mahadharna
-
పేదల ఇళ్లు కూల్చితే రణరంగమే...
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: ‘మూసీలో పేదల ఇళ్లు కూల్చితే తెలంగాణ రణరంగంగా మారుతుంది. పేదలు ఆక్రోశంతో తిరగబడితే ఏ పోలీసులూ అడ్డుకోలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేదల ఇళ్ల కూల్చివేతల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. మేం కూడా కూల్చివేతలను అడుగడుగునా అడ్డుకుంటాం. సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను మేం స్వీకరిస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల కోసంవారి ఇళ్లల్లో ఉండేందుకు మేం సిద్ధం..’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మూసీ, హైడ్రా కూల్చివేతలకు నిరసనగా ‘చేయి చేసిన కీడు...మూసీ బాధితులకు బీజేపీ తోడు’పేరిట నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఇళ్లు కూల్చకుండా సుందరీకరణ చేయాలి ‘మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు. అయితే పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా మూసీ సుందరీకరణ చేయాలి. మూసీకి రెండువైపులా రిటైనింగ్‌వాల్ నిర్మించాక సుందరీకరణ చేపట్టాలి. అప్పుడు బీజేపీ కార్యకర్తలు కరసేవ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాకాకుండా పేదల ఇళ్లు కూల్చాలనుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటాం. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, వివరాలు సేకరించి రానున్న రోజుల్లో పేదల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.అనేక ఏళ్ల నుంచి ఉంటున్న ఇళ్లను ఎలా కూలుస్తారు ? మూసీ పరీవాహక ప్రాంతం చరిత్ర రేవంత్‌రెడ్డికి తెలుసా? మూసీలో అనేక ప్రాంతాల డ్రైనేజీ నీరు కలుస్తోంది. దాన్ని మళ్లించకుండా, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) నిర్మించకుండా మూసీ ప్రక్షాళన చేయలేరు..’అని కిషన్‌రెడ్డి చెప్పారు. ముందుగా హైదరాబాద్‌లోని అనేకచోట్ల భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాక మూసీ సుందరీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, తమ మోసపూరిత వైఖరి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చుతామంటోందని ధ్వజమెత్తారు. మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్: బండి సంజయ్ ‘మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్. మూసీ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్లే. లండన్, సియోల్ కాదు.. మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ము సీఎంకు, మంత్రులకు ఉందా? మీ అల్లుడి (వాద్రా) కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా? మూసీ బాధితులకు మేం అండగా ఉంటాం..’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మూసీ ప్రాజెక్టుకు లక్షన్నరకోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ ప్రక్షాళనకు, ఇళ్ల కూలి్చవేతలకు సంబంధం ఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. సీఎం మాతో మూసీ పర్యటనకు రావాలి: ఏలేటి మహేశ్వరరెడ్డి సీఎం రేవంత్ తమతోపాటు మూసీ పర్యటనకు రావాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు ప్రజల్లో ఒక్కరు ఒప్పుకున్నా తాము వెనక్కి తగ్గుతామని సవాల్ చేశారు. మీ కమీషన్ల కోసం సామాన్య ప్రజలను రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సమన్వయకర్తగా నిర్వహించిన ఈ ధర్నాలో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్, పలువురు పార్టీ నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మూసీ ప్రభావిత ప్రాంతాల్లోని పలువురు మహిళలు ఈ సందర్భంగా తమ సమస్యలను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. -
బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాల సమస్యలు పరిష్కరించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా నినాదాలతో హోరెత్తింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, లేకపోతే సమాజంలో మార్పు ఉండదని ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీల బతుకులు మార్చే బీసీ బిల్లును పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని, పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, డాక్టర్ ఎన్ మారేష్‌ల అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో ఆర్.కృష్ణయ్యతో పాటు ఎంపీలు బీద మస్తాన్ రావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో జబ్బల శ్రీనివాస్, బత్తుల వెంకటరమణ, పద్మలత, నీలం వెంకటేష్, భూపేష్ సాగర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Telangana: ప్రజాపోరు షురూ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపడమే ఇప్పుడు నిజమైన దేశభక్తి అని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. మరో స్వాతంత్య్రోద్యమంతో ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైం దని, అందులో భాగంగా ప్రజాపోరాటం ప్రారంభమైందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం ఇందిరాపార్కు వద్ద ‘ప్రతిపక్షాల మహాధర్నా’ జరిగింది. ఏచూరి ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘దేశంలో మోదీ పాలన ఇలాగే సాగితే ప్రజాస్వామిక హక్కులు మిగలవు. ప్రైవేటీకరణ పేరుతో మోదీ దేశాన్ని తెగనమ్ముతున్నారు. ఆయన విధానాలను వ్యతిరేకించి ప్రశ్నించే నాయకులను ఈడీ, సీబీఐ దాడులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలు కష్టాల్లో ఉంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాధిపతులతో మాట్లాడేందుకు వెళ్లారు. ఈ పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముందు దేశాన్ని కాపాడుకున్న తర్వాత ఈ దేశాన్ని మార్చుకుందాం. అందుకే జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు ఉద్యమానికి నడుం బిగించాయి. మోదీ పాలనపై పోరాడి దేశాన్ని కాపాడుకోవడమే దేశ ప్రజల వాగ్దానం, సంకల్పం కావాలి..’ అని ఏచూరి విజ్ఞప్తి చేశారు. ‘కరోనా కాలంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆదాయపు పన్ను పరిధిలోనికి రాని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా గోదాముల్లో మూలుగుతున్న ధాన్యాన్ని పేదలకు పంపిణీ చేయాలి..’ అని డిమాండ్ చేశారు. గులాబీ చీడ వదలాలంటే మోదీని బండకేసి కొట్టాలి: రేవంత్ ‘తెలంగాణకు విముక్తి కలగాలంటే గులాబీ చీడను వదిలించుకోవాలి. ఈ చీడ వదలాలంటే కేసీఆర్‌కు అండగా ఉన్న మోదీని బండకేసి కొట్టాలి. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుంటే మోదీ, అమిత్‌షాలు ఈ దుర్మార్గుడిని అక్కున చేర్చుకుని తెలంగాణ ప్రజలను గుండెలపై తన్నిస్తున్నారు. గల్లీలో ఉన్న కేడీ, ఢిల్లీలో ఉన్న మోదీ ఒకే తాను ముక్కలు. మోదీ అధికారంలోకి వచ్చాక పెట్రో ధరల రూపంలో రూ.24 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. 70 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కష్టించి సమకూర్చిన దేశ సంపదను మోదీ తెగనమ్ముతున్నారు. రాష్ట్రంలో నిజాం నవాబు ద్వారా సంక్రమించిన వేలకోట్ల రూపాయల విలువైన భూములను సీఎం కేసీఆర్ తెగనమ్ముతున్నారు. ఆయన శివలింగం మీద తేలులా మిగిలాడు. ఆ తేలును ఎలా తీయాలో, చెప్పు కింద ఎలా తొక్కాలో మాకు తెలుసు..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27న జరిగే భారత్‌బంద్‌ను, అక్టోబర్ 5న జరిగే రాస్తారోకోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లో అసలైన డెకాయిట్లు: నారాయణ ‘టీఆర్ఎస్లో అసలైన డెకాయిట్లు ఉన్నారు. రేవంత్ ఇంటిపై దాడి లాంటి ఘటనలు పునరావృతమైతే సంగతి చూస్తాం’ అని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ అన్నారు. మోదీ నరహంతకుడు, ప్రజా భక్షకుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అక్టోబర్ 5న జరిగే పోడు పోరాటంలో బాధిత ప్రజలు క్రియాశీలకంగా పాల్గొనాలని, వారి కుటుంబ సభ్యులంతా రోడ్లపైకి రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలని కోరారు. తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరకు సుధాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ కార్యదర్శి పోటు రంగారావు, గోవర్ధన్, లిబరేషన్ కార్యదర్శి రాజేశ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, కాంగ్రెస్ ముఖ్య నేతలు షబ్బీర్ అలీ, కోదండరెడ్డి, పొన్నం ప్రభాకర్, నాగం జనార్దన్‌రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిలతో పాటు ప్రజా సంఘాల నేతలు, ఆయా పార్టీల కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి మూలాలైన నాలుగు స్తంభాలను ధ్వంసం చేస్తున్నారు. లౌకిక భారతదేశం, సామాజిక స్వేచ్ఛ, సమాఖ్య స్ఫూర్తి, ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న మోదీ ఈ దేశాన్ని నిరంకుశం వైపు నడిపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో రాజ్యాంగం ఉనికి ప్రమాదంలో పడుతుంది. – సీతారాం ఏచూరి తెలంగాణలో ఆఖరి పోరాటం ప్రారంభమైంది. 1969 తెలంగాణ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళం వినిపించింది. మలిదశ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది. ఈ ఆఖరి పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన సాకారం కావాలి. –రేవంత్ రేవంత్ ఇంటిపై దాడి నీచ సంస్కృతి. కేసీఆరో, కేటీఆరో వస్తే మేము రేవంత్‌ను పంపుతాం. అప్పుడు మల్ల యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒకదెబ్బకు రెండు పిట్టలు అనే తరహాలో క్షేత్రస్థాయిలో ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారా మోదీ, కేసీఆర్‌లను దెబ్బకొట్టాలి. – నారాయణ -
ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది..?
సాక్షి, హైదరాబాద్: దళితులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అధ్యక్షతన.. మహిళా కాంగ్రెస్ చైర్మన్ నేరెళ్ల శారద, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం అధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. మహాధర్నాలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మహిళా, దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (టీఆర్ఎస్ నేతల ఇళ్లకే రూ.10 వేలు) ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. 'దళితులకు, మహిళలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలంగాణలో కూడా దళితులు, మహిళల హక్కుల కోసం ధర్నా చేయాల్సి రావడం మన దౌర్భాగ్యం. తెలంగాణ కోసం మహిళలు, దళితులు ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోజూ అత్యాచారాలు, దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతిరోజు దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబ పాలన పోవడానికి ప్రతి దళితుడు పోరాటం చేయాలి. ప్రతి మహిళా టీఆర్ఎస్ను బొంద పెట్టడానికి నడుం బిగించాలి' అని సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. (హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు..?) -
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 29న మహాధర్నా
కొడంగల్ రూరల్ : డిగ్రీ కళాశాలకు గదులు కేటాయించాలంటూ ఈ నెల 29వ తేదీన మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మలి బాల్‌రాజ్ పిలుపునిచ్చారు. ఇటీవల ఆగస్టు 11వ తేదీన డిగ్రీ విద్యార్థులకు తరగతుల నిర్వహణ కొరకు గదులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని నిరసన తెలపడానికి సన్నద్ధం కావడంతో సీఐ హామీ మేరకు నిరసనను విరమించామని ఆయన అన్నారు. సమయం గడిచిపోతున్నా డిగ్రీ విద్యార్థుల చదువులు సాగకపోవడంతో ఇబ్బందిగా మారిందని అన్నారు. ఈ విషయంపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల పార్టీల అధ్యక్షులు మరియమ్మ, కోళ్ల యాదయ్యల ఆధ్వర్యంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఈ నెల 29వ తేదీన మండల కేంద్రంలో మహాధర్నాను నిర్వహించడానికి వారు అంగీకారం తెలిపారని తమ్మలి బాల్‌రాజ్ తెలిపారు. గత పదేళ్లుగా డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు జూనియర్ కళాశాల భవనంలో వంతుల మాదిరి ఉదయం, మధ్యాహ్నం తరగతులను నిర్వహిస్తుండగా, ఈ ఏడాది మాత్రమే డిగ్రీ విద్యార్థులకు గదులు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల భవనం త్వరితగతిన పూర్తి చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత కాంట్రాక్టర్ జాప్యం చేస్తుండడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. గతంలో మాదిరిగానే తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో 29వ తేదీన మహాధర్నాను కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. మహాధర్నాకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్య పరిష్కారమయ్యేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. -
27న బీఎల్ఎఫ్ మహాధర్నా
ఖమ్మంమయూరిసెంటర్ : జిల్లాలోనిప్రజలు, రైతులు, ఇతర రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 27న బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27న ఉద యం 10 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో మహాధర్నా ఉంటుందన్నారు. ఈ నెల 3 నుంచి గ్రామా ల్లో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో 21 మండ లాల్లో 75 బృందాలు 560 గ్రామాల్లో సర్వే నిర్వహించామన్నారు. ఈ సర్వేలో ప్రతి మండలంలో 20 శాతం మంది ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేనివారు ఉన్నారని, అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం డబుల్‌బెడ్ రూం ఇళ్లు అంది స్తామని చెప్పిందని, కానీ ఎక్కడా అవి అర్హులకు అందడం లేదని ఆరోపించారు. జిల్లాలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని, ప్రతి సీజన్లో అటవీశాఖ అధికారులు పంట లు ధ్వంసం చేస్తూ గిరిజనులు, ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారికి రైతు బంధు పథకం అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5లక్షల బీమా, పోడు భూమికి హక్కుపత్రాలు ఇవ్వాలని కోరారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఖమ్మంలోని గోళ్లపాడు చానెల్‌పై నివసిస్తున్న మూడువేల మంది లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఈ ధర్నాకు బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి హాజరవుతారన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీని, బాబును ప్రజలు క్షమించరు!
-
రేపటి మహా ధర్నా కొనసాగుతుంది: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
కమలాపురం: తన పాదయాత్ర ద్వారా సర్వరాయసాగర్ జలాశయానికి నీటిని విడుదల చేయాలనే డిమాండ్ జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లిందని, అయితే రేపటి తన మహా ధర్నా యథావిధిగా కొనసాగుతుందని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మూడు రోజులుగా ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ బాబురావు నాయుడు స్పందిస్తూ ఈ నెల 25వ తేదీ నాటికి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే తన నాలుగో రోజు పాదయాత్ర ముగింపు నాడు చేపట్టే మహా ధర్నా యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం కలెక్టరును కలుస్తానని, ఆయన ఇచ్చే హామీనిబట్టి ముందుగా ప్రకటించిన దీక్ష విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో అధికారులు ఇలానే హామీలు ఇచ్చి వెనక్కు తగ్గారని, అందుకే కలెక్టర్‌తో నేరుగా మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. -
కార్మికుల కడుపు కొట్టొద్దు
– సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి – ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలి – సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డిమాండ్ - కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు భారీగా తరలివచ్చిన కార్మికులు కర్నూలు (న్యూసిటీ) : ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి కార్మికులు కడుపుకొట్టొద్దని సీఐయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయులు ప్రభుత్వాలకు సూచించారు. కార్మికుల డిమాండ్లపై ఆయూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షత వహించిన ఈ ధర్నాకు జిల్లాలోని అసంఘటిత రంగ, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కార్మికులు సరైన వేతనం అందక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు కట్టబెడితే సహించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ హమాలీ, ట్రాన్స్పోర్ట్, బీడీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి హౌసింగ్డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులును తీసి వేస్తున్నారని మండిపడ్డారు. బెల్టుషాపులను ఎత్తివేస్తామని చెప్పి వీధికో మందు దుకాణం పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లపై దాడులను ఆర్టీఏ, పోలీసు, ఆర్టీసీ అధికారుల దాడులను ఆపాలని మోటర్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాన్ డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత డీఆర్ఓ గంగాధర్‌గౌడ్‌ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు గౌస్‌దేశాయ్, పుల్లారెడ్డి, సుబ్బయ్య, రాముడు, గోపాల్, రాజశేఖర్, అంజిబాబు, అంగన్వాడీ వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షబానా, ఆశా వర్కర్ల యూనియన్ నాయకుడు చంద్రుడు, సుధాకరప్ప, విజయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణ
అమరావతి : విశాఖ జిల్లా మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో భూముల రికార్డులు తారుమారు(టాంపరింగ్) అయినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని డీజీపీ నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. భూ కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం నుంచి దర్యాప్తు చేపడుతుందని చెప్పారు. భూముల అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నిర్వహించిన సమావేశంలో సిట్ దర్యాప్తు, రికార్డుల టాంపరింగ్‌పై తీసుకోవాల్సిన చర్యలను వివరించారని డీజీపీ చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో డీజీపీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిట్ విచారణకు ముందే తాము ప్రాథమిక సమాచారం సేకరించామని చెప్పారు. భూముల రికార్డుల తారుమారు, అక్రమాలపై ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయన్నారు. మధురవాడ, కొమ్మాది ప్రాంతాలకు చెందిన భూములకు సంబంధించి 25 రికార్డులు తారుమారు(టాంపరింగ్) జరిగినట్టు గుర్తించమన్నారు. మధురవాడలో 178 ఎకరాలు, కొమ్మాదిలో 92 ఎకరాలు మొత్తం 270 ఎకరాలకు సంబంధించిన రికార్డులు తారుమారు చేశారని చెప్పారు. వాటిలో 265 ఎకరాలు ప్రభుత్వ భూములు కాగా, మరో 5 ఎకరాలు ప్రైవేటు భూములు అన్నారు. వన్‌బి రికార్డుల్లో టాంపరింగ్ చేసినట్టు గుర్తించిన 29 మంది జాబితాను కూడా డీజీపీ మీడియాకు విడుదల చేశారు. భూముల రికార్డులు తారుమారైనట్టు తేలిందని, అయితే ఆ భూములను ఎవరూ ఆక్రమించలేదని, రిజిస్ట్రేషన్(ఈసీ)లో కూడా ఎవరి పేర్లు లేవని గుర్తించామన్నారు. బ్యాంకు రుణాల కోసమే ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నామని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చెప్పిన భూ కుంభకోణానికి రికార్డుల టాంపరింగ్‌కు సంబంధంలేదని, ఆయన ఇచ్చే ఆధారాలను బట్టి ఆ దిశగా కూడా దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. సిట్ లోతైన విచారణలో ఇంకా అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రెండు నెలల్లో నివేదిక.. గతంలో సీబీఐ డీఐజీగా పనిచేసిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు నేతృత్వం వహిస్తారన్నారు. ఆయనతోపాటు విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన, ఆర్డీవో విజయసారధి, మరో అధికారి ఈ టీమ్‌లో సభ్యులుగా ఉంటారని డీజీపీ చెప్పారు. రెండు నెలల్లో ఈ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా దర్యాప్తు చేస్తుందన్నారు. భూముల రికార్డులను ఆన్లైన్ చేయడంలో భాగంగా ఇటీవల విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ టాంపరింగ్ జరిగిన విషయాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే భూముల రికార్టులు ఎందుకు టాంపరింగ్ చేశారు? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎప్పటి నుంచి జరిగింది? అనే వివరాలు సిట్ దర్యాప్తులో తేలనుందని చెప్పారు. సిట్ అధికారులకు సమాచారం అన్ని కోణాల్లో అందించేలా వాట్సాప్ గ్రూప్, మెయిల్ వంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజలు, మీడియా, బాధితులు ఎవరైనా తమ వద్ద ఉన్న సమాచారాన్ని సిట్‌కు అందించి దర్యాప్తునకు సహకరించాలని డీజీపీ కోరారు. భూముల వ్యవహారాన్ని వివాదం చేసి విశాఖకు ఉన్న మంచి పేరును చెడగొట్టవద్దని ఆయన సూచించారు. -
ఈ నెల 22న విశాఖలో మహాధర్నా: బొత్స
తిరుపతి: చంద్రబాబు సర్కార్ భూ దందాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరభేరి మోగించింది. ఈ నెల 22న విశాఖలో అఖిలపక్షంతో కలిసి మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. భూములు కనిపిస్తే టీడీపీ నేతలు రాంబందుల్లా వాలుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూ కబ్జాలపై తమ పోరాటం ఆగదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. విశాఖలో భూ దందాలు, కబ్జాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, స్థానిక నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన విమర్శించారు. అలాగే అన్యాయాన్ని నిలదీస్తే ప్రతిపక్షం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని విమర్శలు చేస్తున్నారని బొత్స అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని బొత్స విమర్శించారు. ఏ ఒక్క వర్గం కూడా ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేదన్నారు. చంద్రబాబువి మాటలే కానీ, చేతల్లో శూన్యమని ఎద్దేవా చేశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అలాగే పార్టీ నేత వెల్లంపల్లి నివాసంపై దాడి ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. -
నేడు జగన్ మహాధర్నా
హంద్రీ-నీవా ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్ ఉరవకొండఽలో పూర్తయిన ఏర్పాట్లు అమ్మవారిపల్లిలో భూనిర్వాసిత రైతులతో భేటీ కానున్న విపక్షనేత ఐదేళ్లుగా హంద్రీ–నీవాకు నీళ్లొస్తున్నా ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కనీసం మొదటి దశకు నీళ్లిచ్చినా 1.18 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కానీ డిస్ట్రిబ్యూటరీలపై ప్రభుత్వం నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. ఓవైపు సాగునీరు లేక పంటలు పండక రైతులు, రైతు కూలీలు కేరళ, తమిళనాడు, కర్ణాటకకు వలస వెళుతున్నారు. ఏ దారీ లేని ఇంకొందరు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. అయినా ప్రభుత్వం కనిపకరం చూపడం లేదు. పొలాలకు నీరిచ్చి రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఈ క్రమంలో విపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఉరవకొండలో ధర్నా చేయనున్నారు. ఇందుకోసం ఉరవకొంఽడ క్లాక్‌టవర్ వద్ద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో పాటు గొల్లపల్లి రిజర్వాయర్ సమీపంలో పారిశ్రామిక వాడకోసం భూములు కోల్పోతున్న రైతులతోనూ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి నిర్వహించనున్నారు. వాస్తవానికి గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొచ్చాయి, బంగారు పంటలు పండుతాయని రైతులు ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం పారిశ్రామిక వాడ పేరుతో వారి భూములను బలవంతంగా లాక్కునేందుకు సిద్ధమైంది. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ బతుకుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఎన్ని లక్షలు ఇచ్చినా భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో అమ్మవారిపల్లి రైతులతో జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. – సాక్షిప్రతినిధి, అనంతపురం -
ప్రజా హక్కులను కాలరాస్తున్నారు
- పోరాటాలతోనే హంద్రీనీవా ఆయకట్టుకు నీరు - 6న నిర్వహించే ధర్నాకు భారీగా తరలిరండి - వైఎస్సార్సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి బెళుగుప్ప : ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, హంద్రీనీవా ద్వారా ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందించే వెసులుబాటు ఉన్నా పట్టనట్లు వ్యవహరిస్తూ ప్రజా హక్కులను కాలరాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలు విమర్శించారు. గురువారం బెళుగుప్ప, బెళుగుప్ప తండాలో పర్యటించి ఈనెల 6న ఉరవకొండలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ధర్నాకు హంద్రీనీవా ఆయకట్టు రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ 2014లో కొంత మందికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వగా.. 2015, 16 సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వలేదన్నారు. అలాగే 2016లో పంటల బీమాను రైతులకు అందించలేదని ధ్వజమెత్తారు. హంద్రీనీవా ద్వారా 3.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉందన్నారు. 2014 నుండి 23 టీఎంసీల చొప్పున జీడిపల్లి రిజర్వాయర్‌కు వస్తున్నా ఎకరం ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందివ్వలేదన్నారు. ప్రజా పోరాటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే సాగునీరు సాధ్యమన్నారు. రైతన్నలకు మద్దతుగా ఈనెల 6న ఉరవకొండలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో చేపట్టిన ధర్నాకు రైతులు తరలివచ్చి వచ్చే ఖరీఫ్‌కైనా సాగునీటిని తెచ్చుకుందాం అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.5,500 కోట్లను ఖర్చు పెట్టి హంద్రీనీవా ప్రాజెక్టును నిర్మించారన్నారు. ఇదే ప్రాజెక్టు ఇప్పుడైతే రూ.30 వేల కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చేదని చెప్పారు. అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి ఎన్నో సార్లు వచ్చినా ఒక్కసారి కూడా హంద్రీనీవా మొదటిదశ ఆయకట్టుకు సాగునీరు అందిస్తానని చెప్పకపోవడం బాధాకరమన్నారు. నీటి సాధనతో పాటు సమస్యలను పరిష్కరించుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో చేస్తున్న ధర్నాకు రైతులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
6న ఉరవకొండలో మహాధర్నా
– హాజరు కానున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి – రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకే... – జిల్లా ఎస్పీని కలిసి అనుమతి కోరిన వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు - ఉరవకొండలో ధర్నా స్థలం పరిశీలన అనంతపురం సెంట్రల్ / ఉరవకొండ : జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల ఆరో తేదీన ఉరవకొండలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకర్‌నారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం వారితో పాటు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి సీపీ వీరన్న తదితరులు జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబును కలిసి ధర్నాకు అనుమతి కోరారు. ఈ సందర్భంగానూ, ఉరవకొండలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతోనూ వారు మాట్లాడారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో ప్రతిపాదిత ఆయకట్టు 3.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలో 80వేల ఎకరాలకు నీరందించాలన్నారు. ఉరవకొండ పట్టణంలో అర్హులైన పేదలకు వెంటనే ఇంటి పట్టాలు ఇచ్చి..పక్కా గృహలు నిర్మించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు సబ్సిడీ మంజూరు చేయాలన్నారు. మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ హంద్రీ-నీవాకు 1996లో చంద్రబాబు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకుండానే వదిలేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టారన్నారు. ఆయన కృషి ఫలితంగానే జిల్లాకు కృష్ణా జలాలు వస్తున్నాయన్నారు. ప్రతియేటా కృష్ణా జలాలు వస్తున్నా ఒక్క ఎకరాకు కూడా అందించకుండా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే హంద్రీ-నీవా ఆయకట్టు కింద ఉన్న మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. అలాగే కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదని మండిపడ్డారు. వెంటనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ హంద్రీ-నీవా ఆయకట్టుకు నీరు అందించకుండా చంద్రబాబు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడటానికి తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారన్నారు. ఈ ధర్నాకు ప్రజలు, రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ సభలకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని, ఉరవకొండలోనూ భారీఎత్తున ధర్నా జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లా రైతులకు హక్కుగా అందాల్సిన నీటిని సాధించడానికి వైఎస్ జగన్ ఉరవకొండలో ధర్నా తలపెట్టడం గొప్పవిషయమన్నారు. ధర్నా స్థలం పరిశీలన ఫిబ్రవరి 6న ఉరవకొండలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన మహా ధర్నాకు అనువైన స్థలాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి పరిశీలించారు. గుంతకల్లు డీఎస్పీ రవికుమార్, ఉరవకొండ సీఐ సూర్యనారాయణతో కలిసి క్లాక్‌టవర్, పాత బస్టాండ్, ఎస్కే ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానం, గవిమఠం ప్రాంగణంలోని స్థలాలను చూశారు. మహాధర్నాకు వేలాదిగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా స్థలాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు. -
ఉరవకొండలో మహాధర్నా చేపడుతాం
అనంతపురం: హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మహాధర్నా చేపడుతామని ఆ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఫిబ్రవరిలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మహాధర్నా చేయనున్నట్టు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ఆర్ పూర్తిచేసిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను పూర్తి చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్షాలను శత్రువులుగా చూస్తున్నారని వై విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
ప్రజలతో ప్రభుత్వం చెలగాటం
విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్) : స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ నగర్ అంటూనే టీడీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోందని కేంద్ర మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి పల్లంరాజు అసహనం వ్యక్తం చేశారు. సింగ్‌నగర్‌లో చెత్త డంపింగ్‌ను నిలిపివేసి, డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సింగ్‌నగర్ ఎక్సెల్ ఫ్లాంట్ వద్ద గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ పేదల ఆరోగ్యం అంటేనే ఈ ప్రభుత్వాలకు చులకన భావమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సింగ్‌నగర్ ప్రాంతంలో చెత్త డంపింగ్ చేయబోమని స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మరవడం సిగ్గుచేటన్నారు. సమస్యను పరిష్కరించకుంటే అన్ని పార్టీలను కలుపుకొని మహోద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. పీసీసీ ప్రతినిధులు రమాదేవి, నరహరశెట్టి నరసిం హారావు, మస్తాన్ వలి, కొలనుకొండ శివాజీ, కంబగండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిలదీద్దాం..రండి
కష్టాల్లో ‘అనంత’ అన్నదాతలు ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం సర్కారు తీరుకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట నేడు వైఎస్సార్సీపీ మహాధర్నా హాజరు కానున్న విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పార్టీ నేతల పిలుపు అనంతపురం ప్రతినిధి : ‘అనంత’ రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయారు. వరుస పంట నష్టాలతో తల్లడిల్లిపోతున్నారు. ఈసారీ రూ.కోట్ల పెట్టుబడులు మట్టిపాలు అయ్యాయి. కన్నీళ్లే ‘రాబడి’గా మిగిలాయి. అసలే బక్కచిక్కిపోయిన అన్నదాతలను ఆదుకోకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మానవీయ కోణంలో చూడకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వారి బతుకును ఫణంగా పెడుతున్నారు. అధికారులు కూడా సర్కారు పెద్దల మెప్పు కోసం వాస్తవాలు దాచి.. తప్పుడు లెక్కలతో రైతులను వంచిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో వర్షాభావంతో జిల్లా వ్యాప్తంగా పంటలు నష్టపోగా.. ప్రభుత్వం మాత్రం ‘రక్షకతడి’తో కాపాడామంటూ ఇన్పుట్æసబ్సిడీ ఎగ్గొట్టేందుకు సిద్ధమవుతోంది. అన్నదాతకు హక్కుగా దక్కాల్సిన బీమా కూడా అందకుండా పోతోంది. ఈ క్రమంలో రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగేందుకు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. నేటి (మంగళవారం) ఉదయం 11గంటలకు జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపడుతోంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. -
మహాధర్నాకు భారీ సంఖ్యలో రైతులు
-
మహాధర్నాకు భారీ సంఖ్యలో రైతులు
కడప : రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించకపోవడానికి నిరసగా శనివారం కడపలో నిర్వహిస్తున్న రైతు మహా ధర్నా లో వైఎస్ఆర్సీపీ అధినేత, విపక్ష నే రేపే మదర్‌కు సెయింట్‌హుడ్ త వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాయలసీమలో ఆయకట్టు భూములకు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లందించక పోవడం, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ వంటి ప్రాజెక్టులపై శీతకన్ను వేయడానికి నిరసగా వైఎస్ జగన్ తొలినుంచి పోరాటం చేస్తున్నారు. ఈ మహా ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిలా రైతులు తరలివచ్చారు. ధర్నాకు రైతు సంఘాలతో పాటు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. రైతులతో పాటు గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో కడప పట్టణం జనసంద్రంగా మారింది. -
3న మహాదర్నా
కడప కార్పొరేషన్: రాయసీమ ప్రాంత రైతాంగంపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు నిరసనగా సెప్టెంబర్ 3న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే రైతు మహాధర్నాను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా, పార్టీ అనుబంధ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండున్నర సంవత్సరాలు పూర్తయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేయలేదని, జిల్లాలో ఉక్కుఫ్యాక్టరీని నెలకొల్పలేదన్నారు. సాగునీరు, తాగునీటి విషయంలో సీమ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని జిల్లాల్లో అందోళనలు, దీక్షలు నిర్వహించినప్పటికీ వైఎస్ఆర్ జిల్లాలో ఒక్క ఆందోళన కూడా చేయలేదన్నారు. మూడేళ్ల తర్వాత నిర్వహింబబోయే ఈ ధర్నాకు భారీగా జన సమీకరణ చేయాలన్నారు. ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతూ బ్రహ్మంసాగర్‌కు, గండికోటకు 12 టీఎంసీల చొప్పున నీళ్లిస్తామని ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి గంటా మాట ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం ఆ మాటను తప్పుతోందన్నారు. సమావేశంలో పార్టీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు, నగర అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, అనుంబంధ సంఘాల అధ్యక్షులు చల్లా రాజశేఖర్, పులి సునీల్, వేణుగోపాల్ నాయక్, నాగేంద్రారెడ్డి, ఖాజా, పత్తి రాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, ఆదిత్య పాల్గొన్నారు. -
రేపు కేఎన్పీఎస్ మహాధర్నా
మాగనూర్ : కులనిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరపార్క్లో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు మొతిలాల్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ధర్నా కార్యక్రమానికి మండలంలోని కార్యకర్తలు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
ఎస్టీ యూ ధర్నాను విజయవంతం చే యాలి
నడిగూడెం : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 27 హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎస్టీయూ ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. శనివారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో ధర్నా వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎండీ.సలీం షరీఫ్, ఎస్టీయూ మండల అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎండీ.జానిపాషా, నాయకులు చందూలాల్, శ్రీనివాస్, కవిత, రమాదేవి, పాల్గొన్నారు. -
మద్యంపై ఎమ్మార్పీ.. విద్యకేదీ ఎమ్మార్పీ?
స్కూల్ ఫీజుల నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో పోరుబాట ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా తల్లిదండ్రులు, వలంటీర్లు, విద్యార్థి నేతలు భారీగా హాజరు స్కూళ్ల దోపిడీని ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ధ్వజం ఫీజు నియంత్రణ చట్టాలు, జీవోల అమలుకు డిమాండ్ లేకుంటే ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ ‘‘స్కూళ్లా.. పుస్తకాల దుకాణాలా, ఇంజనీరింగ్‌కు రూ. లక్ష.. ఎల్కేజీకి రూ. 3 లక్షలా? సేవ ముసుగులో విద్యా వ్యాపారమా?’’ ‘‘యాజమాన్యాలకు బెంజ్ కార్లు.. తల్లిదండ్రులకు గంజి నీళ్లా?’’ ‘‘మేనిఫెస్టోలో పెట్టారు.. అమలు చేయడం మరిచారు.. మద్యంపై ఎమ్మార్పీ.. విద్యకేది ఎమ్మార్పీ?’’ - ప్రైవేటు స్కూళ్ల ఫీ‘జులుం’పై కడుపు మండిన తల్లిదండ్రులు సూటిగా సంధించిన ప్రశ్నలివీ.. సాక్షి, హైదరాబాద్: ఏటేటా పెరిగిపోతున్న ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందాపై తల్లిదండ్రులు దండెత్తారు. స్కూళ్ల ధనదాహానికి నిరసనగా రాజధాని హైదరాబాద్‌లో కదంతొక్కారు. స్కూల్ ఫీజుల నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. తల్లిదండ్రులతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వలంటీర్లు, విద్యార్థి సంఘాల నేత లు అధిక సంఖ్యలో హాజరై ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండటాన్ని ప్రశ్నించారు. ఇదేం దోపిడీ అంటూ నినాదాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టెక్సాస్ ఫీజులా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాల్సిన ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల నియంత్రణ కోసం వచ్చిన చట్టాలు, జీవోలు అమలయ్యే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే కొంతవరకు ప్రైవేటు దోపిడీని అరికట్టవ చ్చని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ చైర్పర్సన్ అరవింద జాటా, ప్రధాన కార్యదర్శి నాగటి నారాయణ, హెచ్ఎస్పీఏ విక్రాంత్, ఆశిష్, సుబ్రమణ్యం, రవికుమార్, డాక్టర్ వినయ్‌కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. స్టిక్కర్ ఆవిష్కరణ.. ‘సీఎం సార్.. దయచేసి స్కూల్ ఫీజుల దోపిడీని అరికట్టండి’ అనే స్టిక్కర్‌ను హెచ్ఎస్పీఏ ప్రతినిధులు ఆవిష్కరించారు. వాహనాలకు వాటిని అంటిస్తూ ఫీజు దోపిడీని వివరించారు. మరో విప్లవానికి దారితీస్తుంది.. స్కూలు ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు రోడ్డెక్కడం విద్యావ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని చెప్పడానికి నిదర్శనమని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య వ్యాఖ్యానించారు. ‘మహాధర్నా’ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఫీజు ఉద్యమం మరో విప్లవానికి దారి తీస్తుందని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని తల్లిదండ్రులు పోరాడుతున్నా చేతగాని దద్దమ్మలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. ‘దొంగలందరూ కలసి తల్లిదండ్రుల బలహీనతలను వాడుకుంటూ ఇష్టారాజ్యంగా ఫీజు వసూలు చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వమూ వత్తాసు పలుకుతోంది. ఫీజు దోపిడీ సాగించే స్కూళ్లన్నీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలవే. ఇందులో సీఎంకూ భాగస్వామ్యం ఉంది’ అని ఆరోపించారు. ఓ తల్లి ఆవేదన... ‘‘నేను ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిని. జీతం నెలకు రూ. 25 వేలు. రెండేళ్ల కిందట ఓ పెద్ద స్కూల్లో మూడో తరగతి చదువుతున్న నా కుమారుడికి రూ. 60 వేల ఫీజు కట్టా. నాలుగో తరగతికి వచ్చే సరికి మరో రూ. 15 వేలు పెంచారు. ఇదేమని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే అంతేనంటూ సమాధానమిచ్చారు. ఈ ఏడాది మరో రూ. 10 వేలు పెంచారు. ఇవన్నీ చెల్లించాలంటే ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి’’ - శారద, (ప్రైవేటు ఉద్యోగిని) వైఎస్ తెచ్చిన జీవో అమలు చేయాలిwhere is restriction on private schools fees 2009లో అప్పటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి తెచ్చిన జీఓ నం 91ను అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ జీవోను పాలకులు విస్మరించడం మూలంగానే ప్రైవేటు స్కూళ్లు యథేచ్ఛగా ఫీజు దోపిడీని సాగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఫీజులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఐటీ సెల్ అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణలో విద్యాసంస్థలు ఫీజుల దోపిడీ సాగిస్తూ తల్లిదండ్రుల ఇళ్లల్లో మట్టికొడుతున్నాయని ప్రొఫెసర్ కంచ ఐలయ్య దుయ్యబట్టారు. బడుల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని, విద్యను వ్యాపారం చేయడానికి వీల్లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం విమర్శించారు. -
12న సంగారెడ్డిలో మహాధర్నా: తమ్మినేని
హత్నూర (మెదక్) : మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయనందుకు నిరసనగా ఈ నెల 12న జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మహాధర్నా చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. గురువారం మెతుకు సీమ కరువు యాత్రలో భాగంగా హత్నూర మండలంలో ఎండిపోయిన వరిపంటను పరిశీలించి, ఉపాధి కూలీలతో సమస్యలను సీపీఎం నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో లక్షా 30వేల బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంత ప్రజలను ఆదుకోవడం లేదన్నారు. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు కోట్లాది రూపాయల బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు కాకుండా పాలకులు ప్రజల కష్టాలు పట్టించుకోవాలని హితవు పలికారు. -
ఎన్నికల హామీలను అమలు చేయాలి: సీపీఐ
పేదలకు ఇళ్లు నిర్మించాలని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. గత పాలకుల మాదిరిగా ఎన్నికల ముందు పేదలు, గుడిసెవాసులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. గుడిసెవాసులకు పట్టాలివ్వాలని, నిరుపేదలకు రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. గోదావరి జలాల్లో పవిత్రస్నానాన్ని ఆచరిం చిన సీఎం కేసీఆర్ అదే పవిత్రహృదయంతో గుడిసెవాసులకు ఇళ్లస్థలాల పట్టాలిచ్చి డబుల్బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకిచ్చిన ఎన్నికల హామీలన్నిం టినీ అమలు చేయాలని, లేదంటే కేసీఆర్ కళ్లు తెరిపించాల్సి వస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరిం చారు. తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పిన కేసీఆర్ సీఎం అయ్యాక ఈ 14 నెలల్లో ఒక్కదానిని కూడా తీర్చలేదని, రోజుకో వాగ్దానం చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. పేదలు, గుడిసెవాసులు ఎవరూ కూడా బంగారు తెలంగాణ కావాలని కోరుకోవడం లేదని, పేదలకు కావాల్సింది ఇళ్లస్థలాలు, పక్కాఇళ్లు, రెండుపడకగదుల ఇళ్లేనన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా హామీలను అమలు చేయాలని, లేనియెడల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న సీఎం ముం దుగా పాత నగరంలోని 1,100 మురికివాడల ప్రజల కనీస సౌకర్యాల గురించి ఆలోచించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్ పాషా సూచించారు. హైదరాబాద్‌లోని పేదలకు లక్ష పట్టాలు పంపిణీ చేశామని సీఎం అబద్ధం చెబుతున్నారని, వాస్తవానికి 60 వేల దరఖాస్తులకుగాను ఇంకా 50 వేలు పెండింగ్‌లో ఉన్నాయని సౌత్‌జోన్ కార్యదర్శి ఈటి నర్సింహ అన్నారు. గుడిసెవాసుల సమస్యలు తెలుసుకోడానికి పదిరోజులు పాదయాత్ర చేసి మహాధర్నా నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వీఎస్‌బోస్, ఎస్.ఛాయాదేవి, ప్రేంపావని పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలేమయ్యాయి?
కేంద్రంపై ‘జనతా పరివార్’ నేతల ధ్వజం ఢిల్లీలో మహాధర్నా చేతులు కలిపిన ములాయం, లాలు, నితీశ్, శరద్‌యాదవ్ సాక్షి, న్యూఢిల్లీ: పాత మిత్రులు ఏకమయ్యారు.. విభేదాలను పక్కనపెట్టి ఒకే వేదికపై కొలువుదీరారు.. గతంలో ‘జనతా పరివార్’లో కీలక భూమిక పోషించిన ఆరు పార్టీలు సోమవారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించాయి. ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఆ పార్టీ ముఖ్యనేత నితీశ్ కుమార్, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ, ఐఎన్ఎల్డీ నాయకుడు దుష్యంత్ చౌతాలా, ఎన్సీపీ నేతలు తారిక్ అన్వర్, డీపీ త్రిపాఠిలతోపాటు సమాజ్‌వాదీ జనతాపార్టీ(ఎస్జేపీ) నాయకుడు కమల్ మొరార్కా తదితరులు పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన మద్దతును తెలుపుతూ పార్టీ నేత డెరిక్ ఓబ్రీన్ ద్వారా ఒక లేఖను పంపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో గుప్పించిన హామీలను విస్మరించి విభజన రాజకీయాలకు పాల్పడతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. సర్కారును దీటుగా ఎదుర్కోవాలంటే ఒక్కతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్ని పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. కేంద్రంపై విమర్శల జడి: విభేదాలను పక్కనపెట్టి బలమైన ప్రతిపక్షంగా ఏర్పడేందుకు ఇతర పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉందని జేడీయూ నేత నితీశ్ కుమార్ అన్నారు. ‘‘మనమంతా ఒకే పార్టీగా ఏర్పడాలి. ఇందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ములాయంసింగ్ విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. ఇతర పార్టీలనూ కలుపుకొని పోదాం.’’ అని అన్నారు. లాలు ప్రసాద్ మాట్లాడుతూ..‘‘నల్లధనాన్ని వెనక్కి తెస్తే ఒక్కో పేదవాడికి రూ.15 లక్షలు ఇవ్వొచ్చని వీరు చెప్పారు. ఆ హామీ ఎటు పోయిందో అడగండి.’’ అంటూ మండిపడ్డారు. శరద్ యాదవ్ మత మార్పిళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతి ఒక్కరూ ఒకే మతాన్ని ఆచరించాలని అనుకుంటే దానిపైనే మళ్లీ ఎన్నికలకు రావాలంటూ మోదీకి సవాలు విసిరారు. గతంలో రెండుసార్లు ఆరు పార్టీల నేతలు సమావేశమై కొత్త కూటమికి పెట్టాల్సిన పేరు, జెండాపై చర్చించారు. ‘సమాజ్‌వాది జనతాదళ్’గా నామకరణం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
చంద్రబాబు మారలేదు
నెల్లూరు (అర్బన్): సీఎం చంద్రబాబు ఏం మారలేదని, ఆయన పాత బాబేనని వైఎస్సార్సీపీ మహాధర్నా జిల్లా సమన్వయకర్త, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత తొమ్మిదేళ్ల రాక్షస పాలనను ఈ ఆరు నెలల్లోనే మళ్లీ గుర్తుకు తెచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ ప్రారంభించిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞనంగా అభివర్ణించిన బాబు ఇప్పుడు హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల ప్రగతిని పట్టించుకోలేదన్నారు. రూ. 50 వేల లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ చేయాలన్నా.. రూ. 30 వేల కోట్లు అవసరమని, అయితే బాబు రూ.5 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. దీన్నీ ఒక వర్గం మీడియా ఎంతో గొప్పగా చూపడం ఆశ్చర్యంగా ఉందన్నా రు. ఈ ఆరు నెలల్లో 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని అడిగిన మీడియాపై చూపిస్తావా అంటూ దబాయించడం బాబుకే చెల్లిందన్నారు. వైఎస్సార్ విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తే అందులో ఎక్కువగా లబ్ధి పొందింది టీడీపీ కార్యకర్తలేనని, పార్టీలకతీతంగా వైఎస్సార్ ప్రజలందరికీ మేలు చేశారన్నారు. బాబు ఆరు నెలల పాలన ప్రజలకు ఏవగింపుగా మారిందన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు : ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు నిలబెట్టుకోకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉంటే రాజధాని కడతాడు, అనుభవం ఉందని అని కొంత మంది భావించారన్నారు. ఆరు నెలల బాబు పాలన చూసి ప్రజలకు మోసపోయామన్న భావన కలుగుతోందన్నారు. రుణమాఫీపై వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రకటన చేయాల్సిందిగా పార్టీ నేతలు కోరితే అబద్ధపు హామీలు ఇవ్వలేమని చెప్పారన్నారు. ఆర్థిక వేత్తలతో మాట్లాడిన తర్వాతే ఆయన ఆ మాట చెప్పారని, డ్వాక్రా రుణాలు రద్దు చేయొచ్చు అంటే ఆ హామీని ఇచ్చారన్నారు. తాను పార్లమెంట్లో ఎన్నికల సంస్కరణలపై ప్రశ్న వేశానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాలు నిలబెట్టుకోవడం లేదని, తప్పించుకునేందుకు రకరకాల కారణాలు చెబుతున్నారని, దీన్ని ఎలా నియంత్రిస్తారు అని లేవనెత్తితే కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ దీనిపై చర్చిస్తున్నట్లు చెప్పారన్నారు. చిన్న పిల్లలకు బయోస్కోప్‌లో చూపినట్లు ప్రజలకు రాజధానిని చూపిస్తున్నారన్నారు. మంచి రాజధానిని నిర్మిస్తే సంతోషమేనని, అదే సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన బాధ్యత బాబుపై ఉందన్నారు. బాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని, కర్నూలు, ప్రకాశం జెడ్పీ చైర్మన్ కుర్చీల కోసం ఏం చేశారో, నెల్లూరు జెడ్పీ చైర్మన్ కుర్చీ కోసం ఎంతగా దిగజారారో ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీ కార్యకర్తల కోసమే ప్రభుత్వం ఉంది : తిరుపతి ఎంపీ వరప్రసాదరావు ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి చూస్తోంటే టీడీపీ కార్యకర్తల కోసమే చంద్రబాబు ప్రభుత్వం అన్నట్లుగా ఉందని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు అన్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన బాబు రాష్ట్ర బడ్జెట్ రూ.60 వేల కోట్లు మాత్రమే అని తెలిసినా లక్ష కోట్ల రుణాలను మాఫీ చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలను మోసం చేయకూడదని జగన్మోహన్రెడ్డి మాటపై నిలబడ్డారు.. కాబట్టే బాబు సీఎం అయ్యారన్నారు. సింగపూర్ ఎంతో చిన్న నగరమని, అక్కడికి వెళ్లి అలా మన రాష్ట్రాన్ని తయారు చేస్తామని చెప్పేందుకు సిగ్గుపడాలన్నారు. సమస్యల్ని పట్టించుకోకుండా రాజధానిని కడతానని చెప్పడం సమంజసం కాదన్నారు. కనీసం వృద్ధాప్య పింఛన్లు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, వాళ్ల పార్టీ నేతలు చెప్పిన వాళ్లకే పింఛన్లు ఇస్తున్నారని విమర్శించారు. మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు : నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికలకు ముందు మీఇంటి బిడ్డగా రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన బాబు ఎన్నికలయ్యాక మాట మార్చి మోసగాళ్లకు మోసగాడుగా మారాడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. జగన్మోహన్రెడ్డి ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బాబుకు నిద్ర పట్టలేదని, అందుకే రుణమాఫీపై విధాన ప్రకటన చేసేందుకు నిర్వహిం చిన ప్రెస్మీట్లో ఏదేదో మాట్లాడారన్నారు. ప్రజల సొమ్ముతో ఆయన కోటరీలోని రియల్టర్లను, వ్యాపారవేత్తలను సింగపూర్, జపాన్ తీసుకెళ్తూ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఆయన పదేపదే విదేశాలకు వెళ్లడం చూస్తోంటే హెల్త్ చెకప్ కోసం వెళుతున్నట్లు అనిపిస్తోందన్నారు. పసిబిడ్డల వద్ద డొనేషన్లు వసూలు చేసిన వాళ్లు మేధావులంటూ మంత్రి పదవులు ఇచ్చారని, పనికిమాలిన వాళ్లంతా మేధావులు కారన్నారు. మొదటి సంతకానికి విలువ లేకుండా చేశారు: జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైఎస్సార్ మొదటి సంతకానికి ఎంతో విలువ ఇస్తే చంద్రబాబు మాత్రం విలువ లేకుండా చేశారని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. జిల్లాలో రుణమాఫీ కోసం 2013 డిసెంబర్ నాటికి రూ.4 వేల కోట్లు అవసరమని, 10 శాతం వడ్డీ వేసుకుంటే మరో రూ.500 కోట్లు కావాలన్నారు. వడ్డీ గురించి బాబు ఏం చెప్పలేదని, రూ.50 వేలపైన రుణం తీసుకున్న వారికి 20 శాతం కడతామని చెబుతున్నారన్నారు. బ్యాంకులు మాత్రం లోన్ కట్టకపోతే కొత్త రుణాలు ఇవ్వలేమని చెబుతున్నాయని, దీనిపై స్పష్టత లేదన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పారని అయితే ఆ పథకాన్ని గాలికొదిలేశారన్నారు. పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టి ఇలా చేయడం సిగ్గు చేటన్నారు. జిల్లాలో 2, 3 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్నారు. జిల్లాలో లక్షన్నర రేషన్ కార్డులను తొలగించారన్నారు. -
మరోసారి ఉద్యమబాటకు వైఎస్ఆర్ సీపీ శ్రీకారం
విశాఖ : ప్రజలకిచ్చిన వాగ్ధానాలు, ఇచ్చిన హమీలను గాలికొదిలేసిన పాలకపక్షంపై ప్రతిపక్షం పోరుబాటకు సిద్దమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, నిరసనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. విశాఖ కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. వైఎస్ఆర్సీపీ పిలుపుకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజాపక్షంగా పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి ఉద్యమబాటకు శ్రీకారం చుట్టింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఆరునెలలవుతున్నా ప్రజలకిచ్చిన ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకపోవడంపై ప్రతిపక్షం మండిపడుతోంది. తెలుగుదేశం నేతలు రోజుకో కట్టుకధ, పూటకో పిట్టకధ చెబుతూ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు దగాలు...జనం దిగాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు డిసెంబర్ 5న జరిగే మహధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఆన్ని జిల్లాల్లో ఇప్పటికే విడుదల చేశారు. మాట తప్పిన ప్రభుత్వం చేస్తున్న వంచనలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ ధర్నాలు, నిరసనల కార్యక్రమం కొనసాగుతోందని వైఎస్ జగన్ చెప్పిన విషయం తెలిసిందే. మొదటి ఐదు సంతకాలతో స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానంటూ ప్రజల సాక్షిగా చేసిన ప్రమాణాలు ఇప్పుడేమయ్యాయని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు, పింఛన్లు కోల్పోయిన లబ్ధిదారులు ఇలా ఒకటేమిటి అన్ని వర్గాల ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజాగ్రహం ఏ స్ధాయిలో చాటి చెప్పింది. అయితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా రాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలకు సిద్దమయ్యారు. -
మహాధర్నాకు సిద్ధమవుతున్న విశాఖ
విశాఖ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహభేరి మోగించేందుకు విశాఖ సిద్ధమవుతోంది. ఎన్నికల హామీలను గాలికొదిలేసిన ప్రభుత్వ పెద్దలపై ప్రజా పోరాటానికి వైఎస్ఆర్ సీపీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ మహాధర్నాకు ప్రజానీకం సమాయత్తమవుతున్నారు. ప్రతి చోటా పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. పోస్టరులు ప్రత్యక్షమవుతున్నాయి. పార్టీ శ్రేణులన్నీ కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. విశాఖలోని మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. -
టీడీపీ నేతలు వణికిపోతున్నారు...
అనంతపురం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భయపడే చంద్రబాబు నాయుడు హడావుడిగా రుణమాఫీపై ప్రకటన చేశారని వైఎస్ఆర్ సీపీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు సలాం బాషా అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ చేపట్టనున్న మహాధర్నాలతో టీడీపీ నేతలు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఇంటికో ఉద్యోగం...నిరుద్యోగుల విషయంలో తీసుకునే అంశాలపై స్పష్టత ఇవ్వాలని సలాం బాష డిమాండ్ చేశారు. -
5న విశాఖలో వైఎస్ జగన్ మహాధర్నా
ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డిసెంబర్ 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విశాఖపట్నంలో ఆయన ఆవిష్కరించారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు, అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విద్యార్థి, మైనార్టీ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
5న వైఎస్సార్ సీపీ మహాధర్నా
బాపట్ల: వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించి మోసం చేయడాన్ని నిరసిస్తూ వచ్చే నెల 5వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద చేపడుతున్న మహాధర్నాకు వేలాదిగా ప్రజలు తరలిరావాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. బాపట్లలోని కోన ఛాంబర్లో సోమ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు ఎమ్మెల్యే కోన రఘుపతి, పార్టీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తొలుత మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థులు రుణమాఫీ అంటూ ఇంటింటి ప్రచారం చేసి గెలుపొందారన్నారు. రుణమాఫీపై తొలి సంతకం చేసిన చంద్రబాబు ఆతరువాత మాటమార్చి వ్యవసా య రుణాలు కాదు, పంట రుణాలు అని చెప్పడం రైతులను మోసం చేయడమేనన్నారు. కొంతమంది మంత్రులు రుణమాఫీ చేసినట్లే మాట్లాడుతున్నారని ఆయన తప్పు పట్టారు. రైతులు అప్పుల్లో మునిగివున్న విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బుద్ధి చెప్పేవిధంగా వేలాదిగా రైతులు,మహిళలు తరలివచ్చి మహాధర్నాలో పాల్గొనాలని ఆయన కోరారు. రాజధానిపై కూడా స్పష్టత లేదు రాజధాని నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రికి స్పష్టతలేదని మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. గుంటూరులో రాజధాని నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని అయితే రైతులు, రైతుకూలీలు, అనుబంధ వృత్తిదారులు జీవనభృతి కొల్పోవడంపై అన్నిపార్టీలు ప్రశ్నిస్తుంటే, చంద్రబాబు మాత్రం వీరంతా రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నారనే నెపం మోపే పనిలో ఉన్నారని అన్నారు. రాజధానికి వ్యతిరేకం కాదని, రైతుల భూములకు న్యాయం చేయాలని ఆయన మరో సారి స్పష్టం చేశారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది.. మేరుగ జిల్లాలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. మహానేత డాక్టరు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టైరు బళ్లు, ఎడ్లబళ్లతో ఇసుక తోలుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుత టీడీపీ 97, 310 నంబర్ల పేరిట జీవోలు విడుదల చేసి ఆ పార్టీ నాయకులకు మాత్రమే వెలుసుబాటు కల్పించిందని మండిపడ్డారు. మహా ధర్నా విజయవంతానికి కృషి - ఎమ్మెల్యే కోన వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవటంపై ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ చేపడుతున్న మహాధర్నాకు బాపట్ల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్నట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు దగ్గుమల్లి ధర్మారావు, దొంతిరెడ్డి సీతారామిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు భోగిరెడ్డి రమేష్‌రెడ్డి, మరుప్రోలు తిరుపతిరెడ్డి ఉన్నారు. -
మహాధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్
-
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు..
మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహాధర్నా హిందూపురం అర్బన్ : అభ్యదయవాదినని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి చంద్రాబాబునాయుడు తన బావమరిది బాలకృష్ణ ప్రాతి నిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీ పీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మండిపడ్డారు. ప్రజాసమస్యల పరిష్కారంలో వివక్ష చూపుతూ, ప్రోటోకాల్ ను విస్మరించిన అధికార పార్టీ తీరుపై వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశా రు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నాయకత్వంలో వైఎస్సాఆర్సీపీ కౌన్సిలర్లు, ఆయా వార్డుప్రజలతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చి మున్సిప ల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. శంకర్‌నారాయణ మాట్లాడుతూ పురం నియోజకవర్గంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం అరాచకపాలన సాగిస్తోందన్నారు. సంక్షే మ పథకాలన్నీ పచ్చ చొక్కాల పరమవుతున్నాయన్నారు. చౌకదుకాణాలు, మ ధ్యాహ్న భోజన ఏజెన్సీలు, రేషన్‌కార్డు లు, పింఛన్లు, తదితర సంక్షేమ పథకాలు తెలుగుతమ్ముళ్లకు పంపిణీ చేస్తున్నారన్నా రు. అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా కాకుండా ప్రజ ల పక్షాన నిలవాలన్నారు. నిష్పక్షపాతం గా ఉన్న అధికారులకు వైఎస్సాఆర్సీపీ అండగా నిలుస్తుందన్నారు. సమన్వయక ర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ ప్రజా తీ ర్పుపై తమకు ఎంతో గౌరవముందన్నా రు. మున్సిపల్ చైర్పర్సన్ రెవెళ్ల లక్ష్మి ఆదర్శవంతంగా ఉన్నా, ఆమె భర్త నాగరాజు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించకుండా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఆయ న అవమానపరచడం ఏమిటని నవీన్‌నిశ్చల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. దు కాణంలో పనిచేస్తూ అశ్లీల చిత్రాల క్యాసె ట్లు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ డం, కోర్టు రిమాండ్ విధించడం ఆయన మరచిపోయినా ప్రజలు మరచిపోలేదన్నారు. గత చరిత్రను మరచి పోయి అధికారం ఉందని కక్ష్యలు, వర్గ,రాజకీయ వి బేధాలకు ఆయన అజ్యంపోస్తున్నారన్నా రు. వీటిని అడ్డుకోడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నామన్నారు. అయినా ప్రవర్తన మార్చుకోకపో తే ప్రజాందోళనలు ఉధృతం చేసి కార్యాలయాలను, ఇళ్లను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సాఆర్సీపీ కౌన్సిల ర్లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హస్తిన బాట
ఏలూరు, న్యూస్‌లైన్:ఢిల్లీలో సమైక్య నినాదాన్ని హోరెత్తించేందుకు జిల్లాకు చెందిన ఎన్జీవోలు, వైసీపీ నాయకులు, కార్యక ర్తలు శనివారం సాయంత్రం ఇక్కడి నుంచి ప్రత్యేక రైళ్లలో బయలుదేరారు. ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే మహాధర్నాలో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి సుమారు 1,500 మంది ఎన్జీవోలు తరలివెళ్లారు. ఏలూరు పెద్దరైల్వే స్టేషన్ నుంచి సుమారు 800 మంది ‘సమైక్యాంధ్ర ఎన్జీవో ప్రత్యేక రైలు’ ఎక్కారు. ఈ రైలుకు ఎన్జీవో అసోసియేషన్ జిల్లా శాఖ కార్యదర్శి టి.యోగానందం, నాయకులు హరనాథ్, చోడగిరి శ్రీనివాస్ జెండా ఊపి ైరె లును పంపారు. ప్రత్యేక రైలు సౌకర్యంలేని ప్రాంతాల నుంచి, ఆకివీడు, దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల నుంచి ఎన్జీవోలు పెద్ద స్టేషన్‌కు తరలివచ్చారు. ఇదిలావుండగా నరసాపురం ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి 50 మంది ఎన్జీవోలు ఢిల్లీకి పయనమయ్యారు. పాలకొల్లు నుంచి 50 మంది, తణుకు నుంచి 80 మంది, తాడేపల్లిగూడెం నుంచి 70 మంది బయల్దేరి వెళ్లారు. భీమవరం, నిడదవోలు, ఉండి ప్రాంతాల నుంచి కూడా ఎన్జీవోలు హస్తినబాట పట్టారు. చింతలపూడి, పోలవరం ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ఎన్జీవోలు ఢిల్లీ వెళ్లారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ జిల్లాలో చేపట్టిన ఉద్యమం శనివారం 200వ రోజుకు చేరుకుంది. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జూలై 30న చేపట్టిన నిరసన దీక్షలు 200 రోజుకు చేరారుు. దీక్ష 200 రోజుకు చేరిన సందర్భంగా గాంధీబొమ్మల సెంటర్లో జేఏసీ అధ్యక్షుడు కె.సత్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వెల్లువలా వెళ్లిన వైసీపీ కార్యకర్తలు ఏలూరు (ఆర్ఆర్ పేట) : దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు నగరం నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. శనివారం సాయంత్రం 6.30 గంటలకు రాజమండ్రి నుంచి వచ్చిన ప్రత్యేక రైలులో కార్యకర్తలు ఉత్సాహంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు వెళ్లారు. పార్టీ నాయకుడు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పర్యవేక్షణలో నాయకులు పాము శామ్యూల్, కోలపల్లి ఉమాశంకర్, కర్రి శ్రీనులతో పాటు సుమారు 60 మంది కార్యకర్తలు ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. వీరికి పార్టీ నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు, మున్నుల జాన్ గురునాథ్ తదితరులు వీడ్కోలు పలికారు. ఆహార, పానీయాలు అందించిన తోట ఢిల్లీ వెళుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆహార పానీయాలను ఏలూరు రైల్వే స్టేషన్లో అందజేశారు. విభజన బిల్లును పార్లమెంటులో కూడా అన్ని పార్టీలూ తిరస్కరించాలని కోరుతూ వైసీపీ తలపెట్టిన ఈ ఆందోళనలో పాల్గొనడానికి వెళుతున్న కార్యకర్తలను తోట చంద్రశేఖర్ అభినందించారు. దెందులూరు సమన్వయకర్త సీహెచ్ అశోక్‌గౌడ్, కైకలూరు సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షులు జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లగడపాటిని స్టేజ్ మీదనుంచి లాగేసిన తెలంగాణవాదులు
హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఏపీ ఎన్జీవోలు నిర్వహిస్తున్న మహాధర్నా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతుండగా, కొందరు తెలంగాణ వాదులు ప్రవేశించి ఆయనను స్టేజి మీద నుంచి కిందకు లాగేశారు. దీంతో అక్కడే భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. తెలంగాణ యువశక్తి సంస్థకు చెందిన ముగ్గురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. అంతకుముందు మహాధర్నా సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ధర్నా ప్రాంతమైన ఇందిరాపార్కు చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీఎస్పీకి చెందిన 20 దళాలు, సీఆర్పీఎఫ్ కంపెనీ ఒకటి, ఆర్ఏఎఫ్ కంపెనీ ఒకటి, స్వాట్ దళాలు 6, 50 మంది ఎస్ఐలు, 15 మంది సీఐలు, 10 మంది డీఎస్పీలు, 100 మంది మహిళా పోలీసులను అక్కడ మోహరించారు. -
ఏపీఎన్జీవోల ధర్నా.. భారీ భద్రతా ఏర్పాట్లు
ఏపీఎన్జీవోలు తలపెట్టిన మహాధర్నా సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ధర్నా ప్రాంతమైన ఇందిరాపార్కు చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీఎస్పీకి చెందిన 20 దళాలు, సీఆర్పీఎఫ్ కంపెనీ ఒకటి, ఆర్ఏఎఫ్ కంపెనీ ఒకటి, స్వాట్ దళాలు 6, 50 మంది ఎస్ఐలు, 15 మంది సీఐలు, 10 మంది డీఎస్పీలు, 100 మంది మహిళా పోలీసులను అక్కడ మోహరించారు. ఇందిరాపార్కు, వార్త ఆఫీసుల, ఎల్ఐసీ కార్యాలయం, కట్ట మైసమ్మ దేవాలయం-అశోక్‌నగర్, అశోక్‌నగర్ రిలయన్స్- న్యూ బ్రిడ్జి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. -
చంద్రబాబు మహాధర్నాకురైతుల కొరత
=రెండుగంటలు ఆలస్యంగా ప్రారంభం =రెండోసారి ప్రసంగం సమయానికే ఖాళీ అయిన కుర్చీలు =విజయమ్మ సభపై బాబు ఆరా సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో చేపట్టిన మహాధర్నాకు రైతులే కరువయ్యారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ప్రకాశం బ్యారేజీ వద్ద నది ఇసుక తిన్నెల్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం పేలవంగా సాగింది. సభలో రైతుల కంటే కిరాయి కార్యకర్తలే ఎక్కువగా కనిపించారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటించినా 12 గంటల వరకు సభాస్థలి వెలవెలపోయింది. 12 గంటలకు చంద్రబాబు వచ్చే ముందు కార్యకర్తలు నెమ్మదిగా చేరుకున్నారు. రెండు గంటలకు సభాస్థలిలోనే ఏర్పాటుచేసిన భోజనాలు పూర్తిచేసి నెమ్మదిగా సర్దుకున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ప్రసంగించారు. రెండోసారి ప్రసంగించే సమయానికి కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమివ్వడం విశేషం. ఒకవైపు తమ సభలో రైతులు కానరాకపోవడంతో చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులిచింతలలో నిర్వహించిన సభ గురించి నేతలను వాకబు చేశారు. అక్కడ సభ కూడా విఫలమైందంటూ వర్ల రామయ్య ప్రకటించి కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. రూటు మార్చిన చంద్రబాబు... చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి బందరు రోడ్డులోని ఒక హోటల్‌కు వచ్చి అక్కడనుంచి సభాస్థలికి రావాల్సి ఉండగా, అర్థంతరంగా రూటు మార్చి నేరుగా సీతానగరంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ గుడిలో పూజ, వేద పండితులతో ఆశీర్వచనం తీసుకుని, అక్కడే అల్పాహారం పూర్తిచేశారు. ఆశ్రమంలోనే సుమారు గంటన్నర పైగా గడపడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సభాస్థలి వద్ద జనం లేకపోవడం వల్లే చంద్రబాబు ఎక్కువసేపు ఆశ్రమంలో గడిపారని కొంతమంది నేతలు చెబుతున్నారు. ఏర్పాట్లపై కార్యకర్తల ఆగ్రహం ఇసుక తిన్నెలపై నేతలు చేసిన ఏర్పాట్లపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తిన్నెల్లోకి దిగేందుకు ఉన్న ర్యాంప్, అప్రాన్లను పోలీసులు మూసివేసి వీఐపీలను మాత్రమే అనుమతించారు. మిగిలినవారిని మెట్లమార్గంలో వెళ్లాలని ఆదేశించారు. ఆ మార్గం అంతా అశుద్ధాలతో నిండిపోవడం, తీవ్ర దుర్గంధం వెలువడుతుండటంతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో చంద్రబాబు తొలిసారి ప్రసంగం కాగానే వెళ్లిపోయారు. చంద్రబాబు బస్సు ఇసుకతిన్నెల్లో కూరుకుపోగా పొక్లెయిన్‌తో తీయించాల్సి వచ్చింది. దీన్నిబట్టే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అధినేత ప్రసన్నానికి నేతల పోటీ పశ్చిమ కృష్ణా : తెలుగుదేశం పార్టీ మహాధర్నా ఆద్యంతం ఆత్మస్తుతి.. పరనింద చందంగా సాగింది. అధినేత చంద్రబాబు దగ్గర్నుంచి పార్టీ నాయకుల వరకు పోటీపడి మరీ అవాస్తవాల బాకా ఊదారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ తన హయాంలోనే వచ్చాయని చంద్రబాబు చెప్పుకొన్నారు. చివరికి పులిచింతల కల సాకారం కావడం తన గొప్పేనని చెప్పడంతో సభికులు ముక్కున వేలేసుకున్నారు. ఇక బాబును ప్రసన్నం చేసుకునేందుకు నేతలు నానా తంటాలు పడ్డారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య స్థాయిమరిచి మాట్లాడారని ఆ పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవు.. ఓట్లు, సీట్లు అక్కర్లేదంటూనే రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి బాబును మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని నేతలు విజ్ఞప్తి చేయడం కొసమెరుపు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, ఎంపీ కొనకళ్ల నారాయణ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని నాని, అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, మాజీ చీఫ్‌విప్ కాగిత వెంకట్రావ్, కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాగంటి బాబు పాల్గొన్నారు.