hanuman jayanti celebrations
-
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. కారణం ఇదే?
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతున్న సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యలలో భాగంగా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే, ఇటీవల శ్రీరామనవమి సందర్బంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసులు రాజాసింగ్‌పై కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే హనుమాన్ జయంతి సందర్భంగా ముందస్తుగా రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది నేను హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బైక్ ర్యాలీలో పాల్గొంటాను. కానీ, ఈసారి మాత్రమే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలని ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ తర్వాత జరిగినే విధ్వంసాలు, అనర్థాలకు నేను మాత్రం బాధ్యుడిని కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, గౌలిగూడ టు తాడ్‌బండ్ హనుమాన్ జయంతి విజయ యాత్రకు ప్రత్యేకమైన బందోబస్తుతో ఎవరికీ ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ అడిషినల్ సీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందితో పాటు శాంతిభద్రతల సిబ్బంది సైతం ట్రాఫిక్ డ్యూటీలో ఉంటున్నట్లు తెలిపారు. యాత్ర సాగే రూట్లో ట్రాఫిక్ డైవర్షన్లు చేస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలను సైతం సూచిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల సమయంలో సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, ఉప్పల్ వెళ్లేవారి కోసం రూట్‌ని కూడా సూచిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు, వాహనదారులకు ఏమైనా అర్థం కాకపోయినా, సమస్యలున్నా నేరుగా 040–27852482, 9010203626 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు. ట్రాఫిక్ ఏర్పాట్లపై అడిషినల్ సీపీ సుధీర్‌బాబు బుధవారం మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. గౌలిగూడ యత్ర ప్రారంభం నుంచి తాడ్‌బండ్ వరకు 12 కి.మీ.మేర యాత్ర కొనసాగనుంది. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కోఠి, సుల్తాన్‌బజార్, కాచిగూడ ఎక్స్‌రోడ్డు, నారాయణగూడ, కవాడిగూడ, బన్సీలాల్‌పేట్, మహంకాళి టెంపుల్, ప్యారడైజ్ ఎక్స్‌రోడ్డు మీదుగా తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వరకు సాగుతుంది. -
స్థానిక ఉత్పత్తులే కొనండి
అహ్మదాబాద్: భారత్ అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రజలంతా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 25 ఏళ్ల పాటు ఇలా స్థానిక ఉత్పత్తుల్నే కొంటే దేశంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుందన్నారు. ‘‘స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే అందరికీ ఉద్యోగావకాశాలు వస్తాయి. అందుకోసమే వోకల్ ఫర్ లోకల్ పథకం తెచ్చాం’’ అని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ స్వయంసమృద్ధిని సాధనకు కృషి చేస్తున్నందున మనం కూడా అదే బాటన ముందుకెళ్లాలన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బిలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. దేశం నాలుగు దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాన సిమ్లాలో 2010లో ఇలాంటి విగ్రహాన్నే ఆవిష్కరించారు. దక్షిణాన రామేశ్వరంలో సన్నాహాలు సాగుతున్నాయి. 3 రోజులు గుజరాత్‌కు మోదీ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో సోమవారం నుంచి మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని పీఎం కార్యాలయం వెల్లడించింది. అల్లర్లపై మాట్లాడరేం? శ్రీరామనవమి సందర్భంగా దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. విద్వేష ప్రసంగాలు, మతహింస ఘటనలపై ఆయన స్పందించకపోవడం దారుణమంటూ సోనియాగాంధీ (కాంగ్రెస్), శరద్‌పవార్ (ఎన్సీపీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకె స్టాలిన్ (డీఎంకే) సహా 13 విపక్ష పార్టీల అధ్యక్షులు ధ్వజమెత్తారు. శనివారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మతఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా శాంతి, సహనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఖండించకపోతే ఆయన మౌనాన్ని మద్దతుగా తీసుకుని మత విద్వేషకులు మరింత రెచ్చిపోతారన్నారు. ఇలాంటి కుట్రదారులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
కొండగట్టు అంజన్న చినజయంతికి పోటెత్తిన భక్తజనం
సాక్షి,కొండగట్టు (చొప్పదండి): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానంకు లక్షలాది మంది భక్తులు, దీక్షాపరులు తరలిరావడంతో కాషాయమయమైంది. హనుమాన్ చినజయంతి సందర్భంగా తెలంగాణతోపాటు ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, దీక్షాపరులు తరలివచ్చారు. కొందరు పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకున్నారు. మరికొందరు సొంత వాహ నాలు, ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చారు. తొలుత కోనేటిలో స్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశాక మాల విరమణ చేశారు. వీరికోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
Hanuman Jayanti 2021: జై భజరంగ భళి అంటే ఏంటో తెలుసా?
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం అంటూ శ్రీ ఆంజనేయుడిని స్మరించిన వెంటనే విచక్షణా జ్ఞానం లభిస్తోందని భక్తులు నమ్ముతుంటారు. హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తివంతమైన హనుమంతుడి నామస్మరణ చేస్తే భయం, మానసిక ఆందోళన తొలగి బలం, కీర్తి వరిస్తాయి. భయం తొలిగిపోతుంది. మానసిక ఆందోళన నుంచి భయటపడవచ్చు. మరి అంతటి మహిమాన్వితుడు హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. హనుమంతుడు శివుడి అవతారం ఒకప్పుడు స్వర్గంలో నివసించిన "అంజన అనే అప్సర ఒకరిని ప్రేమిస్తుంది. దీంతో అంజనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ రుషి అంజన మొహం వానరం అవతారంలా మారిపోవాలని శపిస్తారు. అయితే రుషి శాపంతో భయాందోళనకు గురైన అంజన ఆ శాపం నుంచి తనని రక్షించాలని బ్రహ్మదేవుడిని వేడుకుంటుంది. దీంతో బ్రహ్మదేవుడు ఆమెకు భూమిపై మానవునిగా జన్మించే వరాన్ని ప్రసాదిస్తారు. ఇక బ్రహ్మదేవుడి వరంతో అంజనా భూలోకంలో జన్మిస్తుంది. రాజవంశానికి చెందిన కేసరితో ప్రేమలో పడుతుంది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. శివుని భక్తురాలైన అంజన వివాహం తరువాత శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠిన మైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సుతో ప్రత్యక్షమైన శివుడిని.. తనకు అత్యంత ధైర్యశాలి అయిన కుమారుడు జన్మించేలా వరం ఇవ్వాలని కోరుకుంటుంది. అందుకు శివుడు అంగీకరిస్తాడు. కొద్ది రోజుల తరువాత దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ యాగం ముగిసిన తరువాత యాగం కోసం తయారు చేసిన ప్రసాదాన్ని భార్యలకు పంచిపెట్టాడు. రాణి కౌశల్యకు ఓ డేగ ద్వారా ప్రసాదాన్ని పంచుడుతాడు. ప్రసాదం తీసుకొని డేగ కౌశల్య దగ్గరకు వెళుతుండగా శివుడి ఆజ్ఞతో డేగ చేతిలో ఉన్న ప్రసాదం అంజన చేతిలో పడుతుంది. అయితే ప్రసాదాన్ని శివుడే పంపించాడని, ఆ ప్రసాదం తిన్న అంజన శివుడి అవతారమైన హనుమంతునికి జన్మనిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడిని జై భజరంగభళి అని ఎందుకు పిలుస్తారు ఓ రోజు సీతమ్మవారు తన నుదుటున కుంకుమ పెట్టుకునే సమయంలో సీతమ్మవారిని హనుమంతుడు అమ్మా.. నుదుటున కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు అని అడిగినప్పుడు.. అందుకు సీతమ్మ వారు హనుమ.. నా భర్త శ్రీరాముడు సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటూ కుంకుమతో బొట్టుపెట్టుకుంటున్నానని చెప్పిందట. దీంతో సీతాదేవి సమాధానానికి ముగ్ధుడైన హనుమంతుడు.. అప్పుడు నేను కుంకుమను శరీరం మొత్తం పూసుకుంటే శ్రీరాముడి జీవితకాలం ఎన్నోరేట్లు పెరుగుతుంది కదమ్మా అని అన్నాడు. ఆ తరువాత కుంకుమను హనుమంతుడు శరీరం అంతా పూసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. కుంకుమను భజరంగ్ అని కూడా పిలుస్తారు. ఆ రోజు నుండి హనుమంతుడిని ‘భజరంగ్ భళి’ అని పిలుస్తారు. ఆయనను పూజించినప్పుడల్లా కుంకుమతో అలంకరిస్తారు. సంస్కృతంలో "హనుమంతుడు" అంటే "వికృత దవడ" సంస్కృత భాషలో, "హను" అంటే "దవడ" మరియు "మన" అంటే "వికృతమైనది అని అర్ధం. హనుమంతుడిని బాల్యంలో మారుతి అని పిలిచే వారు. అయితే హనుమంతుడు బాల్యంలో సూర్యుడిని ఒక పండుగా తిన్నాడు. దీంతో ప్రపంచం అంతా చీకటి మయం అవుతుంది. హనుమ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంద్రుడు.. హనుమంతుడిని మెరుపుతో దండించారని, అలా ఇంద్రుడు హనుమంతుడిని దండించడంతో దవడ విరిగి అపస్మారక స్థితిలో వెళ్లారు. ఈ సంఘటన తరువాత హనుమంతుడు తన దవడను కోల్పోయాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు బ్రహ్మచారే, అయినప్పటికీ ఒక కొడుక్కి తండ్రే హనుమంతుడు బ్రహ్మచారి. అయితే ఆ చిరంజీవికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడి పేరు "మకరధ్వాజ". లంకా దహనం అనంతరం హనుమంతుడు తన శరీరాన్ని చల్లబరుచుకునేందుకు తోకను సముద్రంలో ముంచాడు. అదే సమయంలో ఓ చేప హనుమంతుడిని చెమటను మింగడవల్ల.. ఆ చేప గర్భం దాల్చి మకర ధ్వాజకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. చదవండి : హనుమజ్జయంతి ప్రత్యేకత ఏంటో తెలుసా? -
ఘనంగా హనుమాన్ జయంతి
హనుమాన్ జయంతిని గురువారం కొత్తగూడెం, పాల్వంచ, జూలూరుపాడులో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి పూజలు చేశారు. ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీలు, హనుమాన్æ సేవా సమితీల ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు కొత్తగూడెంటౌన్ : జిల్లా కేంద్రంలోని రామవరం సీఆర్పీ క్యాంప్‌లోని ఆంజనేయస్వామి ఆలయం, రుద్రంపూర్‌లోని హనుమాన్ దేవాలయం, రైటర్‌బస్తీలోని మాస్టర్ ఈకే విద్యాలయం హనుమాత్ సేవా సమితి ఆధ్వర్యంలో, బస్టాండ్ సెంటర్లోని హనుమాత్ సేవా సమితి ఆధ్వర్యంలో, ఇల్లెందు క్రాస్ రోడ్డులోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, విద్యానగర్ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయం, పాలకేంద్రంలోని హనుమాన్ ఆలయంలో స్వామివారి జయంతిని నిర్వహించారు. జూలూరుపాడులో.. జూలూరుపాడు: మండలంలోని వెంగన్నపాలెం, జూలూరుపాడు, గుండెపుడి, పాపకొల్లు, భేతాళపాడు, కాకర్ల, పడమటనర్సాపురం, సురారం, బచ్చలకోయగూడెం తదితర గ్రామాల్లోని శ్రీఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామివారి జయంతిని జరుపుకున్నారు. కొన్నిచోట్ల ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాలు జరిగాయి. -
అంజనీపుత్రా.. పాహిమాం
అమ్రాబాద్: నల్లమల లోతట్టు ప్రాంతం పదర మండలంలోని మద్దిమడుగు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. హనుమాన్ జయంత్యుత్సవాల సందర్భంగా ఆంజనేయ దీక్ష స్వాములతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మద్దిమడుగు చేరుకుంటున్నారు. గురువారం ప్రారంభమైన ఆంజనేయస్వామి ఉత్సవాలు రెండు రోజులుగా జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా హనుమన్ నామస్మరణతో మార్మోగిపోతోంది. ఉత్సవాల్లో భాగంగా వేదపండితులు వీరయ్యశాస్త్రి, వీరయ్య శర్మల ఆధ్వర్యంలో ఉదయం ద్వాదశపూజ, హోమం రుద్రహోమం, మన్యసూక్తి హోమం, గవ్యాంతర పూజలు, బలిహరణ సహస్రనామార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పదర పీహెచ్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ఈఓ సత్యనారాయణ, సర్పంచు పద్మాబాయి, ఆలయ అధికారులు జైపాల్‌రెడ్డి, జంగయ్య, విశ్వేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా హనుమాన్ జయంతి
కొల్చారం(నర్సాపూర్): హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కొల్చారం మండలంలోని ఆయా గ్రామాల్లో యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రంగంపేటకు చెందిన ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్ ఆధర్వంలో స్థానిక హనుమాన్ మందిర్ నుంచి చేపట్టిన బైక్ ర్యాలీ తుక్కాపూర్ , పైతర, కోనాపూర్, వై, మందాపూర్, ఎనగండ్ల, సంగాయిపేట గ్రామాల వరకు కొనసాగింది. పోతంశెట్టిపల్లి, రాంపూర్ గ్రామాలలో బైక్ ర్యాలీలను నిర్వహించారు. అంతకు ముందు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో రంగంపేట గ్రామానికి చెందిన ఆరెస్సెస్ కార్యకర్తలు మహేందర్, మచ్చరాజు, వెంకటేశం, శేఖర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం
నారాయణఖేడ్: నారాయణఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయంలో ఈనెల 31న నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలకు రావాలంటూ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావును అఖిల భారత సాధుసంతుల రాష్ట్ర ప్రతినిధి, హనుమాన్ ఆలయ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్ ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయన్ని కలుసుకుని ఆహ్వానపత్రాన్ని ఇచ్చారు. -
వాయు పుత్రుడికి భారీ వడ మాల
సేలం (తమిళనాడు): తమిళనాడులోని సేలం జిల్లా నామక్కల్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేసి లక్షా ఎనిమిది వడలతో రూపొందించిన మాలతో అలంకరించారు. నామక్కల్ కోటలో అతి పురాతనమైన 18 అడుగుల ఎల్తైన శ్రీ ఆంజనేయ స్వామి ఏక శిలా విగ్రహం ఉంది. స్వామికి ప్రతి ఏడాది మార్గశిర నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను నిర్వహి స్తారు. ఆదివారం వేకువజామున 3.00 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. 5.00 గంటలకు లక్షా ఎనిమిది వడల తో రూపొందించిన మాలను అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 11 గంటలకు విశేష అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు ఆంజనేయ స్వామికి ముత్తంగి అలంకరణ చేశారు. -
హనుమాన్ జయంతోత్సవాలు
-
బెంగాల్ వీధుల్లో కొత్త రామాయణం
కోల్‌కతా: శ్రీరామ నవమి వేళ పశ్చిమ బెంగాల్ వీధుల్లో కొత్త రామాయణం దర్శనం ఇచ్చింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటాపోటీగా రామ నవమి వేడుకలు జరిపించారు. అయితే, శ్రీరాముడికి ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంతుడికి మధ్య పోటీ పెట్టినట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. బీజేపీ పార్టీ నేతలు శ్రీరామ నవమి ఉత్సవం నిర్వహించగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఒక్క హనుమంతుడికి మాత్రమే పండుగ నిర్వహించారు. రెండు పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చారు. శ్రీ రామ్ అంటూ వారు, జై హనుమాన్ అంటూ వీరు చూస్తున్నవాళ్లంతా ఔరా అనుకునేలా ఈ వేడుకలు జరిపారు. బీజేపీ నిర్వహించే వేడుకల్లో ఆరెస్సెస్ కూడా తోడై, వారి కార్యకర్తలు కూడా చేరి వీధుల్లో కాషాయ జెండాలతో బారులు తీరి నినాదాలు చేస్తుండగా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ప్రత్యేకంగా ఆయా నివాసాల నుంచి పలువురుని తీసుకొచ్చి పలు చోట్ల హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. దీంతో ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పెద్ద మొత్తంలో భద్రతను మోహరించారు. హిందూ సాంప్రదాయ ఆయుధాలతో ఎస్పీ నివాసం ముందు నుంచే పెద్ద మొత్తంలో ర్యాలీ ప్రారంభించారు. భారీ ఎత్తున నినాదాలు చేస్తూ టాపాసులు కాలుస్తూ రంగులు చల్లుకుంటూ చిందులేస్తూ సందడి చేశారు. దీనిపై పోలీసులు అడ్డు చెప్పగా మొహర్రం రోజున ముస్లింలు ఆయుధాలతో జరుపుకోవడం లేదా మేం చేస్తే తప్పేమిటంటూ 24వ పరగాణాల బీజేపీ అధ్యక్షుడు శంకర్ ఛటర్జీ అన్నారు. -
ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర
హైదరాబాద్ : హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ రామమందిరం నుంచి శనివారం ఉదయం 11గంటలకు యాత్రను ఆరంభించారు. విహెచ్పి, భజరంగ్‌దళ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. రామమందిరం నుంచి ఈ శోభాయాత్ర... కాచిగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, కవాడిగూడ, మహంకాళీ టెంపుల్, ప్యారడైజ్, బోయిన్పల్లి మీదుగా సాయంత్రం ఆరు గంటలకు తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం వరకు కొనసాగుతుంది. సుమారు ఈ శోభాయాత్ర 8 గంటలు సాగేది. అయితే చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ సమయాన్ని ఐదు గంటలకు కుదించారు. మరోవైపు ఈ ర్యాలీ శాంతియుతంగా జరిగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 18ప్రాంతాల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. -
పవన సుతుని శోభాయాత్ర
ఏర్పాట్లు పూర్తి ♦ లక్ష బైక్‌లతో యాత్రకు సన్నాహాలు ♦ వివిధమార్గాలలో ట్రాఫిక్ మళ్లింపు ♦ నగరంలో భారీ బందోబస్తు ♦ జేఈఈ అభ్యర్థులకు ఇబ్బంది కలుగనివ్వం: కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో : హనుమాన్ జయంతి నేపథ్యంలో నగరం కాషాయమయమైంది. బస్తీలు, కాలనీలలోని హనుమాన్ దేవాలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకునేందుకు ఈసారి లక్ష బైక్‌లతో శోభాయాత్రకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర సాగే రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం చంద్రగ్రహణం నేపథ్యంలో దేవాలయాలు మధ్యాహ్నం 3 గంటలకే మూసివేయాలని నిర్ణయించారు. ఈలోగా శోభాయాత్ర ముగిసేలా నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం గౌలిగూడలోని రామమందిరం వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమై... సాయంత్రం ఆరు గంటలకు దాడ్బన్ హనుమాన్ దేవాలయానికి యాత్ర చేరుకునేది. సుమారు 8 గంటలు సాగేది. చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ సమయాన్ని ఐదు గంటలకు కుదించారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ విషయాన్ని భక్తులకు తెలియజేస్తున్నారు. ఈసారి ఉదయం పది గంటల లోపే ప్రారంభించాలని అనుకుంటున్నారు. వివిధ బస్తీలు, కాలనీల నుంచి ప్రారంభించే శోభాయాత్రను కూడా త్వరగా ప్రధాన యాత్రతో కలపాలని నిర్వాహకులకు ఇప్పటికే సూచించారు. రహదారులపై స్వాగత వేదికలు, నీళ్లు, ఫలహారాలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాత్ర ఎక్కువ సేపు ఆపకుండా వెంటవెంటనే పంపించేందుకు వలంటీర్లు సహకరిస్తారు. ఆంధ్రా బ్యాంక్ చౌరస్తాలో సామూహిక హనుమాన్ చాలీసా పఠనం ఉంటుంది. ఆ వేదిక నుంచి బజరంగ్దళ్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాజేష్ పాండే ప్రధాన ఉపన్యాసం చేస్తారు. యాత్ర ముగిసిన తరువాత తాడ్‌బన్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగే బహిరంగ సభలో విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి ప్రసంగిస్తారు. శోభాయాత్ర మార్గాలు ఇవే... గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమయ్యే యాత్ర పుత్లీబౌలీ క్రాస్ రోడ్డు, ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్డు, డీఎం అండ్ హెచ్ఎస్ సర్కిల్, రాంకోఠి క్రాస్ రోడ్డు, కాచిగూడ క్రాస్ రోడ్డు, వైఎంసీఏ, నారాయణగూడ సర్కిల్, నారాయణగూడ ప్లై ఓవర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్‌నగర్ క్రాస్‌రోడ్డు, గాంధీనగర్ టీ జంక్షన్ వరకూ వెళుతుంది. అక్కడి నుంచి కవాడీగూడ క్రాస్‌రోడ్డు, బైబిల్ హౌస్, గ్యాస్ మండీ క్రాస్‌రోడ్డు, బాటా క్రాస్ రోడ్డు, సుభాష్ క్రాస్ రోడ్డు, రాంగోపాల్‌పేట పీఎస్, ఎంజీ రోడ్డు, ప్యారడైజ్, సీటీఓ క్రాస్‌రోడ్డు, బాలంరాయి, తాడ్బన్ క్రాస్ రోడ్డు, చిన్నటాకోట బ్రిడ్జి, సెవెన్ టెంపుల్ రోడ్డు, న్యూ బోయిన్పల్లి, సరోజినీ పుల్లారెడ్డి బిల్డింగ్, సెంట్రల్ పాయింట్, డైమండ్ పాయింట్, మస్తాన్ కేఫ్, మీదుగా తాడ్బన్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు. భారీ బందోబస్తు శోభాయాత్రలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసు, ఆర్ముడ్ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత సిబ్బంది బందోబస్తులో ఉంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ రూంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఈ యాత్రను పర్యవేక్షిస్తారు. -
కొండంతా కాషాయం
నేడు హనుమాన్ జయంతి మూడు రోజుల పాటు ఉత్సవాలు ముమ్మరమైన ఏర్పాట్లు కొండగట్టుకు చేరుకుంటున్న దీక్షాపరులు మల్యాల, న్యూస్‌లైన్: కొండగట్టు గిరులు కాషాయ వర్ణమవుతున్నాయి. హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు దీక్షాపరులు కొండకు చేరుకుంటున్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా జరగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాక నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తర లి రానున్నారు. ఇప్పటికే వేలాది మంది హనుమాన్ దీక్షాపరులు వారం రోజులగా కొండగట్టుకు వస్తూ దీక్షలను శ్రీస్వామివారి సన్నిధానంలో విరమిస్తున్నారు. మూడు రోజుల పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలతో పాటు క్యూలైన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుం టున్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ సీఐ వెంకటరమణ కొండగట్టుకు వచ్చి వసతులను పరిశీలించారు. ఘాట్‌రోడ్డును వన్‌వేగా మార్చడంతో పాటు ఆలయంలో మూడు రోజుల పాటు ఎలాంటి ఆర్జిత సేవలు ఉండబోవని ఈ వో గజరాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుం టున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.