అధికారులకు అరగంట శిక్ష! | Noida CEO Punished Officials Stand Work Due to Ignore Old Couple Viral Video | Sakshi
Sakshi News home page

వీడియో: భలే.. భలే.. అధికారులకు అరగంట శిక్ష!

Published Tue, Dec 17 2024 5:34 PM | Last Updated on Tue, Dec 17 2024 6:36 PM

Noida CEO Punished Officials Stand Work Due to Ignore Old Couple Viral Video

అధికారులు ప్రజలతో వ్యవహరించే తీరు కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుతుంటుంది. ఆ టైంలో చూసేవాళ్లకు రక్తం మరిగిపోతుంటుంది. వాళ్లు ఉన్నది తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడానికే కదా! అనుకుంటాం. అయితే.. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు ఇక్కడ ఓ ఉన్నతాధికారి భలే శిక్ష విధించారులేండి.

అది నోయిడా అథారిటీ కార్యాలయం. సోమవారం నాడు ఓ వృద్ధ జంట తమ పని కోసం అక్కడికి వచ్చారు. చాలాసేపు దాకా అక్కడున్నవాళ్లెవరూ వాళ్లను పట్టించుకోలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ వాళ్లు అలా నిలబడే ఉండిపోయారు. ఇది  నోయిడా అథారిటీ సీఈవో లోకేష్‌ ఎం గమనించారు. మరో అరగంట పోయాక చూస్తే.. ఆ వృద్ధ జంట అలాగే నిలబడి ఉన్నారట!. దీంతో.. ఆయన తన క్యాబిన్‌ నుంచి బయటకు వచ్చారు.

వెంటనే.. బయటకు వచ్చి అరగంట పాటు నిలబడి పని చేయండి అని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. దీంతో అక్కడున్నవాళ్లంతా నిర్ఘాంతపోయారు.  అలా నిలబడి పని చేస్తే.. ఆ వృద్ధ జంట పడ్డ కష్టమేంటో మీకు తెలుస్తుంది అని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది. హ్యాట్సాఫ్‌ సర్‌!.. ప్రస్తుతం ఆ శిక్షకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement