Lord Hanuman
-
ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్‌గా నటించిన నటులెవరో తెలుసా?
హనుమాన్ను కేవలం దైవంగానే కాదు.. పిల్లల దృష్టిలో సూపర్ హీరోగానూ వెండి తెర ఆవిష్కరించింది. ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న జై హనుమాన్ చిత్రంలో కన్నడ నటుడు, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ లుక్ రివీల్ చేశారు. అయితే..గతంలోనూ కొందరు నటులు వెండి తెరపై హనుమంతుడి అవతారంలో ఆడియొన్స్‌ను మెప్పించే ప్రయత్నమూ చేశారు. వాళ్లెవరంటే..దేవ్‌దత్తా నాగేఆదిపురుష్(2023).. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను రాముడి(రాఘవ)గా చూపించిన ప్రయత్నం. అయితే ఆకట్టుకోని విజువల్స్, పైగా కంటెంట్ విషయంలోనూ ఆ చిత్రం తీవ్ర విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ చిత్రంలో మరాఠీ నటుడు దేవ్‌దత్తా నాగే.. హనుమంతుడి(భజరంగ్) పాత్రలో నటించాడు. కానీ, ఆ క్యారెక్టర్ కూడా ఇంటర్నెట్లో నవ్వులపాలవ్వడంతో ఆయన కష్టం వృథా అయ్యింది.ఏ. జనార్ధన రావుతెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆంజనేయస్వామి పాత్రలకు రిఫరెన్స్‌గా ఈయన్ని చూపిస్తుంటారు. ఏకంగా 20 చిత్రాల్లో ఆ పాత్రలో నటించారాయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన జనార్ధన రావు.. 1955లో మిస్టర్ ఇండియా టైటిల్ దక్కించుకున్నారు. కమలాకర కామేశ్వర రావు తీసిన వీరాంజనేయ (1968)చిత్రంలో తొలిసారి ఆయన హనుమాన్ పాత్రలో నటించారు. అయితే తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ ప్రభావంతో దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు హనుమంతుడి పాత్రల విషయంలో ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు దర్శకనిర్మాతలు. అలా.. శ్రీ రామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ కృష్ణ సత్య, ఎన్టీఆర్ సూపర్‌మేన్.. చిత్రాలు ఈనాటికి ఆయన హనుమంతుడి రూపాన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి. రాజనాలతెలుగు విలన్లలో అగ్రతాంబూలం అందుకున్న తొలి నటుడు.. బహుశా ఇంటి పేరునే స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్న తొలి నటుడు కూడా ఈయనేనేమో!(రాజనాల కాళేశ్వర రావు). అయితే 1400కి పైగా అన్ని రకాల జానర్ చిత్రాల్లో నటించిన రాజనాల.. హనుమాన్‌గా కనిపించిన ఒకే ఒక్క చిత్రం ‘శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం’(1972). కానీ, ఆ పాత్రలో మరిచిపోలేని అభినయం కనబర్చారాయన.దారా సింగ్మల్లు యోధుడిగానే కాదు.. ఇటు నటుడిగా, దర్శకుడిగా.. అటు రాజకీయాల్లోనూ రాణించారీయన. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ఏళ్ల తరబడి రాణించిన దారా సింగ్.. ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులేశారు. భజరంగబలి(1976) చిత్రంలో తొలిసారి హనుమాన్‌గా అలరించి.. ఆ తర్వాత రామానంద సాగర్ ‘రామాయణ్’లో హనుమాన్ క్యారెక్టర్లో జీవించి.. భారతీయ బుల్లితెర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారాయాన. చిరంజీవిఆంజనేయ స్వామికి కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఓ ఫైట్ పోర్షన్లో హనుమాన్‌గా అలరించారాయన. అంతేకాదు.. హనుమాన్(2005) యానిమేటెడ్ చిత్రంలో ఆ పాత్రకు తెలుగు వెర్షన్లో వాయిస్ ఓవర్ కూడా అందించారు.నిర్భయ్ వాద్వాతెలుగులో జనార్ధన రావుకు ఎలాగైతే హనుమాన్ క్యారెక్టర్లు గుర్తింపు తెచ్చి పెట్టాయో.. హిందీ టీవీ సీరియల్స్‌లో ఈ యువ నటుడికి అదే విధంగా ఆ పాత్ర మంచి గుర్తింపు ఇచ్చింది. సంకట మోచన్ మహాబలి హనుమాన్(2015-17)లో తొలిసారి హనుమంతుడి పాత్రలో నటించిన నిర్భయ్‌కు.. ఆ తర్వాత మరో రెండు సీరియల్స్‌లోనూ ఆ రోల్ దక్కింది. ఈ ఏడాది ప్రారంభమైన శ్రీమద్ రామాయణ్‌లోనూ ఆయన హనుమాన్ రోల్లోనే నటిస్తున్నారు.ప్రశాంత్ శెట్టిప్రశాంత్ శెట్టి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. రిషబ్ శెట్టిగా అప్పటిదాకా కన్నడ ఆడియొన్స్‌ను మాత్రమే అలరిస్తూ వచ్చిన ఈ మల్టీ టాలెంట్ పర్సన్(నటుడు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్).. కాంతారతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకట్టుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో కాంతారను తీసి.. జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులనూ దక్కించుకున్నాడు. బహుశా ఆ గుర్తింపే ఆయనకు జై హనుమాన్‌లో హనుమాన్ క్యారెక్టర్ దక్కడానికి ఓ కారణం అయ్యి ఉండొచ్చు కూడా!.ಕನ್ನಡ ನೆಲದ ವರಸುತ ಆಂಜನೇಯನ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಭಾರತ ಇತಿಹಾಸದ ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಭಾವವೊಂದನ್ನು ತೆರೆಯ ಮೇಲೆ ತರಲಿದ್ದೇವೆ.ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ ಬೆಂಬಲ ಆಶೀರ್ವಾದ ಎಂದಿನಂತೆ ಸದಾ ಇರಲಿ - ಜೈ ಹನುಮಾನ್A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga🙏We bring forth an epic of loyalty, courage and… pic.twitter.com/Zvgnt1tGnl— Rishab Shetty (@shetty_rishab) October 30, 2024ఇంకా ఎవరైనా నటీనటులను మరిచిపోయి ఉంటే.. వాళ్లు ఏ భాషకు చెందిన వాళ్లైనా సరే కామెంట్ సెక్షన్లో వాళ్ల పేర్లను మీరు తెలియజేయొచ్చు. -
భక్తవిజయం: హనుమత్పురం
మేరుపర్వతానికి దక్షిణ దిశలో పది యోజనాల విస్తీర్ణం గల ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు ధార్మికులు. ఎవరి వృత్తులు వారు చేసుకుంటూ, పరస్పర సహకార ధోరణితో ప్రశాంతంగా జీవనం సాగించేవారు. ఆ గ్రామం జలసమృద్ధితో తులతూగేది. పొలాలు నిత్యహరితంగా అలరారేవి. గ్రామం శివార్లలోని వనాలలో ఫలవృక్షాలు పుష్కలంగా ఉండేవి. గోవృషభాది పశుసంపదకు లోటు లేకుండా ఉండేది. వీటన్నింటి వల్ల గ్రామం సుభిక్షంగా ఉండేది. ప్రజలు తీరికవేళల్లో భగవన్నామ సంకీర్తనతో కాలక్షేపం చేసేవారు. పర్వదినాలలో ఊరుమ్మడిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజపురస్కారాలను నిర్వహించేవారు. రావణ వధానంతరం రాముడు పట్టాభిషిక్తుడై అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగిస్తున్న రోజులవి. హనుమంతుడు రాముని కొలువులో ఉండేవాడు. నిత్యం సీతారాములను సేవించుకుంటూ తన ఆరాధ్య దైవమైన రాముని సమక్షంలోనే ఉండేవాడు. సుగ్రీవునితో మైత్రిని కలపడం సహా లంకలో బంధితురాలైన సీత జాడ కనుగొనడం మొదలుకొని యుద్ధంలో ఘనవిజయం వరకు రామునికి హనుమ చేసిన ఉపకారాలు అన్నీ ఇన్నీ కావు. తనకు ఇన్ని ఉపకారాలు చేసిన హనుమకు ప్రత్యుపకారం ఏదైనా చేయాలని తలచాడు రాముడు. ఒకనాడు హనుమను పిలిచాడు. ‘హనుమా! నువ్వు మాకెన్నో ఉపకారాలు చేశావు. నీ ఉపకారాలను మరువజాలను. నీకేదైనా వరమివ్వాలని ఉంది. నీకిష్టమైనదేదో కోరుకో, తప్పక ఇస్తాను’ అన్నాడు. ‘శ్రీరామా! నువ్వు పురుషోత్తముడవు, పరమపురుషుడవు. నీ సేవకు మించిన భాగ్యం ఇంకేదీ లేదు. నిత్యం నీ సన్నిధిలో నిన్ను సేవించుకుంటూ ఉండటమే నాకు పరమభాగ్యం’ అని బదులిచ్చాడు హనుమ. ‘అది కాదు గాని, నీకు ఒక గ్రామాన్ని బహూకరిస్తున్నాను. మేరుపర్వతానికి దక్షిణదిశలో సుఖశాంతులతో అలరారుతున్న ఆ గ్రామం ఇక నీదే! నా వరంగా ఆ గ్రామాన్ని స్వీకరించు. ఆ గ్రామానికి హనుమత్పురమని నామకరణం చేస్తున్నాను. నువ్వు అక్కడకు వెళ్లి, గ్రామ ప్రజల యోగక్షేమాలను గమనిస్తూ ఉండు. ఇకపై అక్కడి ప్రజలు హనుమద్భక్తులై విలసిల్లుతారు. ముల్లోకాలలో నీ పేరు ప్రతిష్ఠలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి’ అన్నాడు రాముడు. రాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు ఆ గ్రామానికి చేరుకున్నాడు. రాముడి ఆదేశం మేరకు హనుమంతుడు ఆ గ్రామానికి అధిపతి. అయితే, హనుమంతుడికి ఆధిపత్య కాంక్ష లేదు. ఆ ఊరి ప్రజలంతా శాంతికాముకులు, ధార్మికులు, భగవత్ చింతనా తత్పరులు. హనుమంతుడు ఆ గ్రామంలోని బ్రాహ్మణులందరినీ పిలిచి సమావేశపరచాడు. ‘మీరిక్కడ ఎన్నాళ్లుగానో ఉంటున్నారు. ఇకపై కూడా మీరంతా మీ మీ కుటుంబాలతో ఇక్కడే ఉంటూ సత్కార్యాలతో కాలక్షేపం చేస్తూ ఉండండి’ అని చెప్పి, రాముడు తనకు ఇచ్చిన ఆ గ్రామాన్ని అక్కడి ప్రజలకే దానమిచ్చేశాడు. అక్కడి నుంచి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. గ్రామ ప్రజలందరూ హనుమంతుడి ఔదార్యానికి ఆనందభరితులయ్యారు. కృతజ్ఞతగా గ్రామంలో అడుగడుగునా హనుమంతునికి మందిరాలను నిర్మించుకున్నారు. గ్రామస్థుల కృషి, ధార్మిక వర్తనల కారణంగా గ్రామం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లసాగింది. ఆ గ్రామ పరిసరాల్లోని అడవిలో దుర్ముఖుడనే రాక్షసుడు ఉండేవాడు. హనుమత్పురం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుండటం చూసి అతడికి కన్ను కుట్టింది. సుభిక్షమైన ఆ గ్రామాన్ని కైవసం చేసుకోవాలనుకున్నాడు. ఒకనాడు అకస్మాత్తుగా తన రాక్షసదండుతో గ్రామం మీదకు దండెత్తాడు. ‘ఈ గ్రామం నాది. మీరిక్కడ ఉండటానికి వీల్లేదు. వెంటనే గ్రామాన్ని వదిలి వెళ్లిపోండి’ అని గ్రామస్థులను హెచ్చరించాడు. రాక్షసదండును చూడటంతోనే గ్రామస్థులు భయపడ్డారు. దుర్ముఖుడు చేసిన హెచ్చరికతో వారు మరింతగా భీతిల్లారు. ఊరు విడిచి వెళ్లిపోవడానికి రెండురోజులు గడువివ్వమని గ్రామస్థులు దుర్ముఖుడిని వేడుకున్నారు. అతడు అందుకు సమ్మతించి అప్పటికి వెనుదిరిగాడు. దిక్కుతోచని గ్రామస్థులు హనుమంతుని మందిరాల్లో పూజలు చేస్తూ, తమను రక్షించమంటూ ప్రార్థనలు చేశారు. రెండోరోజు రాత్రి ఒక బ్రాహ్మణుడికి కలలో హనుమంతుడు కనిపించాడు. ‘ఈ భూమి ఎవరి రాజ్యమూ కాదు. మాంధాత వంటి చక్రవర్తులు ఈ భూమిని ఏలారు. వారెవరైనా తమ సామ్రాజ్యాలను తమతో పాటే తీసుకుపోయారా? మీ గ్రామంలోనే మీరు ఉండండి. ఇదే మాట దుర్ముఖుడితో చెప్పండి’ అని పలికి, దుర్ముఖుడి రాక్షససేన విడిచి చేసిన వైపుగా బయలుదేరాడు. మరునాటి ఉదయమే దుర్ముఖుడి సేనాని అతడి వద్దకు పరుగు పరుగున చేరుకున్నాడు. ‘నాయకా! తాటిచెట్టంత మహాకాయుడొకడు గ్రామానికి కావలి కాస్తున్నాడు. రాత్రివేళ మన సేన విడిచి చేసిన గుడారాల చుట్టూ తిరిగి కొండ మీదకు చేరుకున్నాడు. కొండ మీద కూర్చుని, బండరాళ్లను బంతుల్లా చేసి ఆడుకుంటున్నాడు. అతణ్ణి చూస్తేనే భయం వేస్తోంది. అతడు బండరాళ్లను మన దండు మీద విసిరితే అంతా నుజ్జు నుజ్జయిపోతాం’ అని చెప్పాడు. దుర్ముఖుడికి పరిస్థితి అర్థమైంది. తెగిస్తే ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించాడు. వెంటనే గ్రామానికి చేరుకుని, ‘గ్రామస్థులారా! మీరంతా సద్వర్తనులు. ఇక్కడ మీరు యథాప్రకారం ఉండండి’ అని చెప్పి వెనుదిరిగాడు. -సాంఖ్యాయన -
విషాదం: రామజపంతో కుప్పకూలిన ‘హనుమాన్’
Sudden Death Video: అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. సోమవారం దేశమంతా భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. పల్లెపట్టణం తేడా లేకుండా రామ మందిర వేడుకల్ని ఘనంగా చేసుకున్నాయి. దేశం నలుమూలల ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఆలయాల్లో బయటా.. అన్నదానాలు.. బాణాసంచా కాల్చి సంబురాలు.. రథయాత్రలు.. ఊరేగింపులు.. రామాయణ ఘట్టాల్ని నాటక రూపంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో హర్యానా భివానీలో నిర్వహించిన ‘రామ్‌లీలా’లో విషాదం చోటుచేసుకుంది. హనుమంతుడి వేషధారణలో ఉన్న నటుడు రామ నామం జపిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే ఆయన నటిస్తున్నారేమో అనుకుని అంతా చప్పట్లు కొట్టగా.. రాముడి వేషధారణలో ఉన్న నటుడు దగ్గరగా వెళ్లి చూసేసరికి చలనం లేకుండా పడి ఉన్నాడు. హుటాహుటిన అలాగే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. भिवानी में घटी दुखद घटना, श्री राम मूर्ति प्राण प्रतिष्ठा के उपलक्ष्य में हनुमान बने कलाकार ने त्यागे प्राण,भगवान राम की झांकी के दौरान श्री राम के चरणों में त्यागे प्राण।डॉक्टरों के मुताबिक कलाकार को हार्ट अटैक आने से हुई मौत। #RamMandirPranPrathistha #Haryana #bhiwani… pic.twitter.com/uBRwsRcT50 — Haryana Tak (@haryana_tak) January 23, 2024 Video Credits: Haryana Tak మృతుడి పేరును హరీష్ మెహతా. విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పని చేసిన ఆయన పదవీ విరమణ పొందారు. గత పాతికేళ్లుగా ఆయన హనుమంతుడి వేషధారణతో అలరిస్తూ వస్తున్నారు. సోమవారం ఒకవైపు అయోధ్య ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమమయంలో భివానీ జవహార్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
గరుత్మంతుడు, హనుమంతుడి మధ్య పోరులో ఎవరు గెలిచారో తెలుసా?
శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు యుగయుగాలుగా సేవలందిస్తూ వస్తున్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారంలో కూడా అవసరమైన వేళల్లో గరుత్మంతుడు శ్రీహరిని సేవించుకుంటూ ఉండేవాడు. గరుత్మంతుడు పుట్టుకతోనే అమిత బలశాలి. ‘అసలు ముల్లోకాలలోనూ నా ఎదుట నిలిచి, తనను యుద్ధంలో గెలవగల ధీరుడెవడున్నాడు? లోకపాలకుడైన శ్రీమన్నారాయణుడినే వీపుమీద మోస్తున్నవాడిని నన్ను మించిన వీరుడింకెవడున్నాడు’ అనుకుని గర్వించసాగాడు.గరుడుని ధోరణిని కొన్నాళ్లుగా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఎలాగైనా, అతడికి గర్వభంగం చేయాలని తలచాడు. ద్వారకలో సత్యా సమేతుడై సభలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు ఒకసారి గరుత్మంతుడిని తలచుకున్నాడు. వెంటనే గరుత్మంతుడు కృష్ణుని ముందు వాలి, ‘ప్రభూ! ఏమి ఆజ్ఞ’ అంటూ మోకరిల్లాడు.‘వీరాధి వీరా! వైనతేయా! నీతో ముఖ్యమైన పని పడింది. అందుకే నిన్ను తలచుకున్నాను’ అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు కృష్ణుడు. ‘ఆజ్ఞ ఏమిటోసెలవివ్వు ప్రభూ’ అంటూ చేతులు జోడించాడు గరుత్మంతుడు.‘మరేమీ లేదు. గంధమాదన పర్వతం మీద కదళీవనంలో తపస్సు చేసుకుంటూ హనుమంతుడు ఉంటాడు. అతడితో ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది. అతణ్ణి ఇక్కడకు తోడ్కొని రావాలి. ఈ పనికి నువ్వే తగిన సమర్థుడవు’ అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి ఆదేశానికి గరుత్మంతుడు మనసులో నొచ్చుకున్నాడు. ‘నేనేమిటి? నా పరాక్రమమేమిటి? ఒక వానరాన్ని తోడ్కొని రావడానికి నేను స్వయంగా వెళ్లడమా?’ అనుకున్నాడు. అయినా ప్రభువు ఆజ్ఞ కదా, ఎలాగైనా నెరవేర్చవలసిందే అనుకుని తక్షణమే బయలుదేరాడు. మనోవేగంతో ఎగురుకుంటూ వెళ్లి, గంధమాదన పర్వతం మీద వాలాడు. అక్కడ హనుమంతుడు నిశ్చల ధ్యానమగ్నుడై కనిపించాడు. గరుత్మంతుడు హనుమంతుడిని పిలిచాడు. ధ్యానంలో ఉన్న హనుమంతుడికి అతడి పిలుపు వినిపించలేదు. ‘ఓ వానరశ్రేష్ఠా! మహాత్ముడైన భగవంతుడు శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ అనుల్లంఘనీయం. కనుక నిన్ను తీసుకుపోకుండా ఇక్కడి నుంచి కదలను’ అని బిగ్గరగా అన్నాడు. తదేక ధ్యానంలో ఉన్న హనుమంతుడు కదల్లేదు, మెదల్లేదు. గరుత్మంతుడికి కోపం వచ్చింది. హనుమంతుడికి ధ్యానభంగం కలిగించైనా, తనతో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. తన పొడవాటి ముక్కును హనుమంతుడి ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు. గరుత్మంతుడి వికారచేష్టను గమనించి కూడా, హనుమంతుడు నిశ్చలంగా ఉన్నాడు. కాసేపటికి తన ధ్యానాన్ని విరమించుకుని, ప్రాణాయామం ప్రారంభించాడు. ముక్కు కుడి రంధ్రం నుంచి వాయువును విడిచి, ఎడమ రంధ్రం ద్వారా పీల్చుకోసాగాడు. హనుమంతుడి ప్రాణాయామ సాధన గరుత్మంతుడికి ప్రాణసంకటంగా మారింది. హనుమంతుడు గాలి విడిచేటప్పుడు ఎవరో బలంగా నెట్టేసినట్లు గరుత్మంతుడు దూరంగా వెళ్లి పడుతున్నాడు. హనుమంతుడు గాలి పీల్చుకునేటప్పుడు ఎవరో బలంగా లాగుతున్నట్లు హనుమంతుడి వైపు రాసాగాడు. హనుమంతుడు ఊపిరి బిగించి వాయువును కుంభించేటప్పుడు అతడి ముక్కుకు అతుక్కుంటున్నాడు. ఈ ఉత్పాతానికి బిక్కచచ్చిన గరుడుడు వజవజ వణకసాగాడు. హనుమంతుడి ప్రాణాయామం పూర్తయ్యాక గరుత్మంతుడు విడుదలయ్యాడు. బతుకు జీవుడా అనుకుని తెప్పరిల్లాడు. కృష్ణాజ్ఞను ఉల్లంఘించినందుకు హనుమంతుడి మీద కోపం తెచ్చుకున్నాడు. దేహాన్ని పెంచి, ఆకాశాన్ని కమ్మేస్తూ హనుమంతుడిని తీసుకుపోయేందుకు అతని చుట్టూ ఎగురుతూ తిరగసాగాడు.గరుత్మంతుడిని పట్టుకునేందుకు హనుమంతుడు తన తోకను ఆకాశం వరకు పెంచాడు. అదేదో కొయ్య స్తంభం అనుకున్నాడు గరుత్మంతుడు. ఎగిరి ఎగిరి అలసిపోయి, కాసేపు ఈ స్తంభాన్ని ఆనుకుని సేదదీరాలనుకుని, హనుమద్వాలం మీద వాలాడు. తాను వాలినది స్తంభం కాదని, హనుమంతుడి తోక అని గ్రహించి, దానిని తన పదునైన ముక్కుతో పొడవడం ప్రారంభించాడు. హనుమంతుడికి చిర్రెత్తింది. తన తోక రోమాల మధ్య గరుత్మంతుణ్ణి బంధించాడు. అంత బలశాలి అయిన గరుత్మంతుడు కూడా హనుమంతుడి తోక రోమాలలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరయ్యాడు. హనుమంతుడు తన తోకను గిరగిర తిప్పి, గరుత్మంతుణ్ణి ఒక్కసారిగా విసిరేశాడు. ఆ దెబ్బకు అవయవాలన్నీ చితికిన గరుత్మంతుడు ఏకంగా పాలసముద్రంలో పడ్డాడు. కాసేపు అక్కడే సేదదీరాడు. తిరిగి శక్తి కూడదీసుకుని, ద్వారక చేరుకుని శ్రీకృష్ణుడి ముందు వాలాడు. తన ముందు దీనంగా నిలుచుకున్న గరుత్మంతుణ్ణి చూసిన కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘ఖగేంద్రా! అలా నిర్విణ్ణుడవై నీరసంగా నిలుచున్నావేమిటి? ఏం జరిగింది? చెప్పు’ అన్నాడు. ‘దేవదేవా! జగన్నాటక సూత్రధారీ! మీ ఆజ్ఞ నెరవేర్చడానికి హనుమంతుడి వద్దకు వెళ్లాను. అతడు నా మాట వినలేదు’ అని గరుత్మంతుడు చెబుతుండగానే శ్రీకృష్ణుడు అడ్డు తగిలాడు.‘ఛీ! ఏమిటీ ఆలస్యం? అతడితో నాకు ముఖ్యమైన పని ఉంది. వెంటనే తీసుకురా’ అన్నాడు.‘స్వామీ! నా బలగర్వం అణిగింది. వానరరూపంలో నా మృత్యువే అక్కడ ఉంది. హనుమంతుడు ఉండే చోటుకు తప్ప ఇంకెక్కడికి పంపినా వెళతాను’ అన్నాడు గరుత్మంతుడు.‘ఈసారి అలా జరగదు. రామనామం జపిస్తూ వెళ్లు. నీ సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడని చెప్పు. హనుమ నీతో మారు మాటాడకుండా వస్తాడు’ అని చెప్పాడు శ్రీకృష్ణుడు. గరుత్మంతుడు ఈసారి వినయంగా వెళ్లి, శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారమే చెప్పి హనుమంతుడిని తనతో తోడ్కొని వచ్చాడు. -
హనుమంతుడి వారసులం అని గర్వపడండి!: కాంగ్రెస్ ఎమ్మెల్యే
ధార్ జిల్లాలోని గంద్వానీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ మాజీ అటవీ మంత్రి ఉమంగ్ సింఘర్ హనుమంతుడు ఆదివాసీయే అని వ్యాఖ్యలు చేశారు. హిందూ ఇతిహాసం అయిన రామాయాణ మహా కావ్యంలో కోతులుగా వర్ణించబడినవారు హనుమంతుని వలే గిరిజనులేనని అన్నారు. ఈ మేరకు ఆయన ధార్ జిల్లాలో గిరిజన నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 123వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హనుమంతుని గురించి ఈ విధంగా ప్రసంగించారు. రాముడిని లంకకు తీసుకువెళ్లింది ఆదివాసీలు(వానర సేన) అని రామయణ కథలో రాశారు. దీనిని బట్టి ఆదివాసీలు అరణ్యాల్లో నివశించారని ఆ కథ ద్వారా మనకు తెలుస్తోంది కావున హనుమంతుడు కూడా ఆదివాసీయే. అందువల్ల మనం అతని వారసులం అని గర్వపడండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సింఘర్ అన్నారు. దీంతో మధ్యప్రదేశ్ అధికార ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్ మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. వారు హనుమాన్ జీని దేవుడిగా భావించరు. హనుమంతుడుని హిందువులు పూజించే దేవుడిగా అస్సలు గుర్తించరు అని ఫైర్ అయ్యారు. హనుమంతుడిని అవమానించారంటూ ఆరోపణలు చేశారు. హనుమంతుడి విషయంలో కాంగ్రెస్ ఆలోచన ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ క్యాథలిక్ మత గురువులు భాష మాట్లాడుతున్నట్లుంది అని వెటకరించారు. ఇక మత మార్పిడిలు చేసేయండి అంటూ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాలను ట్యాగ్ చేశారు బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్. (చదవండి: పాతికేళ్ల ఎన్సీపీ.. పవార్ కీలక నిర్ణయం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆ ఇద్దరూ) -
హనుమంతుడి ముందు.. ఇలాంటి పనులా?!
భోపాల్: బీజేపీ చేష్టలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తీవ్రంగా మడిపడుతోంది. హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేసి, ఆ విగ్రహ సమక్షంలోనే మహిళలకు బాడీ బిల్డింగ్ పోటీలు ఏర్పాటు చేయించింది బీజేపీ. అయితే అందులో వాళ్ల వస్త్రధారణ బికినీలతో ఉండడంతో.. దేవుడి విగ్రహం ముందు, అదీ అసభ్యతను ప్రొత్సహించడమేంటని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. సోమవారం రత్లాంలో బాడీ బిల్డింగ్ జరిగిన వేదికకు వెళ్లి మరీ హనుమాన్ విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. అనంతరం హనుమాన్ చాలీసా పఠించాయి. హనుమంతుడి ముందు ఇలాంటి అసభ్య వేషాలేంటని మండిపడుతున్నారు వాళ్లు. ఈ ఘటనకు కారకులెవరో వాళ్లను హనుమాన్ భగవానే కఠినంగా శిక్షిస్తాడని తిట్టిపోస్తున్నారు. ఇదిలా ఉంటే.. మార్చి 4, 5వ తేదీల్లో రత్లాంలో మిస్టర్ జూనియర్ బాడీబిల్డింగ్ పోటీలు జరిగాయి. నిర్వాహక కమిటీలో బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్ ఉండగా.. స్థానిక ప్రజాప్రతినిధి చైతన్య కశ్యప్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు వార్తల్లో, సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అయితే.. కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ సమాధానం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మహిళలు క్రీడా రంగంలో రాణించడం ఏమాత్రం ఇష్టం లేదేమో అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హితేజ్ బాజ్‌పాయి కౌంటర్ ఇచ్చారు. కుస్తీ, జిమ్నాస్టిక్స్, ఈతలు.. ఇలా ఏ క్రీడల కేటగిరీలోనూ మహిళలు రాణించాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదు. మైదానంలోని మహిళలను పాడు కళ్లతోనే చూస్తారు వాళ్లు. అందుకు వాళ్లకు సిగ్గుండాలి అని విమర్శించారు. అంతేకాదు ఈవెంట్ నిర్వాహకులు కొందరు వేదికపై గంగా జలం జల్లిన కాంగ్రెస్‌నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మెమొరాండం సమర్పించారు. ఇక ఈ ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ వ్యక్తిగత మీడియా సలహాదారు పీయూష్ బాబెలే స్పందించారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమాన్ భగవాన్ సమక్షంలో.. ఇలాంటి అసభ్యతను ప్రదర్శించడం దారుణమన్నారు. భగవంతుడ్ని అగౌరవపరిచి.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. बीजेपी नेताओं ने किया हनुमान जी का अपमान : रतलाम में भाजपा के बीजेपी विधायक चैतन्य कश्यप और महापौर प्रह्लाद पटेल ने हनुमान जी की मूर्ति स्टेज पर रखकर अश्लीश कार्यक्रम का आयोजन किया। शिवराज जी, भाजपा बार-बार हिन्दुओं का अपमान क्यों करती है❓ pic.twitter.com/C4FWb2i72N — MP Congress (@INCMP) March 6, 2023 -
ఆధారసహితం.. అంజనాద్రే హనుమ జన్మస్థలం
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని పురాణాలు, శాసనాలు, భౌగోళిక ఆధారాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయని, ఈ విషయంలో ఆలోచించాల్సిందేమీ లేదని పలువురు పీఠాధిపతులు, పండితులు, చారిత్రక పరిశోధకులు తేల్చిచెప్పారు. టీటీడీ శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ‘హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి’ అంశంపై నిర్వహించిన రెండురోజుల అంతర్జాతీయ వెబినార్ శనివారం ముగిసింది. తిరుమల క్షేత్రంలో అంతర్భాగమైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయస్వామి జన్మస్థలమని, ఆళ్వారుల పాశురాల్లోని వైష్ణవ సాహిత్యం ద్వారా తెలుస్తోందని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు చక్రవర్తి రంగనాథన్ తెలిపారు. ‘వైష్ణవ సాహిత్యంలో తిరుమల–అంజనాద్రి’ అంశంపై మాట్లాడుతూ ఆళ్వారులు రచించిన 4 వేల పాశురాల్లో 207 పాశురాలు తిరుమల క్షేత్ర వైభవాన్ని, అందులో 12 పాశురాలు విశేషంగా ఆంజనేయస్వామి గురించి తెలుపుతున్నాయన్నారు. పండిత పరిషత్ కార్యదర్శి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ‘భక్తి కీర్తనల్లో అంజనాద్రి’ అంశంపై ప్రసంగిస్తూ, అన్నమయ్య, పురంధర దాసులు, వెంగమాంబ లాంటి వాగ్గేయకారులు అంజనాద్రి గురించి కీర్తనల్లో ప్రస్తావించారన్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు రాణి సదాశివమూర్తి ‘పురాణ భూగోళంలో హనుమంతుడు– అంజనాద్రి’ అంశంపై ఉపన్యాసిస్తూ, అంజనాద్రి దాస క్షేత్రమని, వేంకటాచల మహాత్మ్యం అనేది వివిధ పురాణాల సంకలనమన్నారు. సాహిత్య ఆధారాలు.. శ్రీవారి ఆలయ అర్చకులు అర్చకం రామకృష్ణ దీక్షితులు ‘సప్తగిరులలో అంజనాద్రి ప్రాముఖ్యం’పై మాట్లాడారు. కాలిఫోర్నియా నుంచి ప్రముఖ ఐటీ నిపుణులు పాలడుగు చరణ్ ‘సంస్కృత సాహిత్యంలో హనుమంతుడు’ అంశంపై ప్రసంగించారు. ఋగ్వేదం నుంచి వర్తమాన సాహిత్యం వరకు అన్ని పదాల్లో అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని నిరూపితమైందన్నారు. దానికి సాహిత్య ఆధారాలు ఉన్నట్లు వివరించారు. అందుకే అంజనాద్రి అయ్యింది.. మధ్యప్రదేశ్ చిత్రకూట్‌లోని రామభద్రాచార్య ప్రత్యేక ప్రతిభావంతుల విశ్వవిద్యాలయం ఉపకులపతి జగద్గురు రామభద్రాచార్య, తిరువనంతపురంలోని ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ, తిరుమలలో అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయునికి జన్మ ఇచ్చినందువల్లే ఆ కొండకు అంజనాద్రి అని పేరొచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, ముంబైకి చెందిన ప్రసిద్ధ కవి, ఆధ్యాత్మిక వేత్త సాంపతి సురేంద్రనాథ్ మాట్లాడారు. కర్ణాటక సోసలేలోని వ్యాసరాజ మఠాధిపతి విద్యా శ్రీశతీర్థ మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు. అంజనాద్రిని అభివృద్ధి చేస్తాం: ధర్మారెడ్డి తిరుమల అంజనాద్రిలోని ఆంజనేయుడు జన్మించిన స్థలంలో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి భక్తులు దర్శించుకునే సదుపాయాలు కల్పిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వెబినార్ అంశాలను జాతీయ సంసృత విశ్వవిద్యాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రి అని ఆధారాలతో త్వరలో ఒక గ్రంథం ముద్రించనున్నామన్నారు. -
‘అంజనాద్రి’ ప్రకటనపై ప్రతిపాదన లేదు
సాక్షి, న్యూఢిల్లీ: జాపాలి తీర్థంలోని అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రాచీన సాహిత్యం, శాసనాలు, చారిత్రక, ఖగోళ శాస్త్ర అంచనాలు వంటి ఆధారాలతో సహా హనుమంతుడి జన్మస్థలం తిరుమలకు ఉత్తరంగా ఉన్న జాపాలి తీర్థంలోని అంజనాద్రి పర్వతమేనని టీటీడీ నిర్ధారించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కిషన్‌రెడ్డి మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశంలో అత్యధిక సామర్థ్యం కలిగిన సోలార్ ఫొటోవాల్టిక్ మాడ్యూల్స్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.4,500 కోట్లు కేటాయిస్తూ ఏప్రిల్ 7న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పీఎంఎఫ్ఎంఈ ద్వారా ఏపీకి నిధులు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 2020–21లో రూ.34.98 కోట్లు, 2021–22లో రూ.14.15 కోట్లు కేటాయించినట్టు కేంద్రం తెలిపింది. వైఎస్సార్సీపీ ఎంపీలు బీవీ సత్యవతి, చింతా అనూరాధ, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో పెరిగిన ఉపాధి ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం తెలిపింది. వైఎస్సార్సీపీ సభ్యులు పి.వి.మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, తలారిరంగయ్యలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ.. 2019–20లో 65.02 లక్షల మంది ఉపాధి పొందగా 2020–21లో 79.8 లక్షల మంది ఉపాధి పొందారని తెలిపారు. శ్రేయస్ పథకంలో ఏపీ విద్యార్థులు స్కాలర్షిప్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ అచీవర్స్ స్కీం (శ్రేయస్)లో ఏపీలో 2018–19లో 58 మంది విద్యార్థులకు రూ.19.70 లక్షలు, 2019–20లో 95 మందికి రూ.45.98 లక్షలు, 2020–21లో 93 మందికి రూ.32.71 లక్షల ఉపకార వేతనాలను యూజీసీ ద్వారా ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్.రెడ్డెప్ప, తలారి రంయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ లోక్‌సభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కరోనా ప్రభావిత రంగాలకు మద్దతు కరోనా ప్రభావిత రంగాలకు మద్దతుగా ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో పలు అంశాలు పొందుపరిచినట్టు ఎంపీ అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌధరి లిఖితపూర్వకంగా తెలిపారు. ఆ రంగాలను ప్రోత్సహించేందుకు రూ.1.1 లక్షల కోట్ల లోన్ గ్యారెంటీ స్కీమ్ ప్రకటించామని, అదనంగా మరో రూ.1.5ల క్షల కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం ప్రకటించామని వివరించారు ‘నైపుణ్యాభివృద్ధి’ కమిటీ సభ్యుడిగా ఎంపీ గురుమూర్తి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడుగా వైఎస్సార్సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పోలవరానికి తక్షణమే నిధులివ్వండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధులు తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్గాని భరత్‌రామ్, నందిగం సురేష్, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి డిమాండ్ చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సమస్యలు, పోలవరం ప్రాజెక్టుకు విషయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని గుర్తించి.. వాటి పరిష్కారానికి అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి నిధుల కోసం పలుసార్లు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు విజ్ఞప్తులు చేశారన్నారు. సవరించిన అంచనాలపై అనుమతి త్వరగా ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలన్నారు. రాష్ట్ర విధులు, నిధుల విషయంలో పార్టీ ఎంపీలంతా కలసికట్టుగా ముందుకెళ్తున్నామని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని, అన్ని అనుమతులు కేంద్రం ఎప్పటికప్పుడు ఇవ్వాలని అన్నారు. సవరించిన అంచనాలకు వెంటనే అనుమతి ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక కమిటీలు ఆమోదించినప్పటికీ సవరించిన అంచనాలకు ఆర్థిక ఆమోదం ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్ ఆర్ ప్యాకేజీ గుండెకాయ వంటిదన్నారు. వరదల కారణంగా కాఫర్ డ్యాం వద్ద 40 మీటర్ల పైగా నీరు నిల్వ ఉందని, స్పిల్ వే ద్వారా ఈ జలాలు డెల్టా ప్రాంతానికి పంపాల్సి ఉందన్నారు. నిర్వాసితులకు ఆర్ ఆర్ ప్యాకేజీ ద్వారా పరిహారం ఇవ్వడం అత్యవసరమని.. అందుకే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. విభజన చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లయ్యిందని, రీయింబర్స్మెంట్ విధానంతో ఈ ఏడేళ్లు చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేలా ముందుకెళ్తున్నామని, విభజన చట్టం ప్రకారం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
Hanuman Jayanti 2021: జై భజరంగ భళి అంటే ఏంటో తెలుసా?
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం అంటూ శ్రీ ఆంజనేయుడిని స్మరించిన వెంటనే విచక్షణా జ్ఞానం లభిస్తోందని భక్తులు నమ్ముతుంటారు. హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తివంతమైన హనుమంతుడి నామస్మరణ చేస్తే భయం, మానసిక ఆందోళన తొలగి బలం, కీర్తి వరిస్తాయి. భయం తొలిగిపోతుంది. మానసిక ఆందోళన నుంచి భయటపడవచ్చు. మరి అంతటి మహిమాన్వితుడు హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. హనుమంతుడు శివుడి అవతారం ఒకప్పుడు స్వర్గంలో నివసించిన "అంజన అనే అప్సర ఒకరిని ప్రేమిస్తుంది. దీంతో అంజనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ రుషి అంజన మొహం వానరం అవతారంలా మారిపోవాలని శపిస్తారు. అయితే రుషి శాపంతో భయాందోళనకు గురైన అంజన ఆ శాపం నుంచి తనని రక్షించాలని బ్రహ్మదేవుడిని వేడుకుంటుంది. దీంతో బ్రహ్మదేవుడు ఆమెకు భూమిపై మానవునిగా జన్మించే వరాన్ని ప్రసాదిస్తారు. ఇక బ్రహ్మదేవుడి వరంతో అంజనా భూలోకంలో జన్మిస్తుంది. రాజవంశానికి చెందిన కేసరితో ప్రేమలో పడుతుంది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. శివుని భక్తురాలైన అంజన వివాహం తరువాత శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠిన మైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సుతో ప్రత్యక్షమైన శివుడిని.. తనకు అత్యంత ధైర్యశాలి అయిన కుమారుడు జన్మించేలా వరం ఇవ్వాలని కోరుకుంటుంది. అందుకు శివుడు అంగీకరిస్తాడు. కొద్ది రోజుల తరువాత దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ యాగం ముగిసిన తరువాత యాగం కోసం తయారు చేసిన ప్రసాదాన్ని భార్యలకు పంచిపెట్టాడు. రాణి కౌశల్యకు ఓ డేగ ద్వారా ప్రసాదాన్ని పంచుడుతాడు. ప్రసాదం తీసుకొని డేగ కౌశల్య దగ్గరకు వెళుతుండగా శివుడి ఆజ్ఞతో డేగ చేతిలో ఉన్న ప్రసాదం అంజన చేతిలో పడుతుంది. అయితే ప్రసాదాన్ని శివుడే పంపించాడని, ఆ ప్రసాదం తిన్న అంజన శివుడి అవతారమైన హనుమంతునికి జన్మనిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడిని జై భజరంగభళి అని ఎందుకు పిలుస్తారు ఓ రోజు సీతమ్మవారు తన నుదుటున కుంకుమ పెట్టుకునే సమయంలో సీతమ్మవారిని హనుమంతుడు అమ్మా.. నుదుటున కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు అని అడిగినప్పుడు.. అందుకు సీతమ్మ వారు హనుమ.. నా భర్త శ్రీరాముడు సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటూ కుంకుమతో బొట్టుపెట్టుకుంటున్నానని చెప్పిందట. దీంతో సీతాదేవి సమాధానానికి ముగ్ధుడైన హనుమంతుడు.. అప్పుడు నేను కుంకుమను శరీరం మొత్తం పూసుకుంటే శ్రీరాముడి జీవితకాలం ఎన్నోరేట్లు పెరుగుతుంది కదమ్మా అని అన్నాడు. ఆ తరువాత కుంకుమను హనుమంతుడు శరీరం అంతా పూసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. కుంకుమను భజరంగ్ అని కూడా పిలుస్తారు. ఆ రోజు నుండి హనుమంతుడిని ‘భజరంగ్ భళి’ అని పిలుస్తారు. ఆయనను పూజించినప్పుడల్లా కుంకుమతో అలంకరిస్తారు. సంస్కృతంలో "హనుమంతుడు" అంటే "వికృత దవడ" సంస్కృత భాషలో, "హను" అంటే "దవడ" మరియు "మన" అంటే "వికృతమైనది అని అర్ధం. హనుమంతుడిని బాల్యంలో మారుతి అని పిలిచే వారు. అయితే హనుమంతుడు బాల్యంలో సూర్యుడిని ఒక పండుగా తిన్నాడు. దీంతో ప్రపంచం అంతా చీకటి మయం అవుతుంది. హనుమ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంద్రుడు.. హనుమంతుడిని మెరుపుతో దండించారని, అలా ఇంద్రుడు హనుమంతుడిని దండించడంతో దవడ విరిగి అపస్మారక స్థితిలో వెళ్లారు. ఈ సంఘటన తరువాత హనుమంతుడు తన దవడను కోల్పోయాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు బ్రహ్మచారే, అయినప్పటికీ ఒక కొడుక్కి తండ్రే హనుమంతుడు బ్రహ్మచారి. అయితే ఆ చిరంజీవికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడి పేరు "మకరధ్వాజ". లంకా దహనం అనంతరం హనుమంతుడు తన శరీరాన్ని చల్లబరుచుకునేందుకు తోకను సముద్రంలో ముంచాడు. అదే సమయంలో ఓ చేప హనుమంతుడిని చెమటను మింగడవల్ల.. ఆ చేప గర్భం దాల్చి మకర ధ్వాజకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. చదవండి : హనుమజ్జయంతి ప్రత్యేకత ఏంటో తెలుసా? -
శ్రీరామనవమి రోజున ఆధారాలు బయటపెడతాం
తిరుమల: శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్యలో దేవాలయం నిర్మితమవుతున్న తరుణంలో హనుమంతుడి జన్మస్థలాన్ని కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉందని టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో నూతన ప్లవనామ సంవత్సర ఉగాది ఆస్థానంలో పాల్గొన్న జవహర్‌రెడ్డి అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రం హనుమంతుడి జన్మస్థలం తమ ప్రాంతమేనని చెప్పలేదన్నారు. హనుమంతుడి జన్మస్థలంపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. టీటీడీ పండితుల వద్ద బలమైన ఆధారాలు కర్ణాటకలోని హంపి ప్రాంతం హనుమంతుడి జన్మస్థలంగా చెబుతున్నారని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే టీటీడీ పండితుల వద్ద ఉన్న ఆధారాలను శ్రీరామనవమి రోజున బయట పెడతామని తెలిపారు. ఇతర రాష్ట్రాలవారు కూడా తమ వద్ద ఉన్న ఆధారాలను బయట పెట్టవచ్చన్నారు. ఇప్పటికే టీటీడీ నియమించిన పండితుల కమిటీ తిరుమలలోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని పురాణాలను పరిశీలించి బలమైన ఆధారాలను సేకరించిందని వివరించారు. పురాణేతిహాసాలతో పాటు చారిత్రక ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చాయని చెప్పారు. హనుమంతుడి జన్మస్థలంపై పండితులు సేకరించిన ఆధారాలతో తయారు చేసిన నివేదికను శ్రీరామనవమి రోజున ప్రజల ముందుకు తీసుకువచ్చి అందరి అభిప్రాయాలను తీసుకుంటామని జవహర్‌రెడ్డి వివరించారు. ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 7 గంటల నుంచి ఉగాది ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహించామని చెప్పారు. -
నేను మోదీ హనుమాన్‌ని!
పట్నా/న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి తాను హనుమంతుడి వంటి భక్తుడినని లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ శుక్రవారం పేర్కొన్నారు. తన గుండెల్లో ఆయనే ఉన్నాడని, అనుమానం ఉన్నవారు తన గుండెను చీల్చి చూసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటోను వాడుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. జేడీయూ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటో అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటోను వాడుకుంటే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, సుశీల్ కుమార్ మోదీ హెచ్చరించిన నేపథ్యంలో చిరాగ్‌పాశ్వాన్ స్పందించారు. ‘సీఏఏను, ట్రిపుల్ తలాఖ్‌ను, ఎన్ఆర్సీని, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన సీఎం నితీశ్‌కే ప్రధాని ఫొటో అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రధానితో ఆయనే వేదికను పంచుకోవాల్సి ఉంటుంది’ అని చిరాగ్ వ్యాఖ్యానించారు. బీజేపీతో తన అనుబంధం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల తరువాత బిహార్‌లో బీజేపీ– ఎల్జేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమన్నారు. మరోవైపు, చిరాగ్ పాశ్వాన్ ఓట్లను చీల్చే వ్యక్తి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అభివర్ణించారు. బీజేపీ సీనియర్‌నేతలతో సత్సంబంధాలున్నాయని పేర్కొంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఎల్జేపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బిహార్‌లో బీజేపీ జేడీయూ, హెచ్ఏఎం, వీఐపీ పార్టీలతో కలిసి పోటీ చేస్తోందన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో 12 ప్రచార సభల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారని బిహార్ ఎన్నికల ఇన్చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. -
ఆంజనేయస్వామిని దర్శించుకున్న వైఎస్ జగన్
సాక్షి, ఇడుపులపాయ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చక్రయ్యపేట మండలంలోని వీరన్నగట్టుపల్లిలో గల గండి వీరాంజనేయస్వామి క్షేత్రాన్ని శనివారం దర్శించారు. ఆలయ పూజారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వైఎస్సార్ కడప జిల్లా నుంచే ఇతర కాకుండా జిల్లాల నుంచి కూడా అభిమానులు వైఎస్ జగన్‌తో పాటు ఆలయానికి తరలిరావడంతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆంజనేయస్వామిని దర్శించుని వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సమేతంగా వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని, అమీన్ పీర్ దర్గాను దర్శించిన సంగతి తెలిసిందే. అయితే 14 నెలల పాటు కొనసాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మొక్కులు చెల్లించుకునేందుకు సంకల్పించుకున్నారు. గురువారం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన వైఎస్ జగన్.. సామాన్య భక్తునిలా క్యూ లైన్లో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వైఎస్ జగన్ శుక్రవారం అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి ఆచారం ప్రకారం వైఎస్ జగన్ చాదర్ సమర్పించారు. కాగా, మరికాసేపట్లో వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించనున్నారు. -
హనుమంత్ ఖాన్ సాహెబ్
ఆ మధ్య యోగి ఆదిత్యనాథ్ గారు హనుమంతుడు దళితుడని వాక్రుచ్చారు. ఈ దేశంలో కులాల మధ్య తారతమ్యాలను ఆ విధంగా నిర్మూలించే ప్రయ త్నం వారు చేశారు. వారి మంత్రి మండలిలోని లక్ష్మీనారాయణ చౌదరిగారు శాసనసభలో హను మంతుడు జాట్ అని సెలవి చ్చారు. వారి దూరదృష్టి అనన్యసామాన్యం. ఈ విధంగా రాజస్తాన్‌లో ఒక వర్గం నిస్పృహను, నినాదాలను ఆయన ఒక్క వేటుతో నేలమట్టం చేసేశారు. ఈ లోగా మరొక బీజేపీ నాయకుడు బుక్కాల్ నవాబ్ గారు మరొక అపూర్వమైన సృష్టి రహస్యానికి తెర లేవ దీశారు. హనుమంతుడు ముస్లిం అని బల్లగుద్దారు. ఇది చరిత్రను తిరగరాసే, సమాజహితానికి తెరలేపే అపూర్వ మైన పరిశీలన. ఈ లెక్కన కిష్కింధలో వానర సైన్య మంతా ముస్లింలేనా– సుగ్రీవ్ అహమ్మద్, వాలి అహమ్మ ద్‌ల మధ్య వైషమ్యానికి కేవలం తారా బేగం మాత్రమే కాక మతపరమైన కారణాలేమైనా ఉన్నాయా అన్న విష యాలను వివరిస్తూ మరో వాల్మీకి ఖాన్ కనీసం కిష్కింధ కాండనుంచీ రామాయణాన్ని తిరిగి రాయాలని నాకని పిస్తుంది. నన్నడిగితే ఈ బుక్కాల్ నవాబు గారిని హిందు వులు పూలదండలు వేసి దేశమంతా ఊరేగించాలి. హను మంత్ ఖాన్ సాహెబ్ ముస్లిం కనుక, వారికి తన స్వామి శ్రీరాముని పట్ల అపారమైన భక్తి కనుక– ఈ దేశంలో తర తరాలుగా మురిగిపోతున్న అయోధ్య రామ మందిర సమస్య తేలికగా పరిష్కారం కాగలదు. అది ఈ లెక్కన ముస్లింలకూ ప్రార్థనా స్థలం కనుక. నా దగ్గర ఒక మహా అపురూపమైన నాణెం ఉంది. అది 210 సంవత్సరాల కిందటిది. మన దేశానికి స్వాతం త్య్రం రావడానికి 139 సంవత్సరాల ముందుది. ఆనాటికీ ఈ దేశంలో దేశ స్వాతంత్య్రానికి ఆలోచనలే లేవు. ముస్లింలకు వేరే దేశం, ప్రతిపత్తి అన్న ఆలోచనలే లేవు. నిజానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పాలించడం లేదు. ఏమిటి ఈ నాణెం ప్రత్యేకత? ఈ దేశంలో 565 జమీందారీలు, రాజపాలిత సంస్థానాలూ ఉండగా మన దేశానికి కేవలం వ్యాపారానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వెలువరించిన నాణెమిది. అర్దణా నాణెం. అంటే రూపాయిలో 32వ వంతు. ఈ నాణెం మీద హను మంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువెళ్తున్న దృశ్యాన్ని ముద్రించారు. ఇది అపూర్వమైన విషయం (210 సంవ త్సరాల కిందటిమాట అని మరిచిపోవద్దు) ఇంకా నయం హనుమంతుడు లంక్‌షైర్‌లోనో, బర్మింగ్‌హామ్‌లోనో పుట్టిన హనుమంత్ హెన్రీ అనో, వయస్సొచ్చాక ఎగిరి కిష్కింధ చేరాడనో అనలేదు. అయినా నిమ్మకాయలమ్ము కునే వ్యాపారికి యజమాని విశ్వాసాలను పరిరక్షించే ప్రయత్నం ఎందుకు? సమాధానం– అది వారి సంస్కృతి కనుక. ఆ సంస్కృతిలోంచే బ్రౌన్, కాటన్, మెకంజీ వంటి మహనీయులు వచ్చారు. ప్రజల సొమ్మును తినే నీచ వ్యాపారుల సంస్కృతి మనది. ఉదాహరణకి– విజయ్ మాల్యా, నీరవ్ మోదీ. ఏదీ? మతాతీత దేశమైన ఈ దేశంలో దమ్ముంటే ఇలాంటి నాణేన్ని విడుదల చేయమనండి. వేలంకన్ని చర్చి బొమ్మతో నాణేన్ని ముద్రించమనండి. జుమ్మా మసీదు బొమ్మతో నాణేన్ని ముద్రించమనండి. మతాతీత వ్యవస్థ అంటే మతాన్ని అటకెక్కించాల్సిన పనిలేదు. మనకి మతం అడ్డువస్తుంది. మతం సామరస్యానికి పట్టుగొ మ్మగా నిలవాల్సిందిపోయి– పక్కవాడి మతాన్ని దుయ్య పట్టేదిగా తయారయింది. కాగా, ఒక వర్గానికి జరిపే ఉపకారం, క్రమంగా షరతై, ఓట్లయి, హక్కై– మైనారిటీల పేరిట పునాదుల్ని పెంచుకున్నాయి. ఇవాళ మనది స్వాతంత్య్ర దేశం. ఎంతో పురోగతిని సాధించిన దేశం. కానీ మతాల మధ్య అంతరాలను ఆ కారణానికే పరిష్క రించుకునే పెద్ద మనస్సు లేని దేశం. ఈ నేపథ్యంలో మన బుక్కాల్ నవాబుగారి ప్రతి పాదన అమోఘం. అన్నట్టు సత్యపాల్ చౌదరి అనే కేంద్ర మంత్రి హనుంతుడు ఒక ‘ఆర్యుడు’ అన్నారు. నంద కిషోర్ అనే రాష్ట్ర గిరిజన సంస్థ అధ్యక్షులు హనుమంతుడు ఒక గిరిజనుడన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులు దీపక్ సింగ్ గారు మొదట హనుమంతుడు ఎవరో ప్రభుత్వం తేల్చవ లసిన అవసరం ఉన్నదని సభా హక్కుల తీర్మానాన్ని లేవదీశారు. ఏతావాతా మనకి అర్థం అవుతున్న విషయం ఏమి టంటే– ఈ దేశంలో మత విశ్వాసాల ఉద్దీపనకిగానీ, తమ వర్గానికో, మతానికో ప్రాతినిధ్యం వహించే ముఖ్య లక్ష్యా నికిగానీ రామాయణంలో ‘హనుమంతుడి’ పాత్ర ఒక్కటే పెట్టుబడి కావటం– అదిన్నీ 210 సంవత్సరాలకు పైగా నిరూపణ అవుతున్నందుకు హిందువులు గర్వపడవచ్చు. ఈ ప్రతిపాదనలు చేసినవారు కేవలం పార్టీ సభ్యులు కారు. శాసనసభల్లో ప్రతినిధులు. సమాజానికి సేవ చెయ్యడానికి ప్రజల మద్దతుని కూడగట్టుకున్న రాజకీయ నాయకుల ‘వెర్రితలల’ విశృంఖలత్వానికి ఇది శిఖరాగ్రం. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
‘హనుమాన్ జోలికి వస్తే మీ లంకను కాల్చేస్తాడు’
జైపూర్ : హనుమంతుడిపై బీజేపీ నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్‌బ్బర్ హితవు పలికారు. లేకుంటే ఆ హనుమంతుడే బీజేపీ లంకను కాల్చేస్తాడని హెచ్చరించారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హనమంతుడు దళితుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో హనమంతుడి కులం చర్చనీయాంశమైంది. అదే బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ హనుమంతుడు బ్రాహ్మణుడంటే.. మరో ఎంపీ గిరిజనడన్నారు. ఇంకో బీజేపీ ఎమ్మెల్సీ ముస్లిం అంటే యూపీ మంత్రి జాట్ అన్నారు. ఇలా హనమంతుడి పేరును రాజకీయం చేయడంపై రాజ్‌బబ్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే హనుమంతుడిని ఇబ్బంది పెట్టినందుకు బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందని, ఇలానే చేస్తే ఆ దేవుడు తన తోకతో బీజేపీ లంకను కాల్చేస్తాడని హెచ్చరించారు. -
హనుమాన్ జాట్ కులస్తుడే: యూపీ మంత్రి
లక్నో: ఆంజనేయుడు తమ జాట్ కులస్తుడేనని ఉత్తరప్రదేశ్ మత వ్యవహారాల శాఖ మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌధరి వ్యాఖ్యానించారు. ‘శ్రీరాముడి అర్ధాంగి సీతమ్మను రావణుడు ఎత్తుకెళ్లాడు. హనుమంతుడు వెళ్లి లంకాదహనం చేశాడు. శ్రీరాముడికి అపకారం తలపెట్టింది రావణుడు. అసలు సీతారాములు ఎవరో, రావణుడు ఎవరో హనుమంతుడికి తెలియదు. కానీ, ఆయన అన్యాయం జరుగుతుంటే సహించలేకపోయాడు. ఇదే జాట్ల వ్యక్తిత్వం. అన్యాయం ఎక్కడ, ఎవరికి జరిగినా జాట్లు సహించలేరు’ అంటూ తన వాదనను సమర్థించుకున్నారు. -
హనుమాన్ మా ముస్లిం: బీజేపీ ఎమ్మెల్సీ
లక్నో: హనుమంతుడు దళితుడంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారకమునుపే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆంజనేయుడు దళితుడు కాదు, ముస్లిం.. అంటూ బీజేపీకే చెందిన ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ముస్లిం పేర్లు రహ్మాన్, ఫర్హాన్ లాగా ఆయన పేరు కూడా హనుమాన్ అని ఉండటమే అందుకు రుజువు అని ఆయన వాదిస్తున్నారు. ‘అందరికీ ప్రీతిపాత్రుడైన దైవస్వరూపుడు హనుమంతుడు. మతం, కులం, వర్గం అనే బేధం లేకుండా ఆయన అందరి పూజలు అందుకుంటున్నారు. మా మతంలోని వారికి ఉండే పేర్లు సల్మాన్, రెహ్మాన్, రంజాన్, జిషాన్, కుర్బాన్.. మాదిరిగానే హనుమాన్ పేరు కూడా ఉంది. అందుకే, నాకు తెలిసినంతవరకూ ఆయన మహమ్మదీయుడు’ అని బుక్కల్ నవాబ్ తన వాదనను సమర్థించుకున్నారు. -
దళితుడు.. గిరిజనుడు... కాదు కాదు ముస్లిం!
లక్నో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం పొందేందుకో లేదా ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకో రాజకీయ నాయకులు చేసే కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు దళితుడు అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ విషయంపై స్పందించిన ఓ జైన మతప్రబోధకుడు హనుమంతుడు జైన మతానికి చెందిన వాడని వ్యాఖ్యానించగా... ఇక ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ యాదవ్ ఓ అడుగు ముందుకు వేసి హనుమంతుడి కులాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికేట్ జారీచేయాలని వారణాసి జిల్లా కలెక్టరేట్లో దరఖాస్తు చేశారు. మరోవైపు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ నందకుమార్.. హనుమంతుడు దళితుడు కాదని గిరిజనుడని ప్రకటించి వివాదాన్ని మరో మలుపు తిప్పారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ హనుమంతుడి మతాన్నే మార్చివేసి మరో కొత్త వివాదానికి తెరతీశారు. గురువారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్...‘ హనుమంతుడు ముస్లిం అని నమ్ముతున్నా. అందుకే ముస్లింలు ఆయన పేరు మీదుగానే రెహమాన్, ఫర్మాన్, జీషన్, కుర్బాన్ వంటి పేర్లు పెట్టుకుంటారు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా నోరు ఉండి ప్రశ్నించగల ‘ఓటరు దేవుళ్లే’ ఎన్నికల వాగ్దానాలు తప్పిన ప్రజాప్రతినిధులను ఏమీ చేయలేక మౌనం వహిస్తుంటే.. పాపం అందరి తప్పులను మన్నించే గుణం ఉన్న ఆ దేవుడు స్వార్థ రాజకీయాల కోసం తనకు ఎన్ని కులాలు, మతాలు అంటగడితే మాత్రం ఏం చేస్తాడులెండి! #WATCH: BJP MLC Bukkal Nawab says "Hamara man'na hai Hanuman ji Muslaman theyy, isliye Musalmanon ke andar jo naam rakha jata hai Rehman, Ramzan, Farman, Zishan, Qurban jitne bhi naam rakhe jaate hain wo karib karib unhi par rakhe jaate hain." pic.twitter.com/1CoBIl4fPv — ANI (@ANI) 20 December 2018 -
హనుమంతుడి ముందు కుప్పిగెంతులు
దేవుడిపై ప్రయోగించిన కులం కార్డు ఎటు తిరుగుతోందన్న చర్చ తీవ్రరూపం దాలుస్తోంది. ఓ వైపు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో హిందూ సంస్థలు నిమగ్నమైతే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడి కులంపై వ్యాఖ్యలు చేసి కొత్త విషయాల్ని తెర మీదకు తెచ్చారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో.. హనుమంతుడు దళితుడు అని పేర్కొన్న యోగి ఆ వర్గం నుంచి ఓట్లు రాలుతాయని ఆశించి ఉండొచ్చు. ఆ వెంటనే బీజేపీ ఎంపీ సావిత్రిబాయి ఫూలే.. హనుమంతుడు మనువాడీలకు బానిస అని, రాముడి కోసం ఎంతో చేశాడని, అయినా ఆయనకు తోక ఎందుకు పెట్టారని ప్రశ్నించి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ యాదవ్ హనుమంతుడి కులాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికేట్ జారీచేయాలని వారణాసి జిల్లా కలెక్టరేట్లో దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ నందకుమార్.. హనుమంతుడు దళితుడు కాదని గిరిజనుడని ప్రకటించి వివాదాన్ని మరో మలుపు తిప్పారు. ఉద్రిక్తత రాజేసిన భీమ్ ఆర్మీ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలోని హనుమంతుడి ఆలయాలన్నింటిని దళితులు స్వాధీనం చేసుకోవాలని భీమ్ ఆర్మీ పిలుపునిచ్చింది. ఆ ఆలయాలన్నింటిలో దళిత పూజారుల్ని నియమిస్తామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. ఈ మేరకు భీమ్ ఆర్మీ సభ్యులందరూ ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న హనుమంతుడి ఆలయాలను ఆక్రమించుకోవాలని పిలుపునిచ్చారు. భీమ్ ఆర్మీకి ఆల్ ఇండియా అంబేద్కర్ మహాసభ మద్దతు పలకడంతో ముజఫర్‌నగర్‌లో హనుమాన్ ధామ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భీమ్ ఆర్మీ కార్యకర్తలు గత మంగళవారమే సంకటవిమోచన హనుమాన్ ఆలయాన్ని ఆక్రమించుకొని అక్కడి పురోహితుడ్ని తొలగించి దళితుడిని పూజారిగా నియమించారు. ‘హిందూ మతానికి యోగి ఆదిత్యనాథ్ ఒక రాజ్యాంగపరమైన అధికారి. అందుకే ఆయన వ్యాఖ్యలపై మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది’ అని కొత్త పూజారి దీపక్ గంభీర్ అంటున్నారు. మతంతో రాజ్యాధికారం! ఆంజనేయుడి ఆలయాలపై పెత్తనం సాధిస్తామంటూ భీమ్ ఆర్మీ చేసిన ప్రకటనను దళితుల్లోనే కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దళితుల అభివృద్ధికి పాటుపడకుండా ఇలా ఆలయాల్లో పూజారులుగా నియమిస్తే ఒరిగేదేమిటని ప్రశ్నిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, చైతన్యపరచడం ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే బహుజన్ డైవర్సిటీ మిషన్‌కు చెందిన హెచ్.ఎల్.దుసధ్ వాదన భిన్నంగా ఉంది. మతం అత్యంత శక్తిమంతమైనదని, దానిని చేతుల్లోకి తీసుకుంటే నైతికంగా బలం పుంజుకొని రాజ్యాధికారానికి బాటలు పడతాయని ఆయన వ్యాఖ్యానించారు. కులానికో దేవుడుంటే లాభమా? కులానికో దేవుడు ఉన్న ఈ రోజుల్లో తాజా వివాదం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యాదవులందరూ కృష్ణుడు తమ కులదైవం అంటారు. కుష్వాహాలు రాముడి కుమారుడైన కుశుడి సంతతి వాళ్లమని భావిస్తారు. కుర్మీలు లవుడు తమ వాడేనని అంటారు. విశ్వకర్మ తమ కులదైవమని లోహార్లు చెబుతారు. వాల్మీకీ సంతతికి చెందినవాళ్లమని పారిశుధ్ధ్య కార్మికులు చెప్పుకుంటారు. జరాసంధుడి వారసులమని కహరా కులస్తులు (పల్లకీలు మోసే వృత్తి) చెప్పుకుంటారు. ఇలా ప్రతీ వెనుకబడిన కులాల వాళ్లూ సామాజికంగా తమ హోదాలు పెంచుకోవడానికి ఫలానా దేవుళ్లకి వారసులమని చెప్పుకోవడం పరిపాటిగా మారిందని సోషయాలజిస్టు ఎం.ఎన్. శ్రీనివాస్ ఎప్పుడో చెప్పారు. -
హనుమంతుడి కులపత్రం ఇవ్వండి
వారణాసి: హనుమంతుడు దళితుడంటూ మొదలైన చర్చ కొత్త మలుపు తిరిగింది. అంజనీపుత్రుడి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత శివపాల్ యాదవ్‌కు చెందిన పార్టీ నేతలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వారంలోగా సర్టిఫికెట్ ఇవ్వకుంటే ధర్నా చేపడతామని హెచ్చరించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో విభేదాల కారణంగా ములాయం సోదరుడైన శివపాల్ యాదవ్ అక్టోబర్‌లో ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ(పీఎస్‌పీఎల్)(లోహియా) స్థాపించారు. ఆ పార్టీ వారణాసి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హరీశ్ మిశ్రా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘దైవ స్వరూపుడైన ఆంజనేయుడి కుల ధ్రువీకరణ పత్రం కోసం వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో దరఖాస్తు చేశాం. హనుమంతుడు దళితుడంటూ సీఎం యోగి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన్ను స్వార్థపూరిత కుల రాజకీయాల్లోకి లాగారు. అందుకే హనుమంతుడి కుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశాం’ అని తెలిపారు. దరఖాస్తులో హనుమాన్ తల్లిదండ్రులను మహారాజ్ కేసరి, అంజనాదేవీగాను ఆయన నివాసం ప్రముఖ సంకట్ మోచన్ ఆలయంగాను పేర్కొన్నారు. కులానికి సంబంధించిన కాలమ్‌లో దళితుడిగా, పుట్టిన తేదీని అనంతుడనీ, వయస్సును అమరుడు అని పేర్కొన్నారు. హనుమంతుడు దళితుడైనందున దేశ వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలను స్వాధీనం చేసుకుని, దళితులనే పూజారులుగా నియమించుకోవాలంటూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ దళితులకు శుక్రవారం పిలుపునిచ్చారు. -
ఆంజనేయుడు దళితుడన్న సీఎంకు నోటీసు
జైపూర్: హనుమంతుడిని దళితుడన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు హిందూ సంస్థ ఒకటి లీగల్ నోటీసు ఇచ్చింది. మూడు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రాజస్తాన్‌లోని ఆల్వార్ జిల్లా మాలాఖేడాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ..‘హనుమంతుడు అడవిలో జీవించేవాడు. ఆయన నిరుపేద దళితుడు. రాముని ఆకాంక్ష మేరకు ఆయన భారత సమాజాన్ని ఏకం చేయటానికి కృషి చేశాడు. ఆయన మాదిరిగానే మనం కూడా రాముని ఆకాంక్షను నెరవేర్చేదాకా విశ్రమించకూడదు. ప్రజలంతా రామభక్తులకే ఓటేయాలి. రావణులకు కాదు’ అని అన్నారు. దీంతో యోగికి రాజస్తాన్ సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా నోటీసులు పంపారు. -
‘అంబేద్కర్‌కి మొదటి ప్రాధాన్యం ఇవ్వొద్దు’
జైపూర్: బీజేపీ నేతల మాటలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ వైపు మతతత్వ పార్టీ అంటూ బీజేపీపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. నాయకుల అనుచిత వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. తాజాగా బీజేపీ రాజస్థాన్ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహుజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. శుక్రవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘తమని ఆదివాసీలుగా చెప్పుకొనే ఎస్సీ, ఎస్టీలు అంబేద్కర్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వొద్దు. ఆయన కంటే ముందుగా హనుమాన్‌ని పూజించాలి. ఎందుకంటే, ఆదివాసీల మొదటి నాయకుడు హనామన్ జీ మాత్రమే.వారంతా ఆయనకు అగ్ర తాంబూలం ఇవ్వాలి. వారి మొదటి దేవుడు హనుమాన్. దళితులకు మార్గ నిర్దేశం చేసింది హనుమానే’ అని అహుజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యాలయంలో గల అంబేద్కర్ విగ్రహం కింద హనుమాన్ చిత్రపటం ఉండడం చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుణ్ని అవమానించారని మండిపడ్డారు. ‘మీరు సిగ్గు పడాలి. మీరంతా ఆదివాసీలమని చెప్పుకొంటూనే హనుమాన్‌ని అవమానిస్తారా..!’ అని స్థానిక ఎంపీ కిరోడి లాల్ మీనాపై అహుజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయస్వామికి ప్రపంచం మొత్తం మీద దాదాపు 40 లక్షల దేవాలయాలు ఉన్నాయని ఆయన అన్నారు. మరే దేవుడికి ఇన్ని ఆలయాలు లేవని తెలిపారు. అహుజా వ్యాఖ్యలపై ఎంపీ కిరోడిలాల్ స్పందించారు. ‘ హనుమాన్ కాలంలో ఇటువంటి రాజకీయాలు లేవు. అహుజా హనుమాన్ జీని ఆదివాసీ, దళిత నాయకుడు అని అనాల్సిన అవసరం ఏమొచ్చిందో అంతుచిక్కడం లేద’ని ఆయన అన్నారు. ‘హనుమాన్‌కి అవమానం జరిదిందని విన్నాను. ఇది చాలా విచారకరం. అలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను కించపరుస్తాయి. అయినా, ఈ ఘటనకు ఆదివాసీలను బాధ్యులను చేయాల్సిన అవసరం లేద’ని అన్నారు. -
కొనసాగుతున్న ‘విగ్రహ’ కాండ
చెన్నై/కన్నూర్/లక్నో: దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసకాండ కొనసాగుతోంది. లెనిన్, పెరియార్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేడ్కర్ విగ్రహాలపై వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవుతుండగానే కేరళలోని కన్నూర్‌లో గాంధీ విగ్రహానికి నల్లరంగు పూశారు. ఈ ఘటనలో గాంధీ కళ్లద్దాలు పగిలిపోయాయి. చెన్నైలోని తిరువోత్తియూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. ఈ ఘటనను తమిళనాడు సీఎం పళనిస్వామి ఖండించారు.నిందితులను పట్టుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. అటు, యూపీలోని బలియా జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయటం ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతూ.. సమాజంలో శాంతి సామరస్యాలకు భంగం కలిగిస్తున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదుచేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. -
ఎప్పుడు... ఎలా మాట్లాడాలి ?
ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసిన వారిని ఉద్దేశించే కాబోలు, ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే సామెత పుట్టి ఉండవచ్చు. ఉదాహరణకు... రామాయణంలో సుగ్రీవుడి సచివుడిగా మొట్టమొదటిసారి హనుమ రాముడిని కలిశాడు. నాలుగు మాటలు మాట్లాడాడు. వెంటనే రాముడు లక్ష్మణుడితో – ‘‘చూశావా? ఇతను నవ వ్యాకరణ పండితుడు. శాస్త్రాలన్నీ చదివినవాడు. మాటలో తడబాటులేదు. అస్పష్టత లేదు. అసందిగ్ధం లేదు. కొట్టినట్లు లేదు. మృదువుగా, ప్రియంగా ఉంది. ఎంత మాట్లాడాలో అంతే, అర్థవంతంగా, మనసుకు హత్తుకునేలా మాట్లాడుతున్నాడు’’ అని మెచ్చుకున్నాడు. అంటే హనుమ మాటలకే రాముడు మంత్రముగ్ధుడయ్యాడన్నమాట. మరో సందర్భంలో హనుమ మాటలు సీతమ్మకు ఉపశమనంలా అనిపించాయి. అంతులేని నిర్వేదంలో ఉన్న సీతమ్మ, హనుమ మాటలకు దుఃఖం నుంచి తేరుకుంది. అదెప్పుడో చూద్దామా..? అప్పటికి పదినెలలుగా సీతమ్మ కంటికి మంటికి ఏకధారగా విలపిస్తోంది. హనుమ అశోక వనం చేరి – ఆమె సీతమ్మేనని నిర్ధారించుకున్నాడు. ఆమె కూర్చున్న చెట్టుకొమ్మ మీద అంతా గమనిస్తూ ఉన్నాడు. ఈ లోపు తెల్లవారకముందే రావణాసురుడు మందీమార్బలంతో బయలుదేరాడు. రాముడు ఉన్నాడో లేడో, ఉన్నా రాలేడు. ఇక రెండు నెలలు గడువిస్తా. అయినా మనసు మారకపోతే, గడువు తరువాత రోజు ఉదయం ఫలహారంగా సీతను తింటానని – హుంకరించి వెళ్ళిపోయాడు. రావణుడి మాటలతో రాక్షసులు మరింతగా సీతమ్మను ఏడిపించారు. సీతమ్మకు అంతులేని వేదన. తనను తాను చంపుకుందామన్నా తగిన వస్తువు అందుబాటులో లేదు. తన జడనే చెట్టుకొమ్మకు బిగించి, ఆపై మెడకు బిగించుకుందామని సిద్ధం కాబోతోంది. ఇంతలో హనుమ మెరుపులా స్పందించాడు. హనుమంతుడు... రామకథను, గంధర్వగానంగా, మృదువుగా అమ్మకు చైతన్యం కలిగేలా, రాక్షసులకు నిద్రవచ్చేలా, మైథిలీ ప్రాకృత భాషలో, అది కూడా అయోధ్యా మాండలికంలో ప్రారంభించాడు. అమృతపు జల్లువంటి ఆ మాటలతోనే సీతమ్మ ఎంతో సాంత్వన పొందింది. ఆ తర్వాత హనుమ తనకోసం ఎదురు చూస్తున్న వానరులతో, రామలక్ష్మణులతోనూ ‘‘చూశాను సీతను’’ అని చెప్పాడు. అంటే సూటిగా స్పష్టంగా చెప్ప వారికి ఉపశమనం కలిగించాడు. -
వింత మొక్కు.. ఆపై తీర్థంలా మూత్రం!
మండ్య: మగబిడ్డ పుడితే డబ్బు బంగారం సమర్పణ, అన్నదానం ఇలా రకరకాలుగా మొక్కులు తీర్చుకోవడం తెలుసు. కానీ కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని డింక గ్రామంలో ఇది వెరైటీగా మొక్కు తీర్చుకున్నారు. మొక్కు ద్వారా పుట్టిన మగ బిడ్డకు 5-10 ఏళ్ల వయసులో గ్రామంలో ఆంజనేయ స్వామి పండగ సందర్భంగా నగ్నంగా నిచ్చైన పైన కుర్చోబెట్టి గ్రామంలో ఊరేగింపు జరిపారు. ఆ సమయంలో ఇతన్ని బాల హనుమంతుగా స్తుతిస్తారు. బాలుడికి దిగంబరంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వంద మీటర్ల దూరంలోని రంగమంటపం వరకు నిచ్చెనపైన కుర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ జనం నృత్యాలు చేస్తూ బాలుని కోసం ఎదురుచూస్తున్నారు. బాలుడు రాగానే అతని మూత్రాన్ని సేకరించి తీర్థం మాదిరిగా తమపై చల్లుకున్నారు. దీనివల్ల తమకూ మగబిడ్డ పుడతాడనేది వారి విశ్వాసం. ఈ సందర్భంగా గ్రామంలో వర్షాలు ఎలా పడతాయి, పంటలెలా పండుతాయన్న దానిపై బాల హనుమంతుడు భవిష్యవాణి వినిపించాడు. సుమారు 200 ఏళ్ల నుంచీ ఈ సంప్రదాయం ఉంది. దీనికే నిచ్చెన హనుంతు మొక్కు అనే పేరు కూడా ఉంది. -
వాక్య చతురుడు
సందేశం చాలామంది దృష్టిలో హనుమంతుడు అంటే రామనామం చెవిన పడగానే ఆనంద బాష్పాలు విడిచే రామభక్తుడని మాత్రమే. అపార మైన బలానికి, శక్తి సామర్థ్యాలకు ఆయన ప్రతీక అని మాత్రమే. అయితే హనుమని గురించి తెలుసుకోవలసిన విషయాలెన్నో ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసినవాడు హనుమంతుడు. కిష్కింధకాండలో ప్రవేశిస్తాడు హనుమంతుడు. అక్కడ నుంచి కథ అంతా హనుమంతుని వెంట నడుస్తుంది. హనుమంతుడు వాక్య కోవిదుడు. ప్రభువు హితవు కోరే సచివునిగా సుగ్రీవునితో; తన ప్రభువుతో స్నేహం చేసేలా రామలక్ష్మణులతో, అపరిచిత ప్రాంతంలో కలిసిన స్వయంప్రభతో, సీతాన్వేషణ కార్యభారాన్ని స్వీకరిస్తూ వానరసేనతో, లంకానగర ప్రవేశాన్ని నిరోధించిన లంఖిణితో, ఆత్మహత్యకు సిద్ధమవుతున్న సీతాదేవితో, తనను ఎదిరించ వచ్చిన రాక్షసులతో, అశోక వన విధ్వంసానికి ఆగ్రహించిన రావణునితో, సీత క్షేమ సమాచారాన్ని అందిస్తూ – వానరులతోనూ, శ్రీరామునితోనూ... అడుగడుగునా హనుమంతుని మాట తీరు అందరికీ అనుసరణీయం. ఆయన మాటలలో ఒక్కటి కూడా అసంబద్ధంగా ఉండదు. విషయంతో సంబంధం లేని మాట కాని, సందిగ్ధం కాని, ఆపి ఆపి మాట్లాడటం కానీ ఉండదని, వాక్యచతురుడని స్వయంగా రాముడే మెచ్చుకున్నాడు. తాను నమ్మిన రాముడే తన బలం అనుకున్నాడు హనుమ. ప్రతి చిన్న విజయానికీ నా అంతటి వాడు లేడంటూ విర్రవీగుతారు అజ్ఞానులు. అహంకారం మనిషిని ఎదగనివ్వదు. వినయం ఉన్నతినిస్తుంది. వినయం అనేది వ్యక్తికీ వ్యక్తిత్వానికీ వన్నె తెచ్చే... పెట్టని అలంకారం. ఎన్ని ఘన విజయాలు సాధించినా వినయాన్ని వీడలేదు హనుమంతుడు. ఎటువంటి పరిస్థితులలోనూ నిగ్రహాన్ని కోల్పోవడం కానీ, ఆత్మవిశ్వాసాన్ని సడలడం కానీ లేదు. ఆయన నుంచి ఈ లక్షణాలను అలవరచుకోవడమే ఆయనకు చేసే పూజ. (ఉషశ్రీ ‘ఎవరితో ఎలా మాట్లాడాలి’ పుస్తకం నుంచి)