సరిహద్దుల్లో ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్ పర్యటనకు అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు.
ఉదంపూర్: సరిహద్దుల్లో ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్ పర్యటనకు అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మోదీ శుక్రవారం జమ్మూ వస్తున్నారు. ఉదంపూర్లో జరిగే ర్యాలీలో మోదీ పాల్గొంటారు.
మోదీ పర్యటనకు పలు అంచెల్లో భద్రత ఏర్పాటు చేశారు. ఉదంపూర్ పట్టణంలోను, బయట పెద్ద ఎత్తున పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. ఉదంపూర్ వెళ్లే అన్ని రహదారులను దిగ్బంధించి క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. మోదీ ఇదే రోజు సరిహద్దున ఉన్న పూంచ్ జిల్లాలో కూడా ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. జమ్మూ సరిహద్దున గురువారం ఉగ్రవాద దాడిలో పదిమంది మరణించారు. శుక్రవారం ఉదయం జమ్మూ జిల్లాలో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి.