
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో యూపీలోని నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలల్లో ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణను పొడిగించారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌతమ్ బుద్ధ నగర్ పరిపాలనా అధికారులు నవంబర్ 25 వరకు అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆఫ్‌లైన్ తరగతులపై నిషేధాన్ని నవంబర్ 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం ఇటీవల ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేసింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 'చాలా తీవ్రమైన' కేటగిరీకి చేరుకోవడంతో ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేశారు. డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డియోస్) ధరమ్‌వీర్ సింగ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో శనివారం గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం అలీపూర్, అశోక్ విహార్, ఆనంద్ విహార్, బవానా, డీటీయూ, ద్వారక, చాందినీ చౌక్, జహంగీర్‌పురి, నరేలా, నెహ్రూ నగర్, మందిర్ మార్గ్, పట్‌పర్‌గంజ్, రోహిణి, వజీర్‌పూర్, పంజాబీ బాగ్ తదితర ప్రాంతాల్లో వాయునాణ్యత 400 కంటే ఎక్కువ నమోదైంది.
ఇది కూడా చదవండి: 8 నుంచి 16 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment