'ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుకి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం' | YSRCP MLAs takes on tdp govt | Sakshi
Sakshi News home page

'ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుకి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం'

Published Tue, Dec 22 2015 9:43 AM | Last Updated on Tue, May 29 2018 2:55 PM

'ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుకి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం' - Sakshi

'ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుకి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం'

హైదరాబాద్ : 25 మంది కార్పొరేట్ శక్తుల కోటరీ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తోందంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు విలేకర్లతో మాట్లాడారు.


ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని వారు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఈ బిల్లును వ్యాపార ధృక్పథంతో తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. ఈ బిల్లు వల్ల విద్యార్థులకు పూర్తిగా నష్టం కలుగుతుందని విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకుండా చేసి ఇంతమందికి అన్యాయం చేసే బిల్లును శాసనసభలో పాస్ చేసుకోవడం దురదృష్టమని వారు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుని... కార్పొరేట్ చేతుల్లో పెట్టిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సర్కార్ విద్యా, వైద్యాన్ని పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పెట్టేస్తోందని విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి చేతులు రావడం లేదని చంద్రబాబు ప్రభుత్వంపై వారు నిప్పులు చెరిగారు.

కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాల్లో జల్సాలు చేయడానికి మాత్రం రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 20 ప్రభుత్వ యూనివర్శిటీలను ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, సుజయ కృష్ణ రంగారావు అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement