రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు.. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు వద్ద శుక్రవారం ధర్నా చేస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు.. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు వద్ద శుక్రవారం ధర్నా చేస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల బలగాలను భారీగా మోహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతంగా చేపడుతున్న సంగతి తెలిసిందే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి గవర్నర్ నరసింహన్ను కలిశారు. విభజన బిల్లుకు మందే అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ను జగన్ కోరారు. ఇక ఈ నెల 26న హైదరాబాద్లో 'సమైక్య శంఖారావం' సభను నిర్వహిస్తున్నారు.