అనంతపురం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భయపడే చంద్రబాబు నాయుడు హడావుడిగా రుణమాఫీపై ప్రకటన చేశారని వైఎస్ఆర్ సీపీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు సలాం బాషా అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ చేపట్టనున్న మహాధర్నాలతో టీడీపీ నేతలు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఇంటికో ఉద్యోగం...నిరుద్యోగుల విషయంలో తీసుకునే అంశాలపై స్పష్టత ఇవ్వాలని సలాం బాష డిమాండ్ చేశారు.