అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ప్రజాశాంతి పార్టీతో కలిసి కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డిని ఎలాగైనా దెబ్బతీసి తాను లబ్ధి పొందేందుకు కుయుక్తులు పన్నారు. ఇందులో భాగంగా కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీకి లక్షల రూపాయలు ఇచ్చి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేరునే కలిగి ఉన్న మరో వ్యక్తికి బీృఫారం తెప్పించి నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించారు. ఈ రెండు పార్టీల గుర్తులు దగ్గరదగ్గరగా పోలి ఉండడంతోపాటు అభ్యర్థుల పేర్లూ ఒకేలా ఉంటే ఓటర్లను తికమక పెట్టి లబ్ధి పొందవచ్చని కేశవ్ దురాలోచన చేశారు. ఇందులో భాగంగా విశ్వేశ్వరరెడ్డి పేరుగల వ్యక్తుల కోసం గాలించారు. ఈ క్రమంలో సీఆర్ విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తితో పయ్యావుల కేశవ్ అనుచరుడు పరమేశ్వర్‌రెడ్డి చేసిన బేరసారాల ఆడియోలు లీకయ్యాయి. విశ్వేశ్వరరెడ్డి అనే పేరుగల వ్యక్తి ఎందుకు అవసరం.. ప్రజాశాంతి పార్టీ తరఫునే ఎందుకు నామినేషన్ వేయాలి.. అందుకు ప్రతిఫలంగా ఏమిస్తారు.. నామినేషన్ వేసి పొరబాటున విత్‌డ్రా చేసుకుంటే కలిగే ఇబ్బందులు తదితర అంశాలపై పయ్యావుల కేశవ్ అనుచరుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే.. సీఆర్ విశ్వేశ్వరరెడ్డి పోటీకి అంగీకరించకపోవడంతో చివరికి కే విశ్వనాథరెడ్డి అనే వ్యక్తిని బరిలోకి దింపారు. కాగా, నామినేషన్ గడువుకు ముందురోజు సీఆర్ విశ్వేశ్వరరెడ్డితో పయ్యావుల ప్రతినిధి రెండు దఫాలుగా జరిపిన సంభాషణ ఇదిగో ఇలా ఉంది..
ఇది ఓటర్లను తికమక పెట్టేందుకే..
అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే ప్రజలే ఎదురొచ్చి ఓట్లు వేస్తారు. ఏమీ చేయకుండా కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకుని ఈ రోజు దొడ్దిదారిన గెలవాలని పయ్యావుల కేశవ్ చూస్తున్నారు. ప్రత్యర్థి పేరున్న మరో వ్యక్తితో నామినేషన్ వేయించి ఓటర్లను తికమక పెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నాకు ఫోన్ చేశారు. రెండువేల ఓట్లయినా చీల్చాలనే కుట్ర పన్నారు.
- సీఆర్ విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకుడు
మొదటి ఆడియో
పయ్యావుల ప్రతినిధి : అన్నా.. నేను పరమేశ్వరరెడ్డి అని రవీ వాళ్ల ఫ్రెండ్
సీఆర్ విశ్వేశ్వరరెడ్డి : చెప్పండి
ప.ప్ర: నామినేషన్ వేయడానికి చూడమనింటే రవి మీ ఫోన్ నంబరు ఇచ్చాడు
సీఆర్: ఎక్కడనా.. ఇంతకుముందు ఏదో మాట్లాడారు
ఉరవకొండ నుంచి నామినేషన్ వేయాలని.
ప.ప్ర: ఆ..
సీఆర్: ఎవరి తరఫున అన్నా అది
ప.ప్ర: అది కేఏ పాల్
సీఆర్: కేఏ పాలా.. ఆయనేదో జోకర్ కదా ఆయన
ప.ప్ర: అంటే ఆయన మనకు ముఖ్యం కాదు. పయ్యావుల కేశవన్న ఉన్నాడు కదా వాళ్ల తరఫున
సీఆర్: ఓకే. దానివల్ల వీళ్లకేమి ఉపయోగం ఉంటుంది అన్నా
ప.ప్ర: ఏమి ఉపయోగమో అనేది కాదు. వాళ్ల ఐడియాలు ఎట్లున్నాయో మనకు తెలియదు కదా? ఆ పేరు మీద ఉన్నోళ్లలో మీ వాళ్లెవరైనా ఉంటే చూడండి అని చెప్పారు. అందుకోసమని రవికి చెప్పింటిని మాట్లాడు అని. రవి ఫోన్ నంబర్ ఇచ్చాడు. బాగుంటుందన్నా భవిష్యత్తులో కూడా ఏదైనా టౌన్‌లో మంచీచెడ్డ ఉన్నాగాని వాళ్లే చూసిపెడతారు మనకి. దానికోసమని చెబుతున్నా.
సీఆర్: దానివల్ల విశ్వనాథరెడ్డి అని పేరుండే వాళ్లకు ఏమి ఉపయోగం?
ప.ప్ర: ఈయన (కేశవ్) అపోజిట్ కేండెట్ విశ్వేశ్వరరెడ్డి కదా.
సీఆర్: ఎస్.. ఆయన వైఎస్సార్‌సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు.
ప.ప్ర: అవును వాళ్లది ఫ్యాన్ గుర్తుకదా. హెలిక్యాప్టర్‌కు కూడా ఫ్యాన్ ఉంటుంది అని ఒక సజేషన్ ఇచ్చారు వాళ్లకు.
సీఆర్: ఓటర్స్ మొత్తం కన్‌ఫ్యూజ్ అయి.. చీలిపోతాయనా
ప.ప్ర: ఆ.. ఆ.. కనీసం వెయ్యి రెండువేలు ఓట్లు చేంజ్ అయినాగాని మనకు బెనిఫిట్ అవుతుందనే ఆలోచన అంతే.
సీఆర్: సరే ఇక్కడ కంటెస్ట్ చేసే వాళ్లకు ఏమి ఉపయోగం ఉంటుంది అన్నా. విశ్వేశ్వరరెడ్డి పేరుతో కేఏ పాల్ గుర్తుపైన కంటెస్ట్ చేస్తారంటున్నారు కదా.. వారికేమి ఉపయోగం.
ప.ప్ర: బెనిఫిట్స్ ఉంటాయి. అంతో ఇంతో డబ్బులైనా ఇవ్వొచ్చు. రేప్పొద్దున వాళ్లను ఉపయోగించుకోవచ్చు మనం.
సీఆర్: అంటే ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఏం కతా..
çప.ప్ర: ఏమో వాళ్లతో మాట్లాడితే కదా. మనకు వాళ్లేమీ ముందుగా చెప్పలేదు.
సీఆర్: అంటే పయ్యావుల వాళ్లు పాల్‌తో కాంటాక్ట్‌లో ఉన్నారా?
ప.ప్ర: కాంటాక్ట్ ఏమీలేదు. వాడు డబ్బుకు ఇస్తారు బీృఫారం అంతే. డబ్బుకు ఆశ పడుతున్నాడంట. డబ్బు ఏం మాట్లాడుకున్నారో వాళ్లు ఏం మాట్లాడతారో తెలీదు. బీృఫారం తెచ్చుకోవడానికి వాళ్లతో మాట్లాడతారు అంతే.
సీఆర్: అంటే ఓట్లు చీల్చడానికి ఇది వేస్తున్నారు అంతే
ప.ప్ర: అంతే కన్ఫ్యూజన్‌కు
సీఆర్ : అవును లెండి ఫ్యాన్‌కే వేసేదిపోయి హెలిక్యాప్టర్ ఫ్యాన్‌కు వేస్తారు. మీరు టీడీపీలో మెంబరా ఏంటి అన్నా
ప.ప్ర: మాది రాగులుపాడు అని, పరమేశ్వర్‌రెడ్డి నా పేరు. మామూలు బూత్ కమిటీ మెంబరు.
సీఆర్: పోవాలంటే ఎవరు డీల్ చేస్తారు
ప.ప్ర: మన బయోడేటా తీసుకుని కేశవ్ వాళ్ల దగ్గరికి పోతే. అంతా వాళ్లే చూసుకుంటారు అంతే.
సీఆర్: సరే అన్నా..
ప.ప్ర: ఏమీలేదు మనం ఓకే అంటే రేపే (25వ తేదీ) లాస్ట్ డేట్ కదా. ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. రేపు 3 గంటల దాకా టైం ఉంది.
సీఆర్: సరేలే అన్నా.. నేను వన్ అవర్‌లో కన్ఫామ్ చేస్తా
ప.ప్ర: కన్ఫామ్ చేయండి. చెప్పేస్తే మేము వస్తాము. అక్కడికి పోయి నువ్వేమైనా మాట్లాడాలి అనుకున్నా కూడా నేను వాళ్లతో డైరెక్ట్‌గా కూడా మాట్లాడిస్తా.
సీఆర్: సరే అన్నా..ఒకే
రెండో ఆడియో
ప.ప్ర: నామినేషన్ వేసి విత్‌డ్రా చేయకూడదు.
సీఆర్: నామినేషన్ వేసినాక ఎందుకు విత్‌డ్రా చేస్తారు
ప.ప్ర: వాళ్లు ఎప్పటికైనా ఏ రకంగానైనా హెల్ప్ చేస్తారు. తొక్కాలనుకుంటే తొక్కుతారు రెండూ ఉండాయి వాళ్ల దగ్గర.
సీఆర్: అవునులెండి ఉంటాయి మామూలే
ప.ప్ర: డబ్బులు ఎంత ఇస్తారనేది కనుక్కుని కన్ఫాం చేస్తాను.
సీఆర్: సరేనా.. ఒకే.
Comments
Please login to add a commentAdd a comment