'కౌలు రైతుల చట్టం అమలు చేయాలి' | YSRCP MLAs questions to TDP Govt due to farmers problems | Sakshi
Sakshi News home page

'కౌలు రైతుల చట్టం అమలు చేయాలి'

Published Fri, Dec 19 2014 9:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

'కౌలు రైతుల చట్టం అమలు చేయాలి' - Sakshi

'కౌలు రైతుల చట్టం అమలు చేయాలి'

హైదరాబాద్: రాష్ట్రంలో కౌలు రైతుల చట్టం అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆ పార్టీ సభ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... కౌలు రైతుల సమస్య ప్రధానమైందని తెలిపారు. వారి సమస్యలపై గతంలో పోరాటాలు చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకువచ్చారు.

మరో  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంత మంది కౌలు రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు. వీరి ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానమిస్తూ... తమ ప్రభుత్వం కౌలు రైతులకే తొలిప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. రుణమాఫీలో  న్యాయం చేస్తామన్నారు. అలాగే కౌలు చట్టాన్ని పటిష్టంగా అమలు పరుస్తామని... అందులోభాగంగా సదరు రైతులకు కార్డులు జారీ చేస్తున్నట్లు పుల్లారావు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement