విషాదం: రామజపంతో కుప్పకూలిన ‘హనుమాన్‌’ | Man Playing Hanuman Role Collapsed During Ram Leela At Haryana Bhiwani Dies Of Heart Attack, Video Viral - Sakshi
Sakshi News home page

Hanuman Actor Collapsed Video: విషాదం.. రామ నామ జపంతో కుప్పకూలిన ‘హనుమాన్‌’

Jan 23 2024 9:26 AM | Updated on Jan 23 2024 11:36 AM

Hanuman Actor Collapsed During Ram Leela At Haryana Bhiwani Dies - Sakshi

రామ నామస్మరణతో పరవశించిపోయిన హనుమంతుడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో.. 

Sudden Death Video: అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. సోమవారం దేశమంతా భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. పల్లెపట్టణం తేడా లేకుండా రామ మందిర వేడుకల్ని ఘనంగా చేసుకున్నాయి. దేశం నలుమూలల ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఆలయాల్లో బయటా.. అన్నదానాలు.. బాణాసంచా కాల్చి సంబురాలు.. రథయాత్రలు.. ఊరేగింపులు.. రామాయణ ఘట్టాల్ని నాటక రూపంలో ప్రదర్శనలు నిర్వహించారు.   ఈ క్రమంలో హర్యానా భివానీలో నిర్వహించిన ‘రామ్‌లీలా’లో విషాదం చోటుచేసుకుంది. 

హనుమంతుడి వేషధారణలో ఉన్న నటుడు రామ నామం జపిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే ఆయన నటిస్తున్నారేమో అనుకుని అంతా చప్పట్లు కొట్టగా.. రాముడి వేషధారణలో ఉన్న నటుడు దగ్గరగా వెళ్లి చూసేసరికి చలనం లేకుండా పడి ఉన్నాడు. హుటాహుటిన అలాగే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 

Video Credits: Haryana Tak

మృతుడి పేరును హరీష్‌ మెహతా. విద్యుత్‌ శాఖలో జూనియర్‌ ఇంజినీర్‌గా పని చేసిన ఆయన పదవీ విరమణ పొందారు. గత పాతికేళ్లుగా ఆయన హనుమంతుడి వేషధారణతో అలరిస్తూ వస్తున్నారు. సోమవారం ఒకవైపు అయోధ్య ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమమయంలో భివానీ జవహార్‌ చౌక్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement