ఎమ్మెల్యే విశ్వ వెంట పాదయాత్రలో నడస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
ఉరవకొండ: రాష్ట్రం విభజన అనంతరం ము ఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలన లో ప్రజా సమస్యలను పక్కనపెట్టి అందరికీ సింగపూర్ సినిమా చూపారని వైఎస్సార్ సీపీ రాయ చోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. సింగపూర్ లాంటి అమరావతి నిర్మిస్తామంటూ అం దరకీ అరచేతిలో స్వర్గం చూపారన్నారు. సాగునీటి కోసం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ‘జల సంకల్పయాత్ర’ బుధవా రం వజ్రకరూరు మండలంలోని పొట్టిపాడు గ్రామం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డిని కలుసుకుని సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విశ్వతో పాటు పాదయాత్ర చేపట్టారు. అనంత రం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మా న్యం ప్రకాష్ అధ్యక్షతన వజ్రకరూరులో జరిగిన బహిరంగ సభలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు.
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో కేం ద్రం ఇచ్చిన రూ.4,800 నిధులతోనే ఆద ర్శ రాజధానిని నిర్మించగా.. చంద్రబాబు మాత్రం తాత్కలిక రాజధాని కడుతానం టూ కేంద్రం నుంచి వచ్చిన రూ. 3,500 కోట్లును దుర్వినియోగం చేశారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాలతో భయపడిన చంద్రబాబు హోదాపై యూటర్న్ తీసుకుని డ్రామాలు ఆడుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తారని, అసెంబ్లీలో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ఆయన ఎన్నో సార్లు నిలదీశాడన్నారు. రైతుల పక్షాన ఆయన చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు.
రూ.300 కోట్లు ఖర్చు చేస్తే ఆయకట్టుకు నీరు : ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 90 శాతం పూర్తయిన హంద్రీనీవా కాలువ పనుల్లో మిగిలిన 10 శాతం డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు పూర్తి చేస్తే 80 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయడానికి రూ.300 కోట్లు పెడితే ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్ తన హయాంలో హంద్రీనీవా కోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తే... చంద్రబాబు రూ.100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. హంద్రీనీవాకు నీళ్లిచ్చి రైతులకు ఆదుకుంటామని ఎన్నోమార్లు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన చంద్రబాబు...హామీ నిలబెట్టుకోకుండా ప్రజలందరినీ మోసం చేశాడన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, తాడిపత్రి నాయకులు పైలా నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment