జెండాకు అవమానం.. వివాదంలో చైనా ఫోన్‌కంపెనీ!
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో చిక్కుల్లో పడింది. నోయిడాలోని ఆ కంపెనీ ఉద్యోగి ఒకరు భారత జెండాను చింపి.. చెత్తకుప్పలో వేసినట్టు అభియోగాలు రావడంతో ఇక్కడ ఒక్కసారిగా ఉద్రికత్త తలెత్తింది. జాతీయ జెండాలను పట్టుకొని పలువురు వ్యక్తులు ఒప్పో ఇండియా కార్యాలయం ముందు చేరుకొని నిరసనప్రదర్శనకు దిగారు. ఒప్పో కంపెనీ భారత జెండాను అవమానించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒప్పో కంపెనీ భారత జెండాను అవమానించిందన్న కథనాలు, ట్వీట్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ అంశంపై చాలామంది ట్వీట్ చేస్తున్నారు. యూపీ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించి.. ఒప్పో కంపెనీపై చర్య తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Chinese employee of @oppo at Noida torn off the Indian National Flag and dumped in dustbin.
— Rishi Muni (@RishiUvaach) 28 March 2017
People have reached the site with Flags. pic.twitter.com/vLT1DjciAv