Heavy Security
-
పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్‌స్టర్, రివాల్వర్ రాణి
న్యూఢిల్లీ: సమాజంలో ప్రముఖ వ్యక్తుల పెళ్లిళ్లు జరిగినపుడు భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రత కనిపించడం సహజం. కానీ కరడుగట్టిన నేరగాడి పెళ్లి తంతును పోలీసులే దగ్గరుండి జరిపించిన ఘటనకు దేశ రాజధాని వేదికైంది. పెరోల్‌పై తిహార్ జైలు నుంచి బయటికొచ్చిన గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జథేడీ వివాహ వేడుక విశేషమిది. వివరాల్లోకి వెళ్తే సందీప్ డజనుకుపైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసుల్లో నిందితుడు. గ్యాంగ్‌స్టర్ అయిన సందీప్ నాలుగేళ్లుగా లేడీ డాన్‌గా పేరుబడ్డ అనురాధాతో ప్రేమాయణం నడుపుతున్నాడు. మరో గ్యాంగ్‌స్టర్ ఆనంద్పాల్సింగ్ ముఠా సభ్యురాలైన అనురాధాపై మనీ లాండరింగ్, బెదిరింపు వసూళ్లు వంటి అరడజనుదాకా కేసులు ఉన్నాయి. బెయిల్ మీద ఇప్పటికే అనురాధా విడుదలకాగా సందీప్‌కు కేవలం ఆరు గంటల పెరోల్ లభించింది. ఈ సమయంలోనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఢిల్లీ ద్వారకా సెక్టార్–3లోని సంతోష్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌ను బుక్‌చేశారు. సందీప్ న్యాయవాది రూ.51,000కు ఈ ఫంక్షన్‌ను బుక్‌చేశారు. సందీప్, అనురాధాలు వేర్వేరు నేరముఠాలకు చెందిన వ్యక్తులు కావడంతో పెళ్లివేడుకలో గ్యాంగ్‌వార్ జరిగే ఆస్కారముందని పోలీసులు భావించారు. నాలుగు అంచెల రక్షణ ఢిల్లీ, హరియాణా పోలీసులు ఫంక్షన్‌హాల్‌ను శత్రుదుర్బేధ్యంగా మార్చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, కీలక ప్రాంతాల్లో సీసీకెమెరాలు అమర్చారు. డ్రోన్లను రంగంలోకి దింపారు. ఫంక్షన్ హాల్ పరిసరాల్లో 250కిపైగా పోలీసులు మొహరించారు. పెళ్లిరోజు రానే వచ్చింది. హరియాణాలోని సోనీపట్ నుంచి బ్లాక్ ఎస్యూవీ వాహనంలో వధువు అనురాధా, పోలీసు బందోబస్తు నడుమ వరుడు సందీప్ పెళ్లిమండపానికి చేరుకున్న విధానం అచ్చం ఓటీటీ థ్రిల్లర్‌ను తలపించింది. కవరేజీ కోసం చేరుకున్న మీడియా ప్రతినిధులు, రక్షణగా చుట్టుముట్టిన పోలీసులు, వధూవరుల తరఫున హాజరైన కొందరు నేరగాళ్ల సమక్షంలో మంగళవారం వివాహం ఆడంబరంగా జరిగింది. వివాహం తర్వాత సందీప్‌ను పోలీసులు మళ్లీ తిహార్ చెరసాలకు తీసుకెళ్లారు. పెళ్లి వేడుకలో నాలుగు అంచెల భద్రతా వలయాన్ని పోలీసులు సృష్టించారు. బంధువులు వస్తే వెంట గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి. వారి పేర్లు పోలీసుల వద్ద ఉన్న జాబితాతో సరిపోలాలి. ఆ తర్వాత వేడుకలో పాల్గొననిస్తారు. సెల్ఫోన్లను మండపంలోకి పోలీసులు అనుమతించలేదు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్, హరియాణా క్రైమ్ ఇన్వెస్టిగేన్ ఏజెన్సీ, ఢిల్లీ స్పెషల్ వెపన్స్ టెక్నిక్స్ విభాగాల పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ‘రివాల్వర్ రాణి’, ‘మేడమ్ మింజ్’గా పేరొందిన 39 ఏళ్ల అనురాధాను 2020 సంవత్సరం నుంచి 40 ఏళ్ల సందీప్ ప్రేమిస్తున్నాడు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఇతను సన్నిహితుడు. అతడి తలపై రూ.7 లక్షల రివార్డ్ ఉంది. 2021లో పోలీసులు అతడిని అరెస్ట్‌చేశారు. గతంలో కస్టడీ నుంచి ఒకసారి సందీప్ తప్పించుకున్నాడు. అది పునరావృతం కాకూడదనే పెరోల్‌పై బయట ఉన్నంతసేపు సందీప్‌పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. గ్యాంగ్‌వార్‌ను ఎదుర్కొనేందుకు మండపంలో పోలీసులు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించారు. కేసుల బాధ నుంచి విముక్తి పొందాక సాధారణ జీవితం గడపాలని ఇద్దరం భావిస్తున్నట్లు అనురాధా చెప్పారు. -
250 మంది పోలీసుల బందోబస్తు మధ్య గ్యాంగ్స్టర్ల పెళ్లి..
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడి, మహిళా క్రిమినల్ అనురాధ చౌదరి అలియాస్ 'మేడమ్ మింజ్'ల వివాహం మంగళవారం ఢిల్లీఓ జరిగింది. ద్వారకా సెక్టార్-3లోని సంతోష్ గార్డెన్, బాంక్వెట్ హాల్ వీరి పెళ్లి వేదికగా మారింది.. సందీప్ తరఫు న్యాయవాది రూ.51వేలు చెల్లించి ఈ హాల్‌ను బుక్ చేశాడు. ఈ వివాహానికి సందీప్ కుటుంబం 150 మంది అతిథులను ఆహ్వానించాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్, బెయిల్‌పై ఉన్న ఓ మహిళా క్రిమినల్‌కు వివాహం నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు. గ్యాంగ్‌స్టర్‌కు ఉన్న నేర చరిత్ర, కేసులను దృష్టిలో పెట్టుకొని గ్యాంగ్‌వార్ జరిగే అవకాశం, లేదా కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకునేందుకు తావివ్వకుండా ఢిల్లీ పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్పెషల్ స్టాఫ్, క్రైమ్ బ్రాంచ్‌ల బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాల మోహరించారు. 250 మందికి పైగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. వేదిక ప్రవేశం వద్ద రెండు డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశామని, వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరూ దాని గుండా వెళ్లాల్సి ఉంటుందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా హరియాణాలోని సోనిపట్‌కు చెందిన సందీప్ ఒకప్పుడు అతని తలపై రూ. 7 లక్షల రివార్డుతో వాంటెడ్ క్రిమినల్. తీహార్ జైల్లోఉ న్న సందీప్.. పెళ్లి కోసం ఢిల్లీ కోర్టు ఆరు గంటల పెరోల్ ఇచ్చింది. ఇక ‘రివాల్వర్ రాణి' గా పేరొందిన అనురాధ చౌదరి అనేక కేసుల్లో నిందితురాలిగా ఉంది. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు సందీప్ అత్యంత సన్నిహితుడు. ఇతడిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి కేసులున్నాయి. -
లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే!
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఆందోళనకారుల నిరసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే దేశం విడిచి మాల్దీవులకు పరారైన రాజపక్సకు అక్కడ కూడా నిరసన సెగ తగిలింది. రాజపక్స మాల్దీవులకు చేరిన విషయాన్ని తెలుసుకున్న అక్కడి శ్రీలంక పౌరులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గొటబయ గో అంటూ నినాదాలు చేశారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఆయన మళ్లీ సింగపూర్‌కు పయనమవుతున్నారు. మాల్దీవుల నుంచి సింగపూర్‌కు బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో అక్కడి వెలనా అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం వీఐపీ టెర్మినల్ దగ్గర వేచి ఉన్న జర్నలిస్టులను అధికారులు బయటకు పంపించారు. అయితే సింగపూర్‌కు వెళ్లిన తర్వాత గొటబయ తన రాజీనామా లేఖను శ్రీలంక స్పీకర్ మహిందాయాపా అబేయవర్ధనేకు అందించనున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చదవండి: రాజపక్స పారిపోతాడనుకోలేదు.. భారత్‌ను ఎంత సాయం అడుగుతాం! తన పదవికి బుధవారం రాజీనామా చేస్తానని చెప్పిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోవడంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో అట్టుడుకుతున్న ఆందోళనలు ఎమర్జెన్సీ, కర్ఫ్యూ విధింపుతో మిన్నంటుతున్నాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిరసనకారులు చుట్టుముట్టారు. కాగా గోటబయ తన భార్య ఇద్దరు సెక్యూరిటీ అధికారులతో కలిసి సైనిక విమానంలో బుధవారం ఉదయమే మాల్దీవులకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ దేశ స్పీకర్ మహ్మద్ నషీద్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరోవైపు గోటబయ దేశం విడిచి పారిపోయినట్లు తెలుసుకున్న జనం ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. రోడ్డుపైకి చేరుకొని కేరింతలు కొట్టారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేశం వీడిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జూలై 20న పార్లమెంట్లో శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు. -
రైతు పోరు: పంజాబ్, హర్యానాల్లో హై అలర్ట్
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడంతో పరిసర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి సరిహద్దుగా ఉన్న హర్యానా, పంజాబ్‌లు హై అలర్ట్ ప్రకటించాయి. సోన్‌పట్, పాల్వాల్, ఝజ్జర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీస్‌లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అనూహ్యంగా రైతుల పరేడ్ విజయవంతం కావడంతోపాటు ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడంతో ఢిల్లీలో ఏం జరుగుతోందనే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీలోకి వెళ్లే అన్ని రహదారులు, మెట్రోస్టేషన్లు మూసివేశారు. ఈ సందర్భంగా ఢిల్లీకి అదనంగా పారామిలటరీ బలగాలను పెంచారు. ఇంటర్నెట్, మెట్రో సేవలను నిలిపివేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ పెంచారు. రైతుల పరేడ్‌కు కేంద్రంగా నిలిచిన ఎర్రకోట, జమా మసీద్ వద్ద పోలీసులు భద్రత పటిష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసేలా చర్యలు తీసుకున్నారు. కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారడంతో ఎర్రకోట వద్ద భారీగా పోలీసు బలగాల మోహరించారు. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల గస్తీ కొనసాగుతోంది. దర్యాప్తు మొదలు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల దీక్షా శిబిరాల వద్ద భద్రత పెంచారు. అయితే నిన్నటి ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ ఘటనలపై చర్యలు మొదలుపెట్టారు. నిన్న జరిగిన ఘర్షణల్లో 153 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు పోలీసులు ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. నిన్నటి ఆందోళనలపై మొత్తం 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతు గణతంత్ర పరేడ్‌పై స్పెషల్ సెల్ విచారణ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పంజాబ్, హర్యానా గ్యాంగ్స్టర్ల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘాజీపూర్మార్కెట్ నుంచి ఢిల్లీ వచ్చే రహదారి మూసివేశారు. ఇది ఇలా ఉండగా రైతుల గణతంత్ర పరేడ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు వేరే శక్తులు కారణమని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. సంఘ విద్రోహ శక్తులు ఉద్యమంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాయని.. రైతులెవరూ అలాంటి పరిణామాలకు అంగీకరించరని.. సహకరించరని గుర్తుచేశారు. తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
అమర్నాథ్ యాత్ర ప్రారంభం
జమ్మూ/శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని హిమా లయాల్లో ఉన్న ప్రఖ్యాత అమర్నాథ్ ఆలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకునే యాత్రికుల ‘అమర్నాథ్ యాత్ర’ బుధవారం మొదలైంది. రెండు నెలలపాటు సాగే ఈ యాత్రకు కశ్మీర్ ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. దాదాపు 40వేల మందిని బందోబస్తులో వాడుతోంది. బుధవారం 3,000 మంది యాత్రికులతో తొలిæ విడత యాత్రను గవర్నర్ వోహ్రా సలహాదారులు విజయ్ కుమార్, బీబీ వ్యాస్లు జెండా ఊపి ప్రారంభించారు. జమ్మూలోని భగవతి బేస్ క్యాంప్ నుంచి వేకువజామున 4.30 గంటల సమయంలో బయలుదేరిన ఈ బ్యాచ్‌లో యాత్రికులతో కూడిన 107 వాహనాలు, 4 బైక్‌లు ఉన్నాయి. బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, బంకర్లు.. కశ్మీర్ పోలీసులతోపాటు పారామిలటరీ, ఎన్డీఆర్ఎఫ్(జాతీయ విపత్తు స్పందన దళం), సైన్యంతో కలిపి మొత్తం 40వేల మందిని యాత్రికుల భద్రత కోసం వినియోగిస్తున్నారు. అమర్నాథ్ యాత్రికుల వాహనాలకు తొలిసారిగా రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్ఎఫ్) ట్యాగ్‌లను, సీఆర్పీఎఫ్ దళాలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను, వారి హెల్మెట్లకు కెమెరాలను అమర్చారు. ప్రమాదాలకు గురైన యాత్రికులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, మొబైల్ బుల్లెట్ ప్రూఫ్ బంకర్లను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వాహనాలకు ఆర్ఎఫ్ ట్యాగ్‌లను అమర్చామని, వీటి సాయంతో బెమినాలోని సెంట్రల్ కంట్రోల్ సెంటర్ నుంచి వాహనాల కదలికలు చూస్తామని 73వ బెటాలియన్ కమాండెంట్ పీపీ పౌలీ తెలిపారు. యాత్రికులు వెళ్లే మార్గంలో సీఆర్పీఎఫ్ బలగాలు పేలుడు పదార్థాలను పసిగట్టి ‘రోడ్ క్లియరింగ్’ ఏర్పాట్లను చూస్తాయని భద్రతా అధికారి ఒకరు తెలిపారు. కశ్మీర్ లోయలో అల్లకల్లోల పరిస్థితులు, ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉన్నందున యాత్రికులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటామన్నారు.ఉగ్రదాడుల్ని తిప్పికొట్టేందుకు 100 మందితో కూడిన అదనపు బలగాలను కూడా మోహరించారు. అనారోగ్యానికి గురైన యాత్రికులు, భద్రతా సిబ్బందిని వెంటనే చికిత్సకు తరలించేందుకు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే యాత్రికుల కోసం కూడా ఏర్పాట్లు చేపట్టామన్నారు. రెండు లక్షల మంది యాత్రికుల నమోదు హెలికాప్టర్లో వచ్చే యాత్రికులను మినహాయించి రెండు కాలినడక మార్గాల మీదుగా రోజుకు 7,500 మందిని అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 2 లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రను విజయవంతం చేయటానికి కశ్మీర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది. ప్రజల సహకారం, సైనిక, పోలీసు, పౌర అధికారుల సమన్వయంతో యాత్రికులకు వసతి, భద్రత కల్పించనున్నారు. యాత్రికుల్లో 1,904 మంది 36 కిలోమీటర్ల పొడవైన పహల్గామ్ మార్గాన్ని, 1,091 మంది 12 కిలోమీటర్ల బల్తాల్ మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ యాత్ర ఆగస్టు 26వ తేదీన ముగియనుంది. -
జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన
-
జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పది రోజుల క్రితం జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమె గురించి గత రెండు రోజుల నుంచి వైద్యులు హెల్త్ బులెటిన్లు కూడా ఏమీ జారీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. లండన్ నుంచి వచ్చిన వైద్యుడు రిచర్డ్ జాన్ ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. జ్వరం, డీహైడ్రేషన్ అంటూ ఆస్పత్రిలో చేరినా.. ఆమెకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలున్నాయని, అదుకే ఆమె చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నాడీఎంకే వర్గాలు గానీ, రాష్ట్ర మంత్రులు గానీ, చివరకు రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు గానీ దీనిపై స్పందించకపోవడం ఏంటని డీఎంకే అధినేత కరుణానిధి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలితను పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆస్పత్రి ఆవరణ మొత్తం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. జయలలిత ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమె కోలుకుంటున్నారని రెండు రోజుల క్రితం ప్రకటించిన వైద్యులు.. ఆ తర్వాతి నుంచి బులెటిన్లు ఇవ్వడం కూడా మానేశారు. జయలలితతోపాటే ఐసీయూలో ఆమెకు తోడుగా ఉంటున్న నెచ్చెలి శశికళ అసలు బయటకే రావడం లేదు. ఆమె ఇంటికి కూడా వెళ్లడంలేదు. దాంతో ఇది రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం రెండురోజులకు ఒకసారి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు గానీ, మీడియాకు చెప్పేందుకు మాత్రం వెనకంజ వేస్తున్నారు. ఏ విషయం బయటకు చెప్పొద్దని ఆమె ఆస్పత్రిలో చేరకముందే వాళ్లకు ఆదేశాలు వచ్చినట్లు అన్నాడీఎంకే కార్యకర్తలు చెబుతున్నారు. రెండు రోజల క్రితం పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి మాత్రం.. జయలలిత కోలుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రపతికి సుప్రీం న్యాయవాది లేఖ జయలలిత ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. సీఎం ఆరోగ్యం గురించి ఎవరూ బయటకు ఏమీ చెప్పడం లేదని రీగన్ ఎస్. బెల్ అనే న్యాయవాది ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం ఆగిపోయిందని, రాష్ట్ర మంత్రివర్గానికి కూడా ఆమె ఆరోగ్యం గురించి ఏమీ తెలియదని చెప్పారు. ఆస్పత్రి ప్రాంగణంలో వేలాదిమంది పోలీసులను మోహరించారని, చివరకు సీఎంను చూసేందుకు గవర్నర్‌ను కూడా అనుమతించడం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో 356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని, సీఎం ఆరోగ్యంపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి విధులు నిర్వర్తించే పరిస్థితిలో జయలలిత ఉన్నారో లేదో చెప్పాలన్నారు. -
నిఘా నీడలో నగరం
యాకుత్‌పురా: బక్రీద్, నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అదనపు కమిషనర్ శ్రీనివాస్ రావు, జాయింట్ కమిషనర్లు ప్రమోద్ కుమార్, శివ ప్రసాద్, డీసీపీ, అదనపు డీసీపీలతో కలిసి పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చార్మినార్‌లో విలేకరులతో మాట్లాడుతూ..బక్రీద్, గణేష్ నిమజ్జనోత్సవాలను దృష్టిలో ఉంచుకుని 9 జిల్లాలకు చెందిన పోలీసు బలగాలను బందోబస్తుకు వినియోగిస్తున్నామన్నారు. కేంద్ర పారా మిలటరీ బలగాలతో పాటు సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. బక్రీద్ సందర్భంగా నగరంలోని మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. సోషల్ మీడియాల్లో వచ్చే తప్పుడు సమాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. బక్రీద్ సందర్భంగా వ్యర్ధాలను పొగు చేసేందుకు మైనార్టీ, జీహెచ్ఎంసీ శాఖల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్లను పంపిణీ చేశామన్నారు. ప్రార్థనలు నిర్వహించే ఈద్గాల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 15వ తేదీన గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 వేల విగ్రహాలు నిమజ్జనానికి రానున్నట్లు తెలిపారు. 15న అర్ధరాత్రి 12 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు. తాము సూచించిన విధంగా ఉదయం 6 గంటలకు నిమజ్జనాన్ని ప్రారంభించి 12 గంటల్లోపు పూర్తి చేయాలన్నారు. 12 గంటల తర్వాత వచ్చే విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పైకి కాకుండా నెక్లెస్ రోడ్డు వైపు పంపిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. -
పుకార్లు నమ్మొద్దు: సీపీ మహేందర్ రెడ్డి
- నగరంలో భారీ భద్రత - ప్రశాంతంగా పండుగ జరుపుకోండి - పలు ప్రాంతాల్లో పోలీసుల కవాతు హైదరాబాద్: ఓ వైపు గణేశ్ నిమజ్జనం, బక్రీద్ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పుకార్లు నమ్మకుండా ప్రజలందరూ ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని పోలీసులు సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. అల్లర్లకు అవకాశం లేకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. ముందుజాగ్రత్తగా నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి నగరంలో పర్యటిస్తున్నారు. పోలీసుల బందోబస్తును సీపీ పర్యవేక్షిస్తున్నారు. ప్రజలందరూ ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని సూచించారు. పుకార్లు నమ్మవద్దని, సోషల్ మీడియాలో, ఇతర మాధ్యామాల ద్వారా పుకార్లుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా గజ్వేల్ పర్యటనకు ఆదివారం విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గజ్వేల్‌లో బహిరంగ సభకు దాదాపు 4 వేల మంది సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టింది. ప్రధాని పర్యటనను పర్యవేక్షించేందుకు ఒక అదనపు డీజీ ర్యాంకుగల అధికారితోపాటు ఇద్దరు ఐజీలు, ఒక డీఐజీ, నలుగురు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించింది. ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభకు 1,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతను నగర కమిషనర్లకు అప్పగించింది. మరోవైపు ఢిల్లీ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రధాని కాన్వాయ్‌తోపాటు సభా ప్రాంగణాన్ని ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా గజ్వేల్ వెళ్లేందుకు నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లను ఎస్పీజీ సిద్ధం చేసింది. ఒక దానిలో ప్రధానితోపాటు సీఎం కేసీఆర్, ఇద్దరు ప్రత్యేక భద్రతా సిబ్బంది ప్రయాణించనున్నారు. మరో హెలికాప్టర్లో డీజీపీ, సీఎస్ తదితరులు వెళ్లనున్నారు. మూడో హెలికాప్టర్లో ప్రధాని భద్రతా సిబ్బంది ప్రయాణించనుండగా మరో హెలికాప్టర్‌ను రిజర్వులో ఉంచనున్నారు. ప్రధాని కాన్వాయ్ కోసం ఢిల్లీ నుంచి రెండు ప్రత్యేక వాహనాలను తెప్పించారు. గజ్వేల్‌లో సభ కోసం 3 వేల ఆర్టీసీ బస్సులను హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల డిపోల నుంచి తరలిస్తున్నారు. మరో వెరుు్య ప్రైవేట్ బస్సులనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఏర్పాట్లపై మంత్రి హరీశ్ సమీక్ష గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జేసీ వెంకట్రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. సభావేదిక, ఆ తర్వాత హెడ్‌రెగ్యులేటర్ వద్ద పైలాన్ తుది దశ పనులను పరిశీలించారు. -
ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు
ఈ నెల 7న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గజ్వేల్ బహిరంగ సభకు దాదాపు నాలుగు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. గజ్వేల్‌లో ప్రధాని పర్యటనను పర్యవేక్షించడానికి స్వయంగా ఒక అదనపు డీజీ ర్యాంకు కలిగిన అధికారితో పాటు ఇద్దరు ఐజీలను, ఒక డీఐజీ, నలుగురు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభకు 15వందల పోలీసు మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి... పర్యవేక్షణ బాధ్యతను నగర కమిషనర్లకు అప్పగించారు. అదే విధంగా ఢిల్లీ నుంచి కూడా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల బందోబస్తును ప్రతీ నిముషాన్ని ఎస్పీజీ స్వయంగా పర్యవేక్షించనుంది. అలాగే ప్రధాని కాన్వాయితో పాటు సభ ప్రాంగణాన్ని ఎస్పీజీ ఇప్పటికే తమ ఆదీనంలోకి తీసుకుంది. ఈ నెల 7న ప్రధాని ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా... గజ్వేల్ వెళ్లేందుకు నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లను ఎస్పీజీ సిద్ధం చేసింది. వీటిలో ఒక దానిలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీఎం కేసీఆర్, ఇద్దరు ప్రత్యేక భద్రతా సిబ్బంది ప్రయాణించనున్నారు. మరో హెలికాప్టర్లో డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు వెళ్లనున్నారు. మూడవ హెలికాప్టర్లో పూర్తిగా ప్రధాని భద్రతా సిబ్బంది వెళ్లనున్నారు. మరో హెలికాప్టర్‌ను రిజర్వులో ఉంచనున్నారు. ప్రధాని కాన్వాయ్ కోసం ఢిల్లీ నుంచి రెండు ప్రత్యేక వాహనాలు తెప్పించారు. అలాగే కాన్వాయ్‌కు సంబంధించి పోలీసు శాఖ శుక్రవారం నుంచే రిహార్సల్స్ ప్రారంభించారు. -
స్వస్ధలాలకు అమర్నాధ్ యాత్రికులు
-
పోలీసులకూ ‘ఎన్నికల’ శిక్షణ
పోలింగ్ నియమ నిబంధనలపై సిబ్బందికి అవగాహన కసరత్తు చేస్తున్న జంట కమిషనరేట్లు ‘డూస్ అండ్ డోంట్స్’తో కరపత్రాల పంపిణీ సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జంట కమిషనరేట్ల పోలీసులు భారీ బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క ఎన్నికల నియమ నిబంధనలు, చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించడానికి కరపత్రాలు తయారు చేయిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలోని సిబ్బందితో కలిపి మొత్తం 37 వేల మంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకోనున్నారు. వీరికి ‘స్టాండ్ై బె, స్టాండ్ టూ’లు అమలు చేయనున్నారు. వీరంతా విధులు నిర్వహిస్తూ ఎన్నికల నియమ నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు కృషి చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీరందరికీ వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. బందోబస్తు, భద్రత ఏర్పాట్లపై పోలీసులకు ప్రత్యేక అవగాహన అవసరం లేదు. అయితే ఎన్నికల నియమ నిబంధనలు మాత్రం వీరికి అంతగా పరిచయం ఉండదు. ఉన్నతాధికారులకు వీటిపై కొంత పట్టున్నప్పటికీ కింది స్థాయి సిబ్బందికి తక్కువనే చెప్పొచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకున్న జంట కమిషనర్లు ఎన్నికల విధుల్లో ఉండే ప్రతి పోలీస్‌కు ఆ నియమ నిబంధనలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమ నిబంధనలను తెలుగులోకి అనువదించి కరపత్రాలు తయారు చేయిస్తున్నారు. వీటిని విధుల్లో ఉండే పోలీసులకు ‘చేయాల్సినవి, చేయకూడనివి(డూస్ అండ్ డోంట్స్)’ పేరుతో ఇవ్వనున్నారు. పోలింగ్ తేదీకి నాలుగు రోజుల ముందే వీటిని సిబ్బందికి అందించాలని నిర్ణయించారు. జంట కమిషనరేట్ల పరిధిలోని పోలింగ్ స్టేషన్లలను అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సున్నితమైనవిగా విభజించారు. వీటిలో పోలింగ్ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఇందుకు ఉపకరించే ఫ్లాగ్‌మార్చ్‌లుగా పిలిచే కవాతులను మరో రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఏరియాలు, కీలక బస్తీల్లో ఈ ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహించనున్నారు. వీటిలో సాయుధ బలగాలతో పాటు స్థానిక పోలీసులూ పాలుపంచుకుంటారు. సాధారణంగా పోలింగ్‌కు రెండు లేదా మూడు రోజుల ముందే వీటిని ప్రారంభిస్తారు. అయితే ఈసారి మాత్రం వారం రోజుల ముందు నుంచే నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
ప్రధాని రాక నేపథ్యంలో భారీ బందోబస్తు
-
పోప్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు
వచ్చే వారం న్యూయార్క్ రానున్న పోప్ న్యూయార్క్: వచ్చేవారం పోప్ ఫ్రాన్సిస్-1 రానున్న నేపథ్యంలో అమెరికాలో ఆయన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన అమెరికా రానున్న పోప్.. వాషింగ్టన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా నగరాల్లో పలు సభలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. 27వ తేదీ వరకు అమెరికాలో బిజీబిజీగా గడపనున్నారు. మరోపక్క ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 25న 170 మంది ప్రపంచ నాయకులు న్యూయార్క్ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని 120 కోట్ల మంది క్యాథలిక్కులకు ఆరాధ్యుడైన పోప్‌కు భద్రతా ఏర్పాట్లు చేయడం యూఎస్ అధికార వర్గాలకు సవాలుగా మారింది. మోదీ- షరీఫ్ భేటీ ఉండదు! ఇస్లామాబాద్: వచ్చేవారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా భారత్, పాక్ ప్రధానుల భేటీ ఉండకపోవచ్చని సమాచారం. అమెరికాతో పాటు ఇతర ఐరాస భద్రతామండలి శాశ్వత సభ్యదేశాలు భారత్, పాక్ నేతలు సంయమనం పాటించాలని కోరుకుంటున్నా యి. నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు ఐరాస సమావేశాల్లో చేసే ప్రసంగాలు ఘర్షణాత్మకంగా ఉండకూడదని ఈ దేశాలు భావిస్తున్నాయంటూ డాన్ పత్రిక తెలిపింది. ఇరువురి భేటీకి అవకాశాలు కనిపించడం లేదంది. -
పుష్కరాలకు విస్తృత భద్రత
హైదరాబాద్: తెలంగాణలో గోదావరి పుష్కరాలకు విస్తృత భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో 106 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భద్రాచలం, కరీంనగర్, బాసరలో ఐజీ స్థాయి అధికారులు భద్రత పర్యవేక్షిస్తారని అనురాగ్ శర్మ తెలిపారు. భారీ సంఖ్యలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. -
పుష్కరాలకు భారీ బందోబస్తు
ఖమ్మం క్రైం : గోదావరి పుష్కరాలు వచ్చే నెల 14 నుంచి 25 వరకు జరుగనున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం తెలిపారు. ప్రతిరోజు లక్షల మంది భక్తులు తరలివస్తారనే అంచనాతో ట్రాఫిక్ సమస్యతో పాటు ఇతర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అందుకుఅనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఎస్బీ కాన్ఫరెన్స్‌హాలులో గోదావరి పుష్కరాలకు సంబంధించి అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో వ్యయప్రయాసలతో పుష్కర పుణ్యస్నానాలను ఆచరించేందుకు వస్తున్న భక్తులకు తమ నుంచి ఆశిస్తున్న సహాయ సహకారాలను అందించేందుకు జిల్లాపోలీసులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి పుష్కరఘాట్ వద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ను నియమించి. ఘాట్ పర్యవేక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను అప్పగించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పూర్తయిన బందోబస్తు ప్రణాళిక ప్రకారం పుష్కరఘాట్ల వద్ద విధులకు హాజరు కావాల్సిన సీఐ, ఎస్సైలు జూలై 1 నుంచే బాధ్యతలు స్వీకరించాలని సూచిం చారు. పోలీస్ సిబ్బంది మూడు షిప్ట్లుగా బందోబస్తు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చైన్‌స్నాచింగ్, దొంగతనాల వంటి నేరాలు నియంత్రించేందుకు క్రైమ్‌టీమ్‌లను, క్యాట్పార్టీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం తెలిపేలా చర్యలు తీసుకోనన్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రద్దీ ప్రదేశాల్లో అదనపు పోలీస్ సిబ్బందిని నియమించనున్నామన్నారు. వేలల్లో వాహనాలు ప్రతిరోజు తరలివస్తాయనే అంచనాతో సమస్య తలెత్తకుండా అనుభవం కలిగిన పోలీస్ ఇన్స్పెక్టర్లను పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో కేటాయించినట్లు తెలిపారు. అన్ని కంట్రోల్‌రూమ్‌లు, సబ్‌కంట్రోల్ రూమ్‌లను మానిటరింగ్ చేసే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణం చర్యలు చేపట్టేవిధంగా సిద్ధంగా ఉండాలని అధికారులకు ఎస్పీ సూచించారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పట్టణంలో ట్రాఫిక్ క్లియరెన్స్‌కు విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. వరంగల్ రోడ్డు, ఇల్లెందు క్రాస్‌రోడ్, బూర్గంపాడు, పాల్వంచ,కొత్తగూడెం, ఆంధ్ర సరిహద్దులోని ఎటపాక వద్ద పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వేమార్గంలో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ, జిల్లా పోలీసుల సమన్వయంతో అదనపు టికెట్ కౌటర్లు రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నట్లు డీసీఎం రాఘునాథ్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు అశోక్‌కుమార్, దక్షిణామూర్తి, రాంరెడ్డి, సురేందర్‌రావు, కవిత, భాస్కరన్, వీరేశ్వరరావు, రాజేష్, సాయిశ్రీ, ఏఆర్డీఎస్పీ సంజీవ్ తదితర సిఐలు,ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి భారీ భద్రత
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీ భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కమాండెంట్ మాధవరావు అన్నారు. శుక్రవారం ప్రాజెక్ట్ భద్రత ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ డీఎస్పీ పద్మనాభ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆనకట్ట ఎంత పొడువు ఉంది, ప్రాజెక్ట్ నిర్మాణ క్రమం, ప్రాజెక్ట్‌కు రక్షణ గురించి ఎస్ఈ శ్యాంసుందర్‌ను అడిగారు. భద్రత కోసం డ్యాంపై గుర్తించిన 8 పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సారెస్పీకి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని 2007లోనే ఇంటెలిజెన్సీ విభాగాలు హెచ్చరించాయని, అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లకు భారీ భద్రత కల్పించాలని నిర్ణయించిందని చెప్పారు. నాగార్జున సాగార్, శ్రీశైలం ప్రాజెక్ట్‌ల మాదిరిగా ఎస్సారెస్పీకీ భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ ఈఈ రామారావు, డ్యాం డిప్యూటీ ఈఈ మొయినొద్దీన్ఖాన్, ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, డ్యాం ఏఈ బోజదాసు, ఆర్మూర్ రూరల్ సీఐ నరసింహ స్వామి, బాల్కొండ ఎస్సై సురేశ్ ఉన్నారు. -
ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర
హైదరాబాద్ : హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ రామమందిరం నుంచి శనివారం ఉదయం 11గంటలకు యాత్రను ఆరంభించారు. విహెచ్పి, భజరంగ్‌దళ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. రామమందిరం నుంచి ఈ శోభాయాత్ర... కాచిగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, కవాడిగూడ, మహంకాళీ టెంపుల్, ప్యారడైజ్, బోయిన్పల్లి మీదుగా సాయంత్రం ఆరు గంటలకు తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం వరకు కొనసాగుతుంది. సుమారు ఈ శోభాయాత్ర 8 గంటలు సాగేది. అయితే చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ సమయాన్ని ఐదు గంటలకు కుదించారు. మరోవైపు ఈ ర్యాలీ శాంతియుతంగా జరిగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 18ప్రాంతాల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. -
పవన సుతుని శోభాయాత్ర
ఏర్పాట్లు పూర్తి ♦ లక్ష బైక్‌లతో యాత్రకు సన్నాహాలు ♦ వివిధమార్గాలలో ట్రాఫిక్ మళ్లింపు ♦ నగరంలో భారీ బందోబస్తు ♦ జేఈఈ అభ్యర్థులకు ఇబ్బంది కలుగనివ్వం: కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో : హనుమాన్ జయంతి నేపథ్యంలో నగరం కాషాయమయమైంది. బస్తీలు, కాలనీలలోని హనుమాన్ దేవాలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకునేందుకు ఈసారి లక్ష బైక్‌లతో శోభాయాత్రకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర సాగే రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం చంద్రగ్రహణం నేపథ్యంలో దేవాలయాలు మధ్యాహ్నం 3 గంటలకే మూసివేయాలని నిర్ణయించారు. ఈలోగా శోభాయాత్ర ముగిసేలా నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం గౌలిగూడలోని రామమందిరం వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమై... సాయంత్రం ఆరు గంటలకు దాడ్బన్ హనుమాన్ దేవాలయానికి యాత్ర చేరుకునేది. సుమారు 8 గంటలు సాగేది. చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ సమయాన్ని ఐదు గంటలకు కుదించారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ విషయాన్ని భక్తులకు తెలియజేస్తున్నారు. ఈసారి ఉదయం పది గంటల లోపే ప్రారంభించాలని అనుకుంటున్నారు. వివిధ బస్తీలు, కాలనీల నుంచి ప్రారంభించే శోభాయాత్రను కూడా త్వరగా ప్రధాన యాత్రతో కలపాలని నిర్వాహకులకు ఇప్పటికే సూచించారు. రహదారులపై స్వాగత వేదికలు, నీళ్లు, ఫలహారాలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాత్ర ఎక్కువ సేపు ఆపకుండా వెంటవెంటనే పంపించేందుకు వలంటీర్లు సహకరిస్తారు. ఆంధ్రా బ్యాంక్ చౌరస్తాలో సామూహిక హనుమాన్ చాలీసా పఠనం ఉంటుంది. ఆ వేదిక నుంచి బజరంగ్దళ్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాజేష్ పాండే ప్రధాన ఉపన్యాసం చేస్తారు. యాత్ర ముగిసిన తరువాత తాడ్‌బన్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగే బహిరంగ సభలో విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి ప్రసంగిస్తారు. శోభాయాత్ర మార్గాలు ఇవే... గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమయ్యే యాత్ర పుత్లీబౌలీ క్రాస్ రోడ్డు, ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్డు, డీఎం అండ్ హెచ్ఎస్ సర్కిల్, రాంకోఠి క్రాస్ రోడ్డు, కాచిగూడ క్రాస్ రోడ్డు, వైఎంసీఏ, నారాయణగూడ సర్కిల్, నారాయణగూడ ప్లై ఓవర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్‌నగర్ క్రాస్‌రోడ్డు, గాంధీనగర్ టీ జంక్షన్ వరకూ వెళుతుంది. అక్కడి నుంచి కవాడీగూడ క్రాస్‌రోడ్డు, బైబిల్ హౌస్, గ్యాస్ మండీ క్రాస్‌రోడ్డు, బాటా క్రాస్ రోడ్డు, సుభాష్ క్రాస్ రోడ్డు, రాంగోపాల్‌పేట పీఎస్, ఎంజీ రోడ్డు, ప్యారడైజ్, సీటీఓ క్రాస్‌రోడ్డు, బాలంరాయి, తాడ్బన్ క్రాస్ రోడ్డు, చిన్నటాకోట బ్రిడ్జి, సెవెన్ టెంపుల్ రోడ్డు, న్యూ బోయిన్పల్లి, సరోజినీ పుల్లారెడ్డి బిల్డింగ్, సెంట్రల్ పాయింట్, డైమండ్ పాయింట్, మస్తాన్ కేఫ్, మీదుగా తాడ్బన్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు. భారీ బందోబస్తు శోభాయాత్రలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసు, ఆర్ముడ్ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత సిబ్బంది బందోబస్తులో ఉంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ రూంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఈ యాత్రను పర్యవేక్షిస్తారు. -
గణతంత్ర వేడుకలకు భారీ బందోబస్తు
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్యఅతిథిగా హాజరు కానుండడంతో నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ వెల్లడించారు. ‘విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అవసరమైన చర్యలు తీసుకుంటాం’అని అన్నారు. ఈ వేడుకల సమయంలో తమ సిబ్బంది చక్కని సమన్వయంతో ముందుకుసాగుతారని, ఇతర ఏజెన్సీలను కలుపుకుపోతామని అన్నారు. భద్రతా విధుల్లో అమెరికా ఏజెన్సీలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు, సైన్యం, పారామిలిటరీ బలగాలతోపాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు కూడా పాలుపంచుకోనున్నాయన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో కూడిన సమన్వయ కమిటీ సమావేశం త్వరలో జరుగుతుందన్నారు. కాగా ఉగ్రవాదులు ఏక్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశముందనే గూఢచార విభాగం హెచ్చరికల నేపథ్యంలో నగరంలో పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఇందుకోసం మూడు స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్ట్స్ (స్వాట్) బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలను... విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్సు టెర్మినళ్లు, మెట్రో రైల్వేస్టేషన్లు, మాల్స్ వంటి కీలక ప్రదేశాలలో వీటిని మోహరించారు. ఈ బృందాలు నిరంతరం విధుల్లో ఉంటాయి. -
నేడు శ్రీనగర్ వెళ్లనున్న మోదీ
శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శ్రీనగర్ వెళ్లనున్నారు. కశ్మీర్ లోయలో మోదీ ఎన్నికల సభను పురస్కరించుకుని నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభ జరిగే షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై నిరంతర నిఘా నిమిత్తం ఇప్పటికే హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు. శ్రీనగర్ అత్యుత్తమమైన రక్షణ చట్రంలో ఉంది. ఇక్కడ జరిగే బీజేపీ ఎన్నికల సభలో మోదీ ప్రసంగించనున్నారు. కాగా యూరీలోని సైనిక శిబిరంపై దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందినవారేనని, వారికి పాక్ సంస్థ మద్దతు ఉందనేందుకు తగిన సాక్ష్యం ఉందని ఆర్మీ తెలిపింది. కశ్మీరీల లక్ష్యంగానే: కశ్మీర్లో మిలిటెంట్లు యూరి సైనిక క్యాంపుపై చేసిన దాడి వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆర్మీ అనుమానిస్తోంది. భారీ ఎత్తున కశ్మీర్ ప్రజలను లక్ష్యం చేసుకునే టైస్టులు తెగబడ్డారని సైనిక దళాల ఉన్నతాధికారి ఒకరు అన్నారు. -
'జమ్మూకాశ్మీర్‌లో 30 ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయింది'
జమ్మూ: గత 30 ఏళ్లుగా జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఉదంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. జమ్మూలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు అవినీతిలో కూరుకుపోయారని మోదీ విమర్శించారు. బ్యాలెట్ కంటే బుల్లెట్‌ను నమ్ముకున్నవారు విఫలమయ్యారని అన్నారు. మొదటి విడత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. జమ్మూకాశ్మీర్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని, అవినీతిని అంతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
మోదీ జమ్మూ పర్యటనకు భారీ భద్రత
ఉదంపూర్: సరిహద్దుల్లో ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్ పర్యటనకు అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మోదీ శుక్రవారం జమ్మూ వస్తున్నారు. ఉదంపూర్‌లో జరిగే ర్యాలీలో మోదీ పాల్గొంటారు. మోదీ పర్యటనకు పలు అంచెల్లో భద్రత ఏర్పాటు చేశారు. ఉదంపూర్ పట్టణంలోను, బయట పెద్ద ఎత్తున పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. ఉదంపూర్ వెళ్లే అన్ని రహదారులను దిగ్బంధించి క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. మోదీ ఇదే రోజు సరిహద్దున ఉన్న పూంచ్ జిల్లాలో కూడా ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. జమ్మూ సరిహద్దున గురువారం ఉగ్రవాద దాడిలో పదిమంది మరణించారు. శుక్రవారం ఉదయం జమ్మూ జిల్లాలో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. -
ముందే... చేసేశారు!
మెల్బోర్న్: సమయం ఉదయం 9 గంటలు... అడిలైడ్ విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు... పుష్పగుచ్ఛాలతో లైసన్ అధికారుల ఎదురుచూపులు... లోపలా, బయటా ఎస్కార్ట్ సిబ్బంది హడావుడి... గ్యాలరీలో మోహరించిన మీడియా కెమెరాలు... తమ అభిమాన క్రికెటర్లను ఫొటోలు తీసుకునేందుకు ఫోన్లను పట్టుకుని బారులు తీరిన భారత అభిమానులు... జట్టు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న పోలీసులు... ఇక అందరి చూపు సింగపూర్ నుంచి భారత జట్టును తీసుకొస్తున్న విమానంపైనే... సీన్ కట్ చేస్తే... గంట గడిచిపోయింది. కానీ విమానం రాలేదు.... భారత క్రికెటర్లూ దిగలేదు. ఏం జరిగిందబ్బా అని ఆరా తీస్తే... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సమాచార లోపం వల్ల సాయంత్రం చేయాల్సిన ఏర్పాట్లను ఉదయాన్నే చేశారని తేలింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6 గంటలకు భారత్ జట్టు అడిలైడ్‌కు రావాల్సి ఉంది. దీంతో చేసేదేమీ లేక అందరూ నిరాశతో వెనుదిరిగిపోయారు. ఈ మొత్తం సీన్లో కొసమెరుపు ఏంటంటే... వీళ్లు హడావుడి చేస్తున్న సమయంలో విరాట్‌సేన సింగపూర్‌లో కనీసం విమానం కూడా ఎక్కకపోవడం...! భారత జట్టు శనివారం సాయంత్రం ఆడిలైడ్‌కు చేరుకుంది. -
బతుకమ్మ నిమజ్జనానికి భారీ భద్రత
బందోబస్తులో 2 వేల మంది పోలీసులు భారీగా మహిళా వలంటీర్ల వినియోగం సైఫాబాద్: సామూహిక బతుకమ్మ నిమజ్జనోత్సవం గురువారం హుస్సేన్‌సాగర్‌లో జరగనున్న నేపథ్యంలో మధ్య మండల పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. బతుకమ్మను తెలంగాణ ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించడంతో గతానికి భిన్నంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. పైగా ఇది మహిళల పండుగ కావడంతో నిమజ్జనంలో చైన్ స్నాచర్లు, ఇతర ప్రాపర్టీ అఫెండర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అనుమానించిన సెంట్రల్ జోన్ అధికారులు వారికి చెక్ చెప్పే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఊరేగింపులు జరిగే ఎల్బీ స్టేడియం నుంచి హుస్సేన్‌సాగర్ వరకు డేగ కంటి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 100 సర్వెలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు వీడియో గ్రాఫర్లను సైతం నియమించి మొత్తం 200 వీడియో కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. బందోబస్తు కోసం రెండు వేల మంది సిబ్బందిని నియమించారు. వీరిలో దాదాపు 500 మంది మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అనుమానితులను పట్టుకునేందుకు మరికొంత మంది సిబ్బందిని మఫ్టీలో ఉంటారు. పోలీసులతో పాటు 400 మంది వలంటీర్లు, మరో 300 మంది ఎన్సీసీ క్యాడెట్లను సైతం ఎల్బీ స్టేడియం నుంచి హుస్సేన్‌సాగర్ వరకు, అప్పర్ ట్యాంక్ బండ్‌పై మోహరిస్తారు. నగరంలో రెచ్చిపోతున్న స్నాచర్లలో బయట జిల్లాల వారు కూడా ఉంటున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆయా జిల్లాల నుంచీ క్రైమ్ టీమ్స్‌ను రప్పిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలో ఉన్న నేరగాళ్ల అడ్డాలపై గురువారం వరకు వరుస దాడులు చేయాలని, అవసరమైన చోట కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. -
సీఎం పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు
నెల్లూరు(పొగతోట): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 24న జిల్లాలో పర్యటించనకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో ముఖ్యమంత్రి పర్యటనపై వివిధశాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి 24న వెంకటాచలంలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారిపై ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలన్నా రు. సీఎంతో పాటు జిల్లాకు వచ్చే ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో వైద్యుల బృందంతో పాటు ఫైరింజన్ అందుబాటులో ఉండాలన్నారు. వృత్తి విద్యా కోర్సులు చేస్తున్న విద్యార్థులతో సీఎం ముఖముఖి కార్యక్రమం ఉంటుందన్నారు. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం మొక్కలు నాటే ప్రాంతాల్లో ఏర్పా ట్లు చేయాలని సూచించారు. అనంతరం రేషన్‌కార్డులు, గ్యాస్ వినియోగదారుల, స్కాలర్షిప్లు, పాసుపుస్తకాలకు సంబంధించి ఆధార్ సీడీంగ్పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ రేఖారాణీ, ఏజేసీ రాజ్‌కుమార్, డీఆర్ఓ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ ఎం.జితేంద్ర, డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి, డీఎస్ఓ శాంతకుమారి, డీఎం ధర్మారెడ్డి పాల్గొన్నారు. -
ఇయ్యాల రేపంట.. లష్కర్ బోనాలంట
- నేడు బోనాలు, రేపు రంగం - విద్యుత్ దీపాలతో వెలుగొందుతున్న ఆలయం - పూర్తయిన ఏర్పాట్లు భారీ బందోబస్తు రాంగోపాల్‌పేట్:లష్కర్ బోనాలుగా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. ఆదివారం అమ్మవారికి బోనాలు, సాక సమర్పిస్తారు. సోమవారం రంగం ఉంటుంది. ఇందులో జోగిని భవిష్య వాణి వినిపిస్తుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ జాతర జరగనుంది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన పది లక్షలకుపైగా భక్తుల పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ, దేవాదాయ, పోలీసు, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మొదటి పూజ... ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా ఆదివారం తెల్లవారు జామున 4గంటలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం మొదటి పూజ చేయనుంది. ఆపై మిగతా భక్తులను అనుమతిస్తారు. అంతకుముందు అభిషేకాలు, మహా మంగళహారతి పూజలు మొదలవుతాయి. బోనాలకు ప్రత్యేక క్యూలైన్.. అమ్మవారిని దర్శించుకునేందుకు ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్ (బాటా వైపు నుంచి) ఏర్పాటు చేశారు. వీవీఐపీలు వచ్చిన సమయంలోనూ బోనాలతో వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీలకు (ఎరుపు రంగు పాస్), సాధారణ భక్తులకు రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ వైపు నుంచి రెండు వేర్వేరు క్యూ లైన్లు, టొబాకో బజార్ నుంచి ప్రత్యేక దర్శనం కోసం (నీలం రంగు పాస్) మరో క్యూలైన్, అంజలీ థియేటర్ వైపు నుంచి సాధారణ భక్తుల కోసం ఓ క్యూలైన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే తదితర ప్రొటోకాల్ అధికారులకు మహంకాళి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉండే ఆర్చ్‌గేట్ నుంచి నేరుగా అనుమతిస్తారు. వృద్ధులు, వికలాంగులకు ఇక్కడి నుంచే నేరుగా లోపలికి పంపిస్తారు. క్యూలైన్లలో ఉండే భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా వాటర్ ప్రూఫ్‌తో కొల్కత్తా డెకోరేషన్ షెడ్స్ ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు బిగించారు. నిరంతం విద్యుత్ సరఫరా దేవాలయంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో నిరంతరం విద్యుత్ సరఫరాకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా మొబైల్ ట్రా న్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచారు. దేవాలయానికి చెందిన జనరేటర్‌ను సిద్ధంగా ఉంచారు. జలమండలి... జాతర కోసం జలమండలి మంచినీటి సరఫరా చేస్తుంది. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్, బాటా, దేవాలయం వెనుక టెంట్లు వేసి డ్రమ్ములతోపాటు వాటర్ ప్యాకెట్లు భక్తులకు అందిస్తారు. 15 వందల మంది వలంటీర్లు.. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వివిధ శాఖలు, సంస్థలకు చెందిన 1,500 మంది వలంటీర్లు పనిచేయనున్నారు. దక్కన్ మానవసేవా సమితి, వాసవి క్లబ్ సికింద్రాబాద్, మున్నూరు కాపు సంఘం, ఎన్సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నల్లగుట్ట అభివృద్ధి సంఘం తదితర సంఘాల వారు అమ్మవారి సేవలో పాలుపంచుకోనున్నారు. బందోబస్తు ఏర్పాట్లు భారీగా.. ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి ఆధ్వర్యంలో జాతరకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయం లోపల 16, బయట 16 సీసీ కెమెరాలను దేవాలయ అధికారులు బిగిం చారు. మరో 10 సీసీ కెమెరాలను పోలీసులు క్యూలైన్లలో ఏర్పాటు చేసి ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు పెద్ద పెద్ద ఎల్సీడీలను ఏర్పాటు చేశారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 12 మంది ఏసీపీలు, 30 మంది ఇన్స్పెక్టర్లు, 72 మంది ఎస్ఐలు, 66 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 296 మంది కానిస్టేబుళ్లు, 242 మంది హోం గార్డులు, 12 ప్లటూన్ల సాయుధ బలగాలను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. ఇందులో 132 మంది మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. పార్కింగ్ ప్రదేశాలు... రాణిగంజ్‌లోని అడివయ్య చౌరస్తాలోని మైదానం, ఆర్పీ రోడ్‌లోని మహబూబ్ కళాశాల, ప్యారడైజ్ ప్రాంతంలోని పీజీ కళాశాల, ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉండే వెస్లీ డిగ్రీ కళాశాల ప్రాంగణాల్లో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. -
నేటి సార్వత్రిక ఓట్ల లెక్కింపు కోసం భారీ భద్రత
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో శుక్రవారం జరగనున్న సార్వత్రిక (ఎంపీ, ఎమ్మెల్యే) ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. సంగారెడ్డికి సమీపంలోని ఫసల్వాది ఎంఎన్ఆర్ కళాశాల, కాశీపూర్‌లోని డీవీఆర్ కళాశాల, పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వ విద్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద ఇద్దరు ఏఎస్పీలు, ఒక ఓఎస్డీ, ఏడుగురు డీఎస్పీలు, 35 మంది సీఐలు, 90 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 9 స్పెషల్ పార్టీ పోలీసులు, 150 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎవరూ కూడా గుమిగూడి ఉండరాదని ఎస్పీ శెముషీ హెచ్చరించారు. అలాగే నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, ముఖ్య గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పికెట్లు, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలో 30 పోలీసు చట్టం, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎస్పీ సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎవరు కూడా అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్లు, ఇంకు పెన్నులు, బ్లేడ్లు, చాకులు, రాళ్లు, వాటర్ బాటిళ్లు, సెల్ఫోన్లు, సుత్తెలు వంటివి తీసుకుని వెళ్లరాదని పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా శాంతికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. -
రిపబ్లిక్‌డేకు గట్టి నిఘా
పెరేడ్ గ్రౌండ్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన నగర పోలీసు కమిషనర్ రేపు ట్రాఫిక్ ఆంక్షలు సిటీబ్యూరో,కంటోన్మెంట్, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముష్కరమూకలు విరుచుకుపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా తీసుకుంటు న్న చర్యలను నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌ను శుక్రవారం నాటికే పోలీసు లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం జరిగే రిహార్సల్స్‌ను వీక్షించే ఉన్నతాధికారులు భద్రతా చర్యల్లో తీసుకోవాల్సిన మార్పు చేర్పులను సూచించనున్నారు. పెరేడ్గ్రౌండ్స్తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున బలగాలను మోహరించారు. మైదానం చుట్టూ నిత్యం పెట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అయితే పెరేడ్‌ను వీక్షించడానికి వచ్చేవారు తమవెంట హ్యాండ్‌బ్యాగులు, కెమెరాలు, టిఫిన్‌బాక్సులు, బ్రీఫ్ కేసులను తీసుకురావడాన్ని నిషేధించారు. రేపు ట్రాఫిక్ ఆంక్షలు: సికింద్రాబాద్ పెరేడ్‌గ్రౌండ్స్‌లో ఆదివారం జరుగనున్న గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఆ పరిసరాల్లో, గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్ వద్దా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీచేశారు. సర్దార్పటేల్రోడ్లోని సెంట్రల్ టెలిగ్రాఫ్ ఆఫీసు జంక్షన్-వైఎంసీఏ చౌరస్తా మధ్య ఆదివారం ఉదయం 7-11 గంటల మధ్య వన్-వే అమలులో ఉంటుంది. దీని ప్రకారం పెరేడ్ ప్రారంభానికి ముందు సీటీవో జంక్షన్ నుంచి వైఎంసీఏ వైపు, పూర్తయిన తర్వాత వైఎంసీఏ నుంచి సీటీవో జంక్షన్ వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ఇదే సమయంలో కంటోన్మెంట్ గార్డెన్స్-ఎస్బీహెచ్ చౌరస్తా మధ్య ఎలాంటి వాహనాల ప్రవేశానికి అనుమతి ఉండదు. బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు సీటీవో ఫ్లై ఓవర్ కింది నుంచి ప్రయాణించి ప్యారడైజ్, బా లంరాయ్ మీదుగా పెరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకోవాలి. సెయింట్‌జాన్స్ రోటరీ వచ్చే వాహనాలు వైఎంసీఏ ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చి ఉప్కార్ చౌరస్తా లేదా క్లాక్‌టవర్ మీదుగా గ్రౌండ్స్‌కు రావాలి. సికింద్రాబాద్ క్లబ్ ఇన్‌గేట్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్బీహెచ్ చౌరస్తాకు అనుమతించరు. వైఎంసీఏ క్రాస్‌రోడ్స్ లేదా టివోలీ చౌరస్తా మీదుగా వెళ్లాలి. ఆర్పీ రోడ్ నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్ ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ వైపు మళ్లాల్సి ఉంటుంది. -
లగడపాటిని స్టేజ్ మీదనుంచి లాగేసిన తెలంగాణవాదులు
హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఏపీ ఎన్జీవోలు నిర్వహిస్తున్న మహాధర్నా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతుండగా, కొందరు తెలంగాణ వాదులు ప్రవేశించి ఆయనను స్టేజి మీద నుంచి కిందకు లాగేశారు. దీంతో అక్కడే భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. తెలంగాణ యువశక్తి సంస్థకు చెందిన ముగ్గురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. అంతకుముందు మహాధర్నా సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ధర్నా ప్రాంతమైన ఇందిరాపార్కు చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీఎస్పీకి చెందిన 20 దళాలు, సీఆర్పీఎఫ్ కంపెనీ ఒకటి, ఆర్ఏఎఫ్ కంపెనీ ఒకటి, స్వాట్ దళాలు 6, 50 మంది ఎస్ఐలు, 15 మంది సీఐలు, 10 మంది డీఎస్పీలు, 100 మంది మహిళా పోలీసులను అక్కడ మోహరించారు. -
ఏపీఎన్జీవోల ధర్నా.. భారీ భద్రతా ఏర్పాట్లు
ఏపీఎన్జీవోలు తలపెట్టిన మహాధర్నా సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ధర్నా ప్రాంతమైన ఇందిరాపార్కు చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీఎస్పీకి చెందిన 20 దళాలు, సీఆర్పీఎఫ్ కంపెనీ ఒకటి, ఆర్ఏఎఫ్ కంపెనీ ఒకటి, స్వాట్ దళాలు 6, 50 మంది ఎస్ఐలు, 15 మంది సీఐలు, 10 మంది డీఎస్పీలు, 100 మంది మహిళా పోలీసులను అక్కడ మోహరించారు. ఇందిరాపార్కు, వార్త ఆఫీసుల, ఎల్ఐసీ కార్యాలయం, కట్ట మైసమ్మ దేవాలయం-అశోక్‌నగర్, అశోక్‌నగర్ రిలయన్స్- న్యూ బ్రిడ్జి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. -
భారీ బందోబస్తు మధ్య రాష్ట్రపతి పర్యటన
అనంతపురం క్రైం/సిటీ/బుక్కరాయసముద్రం, న్యూస్‌లైన్ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జిల్లా పర్యటన సోమవారం పోలీస్ పహారా మధ్య ముగిసింది. నగర శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌తో పాటు నీలం సంజీవరెడ్డి స్టేడియంలోని సభాస్థలికి అర కిలోమీటర్ వరకు జనం ఎవరూ కనబడకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. సభ ఆవరణలోకి విద్యార్థులను మినహా మరెవ్వరినీ అనుమతించలేదు. పౌర సంబంధాల శాఖాధికారి జారీ చేసిన వాహనాల పాస్‌లు ఉన్నా పోలీసులు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనాలను ఎక్కడికక్కడ ఆపేసి వీఐపీలను నడిపించారు. రాష్ట్రపతి కాన్వాయ్ నగరంలోకి రాకముందే గంటకు పైగా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. రుద్రంపేట కాలనీ, నడిమి వంక, ఒకటి, నాలుగు, ఐదో రోడ్డు, లక్ష్మినగర్, నీలం సంజీవరెడ్డి బంగా రోడ్డుల్లో రెండున్నర గంటల పాటు ట్రాఫిక్‌ను నిలిపేశారు. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉత్సవాలు ముగిశాక స్కూల్ విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ మేర నడుచుకుంటూ పార్కింగ్ స్థలానికి వెళ్లి బస్సు ఎక్కాల్సి వచ్చింది. సుమారు 15 వేల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 మొబైల్ టీంలు ఏర్పాటు చేశారు. ఎత్తై భవనాలపైకి పోలీసులు చేరి నిఘా కెమెరాలతో రాకపోకలు గుర్తించారు. పీటీసీ సమీప ప్రాంతాలు, కాన్వాయ్ వచ్చే ప్రాంతాల్లో దుకాణాలను మూసి వేయించారు. బాంబు, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి రహదారులు, వంతెలన వద్ద సోదాలు నిర్వహించారు. చివరికి ఇళ్లలోని వారిని కూడా బయటకు రానివ్వలేదు. ఈ క్రమంలో నాల్గో రోడ్డులోని ఓ గృహిణి పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ‘మా ఇంటి ముందు కూర్చోవడానికి మీ పర్మిషన్ తీసుకోవాలంటే ఎలా?’ అంటూ నిలదీసింది. అయితే పోలీసులు వినకపోవడంతో ఇంట్లోకెళ్లిపోయింది. -
జమ్మూలో నరేంద్ర మోడీ ర్యాలీకి భారీ భద్రత
జమ్మూలో ఆదివారం జరిగే బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ ర్యాలీకి అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. ర్యాలీ వేదిక ఎంఏ స్టేడియం చుట్టూ భద్రత బలగాలు పహారా కాస్తున్నాయి. ఇక్కడ ఎలాంటి అనధికారిక కార్యక్రమాలు జరగకుండా నిషేధం విధించారు. రెండు రోజుల ముందు గుజరాత్ పోలీసులు మోడీ భద్రతను సమీక్షించారు. శనివారం వేదిక వద్ద స్థానిక పోలీసులు, సీఆర్ఎఫ్ సిబ్బంది ముందస్తుగా డ్రిల్ నిర్వహించారు. మోడీ ర్యాలీని దృష్టిలో ఉంచుకుని జమ్మూకాశ్మీర్ రాష్ట్రమంతటా స్థానిక పోలీసులు, సీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. భద్రత చర్యల్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జమ్మూకు వెళ్లే అన్ని రహదారుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్మీ సిబ్బంది స్థానిక పోలీసులకు సాయపడుతున్నారు. ర్యాలీలో మోడీతో పాటు బీజేపీ నాయకులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొంటారు. -
దేవర్ జయంతి వేడుకలకు భారీ భద్రత
టీ.నగర్, న్యూస్‌లైన్ : దేవర్ జయంతి వేడుకలకు దక్షిణ జిల్లాల్లో 25 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఐజీ అభయ్‌కుమార్ వెల్లడించారు. రామనాథపురం జిల్లా పసుం పొన్లో ముత్తురామలింగ దేవర్ జయంతి వేడుకలు అక్టోబర్ 30వ తేదీ నిర్వహించనున్నారు. ఇందులో దక్షిణ జిల్లాల నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది పాల్గొంటా రు. గత ఏడాది జయంతి ఉత్సవాలకు వెళ్లి తిరిగి వస్తున్న వారిపై మదురై సమీపంలో కొందరు దుండగులు పెట్రో బాంబులు వేశారు. ఈ సంఘటన సహా రెండు ఘటనలలో 10 మంది మృతిచెందారు. ఈ ఏడాది ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అదనపు డీజీపీ రాజేంద్రన్ ఆధ్వర్యంలో దక్షిణ జిల్లా పోలీసు అధికారులు పసుంపొన్‌లో నేరుగా పరిశీలన జరిపి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. దీని గురించి సౌత్ డివిజన్ ఐజీ అభయ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ మదురై సహా తొమ్మిది దక్షిణ జిల్లాల్లో 22 వేల మంది పోలీసులు ఉన్నారని, చెన్నై సహా మిగతా ప్రాంతాల నుంచి మూడు వేల మందికి పైగా పోలీసులు దక్షిణ జిల్లా భద్రతకు రానున్నట్లు తెలిపారు. మొత్తం 25 వేల మందికి పైగా పోలీసులు అక్టోబర్ 30న భద్రతా పనులలో నిమగ్నమవుతారన్నారు. -
సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు
-
సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద భారీ భద్రత
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు.. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు వద్ద శుక్రవారం ధర్నా చేస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల బలగాలను భారీగా మోహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. విభజన బిల్లుకు మందే అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ను జగన్ కోరారు. ఇక ఈ నెల 26న హైదరాబాద్‌లో 'సమైక్య శంఖారావం' సభను నిర్వహిస్తున్నారు.