రోడ్డెక్కిన రైతన్న | Farmers Protest For Irrigation Problem In YSR Kadapa | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన రైతన్న

Published Thu, Aug 9 2018 6:59 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Farmers Protest For Irrigation Problem In YSR Kadapa - Sakshi

మైదుకూరు హైవేపై రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

మైదుకూరు(చాపాడు): కేసీ ఆయకట్టులో ఏటా మాదిరి కాకుండా ఈసారి సంపూర్ణంగా కాలువల ద్వారా ఖరీఫ్‌ పంటలకు సాగునీరు వస్తుందని గత నెల 29న టీడీపీ నేతలు రాజోలి వద్ద సాగునీటిని వదిలారు. వదిలిన వారం రోజులకే ఆగిపోయాయి. దీంతో ఇప్పటికే 92వేల ఎకరాల ఆయకట్టులో 70శాతం మంది రైతులు వేసుకున్న నారుమళ్లు నీరు లేక ఎండిపోతున్నాయి. ఎండిన నారుమళ్లను ట్యాంకర్లతో రైతులు తడుపుకొంటుండగా, మరోవైపు శ్రీశైలంలో నీరు ఉన్నా.. మన వాటా ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు 10టీఎంసీలు నీరు తీసుకుపోతుండటంతో కడుపుమండిన రైతన్నలు బుధవారం రోడ్డెక్కారు. సీనియర్‌ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా కడప–కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిలు అండగా నిలిచారు. రాయలసీమ ద్రోహి సీఎం చంద్రబాబు మన నీటిని కిందికి తీసుకుపోతున్నారని, సీమ టీడీపీ నేతలకు పౌరుషం, దమ్ము, ధైర్యం ఉంటే శ్రీశైలం వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుందామని వైఎస్సార్‌సీపీ నేతలు సవాల్‌ విసిరారు. రాస్తారోకోలో వైఎస్సార్‌సీపీ రైతువిభాగం జిల్లా కన్వీనర్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఏపీ రైతుసంఘం ప్రెసిడెంట్‌ ఏవీ రమణ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు.

రెండు రోజులకే నీరు ఆగిపోయింది: కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
టీడీపీ నాయకులు రాజోలి నుంచి నీరు వదిలి ఈసారి రైతులు రెండు కార్లలో పంటలు పండిం చుకోవచ్చని గొప్పలు చెప్పారని, రెండు రోజు ల్లోనే సాగునీరు ఆగి పోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఏ ఒక్కరూ కూడా పట్టించుకోలేదనన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి అంటూ 150 టీఎంసీల నీరు ఉన్నా, కేసీ రైతులకు సాగునీరు ఇవ్వకుండా సాగర్, కృష్ణాడెల్టాలకు తీసుకెళ్లటం అన్యాయం, అక్రమమని పేర్కొన్నారు. టీడీపీ నేతలు, ప్రభుత్వానికి ప్రజ లు బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు లంచాలు, కమీషన్లు వచ్చే పనులకే మద్దతుగా ఉంటాడని, రైతులకు సాగునీరు ఇచ్చేందుకు ఏనాడు ముందుకు రాడన్నారు. చంద్రబాబు అధికారంలో వచ్చాడంటేనే కరువు కూడా వచ్చినట్లేనని, దీంతోనే రైతులు సాగునీరు లేక, మద్దతు ధరల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
 
టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయం కుదేలు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు 
గతంలో, ఈ నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ వ్యవసాయం కుదేలవుతుందని, పంటల సాగులో కలుపు మొక్కలను ఏరి పారేసినట్లు రైతులు టీడీపీని ఏరి పారేయాలన్నారు. రాయలసీమకు సాగునీరు ఇస్తున్నామని గొప్పలు చెప్పే సీఎం, టీడీపీ నేతలు 92వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతన్నలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. సిగ్గుంటే తాగునీరు, సాగునీరు ఇవ్వాలని లేకుంటే ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హతే లేదన్నారు. తక్షణమే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు పోవాలంటే వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, రైతుల కోసం అనునిత్యం పరితపించే రఘురామిరెడ్డిని ఎమ్మెల్యేను చేసుకోవాలని, జిల్లాలోని 10 ఎమ్మెల్యేలు, 2ఎంపీల స్థానాలను వైఎస్సార్‌సీపీకి ఇస్తే రైతుల సమస్యలన్నీ తీరుతాయని ప్రజలకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు, కరువు కవల పిల్లలు: కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా
చంద్రబాబు, కరువు కవల పిల్లలని, ఈయన అధికారంలో రాగానే కరువు కూడా వస్తుందన్నారు. ఈ పాలనలో రైతులు కష్టాలు తప్పవని, కరువు కూడా సిగ్గుపడుతుందన్నారు. నాలుగేళ్లుగా కేసీ రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఉద్యమాలు, ధర్నాలు చేయకతప్పటం లేదన్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన రైతాంగానికి దుర్భర పరిస్థితులు రావటం బాధాకరమన్నారు. గతంలో పట్టిసీమను వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ నేతలపై అభాండాలు వేశారని, ఇప్పుడేమో ఆ వాటాను సీమకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, చంద్రబాబుకు రైతులు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైఎస్‌ పాలనలో దేవుడు కూడా కరుణించి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేశాడని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే దేవుడికి కూడా ఇష్టం లేదన్నారు. జగన్‌ను సీఎం చేసుకుంటేనే రాయలసీమ రైతులకు తాగు, సాగునీరు అందుతుందని రైతులకు సూచించారు.

వైఎస్‌ 40వేల క్యూసెక్కులకు పెంచారు: కడప మేయర్‌ సురేష్‌బాబు
రాయలసీమ రైతాంగం తాగు, సాగునీరు అందక ఏళ్ల తరబడి నష్టపోతుండటంతో వైఎస్సార్‌ ముఖ్య మంత్రి కాగానే ప్రతిపక్షం, టీఆర్‌ఎస్‌ ఇంకా ఇతర పార్టీలన్నీ తప్పుపట్టినా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచారని, రాయలసీమకు సాగునీరు అందించారన్నారు. మన వాటా కూడా ఇవ్వకుండా ఏటా కేసీ రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులు గురిచేస్తోందన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రైతులు, ప్రజల కోసం నిత్యం అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారని, ఉద్యమాలు, ధర్నాలకు తమను కూడా రమ్మని కోరుతుంటాడని, ఆయన రైతుల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటున్నాన్నారు.

నాలుగేళ్లుగా రైతులకు అవస్థలే: మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి
టీడీపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన నాలుగేళ్ల నుంచి కేసీ రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతూనే ఉన్నారు. ఏటా మైదుకూరులో రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. జిల్లా› టీడీపీ నేతలు సాగునీరు వదిలి వరి సాగు చేసుకోవచ్చని చెప్పి, నారుమళ్లు సిద్ధం చేసుకున్నాక నీరు రాకపోగా పట్టించుకోకపోవటం దారుణమన్నారు. సత్వరమే కేసీ రైతాం గానికి సాగునీరు ఇవ్వకుంటే రైతులు తీవ్రం గా నష్టపోతారన్నారు. శ్రీశైలంలో నీరు ఉన్నప్పటికీ రైతులకు ఇవ్వకపోవటం దారుణమన్నారు. కేసీ రైతాంగానికి సాగునీటి సమస్య లేకుండా దివంగత సీఎం వైఎస్సార్‌ రాజోలి జలాశయం తలపెట్టారన్నారు. ఆయన మరణంతో ప్రాజెక్టు ఆటకెక్కిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి రైతులకు సాగునీరు ఇవ్వాలని మాజీ ఎంపీ డిమాండ్‌ చేశారు.

శ్రీశైలం వద్దకెళ్లి నీటిని తెచ్చుకుందాం: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీరు ఇచ్చి, దీని వాటా రాయలసీమకు తెస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన సీఎం ఇప్పుడేమో సీమకు సాగునీరు ఇవ్వకుండా 10టీఎంసీలు కృష్టా డెల్టాకు తీసుకుపోతున్నారన్నారు. కర్నూలు ఐఏïబీ మీటింగ్‌లో మంత్రులు, అధికారులు చేసిన తీర్మానాలతో రైతుల్లో ఆశలు రేపారని, ఇప్పుడు నీరు రాకపోవటంతో వేసుకున్న నారుమళ్లు ఎండిపోతుంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూడు కార్లు పంటలు పండే కృష్ణా డెల్టాకు నీరు తీసుకెళ్లకుండా ఆడ్డుకోవాలన్నారు.  సీఎం వద్ద వంగి వంగి పోవటం కాదని, రైతులకు సాగునీరు ఇప్పించేందుకు పోరాడాలని టీడీపీ నేతలకు హితవు పలి కారు. రాజోలి వద్ద నుంచి నెల్లూరుకు చెందిన మంత్రి సోమిరెడ్డి 6వేల క్యూసెక్కుల చొప్పున ఐదు రోజుల పాటు సోమశిలకు నీరు తీసుకెళ్లారని, మన నీటికి కిందికి తీసుకుపోతుంటే టీడీపీ నేతలు గాడిదలు కాస్తున్నారా.. అని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement