శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం అంటూ శ్రీ ఆంజనేయుడిని స్మరించిన వెంటనే విచక్షణా జ్ఞానం లభిస్తోందని భక్తులు నమ్ముతుంటారు. హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తివంతమైన హనుమంతుడి నామస్మరణ చేస్తే భయం, మానసిక ఆందోళన తొలగి బలం, కీర్తి వరిస్తాయి. భయం తొలిగిపోతుంది. మానసిక ఆందోళన నుంచి భయటపడవచ్చు. మరి అంతటి మహిమాన్వితుడు హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.
హనుమంతుడు శివుడి అవతారం
ఒకప్పుడు స్వర్గంలో నివసించిన "అంజన అనే అప్సర ఒకరిని ప్రేమిస్తుంది. దీంతో అంజనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ రుషి అంజన మొహం వానరం అవతారంలా మారిపోవాలని శపిస్తారు. అయితే రుషి శాపంతో భయాందోళనకు గురైన అంజన ఆ శాపం నుంచి తనని రక్షించాలని బ్రహ్మదేవుడిని వేడుకుంటుంది. దీంతో బ్రహ్మదేవుడు ఆమెకు భూమిపై మానవునిగా జన్మించే వరాన్ని ప్రసాదిస్తారు. ఇక బ్రహ్మదేవుడి వరంతో అంజనా భూలోకంలో జన్మిస్తుంది. రాజవంశానికి చెందిన కేసరితో ప్రేమలో పడుతుంది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. శివుని భక్తురాలైన అంజన వివాహం తరువాత శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠిన మైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సుతో ప్రత్యక్షమైన శివుడిని.. తనకు అత్యంత ధైర్యశాలి అయిన కుమారుడు జన్మించేలా వరం ఇవ్వాలని కోరుకుంటుంది. అందుకు శివుడు అంగీకరిస్తాడు.
కొద్ది రోజుల తరువాత దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ యాగం ముగిసిన తరువాత యాగం కోసం తయారు చేసిన ప్రసాదాన్ని భార్యలకు పంచిపెట్టాడు. రాణి కౌశల్యకు ఓ డేగ ద్వారా ప్రసాదాన్ని పంచుడుతాడు. ప్రసాదం తీసుకొని డేగ కౌశల్య దగ్గరకు వెళుతుండగా శివుడి ఆజ్ఞతో డేగ చేతిలో ఉన్న ప్రసాదం అంజన చేతిలో పడుతుంది. అయితే ప్రసాదాన్ని శివుడే పంపించాడని, ఆ ప్రసాదం తిన్న అంజన శివుడి అవతారమైన హనుమంతునికి జన్మనిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.
హనుమంతుడిని జై భజరంగభళి అని ఎందుకు పిలుస్తారు
ఓ రోజు సీతమ్మవారు తన నుదుటున కుంకుమ పెట్టుకునే సమయంలో సీతమ్మవారిని హనుమంతుడు అమ్మా.. నుదుటున కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు అని అడిగినప్పుడు.. అందుకు సీతమ్మ వారు హనుమ.. నా భర్త శ్రీరాముడు సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటూ కుంకుమతో బొట్టుపెట్టుకుంటున్నానని చెప్పిందట. దీంతో సీతాదేవి సమాధానానికి ముగ్ధుడైన హనుమంతుడు.. అప్పుడు నేను కుంకుమను శరీరం మొత్తం పూసుకుంటే శ్రీరాముడి జీవితకాలం ఎన్నోరేట్లు పెరుగుతుంది కదమ్మా అని అన్నాడు. ఆ తరువాత కుంకుమను హనుమంతుడు శరీరం అంతా పూసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. కుంకుమను భజరంగ్ అని కూడా పిలుస్తారు. ఆ రోజు నుండి హనుమంతుడిని ‘భజరంగ్ భళి’ అని పిలుస్తారు. ఆయనను పూజించినప్పుడల్లా కుంకుమతో అలంకరిస్తారు.
సంస్కృతంలో "హనుమంతుడు" అంటే "వికృత దవడ"
సంస్కృత భాషలో, "హను" అంటే "దవడ" మరియు "మన" అంటే "వికృతమైనది అని అర్ధం. హనుమంతుడిని బాల్యంలో మారుతి అని పిలిచే వారు. అయితే హనుమంతుడు బాల్యంలో సూర్యుడిని ఒక పండుగా తిన్నాడు. దీంతో ప్రపంచం అంతా చీకటి మయం అవుతుంది. హనుమ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంద్రుడు.. హనుమంతుడిని మెరుపుతో దండించారని, అలా ఇంద్రుడు హనుమంతుడిని దండించడంతో దవడ విరిగి అపస్మారక స్థితిలో వెళ్లారు. ఈ సంఘటన తరువాత హనుమంతుడు తన దవడను కోల్పోయాడని పురాణాలు చెబుతున్నాయి.
హనుమంతుడు బ్రహ్మచారే, అయినప్పటికీ ఒక కొడుక్కి తండ్రే
హనుమంతుడు బ్రహ్మచారి. అయితే ఆ చిరంజీవికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడి పేరు "మకరధ్వాజ". లంకా దహనం అనంతరం హనుమంతుడు తన శరీరాన్ని చల్లబరుచుకునేందుకు తోకను సముద్రంలో ముంచాడు. అదే సమయంలో ఓ చేప హనుమంతుడిని చెమటను మింగడవల్ల.. ఆ చేప గర్భం దాల్చి మకర ధ్వాజకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.
చదవండి : హనుమజ్జయంతి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment