హైదరాబాద్ : హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ రామమందిరం నుంచి శనివారం ఉదయం 11గంటలకు యాత్రను ఆరంభించారు. విహెచ్‌పి, భజరంగ్‌దళ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. రామమందిరం నుంచి ఈ శోభాయాత్ర... కాచిగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, కవాడిగూడ, మహంకాళీ టెంపుల్, ప్యారడైజ్, బోయిన్‌పల్లి మీదుగా సాయంత్రం ఆరు గంటలకు తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం వరకు కొనసాగుతుంది.
సుమారు ఈ శోభాయాత్ర 8 గంటలు సాగేది. అయితే చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ సమయాన్ని ఐదు గంటలకు కుదించారు. మరోవైపు ఈ ర్యాలీ శాంతియుతంగా జరిగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 18ప్రాంతాల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర
Published Sat, Apr 4 2015 11:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement
Advertisement