అనంతపురం: హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మహాధర్నా చేపడుతామని ఆ పార్టీ ఎమ్మెల్యే వై విశ‍్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఫిబ్రవరిలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మహాధర్నా చేయనున్నట్టు తెలిపారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ఆర్ పూర్తిచేసిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను పూర్తి చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్షాలను శత్రువులుగా చూస్తున్నారని వై విశ‍్వేశ్వర్ రెడ్డి అన్నారు.
ఉరవకొండలో మహాధర్నా చేపడుతాం
Published Sat, Jan 21 2017 2:12 PM | Last Updated on Tue, Oct 30 2018 5:12 PM
Advertisement
Advertisement