ఏపీఎన్జీవోలు తలపెట్టిన మహాధర్నా సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఏపీఎన్జీవోలు తలపెట్టిన మహాధర్నా సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ధర్నా ప్రాంతమైన ఇందిరాపార్కు చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీఎస్పీకి చెందిన 20 దళాలు, సీఆర్పీఎఫ్ కంపెనీ ఒకటి, ఆర్ఏఎఫ్ కంపెనీ ఒకటి, స్వాట్ దళాలు 6, 50 మంది ఎస్ఐలు, 15 మంది సీఐలు, 10 మంది డీఎస్పీలు, 100 మంది మహిళా పోలీసులను అక్కడ మోహరించారు.
ఇందిరాపార్కు, వార్త ఆఫీసుల, ఎల్ఐసీ కార్యాలయం, కట్ట మైసమ్మ దేవాలయం-అశోక్‌నగర్, అశోక్‌నగర్ రిలయన్స్- న్యూ బ్రిడ్జి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.