y visweswara reddy
-
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన చేస్తే గుర్రాలతో తొక్కి చంపించిన చరిత్ర నీది..
-
తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం
-
‘అలా చేస్తే పయ్యావుల కూడా టీడీపీలో మిగలడు’
అనంతపురం, సాక్షి: ఎన్నికలొచ్చినప్పుడే పయ్యావుల కేశవ్‌కు ఉరవకొండ గుర్తొస్తుందని.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం సీఎం జగన్మోహన్రెడ్డి హాజరైన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన విశ్వేశ్వరరెడ్డి.. పయ్యావులపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ గొప్ప ప్రజాస్వామిక వాది. కులాలు మతాలకు అతీతంగానే కాదు.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పార్టీ కండువా కప్పుకుంటేనే లబ్ధి చేకూరుస్తామని చెప్పేవాళ్లు. మీలా వైఎస్సార్ సీపీ కండువా వేసుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తామంటే ఒక్కరైనా ఉండేవారా?.. ఆఖరికి పయ్యావుల కేశవ్ కూడా పార్టీలో మిగలడు. మేం ప్రజాస్వామ్య వాదులం కాబట్టే అలా చేయం. నూటికి 90 శాతం మందికి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే. ..ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. వేలాది మంది పేదలకు ఇంటి పట్టాలు రాకుండా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారు అని విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ పరిపాలనలో అనేక సంస్కరణలు జరిగాయి. జగన్ ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి - సంక్షేమం టీడీపీ నేతలకు కనిపించదు. సీఎం జగన్ రాష్ట్ర ఆదాయం పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. సీఎం జగన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారు.. అందుకు కృతజ్ఞతలు. ఉరవకొండకు మరిన్ని సమస్యలు ఉన్నాయ్.. అవి తీర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా. నాడు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా అని విశ్వేశ్వర్‌రెడ్డి తన ప్రసంగం ముగించారు. -
సీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు
-
దొడ్డిదారిన గెలిచేందుకు పయ్యావుల కుట్ర
అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ప్రజాశాంతి పార్టీతో కలిసి కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డిని ఎలాగైనా దెబ్బతీసి తాను లబ్ధి పొందేందుకు కుయుక్తులు పన్నారు. ఇందులో భాగంగా కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీకి లక్షల రూపాయలు ఇచ్చి వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరునే కలిగి ఉన్న మరో వ్యక్తికి బీృఫారం తెప్పించి నామినేషన్ వేయించేందుకు ప్రయత్నించారు. ఈ రెండు పార్టీల గుర్తులు దగ్గరదగ్గరగా పోలి ఉండడంతోపాటు అభ్యర్థుల పేర్లూ ఒకేలా ఉంటే ఓటర్లను తికమక పెట్టి లబ్ధి పొందవచ్చని కేశవ్ దురాలోచన చేశారు. ఇందులో భాగంగా విశ్వేశ్వరరెడ్డి పేరుగల వ్యక్తుల కోసం గాలించారు. ఈ క్రమంలో సీఆర్ విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తితో పయ్యావుల కేశవ్ అనుచరుడు పరమేశ్వర్‌రెడ్డి చేసిన బేరసారాల ఆడియోలు లీకయ్యాయి. విశ్వేశ్వరరెడ్డి అనే పేరుగల వ్యక్తి ఎందుకు అవసరం.. ప్రజాశాంతి పార్టీ తరఫునే ఎందుకు నామినేషన్ వేయాలి.. అందుకు ప్రతిఫలంగా ఏమిస్తారు.. నామినేషన్ వేసి పొరబాటున విత్‌డ్రా చేసుకుంటే కలిగే ఇబ్బందులు తదితర అంశాలపై పయ్యావుల కేశవ్ అనుచరుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే.. సీఆర్ విశ్వేశ్వరరెడ్డి పోటీకి అంగీకరించకపోవడంతో చివరికి కే విశ్వనాథరెడ్డి అనే వ్యక్తిని బరిలోకి దింపారు. కాగా, నామినేషన్ గడువుకు ముందురోజు సీఆర్ విశ్వేశ్వరరెడ్డితో పయ్యావుల ప్రతినిధి రెండు దఫాలుగా జరిపిన సంభాషణ ఇదిగో ఇలా ఉంది.. ఇది ఓటర్లను తికమక పెట్టేందుకే.. అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే ప్రజలే ఎదురొచ్చి ఓట్లు వేస్తారు. ఏమీ చేయకుండా కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకుని ఈ రోజు దొడ్దిదారిన గెలవాలని పయ్యావుల కేశవ్ చూస్తున్నారు. ప్రత్యర్థి పేరున్న మరో వ్యక్తితో నామినేషన్ వేయించి ఓటర్లను తికమక పెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నాకు ఫోన్ చేశారు. రెండువేల ఓట్లయినా చీల్చాలనే కుట్ర పన్నారు. - సీఆర్ విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకుడు మొదటి ఆడియో పయ్యావుల ప్రతినిధి : అన్నా.. నేను పరమేశ్వరరెడ్డి అని రవీ వాళ్ల ఫ్రెండ్ సీఆర్ విశ్వేశ్వరరెడ్డి : చెప్పండి ప.ప్ర: నామినేషన్ వేయడానికి చూడమనింటే రవి మీ ఫోన్ నంబరు ఇచ్చాడు సీఆర్: ఎక్కడనా.. ఇంతకుముందు ఏదో మాట్లాడారు ఉరవకొండ నుంచి నామినేషన్ వేయాలని. ప.ప్ర: ఆ.. సీఆర్: ఎవరి తరఫున అన్నా అది ప.ప్ర: అది కేఏ పాల్ సీఆర్: కేఏ పాలా.. ఆయనేదో జోకర్ కదా ఆయన ప.ప్ర: అంటే ఆయన మనకు ముఖ్యం కాదు. పయ్యావుల కేశవన్న ఉన్నాడు కదా వాళ్ల తరఫున సీఆర్: ఓకే. దానివల్ల వీళ్లకేమి ఉపయోగం ఉంటుంది అన్నా ప.ప్ర: ఏమి ఉపయోగమో అనేది కాదు. వాళ్ల ఐడియాలు ఎట్లున్నాయో మనకు తెలియదు కదా? ఆ పేరు మీద ఉన్నోళ్లలో మీ వాళ్లెవరైనా ఉంటే చూడండి అని చెప్పారు. అందుకోసమని రవికి చెప్పింటిని మాట్లాడు అని. రవి ఫోన్ నంబర్ ఇచ్చాడు. బాగుంటుందన్నా భవిష్యత్తులో కూడా ఏదైనా టౌన్లో మంచీచెడ్డ ఉన్నాగాని వాళ్లే చూసిపెడతారు మనకి. దానికోసమని చెబుతున్నా. సీఆర్: దానివల్ల విశ్వనాథరెడ్డి అని పేరుండే వాళ్లకు ఏమి ఉపయోగం? ప.ప్ర: ఈయన (కేశవ్) అపోజిట్ కేండెట్ విశ్వేశ్వరరెడ్డి కదా. సీఆర్: ఎస్.. ఆయన వైఎస్సార్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. ప.ప్ర: అవును వాళ్లది ఫ్యాన్ గుర్తుకదా. హెలిక్యాప్టర్‌కు కూడా ఫ్యాన్ ఉంటుంది అని ఒక సజేషన్ ఇచ్చారు వాళ్లకు. సీఆర్: ఓటర్స్ మొత్తం కన్ఫ్యూజ్ అయి.. చీలిపోతాయనా ప.ప్ర: ఆ.. ఆ.. కనీసం వెయ్యి రెండువేలు ఓట్లు చేంజ్ అయినాగాని మనకు బెనిఫిట్ అవుతుందనే ఆలోచన అంతే. సీఆర్: సరే ఇక్కడ కంటెస్ట్ చేసే వాళ్లకు ఏమి ఉపయోగం ఉంటుంది అన్నా. విశ్వేశ్వరరెడ్డి పేరుతో కేఏ పాల్ గుర్తుపైన కంటెస్ట్ చేస్తారంటున్నారు కదా.. వారికేమి ఉపయోగం. ప.ప్ర: బెనిఫిట్స్ ఉంటాయి. అంతో ఇంతో డబ్బులైనా ఇవ్వొచ్చు. రేప్పొద్దున వాళ్లను ఉపయోగించుకోవచ్చు మనం. సీఆర్: అంటే ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఏం కతా.. çప.ప్ర: ఏమో వాళ్లతో మాట్లాడితే కదా. మనకు వాళ్లేమీ ముందుగా చెప్పలేదు. సీఆర్: అంటే పయ్యావుల వాళ్లు పాల్‌తో కాంటాక్ట్‌లో ఉన్నారా? ప.ప్ర: కాంటాక్ట్ ఏమీలేదు. వాడు డబ్బుకు ఇస్తారు బీృఫారం అంతే. డబ్బుకు ఆశ పడుతున్నాడంట. డబ్బు ఏం మాట్లాడుకున్నారో వాళ్లు ఏం మాట్లాడతారో తెలీదు. బీృఫారం తెచ్చుకోవడానికి వాళ్లతో మాట్లాడతారు అంతే. సీఆర్: అంటే ఓట్లు చీల్చడానికి ఇది వేస్తున్నారు అంతే ప.ప్ర: అంతే కన్ఫ్యూజన్కు సీఆర్ : అవును లెండి ఫ్యాన్‌కే వేసేదిపోయి హెలిక్యాప్టర్ ఫ్యాన్‌కు వేస్తారు. మీరు టీడీపీలో మెంబరా ఏంటి అన్నా ప.ప్ర: మాది రాగులుపాడు అని, పరమేశ్వర్‌రెడ్డి నా పేరు. మామూలు బూత్ కమిటీ మెంబరు. సీఆర్: పోవాలంటే ఎవరు డీల్ చేస్తారు ప.ప్ర: మన బయోడేటా తీసుకుని కేశవ్ వాళ్ల దగ్గరికి పోతే. అంతా వాళ్లే చూసుకుంటారు అంతే. సీఆర్: సరే అన్నా.. ప.ప్ర: ఏమీలేదు మనం ఓకే అంటే రేపే (25వ తేదీ) లాస్ట్ డేట్ కదా. ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. రేపు 3 గంటల దాకా టైం ఉంది. సీఆర్: సరేలే అన్నా.. నేను వన్ అవర్‌లో కన్ఫామ్ చేస్తా ప.ప్ర: కన్ఫామ్ చేయండి. చెప్పేస్తే మేము వస్తాము. అక్కడికి పోయి నువ్వేమైనా మాట్లాడాలి అనుకున్నా కూడా నేను వాళ్లతో డైరెక్ట్‌గా కూడా మాట్లాడిస్తా. సీఆర్: సరే అన్నా..ఒకే రెండో ఆడియో ప.ప్ర: నామినేషన్ వేసి విత్‌డ్రా చేయకూడదు. సీఆర్: నామినేషన్ వేసినాక ఎందుకు విత్‌డ్రా చేస్తారు ప.ప్ర: వాళ్లు ఎప్పటికైనా ఏ రకంగానైనా హెల్ప్ చేస్తారు. తొక్కాలనుకుంటే తొక్కుతారు రెండూ ఉండాయి వాళ్ల దగ్గర. సీఆర్: అవునులెండి ఉంటాయి మామూలే ప.ప్ర: డబ్బులు ఎంత ఇస్తారనేది కనుక్కుని కన్ఫాం చేస్తాను. సీఆర్: సరేనా.. ఒకే. -
అనంతపురం జిల్లా వజ్రకరూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
-
పేదలు ఇప్పుడు గుర్తొచ్చారా?
ఉరవకొండ: తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత పేదలు గుర్తొచ్చారా అంటూ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ను ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నిలదీశారు. మరో ఇరవై రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ఇంటి పట్టాల పంపిణీ చేపట్టడం పేదలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికేనని ధ్వజమెత్తారు. ఉరవకొండలోని ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం చేపట్టిన ఇంటిపట్టాల పంపిణీ ఉద్రిక్తతల నడుమ సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేదల ఇంటి పట్టాల సాధన కోసం తాను సాగించిన పోరాటాలను, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పట్టణంలో ఇంటింటికీ వెళ్లి సమస్యలను గతంలో గుర్తించామన్నారు. ఇందులో నివేశన స్థలం, పక్కాగృహాలు లేవని ఎంతోమంది పేదలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. సంప్‌లు శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా సరఫరా అవుతున్న నీటినే తాగాల్సిన దుస్థితి గురించి వివరించారన్నారు. 2014 నుంచి పేదల ఇంటి పట్టాల కోసం తాను సుదీర్ఘ పోరాటాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైఎస్సార్సీపీతో పాటు సీపీఐ, సీపీఎం కుడా పోరాటాల్లో పాలుపంచుకున్నారన్నారు. 2016లో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు 25 గంటల దీక్ష, ఆ ఏడాది జూలై 29న తహసీల్దార్ కార్యాలయం ముట్టడితో పాటు వేలాది మందితో రోడ్డు దిగ్బంధించి చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కల్గించామన్నారు. 2017 ఫిబ్రవరి 6న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ఉరవకొండలో నిర్వహించిన ధర్నాలో పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. నాలుగున్నరేళ్లుగా పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుందని తెలిసి, ఇప్పడు పట్టాలు ఇవ్వకపోతే తమను ప్రజలు ఎక్కడి అక్కడ నిలదీస్తారోనని భయపడి పట్టాల పంపిణీకి ఎమ్మెల్సీ కేశవ్ శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి టీడీపీ ప్రభుత్వ తీరు, ఎమ్మెల్సీ కేశవ్‌ల తీరును ఎండగడుతుండటంతో జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఎమ్మెల్యే మాట్లాడుతున్న మైక్‌ను కట్ చేశారు. ఎమ్మెల్యే మహనేత వైఎస్, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ఉచ్ఛరించగానే సభలో తప్పట్లు, ఈలలు వేయడం వేదికపై ఉన్న టీడీపీ నేతలకు మరింత కోపాన్ని తెప్పించింది. దీంతో వాస్తవాలు చెబుతున్న ఎమ్మెల్యే మైకును లాక్కోవడంతో టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో పాటు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు చందా చంద్రమ్మ, సులోచనలు మాట్లాడుతుండగా టీడీపీ నాయకులు కొందరు సభ్యత లేకుండా అడ్డుతగిలారు. దీంతో గుంతకల్లు డీఎస్పీ ఖాసీంసాబ్, సీఐ సయ్యద్ చిన్నగౌస్, ఎస్‌లు ఇరువర్గాల వారినీ సముదాయించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విప్ చేతుల మిదుగా పేదలకు పట్టాలు అందించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ రేగాటి నాగరాజు, ఎంపీపీ సుంకమ్మ, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో రైతాంగం కుదేలు
వజ్రకరూరు: చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగం కుదేలైందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. వజ్రకరూరును కరువు మండలంగా ప్రటించాలని డిమాండ్ చేస్తూ గురువారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పార్టీ శ్రేణులు షిర్డీసాయి ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తీవ్ర వర్షాభావంతో జిల్లాలో 5.71 లక్షల హెక్టార్లలో పంట తుడుచు పెట్టుకుపోయిందన్నారు. జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు రుణాలన్నింటినీ రీషెడ్యూల్ చేయాలన్నారు. బ్యాంకుల్లో వేలాలు ఆపాలని, పెండింగ్‌లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్రకష్టాల్లో ఉన్నా రుణమాఫీ మొత్తం విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. రైతులు ప్రీమియం చెల్లించినా ఇన్యూరెన్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లవుతున్నా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. సీఎంకు అమరావతి భజన తప్ప మరోటి పట్టడం లేదని విమర్శించారు. వైఎస్ హంద్రీనీవా పనులు 90 శాతం పనులు పూర్తి చేసి జిల్లాకు కృష్ణ జలాలు తీసుకొస్తే టీడీపీ నాయకులు తామే తీసుకొచ్చినట్లు టీడీపీ నాయకులు ఫోజులు కొడుతున్నారన్నారు. కేశవ్ కొత్త నాటకం ఎమ్మెల్సీ చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామంటూ రైతులను మభ్యపెడుతున్నారని, ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త నాటకానికి తెరతీశారని విశ్వ ధ్వజమెత్తారు. కాలువ తవ్వి నీరు ఇస్తున్నట్లు కేశవ్ ఆర్భాటం ప్రదర్శిస్తున్నారే తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకపోవడంతో కళ్లముందే హంద్రీ–నీవా పారుతున్నా రైతులు వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు. అనంతరం తహసీల్దార్ అనిల్‌కుమార్‌కు రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సుశీలమ్మ, మండలాధ్యక్షుడు జయేంద్రరెడ్డి, వైస్ ఎంపీపీ నారాయణప్ప, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్యం ప్రకాష్, పార్టీ జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, జెట్పీటీసీ తిప్పయ్య, ఎంపీటీసీలు వెంకటేశ్‌నాయక్, రామాంజనేయులు, రవికుమార్, మాజీ సర్పంచులు యోగానంద, రుద్రప్ప,రఘు, లక్ష్మీబాయి, నాగేంద్ర, నాయకులు వెంకటరెడ్డి, నారాయణరెడ్డి, శంకర్‌రెడ్డి, మన్యం అనిల్, ఉస్మాన్, డిష్సురేష్, రాకెట్లబాబు, ముండాసు ఓబుళేసు, తిరుపాల్‌శెట్టి, రఘుపతి, కిరణ్, బెస్త ఆది, ప్రభుదాసు, సికిందర్, చిన్నపులికొండ, బత్తిన వెంకట్రాముడు, తిప్పారెడ్డి, ముత్యాల్, సోమశేఖర్‌రెడ్డి, గూదె అనిల్, కమలమ్మ, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. -
జేసీ బ్రదర్స్‌కు తొత్తులుగా పోలీసులు
అనంతపురం / గుత్తి: జేసీ బ్రదర్స్ (దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి)కి పోలీసులు తొత్తులుగా మారిపోయారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీడీ తలారి రంగయ్య, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీమ్ ధ్వజమెత్తారు. వారందరూ గుత్తి స్పెషల్ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని శనివారం విడివిడిగా పరామర్శించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. జేసీ బ్రదర్స్ ఆడగాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయన్నారు. అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, కదిరి, రాప్తాడు, ధర్మావరం, హిందూపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టడానికి టీడీపీ సర్కార్ పోలీసుల చేత అక్రమ కేసులు బనాయింపజేస్తోందన్నారు. పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మలుగా, మరీ ముఖ్యంగా జేసీ బ్రదర్స్ చెప్పు చేతల్లో ఉన్నారని ఘాటుగా విమర్శించారు. పోలీసులు ఇలా అక్రమ కేసులు బనాయించుకుంటూ పోతే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందన్నారు. పచ్చని గ్రామాల్లో చిచ్చు రేగుతుందన్నారు. పోలీసు యంత్రాంగం అరాచకాలను, రౌడీ, గూండాయిజాన్ని అణచి వేయడానికి పని చేయాలి తప్ప ఇలా అధికారపార్టీకి తొత్తులుగా మారితే ఇక చట్టం ఎందుకని ప్రశ్నించారు. విచారణ లేకుండా కేసులు పెడుతూ పోతే ప్రజాస్వామ్యం నాశనం అవుతుందన్నారు. ఇప్పటికైనా పోలీసులు చట్టం, న్యాయం ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. పెద్దారెడ్డిని పరామర్శించిన వారిలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పైలా నరసింహయ్య, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు మీసాల రంగన్న, పేరం నాగిరెడ్డి, మంగళ కృష్ణ, బొంబాయి రమేష్, రమేష్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఫయాజ్ బాషా, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, ఉరవకొండ వీరన్న, సీవీ రంగారెడ్డి, సుభాష్‌రెడ్డి, శాంతి రెడ్డి, పీరా తదితరులు ఉన్నారు. -
పరిహారం ప్రకటించి భరోసా కల్పించాలి
అనంతపురం అర్బన్: ‘‘హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ కింద 60,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు సేకరించిన భూములకు పరిహారం ఇవ్వకుండా పనులు చేయడం ఏమిటి. చట్ట విరుద్ధంగా పనులు చేస్తున్న కాంట్రాక్టరుపైన, ప్రశ్నించిన రైతులపై దౌర్జన్యం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నీరు రావాలని మేమంతా పోరాటం చేసిన వారిమే. అయితే అది చట్టపరంగా జరగాలే తప్ప ఇలా చట్ట విరుద్ధంగా.. రైతులకు ఆందోళనకు గురిచేసే విధంగా కాదు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేసి, పరిహారం ప్రకటించి రైతులకు భరోసా కల్పించండి.’’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి.. జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావును కోరారు. జాయింట్ కలెక్టర్‌ను గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు(రాజారాం), ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి.శివారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరన్న, రైతులు కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు. పరిహారం ఇవ్వకుండానే 36వ ప్యాకేజీ పనులు శరవేగంగా జరుగుతుండడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. పరిహారం చెల్లించకుండా పనులు ముందుకు సాగనివ్వమంటూ బాధిత రైతులు చెబితే.. స్థానిక రాజకీయ నాయకులు, కొంత మంది వారిని భయపెడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారిగా మీరు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి భూములు కోల్పోతున్న రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల అంగీకారం మేరకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 36వ ప్యాకేజీ పనులను చట్టవిరుద్ధంగా చేపట్టిన కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతులు మూకుమ్మడిగా పనులను అడ్డుకుంటారని, తద్వారా చట్టపరమైన అవరోధాలు తలెత్తితే, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కరువు జిల్లాగా ప్రకటించాలి జిల్లా మొత్తం కరువు నెలకొన్నప్పటికీ కేవలం 44 మండాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం సరైన విధానం కాదని, జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని జాయింట్ కలెక్టర్‌ను ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి కోరారు. 2014 నుంచి రాయలసీమ ప్రాంతం కరువుతో విలవిల్లాడుతోందన్నారు. రైతులు, రైతు కూలీలు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు. ఆ కుటుంబాల పిల్లలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జిల్లాలో మరింత ఇబ్బందికర పరిస్థితి నెలకొందన్నారు. –ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి -
'విశ్వ' రూపం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదంతో ఐఏబీ(సాగునీటి సలహా మండలి సమావేశం) సమావేశం రసాభాసగా మారింది. ఏడాదికి ఒక్కసారి నిర్వహించే సమావేశానికి సగం మంది ఎమ్మెల్యేలు కూడా హాజరుకాని పరిస్థితి. వచ్చిన వారి అభిప్రాయాలను కూడా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓపిగ్గా వినకపోవడం గమనార్హం. పక్ష ఎమ్మెల్యేలతో పాటు స్వపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు చెబుతుండగా మంత్రి జోక్యం చేసుకుని ‘ఓకే.. ఓకే.. అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం. వీలైనంత త్వరలో నీళ్లిస్తాం’ అని అడ్డుపడ్డారు. స్వపక్షపార్టీ నేత కావడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఏమనలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికీ ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, జితేంద్రగౌడ్, ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడేది పూర్తిగా వినాలని మంత్రికి చెప్పారు. ఇంత తతంగం జరుగుతున్నా ఐఏబీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కనీసం పెదవి విప్పలేదు. ప్రేక్షకపాత్ర వహించారు. చివరకు నీటి కేటాయింపుల గురించి కూడా మాట్లాడలేకపోవడం గమనార్హం. ఈ ఏడాది హెచ్చెల్సీ కోటా 25.142 టీఎంసీలు తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది నీటి లభ్యత 164 టీఎంసీలుగా టీబీ బోర్డు నిర్ధారించింది. ఇందులో దామాషా ప్రకారం 25.142 టీఎంసీలు హెచ్చెల్సీకి కేటాయించారు. ఇందులో తొలి ప్రాధాన్యతగా 10టీఎంసీలు తాగునీటికి కేటాయించారు. తక్కిన 15.142 టీఎంసీలు సాగునీటికి కేటాయించారు. తుంగభద్ర మెయిన్ కెనాల్, జీబీసీ(గుంతకల్లు బ్రాంచ్ కెనాల్), ఎంపీఆర్ దక్షిణ, ఉత్తర కాలువలు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్‌కు కలిపి 6.808 టీఎంసీలు కేటాయించారు. కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు 0.742 టీఎంసీలు, వైఎస్సార్‌జిల్లా మైలవరం బ్రాంచ్ కెనాల్‌కు 1.253, పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు 1.378 టీఎంసీలు కేటాయించారు. మొదట పీఏబీఆర్, ఎంపీఆర్‌లో నీటిని నిల్వ చేసుకుని తర్వాత కోటా మేర కాలవలకు నీటి విడుదల ప్రారంభిస్తామన్నారు. హెచ్చెల్సీ మెయిన్ కెనాల్, జీబీసీకి ఈ నెల 6న నీటిని విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. సమావేశంలో మంత్రి పరిటాల సునీత, మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, విప్ యామినీబాల, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు, హెచ్చెల్సీ ఎస్ఈ మక్బూల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. జీబీసీకి రేపు నీటి విడుదల అసాధ్యం: జీబీసీకి రేపు నీటి విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. అయితే కాలవ ఉన్న పరిస్థితుల్లో వెంటనే నీటి విడుదల సాధ్యం కాదని పనులు చూస్తే స్పష్టమవుతుంది. ఈ పనులను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేస్తోంది. వీరికి నీటి విడుదల తేదీ 23 అని ప్రభుత్వం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాలవలో మట్టి ఉంది. దీన్ని తొలగించాలంటే కనీసం 15–20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మంత్రి దేవినేని మాత్రం రేపు జీబీసీకి నీళ్లస్తామని ప్రకటించడం గమనార్హం. ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి: ‘‘జిల్లాలో కరువు తీవ్రంగా ఉంది. కరువు మండలాలను ఏమైనా గుర్తించారా?’’ అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు. మంత్రి కాలవ: మీరు కరువు మండలాల గురించి మాట్లాడకూడదు. ఎమ్మెల్యే విశ్వ: ఏడాదికి ఒకసారి సమావేశం జరుగుతుంది. విపక్షపార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఉంటే కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ఎలా? కాలవ: వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే అనంతపురానికి, రాయలసీమకు నీళ్లు వచ్చేవి కావు. చంద్రబాబే నీళ్లు తీసుకొచ్చారు. విశ్వ: చనిపోయిన వ్యక్తి పేరును ప్రస్తావించకూడదనే సంస్కారం కూడా లేదా. వైఎస్ హయాంలో హంద్రీనీవా 75శాతం పూర్తయితే ఇప్పటి వరకూ మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. 2012లోనే జీడిపల్లికి నీళ్లొచ్చాయి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందా? హంద్రీనీవా సామర్థ్యాన్ని 5టీఎంసీలకు తగ్గించి తాగునీటి ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చారు. 40టీఎంసీలతో వైఎస్ పనులు చేసి నీళ్లు తెచ్చారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 54వేల క్యూసెక్కులకు వైఎస్ పెంచారు. అనంతపురం కరువు జిల్లా అని సొంత జిల్లా కేసీ కెనాల్‌కు వెళ్లే నీటిలో 10 టీఎంసీలను హెచ్చెల్సీ ద్వారా అనంతకు కేటాయిస్తూ వైఎస్ జీఓ ఇచ్చారు. ఆ నీళ్లే ఇప్పటికీ ‘అనంత’కు అందుతున్నాయి. పోలవరానికి రూ.5వేల కోట్లు వైఎస్ హయాంలోనే ఖర్చు చేశారు. కుడి కాలవను కూడా ఆయన హయాంలోనే పూర్తి చేశారు. నాలుగేళ్లుగా టీడీపీ అధికారంలో ఉన్నా హంద్రీ–నీవా నీళ్లు జిల్లాకు వస్తుంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేక, ఒక్క ఎకరానూ తడపలేకపోయారు. ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములైనా మీరు వైఎస్ గురించి మాట్లాడుతారా? .. విశ్వేశ్వరరెడ్డి నేరుగా సంధిం చిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాలవ సహనం కోల్పోయి సంబంధం లేని విషయాలను మాట్లాడారు. ఇంతలో మంత్రి దేవినేని ఉమాతో పాటు ఇతర ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించారు. -
అనుభవం మోసాన్ని పసిగట్టలేకపోయిందేం?
ఉరవకొండ: ‘‘రాష్ట్రాన్ని పాలించడంలో తనకు అపారమైన అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మోసగించిందని చెప్పుకోవడం సిగ్గుచేటు. నాలుగేళ్ల పాటు కేంద్రాన్ని భుజానికెత్తుకుని ఎన్నికల వేళ ప్రజల ముందు మొసలి కన్నీరు కార్చడం ఆయనకే చెల్లు. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని గొప్పగా చెప్పుకునే ఆయన అనుభవం ప్రత్యేక హోదాను సాధించడంలో ఏమైంది.’’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనను ప్రజలకు తెలియజెప్పేందుకే ఈనెల 2న అనంతపురంలో ‘వంచనపై గర్జన దీక్ష’ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులు, తమ పదవులను తృణప్రాయంగా వదిలేసిన తాజా మాజీ ఎంపీలు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు దీక్షలో పాల్గొంటారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు గత నాలుగేళ్లుగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారన్నారు. హోదా అంశం ఇప్పటికీ సజీవంగా ఉందంటే అది తమ నేత అంకితభావం వల్లేనన్నారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించిందేమి చంద్రబాబు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 29 సార్లు డిల్లీకి వెళ్లారని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా చెప్పుకుంటున్నారని, అయితే ఆయన ఏమి సాధించారో ప్రజలకు వివరించాలన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కేంద్రాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయని విధంగా మోదీ సర్కారు అభివృద్ధి చేసిందని చెప్పిన నోటితోనే ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అడగటం వెనుక దురుద్దేశం ప్రజలకు తెలియనిది కాదన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పోరు ఉద్ధృతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు ప్రాణాలకు తెగించి పోరాడుతామన్నారు. ప్రత్యేక హోదా కోసం దీక్షలు, ధర్నాలతో పాటు కేంద్రంపై అవిశ్వాసం కుడా ప్రవేశపెట్టామన్నారు. ఐదుసార్లు రాష్ట్ర బంద్‌లు, ఎంపీల రాజీనామాతో వైఎస్సార్సీపీ పోరాటం ప్రజలను ఆలోచింపజేస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తేజోనాథ్, చేనేత విభాగం రాష్ట్ర నాయకులు మిడతల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఈడిగప్రసాద్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
విపక్షంపై బురద చల్లడమే బాబు పని
కూడేరు: రాష్ట్రాభివృద్ధిని మరిచి విపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై బురద చల్లడమే పనిగా సీఎం చంద్రబాబు పెట్టుకున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి, అనంతపురం పార్లమెంట్ సమన్వయ కర్త పీడీ రంగయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుబ క్రిష్టప్ప విమర్శించారు. మంగళవారం కూడేరులో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసులకు భయపడే నైజం జగన్‌లో లేదన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడడం బాబు అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధనకు పలుమార్లు ఢిల్లీలో దీక్షలు, ఆందోళనలు జగన్ చేపట్టారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి ఎంపీల చేత రాజీనామా చేయించిన ఘనత కూడా జగన్‌దేనన్నారు.ప్రత్యేక హోదా సాధన కోసమంటూ ధర్మపోరాటం పేరిట చంద్రబాబు దీక్ష చేపట్టి రూ.30 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. కేసులకు భయపడకుండా ఉంటే కోర్డు నుంచి స్టే ఎందుకు తెచ్చుకున్నారంటూ బాబుని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో కోట్లాది రూపాయలు దోచుకున్నారని, అమరావతి నిర్మాణం డిజైన్ కోసం ఇతర దేశాలకు ప్రత్యేక విమానాల్లో తిరిగి సుమారు రూ.100 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. -
ఎకరాకు రూ. 70వేలు ఇవ్వాలి
సాక్షి, అనంతపురం : పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైఎస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం బెలుగుప్ప మండలంలోని రామసాగరం, దుద్దేకుంట గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న అరటి, మామిడి తోటలను ఆయన పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వెయ్యి హెక్టార్లలో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, గత ఏడాదిలో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 70వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫమైందని ధ్వజమెత్తారు. గత కొద్ది కాలంగా అరటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వమే ఉచితంగా విత్తన మొక్కలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందంటూ విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నించారు. -
29 సార్లు ఢిల్లీకి వెళ్లిఏం సాధించారు..
ఉరవకొండ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరే కారణమని వక్తలు అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల పాటు హోదా మాటెత్తని చంద్రబాబు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు హోదా రాగం అందుకున్నాడన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉరవకొండలోని తొగటవీరక్షత్రియ కళ్యాణ మండపంలో స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ‘‘ఏపీకి ప్రత్యేక హోదా...విభజన హామీల అమలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. విద్యావేత్త డి.ఎర్రిస్వామి అధ్యక్షతన జరిగిన సదస్సులో మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఉద్యమంలో తమపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతున్నారన్నారు. హోదా కోసం రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కేంద్రం ప్యాకేజీ అంటే చంద్రబాబుకు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోదని కేంద్రం డ్రామా ఆడిందనీ, అప్పుడు చంద్రబాబు కనీసం ఆర్థిక సంఘం సభ్యులతో ఆరా తీశారా అంటూ ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసుకు భయపడి 85 రోజులు అసెంబ్లీకు రాలేకపోయారన్నారు. హోదాను ఇంకా సజీవంగా ఉంచింది వైఎస్ జగన్మాత్రమేనన్నారు. అన్నీ వర్గాలను కలుపుకోని చంద్రబాబు పోరాడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. హోదా ఉద్యమం మరింత ఉధృతం చేసేందుకు అందురూ ముందుకు రావాలని కోరారు. సదస్సులో విశ్రాంత బ్యాంకు మేనేజర్ ఓబులేసు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, జెడ్పీటీసీ సభ్యులు తిప్పయ్య, లలితమ్మ, చేనేత విభాగం నేతలు చంద్రమౌళి, ఎంసీ నాగభూషణం, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రసూల్‌సాబ్, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి హనుమప్ప, న్యాయవాదులు ఆదినారాయణరెడ్డి, రామ్మోహన్, అధ్యాపకులు ముండాసు ఓబులేసు, డాక్టర్ ఎర్రిస్వామి, డాక్టర్ నారాయణస్వామి పాల్గొన్నారు. -
బాబూ.. ప్రజల పక్షాన నువ్వెప్పుడున్నావ్..?
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రాష్ట్రం వైపు ఉన్నాయా.. కేంద్రం పక్షమా అని చంద్రబాబు అడగడం సిగ్గుచేటన్నారు. అసలు చంద్రబాబు రాష్ట్ర ప్రజల పక్షానికి ఎప్పుడొచ్చారో చెప్పాలన్నారు. మూడున్నరేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శిస్తే వారి వెనుక బీజేపీ ఉన్నట్లు చిత్రీకరిస్తారా? అని మండిపడ్డారు. ప్రత్యేకహోదా సెంటిమెంటు అందరిలోనూ నాటుకుపోయిందన్నారు. ఈ సమయంలో మేల్కోకుంటే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని భయపడే చంద్రబాబు ప్లేటు ఫిరాయించారన్నారు. తనస్వార్థం కోసం ప్యాకేజీకి అంగీకరించి ఇప్పుడేమో మోసపోయామంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారన్నారు. ముందునుంచి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ ఉద్యమిస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో హోదా ఉద్యమాలు జరిగితే పీడీ యాక్ట్‌లు, కేసులు పెట్టడమే కాకుండా హేళనగా మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. చీకటిలో ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటన్నారు. ఈ విషయంలో ఏ పార్టీతోనైనా కనీసం చర్చించలేదన్నారు. తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా అనుకూల మీడియా రక్షిస్తుందన్న అహంకారంతో చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ పర్యటించి ఏం సాధించారని ప్రశ్నించారు. ఎంపీ విజయసాయిరెడ్డిని విజయ్‌మాల్యాతో పోల్చడం ఏంటన్నారు. ఆయనేం దేశం వదిలివెళ్లలేదని ౖతనపై బనాయించిన అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. త్వరలోనే నిర్దోషిగా నిరూపించుకుంటారన్నారు. టీడీపీలో ఉన్న సుజనాచౌదరి, దీపక్‌రెడ్డి, నారాయణరెడ్డి ఆర్థిక నేరగాళ్లు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి సీఎం సమాధానం చెప్పాలన్నారు. జన్మభూమి కమిటీల నుంచి సీఎం వరకు అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయారన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కూడా చంద్రబాబు కేబినేట్, తనయుడు అవినీతిపై మాట్లాడారని గుర్తు చేశారు. చంద్రబాబు కొడుకుపై అవినీతి అనేలోగా అమిత్‌షా కొడుకు గుర్తుకొచ్చాడా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారైనా అఖిలపక్షం వేశారా అని అడిగారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కార్యదర్శులు ఈడిగ ప్రసాద్, నిరంజన్‌గౌడ్, తేజోనాథ్, నాయకులు రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నాలుగేళ్లుగా సింగపూర్ సినిమానే
ఉరవకొండ: రాష్ట్రం విభజన అనంతరం ము ఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలన లో ప్రజా సమస్యలను పక్కనపెట్టి అందరికీ సింగపూర్ సినిమా చూపారని వైఎస్సార్ సీపీ రాయ చోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. సింగపూర్ లాంటి అమరావతి నిర్మిస్తామంటూ అం దరకీ అరచేతిలో స్వర్గం చూపారన్నారు. సాగునీటి కోసం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ‘జల సంకల్పయాత్ర’ బుధవా రం వజ్రకరూరు మండలంలోని పొట్టిపాడు గ్రామం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డిని కలుసుకుని సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విశ్వతో పాటు పాదయాత్ర చేపట్టారు. అనంత రం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మా న్యం ప్రకాష్ అధ్యక్షతన వజ్రకరూరులో జరిగిన బహిరంగ సభలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో కేం ద్రం ఇచ్చిన రూ.4,800 నిధులతోనే ఆద ర్శ రాజధానిని నిర్మించగా.. చంద్రబాబు మాత్రం తాత్కలిక రాజధాని కడుతానం టూ కేంద్రం నుంచి వచ్చిన రూ. 3,500 కోట్లును దుర్వినియోగం చేశారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటాలతో భయపడిన చంద్రబాబు హోదాపై యూటర్న్ తీసుకుని డ్రామాలు ఆడుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తారని, అసెంబ్లీలో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ఆయన ఎన్నో సార్లు నిలదీశాడన్నారు. రైతుల పక్షాన ఆయన చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. రూ.300 కోట్లు ఖర్చు చేస్తే ఆయకట్టుకు నీరు : ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 90 శాతం పూర్తయిన హంద్రీనీవా కాలువ పనుల్లో మిగిలిన 10 శాతం డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు పూర్తి చేస్తే 80 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయడానికి రూ.300 కోట్లు పెడితే ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్ తన హయాంలో హంద్రీనీవా కోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తే... చంద్రబాబు రూ.100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. హంద్రీనీవాకు నీళ్లిచ్చి రైతులకు ఆదుకుంటామని ఎన్నోమార్లు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన చంద్రబాబు...హామీ నిలబెట్టుకోకుండా ప్రజలందరినీ మోసం చేశాడన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, తాడిపత్రి నాయకులు పైలా నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో 'ఆయ'కట్
ఉరవకొండ: చంద్రబాబు పాలనలో హంద్రీనీవా పరిధిలోని ఆయకట్టుకు నీరు రాకుండా పోయిందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. అసలు ఆయకట్టుకు నీరివ్వాలన్న చిత్తశుద్ధే ప్రభుత్వానికి లేనట్టుందని దుయ్యబట్టారు. హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో ‘జల సంకల్ప యాత్ర’ పేరిట విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం నింబగల్లుకు చేరింది. సర్పంచ్ వరలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకులు హనుమప్ప, చిదంబరి, రమేష్, ఈశ్వర్, వెంకటేష్, ఓబుళప్ప, శివరాజ్ తదితరులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ మండల కన్వీనర్ వెలిగొండ నరసింహులు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మార్చినాటికి హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదని విరుచుకుపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని గతంలో అనేక దీక్షలతో పాటు స్వయంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉరవకొండలో ధర్నాకు దిగినా ఈ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మాకు హక్కుగా ఇవ్వాల్సిన నీటిని ఒక నాయకుడు తాడిపత్రి, మరొకరు బుక్కపట్నం, ధర్మవరానికి తీసుకెళితే మేము చూస్తు ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే కరువు పీడిత అనంతపురం జిల్లాలోని 3.50లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో యువనేత నిఖిల్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కిసాన్‌సెల్ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, రైతు విభాగం రాయలసీమ జిల్లాల కన్వీనర్ తరిమెల శరత్‌చంద్రారెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు నారాయణరెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి, వైఎస్సార్సీపీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కె.వి.రమణ, రైతు సంఘం నాయకులు రాజారాం, నరేంద్రబాబు, బీసీ సెల్ నాయకులు అనిల్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. -
పయ్యావుల కేశవ్ చేతగాని దద్దమ్మ
అనంతపురం : ‘చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కారణమైన అనంత జిల్లాను పూర్తిగా విస్మరించారు. నీళ్లివ్వమంటే మోసపూరిత మాటలు చెప్తున్నారు.. మహానేత వైఎస్ పట్టుదలతో శ్రీశైలం నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొచ్చాయి.. టీడీపీ వాళ్లు ఒక అడుగు కూడా నీరు ఇవ్వలేకపోయారు ఉరవకొండ నియోజవర్గానికి నీళ్లు ఎలా ఇవ్వరో చూస్తాం’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఆయకట్టుకు హంద్రీ–నీవా నీరివ్వాలనే డిమాండ్‌తో తొమ్మిది రోజులు తలపెట్టిన ‘జల సంకల్పయాత్ర’ గురువారం బెళుగుప్ప మండలం గుండ్లపల్లి నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. అనంతరం బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు మోసపు మాటలు ఏవిధంగా ఉన్నాయో తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నీరివ్వకుంటే వేలాది మంది రైతులతో పాదయాత్ర చేసి చంద్రబాబు బండారం బయట పెడతాం. వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా చేస్తాం. 2004లో సీఎం అయిన ఏడాదికే వైఎస్ ఉరవకొండకు వచ్చి హంద్రీ–నీవా పథకానికి శంకుస్థాపన చేసి జీడిపల్లి వరకు రూ. 2,300 కోట్లు ఖర్చు చేశారు. రెండోదశ కూడా దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు వచ్చే నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగేళ్లలోనే వైఎస్ అంత గొప్ప పనులు చేస్తే చంద్రబాబు మాత్రం జీడిపల్లి నుంచి గుండ్లపల్లికి నీరు తీసుకురాలేకపోయారు. రాష్ట్రం విడిపోయిన నాటికి రూ. 90 వేల కోట్లు అప్పులుంటే ఈ మహానుభావుడు వచ్చిన నాలుగేళ్లలోనే రూ.2.20 లక్షల కోట్లకు అప్పులు పెంచేశారు. -
హోదాతోనే మనుగడ
అనంతపురం: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి హైదరాబాద్ కేంద్రంగానే సాగింది. ఆ తర్వాత ఏపీ పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతోంది. ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం పెట్టినా ఏకగ్రీవం అయ్యేందుకు తాము కూడా మద్దతిచ్చాం. వరుసగా రెండేళ్లు తీర్మానం చేసిన తర్వాత సీఎం యూటర్న్ తీసుకున్నారు. అంతా తానే అన్నట్లు నియంతృత్వ పోకడ కనపరుస్తున్నారు. చంద్రబాబు ఎçప్పుడైతే ప్యాకేజీ విషయంలో రాజీపడ్డారో అప్పటి నుంచి బీజేపీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. కేంద్రం, రాష్ట్రం రెండూ దోషులే. కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవడంలో వైఫల్యం చెంది ప్రతిపక్ష పార్టీపై నిందలు వేయడం సరికాదు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకపోవడం వల్లే ఇంత నష్టం జరిగింది. ఇందుకు ఆయనే బాధ్యత వహించాలి. తన ఫెయిల్యూర్స్‌ను ఇతరులపైకి నెట్టడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రత్యేకహోదా విషయంలో వైఎస్సార్సీపీ పంథా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద్వ నీతి.. తదితర అంశాలపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. సాక్షి: హోదాపై మీ పార్టీ వైఖరేంటి? విశ్వ:ప్రత్యేక హోదాపై ప్రారంభం నుంచి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే విధానంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర్రం సమైక్యంగా ఉండాలని అందరం కోరుకున్నాం. అయితే విభజన జరిగిపోయింది. అన్యాయంగా విభజిస్తున్నారని గొంతెత్తాం. రాజధాని లేకుండానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తమ అధినేత ఆది నుంచీ చెబుతున్నారు. సాక్షి: రాష్ట్ర ప్రభుత్వం తప్పంతా కేంద్రంపై నెడుతోందంటారా? విశ్వ: ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు. ఆయన వ్యవహారంపై రాష్ట్ర ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బంద్‌లు, ఆందోళనలు ఊహించని రీతిలో సక్సెస్ కావడమే అందుకు నిదర్శనం. కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన ముఖ్యమంత్రి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్యాకేజీకి అంగీకరించకుండా.. మెతకవైకరి ప్రదర్శించకుండా ఉంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తప్పకుండా తలొగ్గేది. సాక్షి: ప్రత్యేక హోదా వల్ల ఒరిగిందేమీ లేదన్న చంద్రబాబే ఈ రోజు హోదా అవసరమనే సంకేతాలు లీకుల ద్వారా ఇవ్వడాన్ని మీరెలా సమర్థిస్తారు? విశ్వ: గతంలో హోదా కలిగిన 9 ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ పొడిగించారు. హోదా విలువ తెలిసే ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మళ్లీ పొడిగించుకున్నాయి. మన ముఖ్యమంత్రి మాత్రం ఇది ముగిసిన అధ్యాయం అని చెబుతూవచ్చారు. ఇప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దాన్ని తగ్గించుకునే క్రమంలోనే హోదా పల్లవి అందుకుంటున్నారు. సాక్షి: కేంద్రం కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటారా? విశ్వ:నిధులు ఇచ్చేటప్పుడు కేంద్రం కూడా తన రాజకీయ ప్రయోజనాలు చూస్తుంది. తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలకు రైల్వే నిధులు కాని, ప్యాకేజీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది. మన రాష్ట్రంలో పెద్ద ఉపయోగం లేదు కాబట్టి సహజంగానే తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం నిర్లక్ష్యం చూపుతోంది. అలాంటప్పుడు కేంద్రం ఉదారంగా ఇస్తుందని ఆశించలేం. ఒత్తిడి పెంచితే ఏదైనా లాభం ఉంటుంది. తమ అధినేత జగన్ అనేకమార్లు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లండి సపోర్ట్ చేస్తామని చెప్పినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. సాక్షి: చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించకపోవడం వెనుక ఉద్దేశమేమనుకుంటారు? విశ్వ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సమయంలో పట్టుబడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా లొంగుబాటును ప్రదర్శించారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండడానికి అవకాశం ఉన్నా రాత్రికిరాత్రే విజయవాడకు వచ్చేశారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా ఓటుకు నోటు కేసు భయంతో 85 రోజులు సెక్రటేరియేట్‌కు వెళ్లలేదు. బహుశా ఇన్ని రోజులు సెక్రటేరియేట్‌కు వెళ్లని ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరేమో. సాక్షి: ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలను కలుపుకుని వెళ్తామని చెబుతున్న పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల మీ స్పందనేంటి? విశ్వ: పవన్‌కళ్యాణ్ గురించి ఈ మూడేళ్లలో చూశాం. ఆయన కష్టపడే మనిషికాదు. ఇతరులపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు డైరెక్షన్లో రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అనేక ఉద్యమాలు నీరుగార్చుతూ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారు. సాక్షి: జిల్లాకు వచ్చిన పవన్ కొందర్నే కలవడాన్ని ఏమనుకుంటారు? విశ్వ:ఇక్కడ తీవ్రమైన కరువు ఉంది. అధికారంలో ఉన్న వారి ఇళ్లకు పోవడం వెనుక ఆంతర్యం ఆయనకే తెలియాలి. జిల్లా కరువుపై పోరాటాలు చేసిన అనేక పార్టీలు ఉన్నాయి. స్వతంత్ర సంస్థలు, కవులు, రచయితలు ఉన్నారు. అయితే కేవలం అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలనే కలిశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి మద్ధతుగా నిలవడాన్ని ఆయన అభిమానులు కూడా తట్టులేకపోతున్నారు. సాక్షి: సీమ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందా? విశ్వ: అన్ని రకాలుగా వెనుకబడిన రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాల అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ఇవ్వాలని విభజన సమయంలో హామీ ఇచ్చారు. ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో ఆయా ప్రాంతాల విషయాలనే మరిచిపోయారు. సాక్షి: కొత్త రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని ఇచ్చిన హామీ అమలవుతోందా? విశ్వ: రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం అభివృద్ధి కేంద్రీకరించడమే. తెలంగాణ కంటే రాయలసీమ జిల్లాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయంటూ స్వయంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. వేలాది మంది నుంచి వినతులు స్వీకరించి, స్వయంగా పరిశీలించిన శివరామకృష్ణన్ కమిటీ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని స్పష్టం చేసింది. కానీ చంద్రబాబు ఎవరి మాటా వినకుండా అభివృద్ధిని అమరావతికే పరిమితం చేస్తున్నారు. సాక్షి: సీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని జరుగున్న ఉద్యమంపై మీ స్పందన? విశ్వ: చంద్రబాబు పాఠం నేర్చుకోవాలి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చేస్తున్న డిమాండ్ చాలా న్యాయమైనది. దీనిపై సీఎంతో చర్చించడానికి అమరావతికి లాయర్లు వెళితే కలవడానికి కూడా నిరాకరించడం బాధాకరం. న్యాయవాదుల ఉద్యమానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. సాక్షి: హోదాకు ప్రత్యేక ప్యాకేజీ సమానమేనా? విశ్వ: అసలు కానేకాదు. ప్రత్యేక హోదా లేకపోతే పరిశ్రమలు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, వివిధ పన్నుల రూపంలో ఏటా రూ.60 వేల కోట్ల ఆదాయం నష్టపోతాం. ఈ ఏడాది ప్యాకేజీ కింద చంద్రబాబు అడిగింది రూ.3,900 కోట్లు. అందుకే హోదాకు, ప్యాకేజీకి ఎలాంటి సంబంధం లేదు. ప్యాకేజీ అంటే ఏదో కొంత నిధులు వస్తాయి. అదే హోదా ఇన్తే అనేక రాయితీలు వర్తిస్తాయి. తద్వారా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 11 అనుభవ రాష్ట్రాల్లో ఇది నిరూపితమైంది. సాక్షి: రాష్ట్రాభివృద్ధికే విదేశీ పర్యటనలు చేస్తున్నానని సీఎం చెబుతున్నారు? విశ్వ: ప్రత్యేక హోదా రాకుండా ఎన్నిమార్లు విదేశీ పర్యటనలు చేసినా ఫలితం శూన్యం. రాష్ట్ర విభజన తర్వాత చాలా తీవ్రమైన సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. కీలకమైన రాజధాని నిర్మాణం, నదీజలాలు, తెలుగు రాష్ట్రాల మధ్య వచ్చిన సమస్య, విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలోనూ సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. చివరికి అసెంబ్లీ కూడా నడపలేని స్థితికి సీఎం చేరుకున్నారు. -
‘చంద్రబాబు-పవన్ నాటకాలు ఆపాలి’
సాక్షి, అనంతపురం: ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గటం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబును ఆయన పొలిటికల్ పార్టనర్ పవన్ కళ్యాణ్ ఒప్పించాలన్నారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ నాటకాలు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని పునరుద్ఘాటించారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్ చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 వరకు వివిధ దశల్లో పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ఆయన ప్రకటించారు. -
సీమ అభివృద్ధికి ఐక్య పోరాటం
అనంతపురం రూరల్: రాయలసీమ అభివృద్ధికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి అద్యక్షతన గురువారం న్యాయవాదులు చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షలకు ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం, నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, రాయలసీమ విమోచన సమితి నాయకులు సీమ కృష్ణ, నిరుద్యోగ సంఘం నాయకులు టి.పి.రామన్న, పీఎస్వో విద్యార్థి సంఘం, కుల సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. శిబిరంలో విశ్వ, అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా సెక్షన్4 ప్రకారం హైకోర్టును రాజధాని ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ సీమకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో అభివృద్ధిని హైదరాబాద్ చుట్టూ కేంద్రీకరించడం వల్ల విభజన తర్వాత అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని గుర్తు చేశారు. మరోసారి అదే తప్పుని సీఎం చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటయ్యే వరకూ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఫలించిన ఎమ్మెలే విశ్వ పోరాటం
ఉరవకొండ: పట్టణంలోని అర్హులైన పేదలకు జానెడు జాగా ఇప్పించడానికి స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి దశలవారిగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. చివరికి వైఎస్సార్సీపీ అధినేత, ప్రతి పక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డినే స్వయంగా ఉరవకొండ తీసుకొచ్చి ఇంటి పట్టాల కోసం ధర్నా చేయించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశారు. ఓ వైపు ప్రజా పోరాటాలు సాగిస్తూనే.. మరోవైపు పేదలకు న్యాయం చేయడానికి మూడు నెలల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అర్హులైన వారికి ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు జిల్లా ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో పిల్ దాఖలు చేయాలని కూడా సూచించింది. కోర్టు ఆదేశాలతో స్పందించి ఆర్డీఓ, ఇతర అధికారులు పేదల ఇంటిపట్టాల ప్రక్రియను ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. 2008లో మహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయంలో ఉరవకొండ పట్టణంలోని నిరుపేదలకు ఇంటిపట్టాలు ఇవ్వడానికి 88 ఎకరాల స్థలాన్ని రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే ఆ తర్వాత పేదలకు పట్టాలు పంచి పెట్టడంలో టీడీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అటు ప్రభుత్వంపై ఇటు ఉన్నతాధికారుల పై ఒత్తిడి తీసుకురావడంతో ఇంటిపట్టాల పంపిణీ ప్రక్రియకు ఇప్పటికి మోక్షం కల్గింది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోరాటాల వల్లే తమకు ఇళ్ల పట్టాలకు మార్గం సుగమం అయిందని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఏళ్లు గడుస్తున్నా నీరివ్వరేం?
సాక్షి, అనంతపురం: హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టుకు నీటి ని అందించడంలో టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో 80 శాతా నికి పైగా పనులు పూర్తయ్యాయని, అలాంటిది ఈ మూడేళ్లలో కనీసం స్ట్ర క్చర్లు కూడా నిర్మించలేని దౌర్బాగ్య పరిస్థితిలో టీడీ పీ ప్రభుత్వం ఉందన్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్ట్ పురోగతిపై శనివారం స్థానిక హంద్రీ–నీవా కార్యాలయంలో హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రామకృష్ణారెడ్డితో కలిసి ఆ యన మూడు గంటల పాటు సమీక్షించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైంది? ‘ఉరవకొండ నియోజకవర్గంలోని హంద్రీ– నీవా ఆయకట్టుకు నీటి విడుదల అంశాన్ని గతేడాది అసెంబ్లీలో లేవనెత్తాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. మార్చిలోగా హంద్రీ–నీవా ఆయకట్టుకు నీరిస్తామంటూ అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. అయితే పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఆయకట్టు స్ట్రక్చర్ పనులే ప్రారంభించకుండానే మార్చి నాటికి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం సాధ్యమవుతుందా?’ అని ఎస్ఈని ప్రశ్నించారు. ఎక్కడి పనులు అక్కడేనా? ‘33వ ప్యాకేజీ పనులు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు పనులు నిలిపేస్తే.. అదనపు రేట్లకు టెండర్లు ఇచ్చుకుంటూ ప్రజాధనం లూటీ చేస్తున్నారే తప్ప పనుల్లో పురోగతి చూపడం లేదు. మొత్తం 11 స్ట్రక్చర్లకు గాను ఐదింటిని మాత్రమే పూర్తి చేశారు. ఒక కిలోమీటర్లు కాలువ బ్లాస్టింగ్ చేయాల్సి ఉందన్నారు. 17 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సిన 34వ ప్యాకేజీలో 45 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులన్నీ ఎప్పటికి పూర్తి చేయగలుగుతారు. పని చేయని కాంట్రాక్ట్ సంస్థలను వెంటనే బ్లాక్‌లిస్టులో పెట్టండి. అవసరమైతే బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 5 కోట్లను జప్తు చేయండి. 36వ ప్యాకేజీలో జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా మొత్తం 80 వేల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. మిగిలిపోయిన పనులకు రూ.55 కోట్లతో చేయాల్సి ఉండగా రూ. 275 కోట్లు పెంచుకుని కొత్త కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. పనులు ఎక్కడా చేపట్టకపోతే అధికారులుగా మీరేమి చేస్తున్నారు’ అంటూ నిలదీశారు. అన్ని చెరువులకు నీళ్లివ్వాలి ఆమిద్యాల లిప్ట్ పనులకు వెంటనే టెండర్లు పిలవడంతో పాటు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. వజ్రకరూరు నుంచి గుంతకల్లు వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి 13 చెరువులను నింపాలన్నారు. ఈ పనులు చేపట్టాలని సూచించారు. అవసరమైతే మొబైల్ లిప్ట్‌లు తెప్పించి మెయిన్ కెనాల్ నుంచి చెరువులకు నీటిని తరలించాలని కోరారు. రైతులకు లబ్ధి చేకూర్చేందుకు సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. నిధుల దోపిడీకే టెండర్లు హంద్రీ–నీవా మొదటి దశలో ఐదు శా తం పనులు మాత్రమే పూర్తి చేస్తే ఆయకట్టుకు నీరివ్వచ్చునని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ మూడేళ్లలో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వకుండా ఉరవకొండ నియోజకవర్గ రైతులను మోసం చేసి కు ప్పంకు నీటిని తీసుకుపోవడానికి ప్రత్నిం చిన చంద్రబాబు, ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బైరవాని తిప్ప ప్రాజెక్టు, పేరూరు డ్యాంలకు నీళ్లిస్తామం టూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉం దని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు డ బ్బులు దాచుకునేందుకు ఈ పనులకు టెండర్లు పిలుస్తున్నారని, గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే అవకాశాలు ఉన్నా లిఫ్ట్‌లు పెడు తూ రూ. వందల కోట్లు దోచుకునేందుకు కుట్రలు చేశారని విమర్శించారు. -
ఒక్క హామీ అయినా నెరవేర్చారా?