలిమంజారో పర్వతారోహణ పూర్వాపరాలను సాక్షితో పంచుకుంది. తొలి ఘట్టం ఎవరెస్ట్ బేస్ క్యాంపు ‘‘మా నాన్నది మంచిర్యాల, అమ్మ వాళ్ల ఊరు కర్నూలు జిల్లా నంద్యాల. ఇద్దరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. నా చిన్నప్పుడు వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉండేవాళ్లం. అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి అవకాశం బాగా ఉండేది. అన్నయ్య, నేను ఇద్దరం ఎప్పుడూ ఏదో ఒక కోచింగ్ లో ఉండేవాళ్లం. కీబోర్డ్, గిటార్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆర్కిస్టిక్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేసి నేషనల్స్‌కు వెళ్లాను. నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సీరియెస్‌గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. కానీ కోవిడ్‌తో ప్రాక్టీస్ ఆగిపోయింది. మౌంటనియరింగ్ వైపు దృష్టి మళ్లింది. ఎవరెస్ట్ అధిరోహించడానికి ముందు బేస్‌క్యాంప్ ట్రెక్ పూర్తి చేసి ఉండాలి. అందుకే తొలి ప్రయత్నంగా బేస్ క్యాంపు ట్రెక్ పూర్తి చేశాను. 2024–2025 కి సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేయాలనేది నా టార్గెట్. ఆ తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్ వైపు వెళ్లాలనేది ఇప్పటి నా ఆలోచన. సెవెన్ సమ్మిట్స్ పూర్తయిన తర్వాత అప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తాను’’ అంటూ భుజాలు ఎగరేస్తూ నవ్వింది పులకిత హస్వి. గడ్డకట్టిన నీళ్లు ‘కిలిమంజారో సమ్మిట్ పూర్తి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇక్కడితో సంతృప్తి చెందితే మిగిలిన సమ్మిట్స్ పూర్తి చేయలేనని కూడా ఆ క్షణంలోనే గుర్తు వచ్చింది’ అంటూ కిలిమంజారో అధిరోహణ అనుభవాలను చెప్పింది పులకిత హస్వి. ‘‘సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ ఎనిమిది వరకు సాగిన ట్రిప్‌లో యాక్చువల్ పర్వతారోహణ మొత్తం ఐదు రోజులే. నాలుగో రోజు శిఖరాన్ని చేరతాం. ఐదవ రోజు కిందకు దిగుతాం. శిఖరాన్ని చేరే లోపు నాలుగు రోజుల్లో ఏడెనిమిది రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాం. మంచు దట్టంగా పొగలా కమ్మేసి ఉంటుంది. ముందు ఏముందనేది స్పష్టంగా కనిపించదు. నాలుగో రోజు ఆహారం కూడా ఉండదు. రెండు చాక్లెట్లు, ప్రొటీన్ బార్ మాత్రమే ఆహారం. అంతకు మించి ఏమీ తినాలనిపించదు కూడా. మైనస్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మాతో తీసుకువెళ్లిన బాటిల్లోని నార్మల్ వాటర్ గడ్డకట్టిపోయాయి. ఫ్లాస్క్‌లో తీసుకువెళ్లిన వేడినీటిని కలుపుకుని తాగాను. స్నోఫాల్ని దగ్గరగా చూడగలిగాను. కిలిమంజారో పర్వతం మీద మంచు కురుస్తుంటే పక్కనే మరో పర్వతం మీద సూర్యుడి కిరణాలు కాంతులీనుతున్నాయి. ప్రకృతి చేసే ఇలాంటి అద్భుతమైన విన్యాసాలను బాగా ఎంజాయ్ చేశాను. ఈ పర్వతారోహణ వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. స్పాట్ డెసిషన్ తీసుకోవడం అనేది ప్రాక్టికల్‌గా తెలిసి వచ్చింది. ఐదవరోజు పర్వతాన్ని దిగేటప్పుడు చాలాసార్లు పల్టీలు కొట్టుకుంటూ పడిపోయాను. ‘అయ్యో పడిపోయావా’ అంటూ లేవదీయడానికి ఎవరూ ఉండరు. మనకు మనమే సంభాళించుకుని లేచి ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే ఒకటి– రెండు సార్లు పడిన తర్వాత ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలిసి వస్తుంది. ఆ తర్వాత పడకుండా సాగిన ప్రయాణమే పెద్ద విజయంగా అనిపిస్తుంది. కిలిమంజారో ఎక్స్‌పెడిషన్‌కు వెళ్లడానికి ముందు మూడు నెలలపాటు ఫిట్నెస్ ప్రాక్టీస్ చేశాను. ఫిట్నెస్ క్లాసులు కూడా డిజిటల్ మీడియా ద్వారానే. మా కోచ్ వాట్సాప్‌లో ఏరోజుకారోజు టాస్క్ ఇస్తారు. హైట్స్‌కి వెళ్లకుండా ప్రాక్టీస్ మొత్తం నేల మీదనే కావడంతో శిఖరం మీదకు వెళ్లినప్పుడు వామిటింగ్ ఫీలింగ్ కలిగింది. అంతకు మించి ఎక్కడా ఇబ్బంది పడలేదు. మా టీమ్‌లో మొత్తం ఏడుగురున్నారు. నేనే చిన్నదాన్ని. అరవై ఏళ్ల మౌంటనియర్ కూడా ఉన్నారు. మాలో శిఖరాన్ని చేరింది నలుగురే. కిలిమంజారో పర్వతారోహణ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందనేది నాకే స్పష్టంగా తెలుస్తోంది. ఏడు సమ్మిట్స్‌ని పూర్తి చేసి తీరుతాను’’ అన్నది హస్వి. సెవెన్ సమ్మిట్స్ ఎవరెస్ట్ (8,849 మీటర్లు)– ఆసియా, అకాంగువా (6,961 మీటర్లు) – సౌత్ అమెరికా, దేనాలి (6,194 మీటర్లు)– నార్త్ అమెరకా, కిలిమంజారో (5,895 మీటర్లు)– ఆఫ్రికా, ఎల్బ్రస్ (5,642 మీటర్లు)– యూరప్, విన్సాన్ మాసిఫ్ (4,892 మీటర్లు)– అంటార్కిటికా, కోస్కియుజ్కో (2,228 మీటర్లు) – ఆస్ట్రేలియా. పులకిత సాధించిన పతకాలు; కిలిమంజారో నేషనల్ పార్క్ వద్ద పులకిత -
పింగళిని స్మరించుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి : భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. ‘మన రాష్ట్రంలో జన్మించిన గొప్ప వ్యక్తి. స్వాతంత్ర్య సమరయోధుడు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. అదే ఆయనను అజరామరుడిని చేసింది’ అని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరైన పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా, భట్ల పెనుమర్రులో జన్మించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో పతాకాలు వినియోగించినప్పటికీ.. పింగళి రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ మహాత్మాగాంధీ అధ్యక్షతన విజయవాడలో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ తర్వాత ఈ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై 'రాట్నం' గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నాటి ప్రధాని నెహ్రూ సూచనమేరకు రాట్నం స్థానంలో అశోకచక్రం చేర్చారు. -
డివిలియర్స్‌పై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్
న్యూఢిల్లీ : విధ్వంసక క్రికెటర్, ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్‌పై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టింగే అందుకు కారణం. దక్షిణాఫ్రికాలో తయారయ్యే ద ఫస్ట్ ఎలెవన్ అనే వైన్ బ్రాండ్ ఉత్పత్పులు భారత్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ క్రమంలో డివిలియర్స్ ‘మా దేశ వైన్ ఇప్పుడు భారత్‌లో దొరుకుతోంది. చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఓ బాటిల్ పట్టుకుంటే మీరు ఏం ఆలోచిస్తారంటూ’ ట్వీట్ చేశాడు. అదే ఉత్సాహంలో ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అదే సమాచారాన్ని రాసుకొచ్చిన డివిలియర్స్.. భారత జాతీయ పతాకం ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. న్యూఢిల్లీలో ఆల్కహాల్ బ్రాండ్ లాంచ్ అయిందంటూ త్రివర్ణ పతాకాన్ని అప్లోడ్ చేయడమేంటని ఏబీని ప్రశ్నిస్తున్నారు. భారతీయులను అవమానించడంతో పాటు.. క్రికెట్‌ను పక్కనపెట్టి ఆల్కహాల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చాలా గొప్ప పనులు చేస్తున్నావంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. భారతీయులం నిన్ను ఎంతగానో అభిమానిస్తే.. నువ్వు మాత్రం నీ నీచబుద్ధిని ప్రదర్శించావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్-11 సీజన్ అనంతరం క్రికెట్ అన్ని ఫార్మాట్లకు డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. Exciting times! A taste of our very own wines in Incredible India. If u get your hands on a bottle please let us know what u think @firstxiwines A post shared by AB de Villiers (@abdevilliers17) on Jul 18, 2018 at 12:29am PDT -
జాతీయ పతాకానికి అవమానం!
సాక్షి, కాటారం : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరణలో అపశృతి దొర్లింది. ఎగురవేస్తుండగా తాడు నుంచి జాతీయ పతాకం విడివడి గాల్లోకి ఎగిరి కింద పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చోటుచేసుకుంది. అయితే వెంటనే తమ పొరపాటును గుర్తించి జెండాను సరిచేసి మరోసారి ఎగురవేశారు. దీనిపై మార్కెట్ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జెండా కర్రను రాత్రి సిద్ధం చేశామని, అయితే తాడును ఎలుకలు ఏమైనా కొరికి ఉండొచ్చునని, దీన్ని గమనించకపోవడం వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. జాతీయ జెండాకు అవమానం జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
గౌతమ్ గంభీర్ ట్వీట్లపై వివాదం
న్యూఢిల్లీ: భారత జాతీయ జెండాలోని మూడు రంగులకు కొత్త అర్థాన్ని, కొత్త భాష్యాన్ని చెబుతూ భారత క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్‌పై ఇప్పుడు వివాదం రగులుతోంది. ఏ ఉద్దేశాలతోని జాతీయ జెండాలోకి మూడు వర్ణాలను ఎంపిక చేశారో, అందుకు పూర్తి విరుద్ధంగా కొత్త భాష్యం చెప్పడమంటే మన జాతీయ జెండానే అవమానించడేమేనని కొందరు విమర్శిస్తుండగా, అందుకు ఆయనపై కేసు పెట్టాలని మరికొందరు అదే సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. 'భారత జాతీయ జెండాలోని కాషాయం రంగు మా కోపానికి నిదర్శనమని, తెల్లరంగు జిహాదీల శవాలపై తెల్లగుట్ట కప్పడమని, ఆకుపచ్చ రంగు విద్వేషమన్న అర్థాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని భారత వ్యతిరేకులు మరచిపోయినట్టున్నారు' అని గంభీర్ గురువారం ట్వీట్ చేశారు. జాతీయ జెండాలోని కాషాయ రంగు భారత దేశ పటిష్టతకి, ధైర్యానికి చిహ్నమని, మధ్యనుండే తెల్లరంగు, అందులోని అశోక చక్రం శాంతికి, నిజానికి చిహ్నమని, ఇక ఆకుపచ్చ రంగు పరిపుష్టతకు, వృద్ధికి చిహ్నమని జెండా రూపకర్తలు సంక్షిప్తంగా సూచించారు. భారత తొలి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ జెండాలోని రంగుల విశిష్టత గురించి కాస్త విఫులంగా చెప్పారు. కాషాయ రంగు ధైర్య సాహసాలకే కాదు, పరిత్యాగాన్ని సూచిస్తుందని, రాజకీయ నాయకులంతా తమ విధులకు అంకితం కావాలన్న స్ఫూర్తి ఇందులో ఉందన్నారు. అలాగే తెల్ల రంగు గురించి చెబుతూ అది ఒక వెలుతురు లాంటిదని, నాయకుల రుజువర్తనకు ఈ వెలుగు దారిచూపాలని చెప్పారు. ఆకుపచ్చ రంగు భూమితో మనకున్న అనుబంధాన్ని, భూమిపైనున్న చెట్లు, ఇతర ప్రాణుల పట్ల మనకుండాల్సిన ప్రేమను సూచిస్తుందని, అశోకచక్రం ధర్మాన్ని సూచిస్తోందని చెప్పారు. క్రికెట్‌తోపాటు గౌతమ్ గంభీర్ తీరిక వేలళ్లో సర్వేపల్లి రాధాకృష్ణ పుస్తకాలు చదవడం మంచిదని కూడా కొందరు సూచిస్తున్నారు. -
జెండాకు అవమానం.. వివాదంలో చైనా ఫోన్‌కంపెనీ!
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో చిక్కుల్లో పడింది. నోయిడాలోని ఆ కంపెనీ ఉద్యోగి ఒకరు భారత జెండాను చింపి.. చెత్తకుప్పలో వేసినట్టు అభియోగాలు రావడంతో ఇక్కడ ఒక్కసారిగా ఉద్రికత్త తలెత్తింది. జాతీయ జెండాలను పట్టుకొని పలువురు వ్యక్తులు ఒప్పో ఇండియా కార్యాలయం ముందు చేరుకొని నిరసనప్రదర్శనకు దిగారు. ఒప్పో కంపెనీ భారత జెండాను అవమానించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒప్పో కంపెనీ భారత జెండాను అవమానించిందన్న కథనాలు, ట్వీట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ అంశంపై చాలామంది ట్వీట్ చేస్తున్నారు. యూపీ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించి.. ఒప్పో కంపెనీపై చర్య తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. Chinese employee of @oppo at Noida torn off the Indian National Flag and dumped in dustbin. People have reached the site with Flags. pic.twitter.com/vLT1DjciAv — Rishi Muni (@RishiUvaach) 28 March 2017 -
జాతీయ పతాకం.. జాతీయ గీతం మన దేశ సంపద
స్వామిగౌడ్ నార్సింగి: రాజేంద్రనగర్ బండ్లగూడలోని శారదాధామంలో శుక్రవారం సాయంత్రం భారత జాతీయ పతాక 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, సరస్వతీ విద్యామందిర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పతాకం, జాతీయ గీతం, వందేమాతరం జాతీయ సంపద అని అన్నారు. రోజూ ఉదయం లేవగానే భారతమాతాకీ జై అని నినదించి తమ పనులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కె.హెచ్.ఎస్.జగదాంబ, వి.రాముడు యాదవ్, ప్రమీల యాదవ్, కె.సంజీవ్‌కుమార్, సురేష్, నర్సింహా రెడ్డి, రావుల విశ్వనాథ్‌రెడ్డి, రాంప్రసాద్‌రావు, ప్రవీన్‌కుమార్, పి.రాజు, ప్రజాప్రతినిధులు, నాయకులు మల్లేష్, కృష్ణా రెడ్డి, హరికృష్ణ, స్వర్ణలత భీమార్జున్‌రెడ్డి హాజరయ్యారు.