డ్యాన్స్‌ చేస్తుండగా ఆగిన కానిస్టేబుల్‌ గుండె | Delhi Constable Sudden Death While Dancing, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

తీవ్ర విషాదం.. డ్యాన్స్‌ చేస్తుండగా ఆగిన కానిస్టేబుల్‌ గుండె

Published Fri, Aug 30 2024 8:19 AM | Last Updated on Fri, Aug 30 2024 9:09 AM

Delhi Constable Sudden Death While Dancing Video Viral

గుండె ఆగిపోయి.. హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి మరణాల వెనుక.. వైద్యపరంగా ఆరోగ్య సమస్యలూ ఉండొచ్చనే అభిప్రాయమూ నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. తాజాగా ఢిల్లీలో ఓ యువ పోలీస్‌ కానిస్టేబుల్‌ డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. 

ఢిల్లీ రూప్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్‌.. స్టేషన్‌ హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా రవికుమార్‌ పలు పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో.. 

అతడి సహచరులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. రవికుమార్‌ చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు తమతో సరదాగా ఉన్న కానిస్టేబుల్‌ మృతిచెందడంతో ఆయన మిత్రులు షాక్‌కు గురయ్యారు. హెడ్‌ కానిస్టేబుల్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన రవికుమార్‌ 2010లో ఢిల్లీ పోలీస్‌ విభాగంలో చేరాడు. అతడి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 45 రోజుల క్రితమే రవికుమార్‌ యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకున్నట్లు తెలుస్తోంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement