జమ్మూ: గత 30 ఏళ్లుగా జమ్మూకాశ్మీర్లో అభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఉదంపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు.
జమ్మూలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు అవినీతిలో కూరుకుపోయారని మోదీ విమర్శించారు. బ్యాలెట్ కంటే బుల్లెట్ను నమ్ముకున్నవారు విఫలమయ్యారని అన్నారు. మొదటి విడత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్న ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. జమ్మూకాశ్మీర్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని, అవినీతిని అంతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
'జమ్మూకాశ్మీర్లో 30 ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయింది'
Published Fri, Nov 28 2014 2:19 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement