ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహభేరి మోగించేందుకు విశాఖ సిద్ధమవుతోంది. ఎన్నికల హామీలను గాలికొదిలేసిన ప్రభుత్వ ...
విశాఖ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహభేరి మోగించేందుకు విశాఖ సిద్ధమవుతోంది. ఎన్నికల హామీలను గాలికొదిలేసిన ప్రభుత్వ పెద్దలపై ప్రజా పోరాటానికి వైఎస్ఆర్ సీపీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ మహాధర్నాకు ప్రజానీకం సమాయత్తమవుతున్నారు.
ప్రతి చోటా పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. పోస్టరులు ప్రత్యక్షమవుతున్నాయి. పార్టీ శ్రేణులన్నీ కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. విశాఖలోని మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.