
విజయనగరం / తూర్పుగోదావరి జిల్లా: విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సొంత నియోజకవర్గంలోని తెర్లాం మండలానికి చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీటీసీలతో పాటు ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, రెండు వేల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పల నాయుడుల సమక్షంలో వీరంతా వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ నేతలు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కొనసాగుతున్న చేరికలు..
అలాగే తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడికి చెందిన టీడీపీ నాయకుడు నరాల శ్రీనివాస్‌తో పాటు మరో 300 మంది ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ సమన్వయకర్త పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. గండేపల్లి మండలం కె.గోపాలపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చంటిబాబు సమక్షంలో చేరారు. గ్రామానికి చెందిన పుప్పాల శ్రీను, కష్ణాపురం గ్రామానికి చెందిన కట్టమూరి బంగారంల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరిన వారికి చంటిబాబు కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనరు చలగళ్ళ దొరబాబు, బోదా రామిరెడ్డి, గొల్లవిల్లి రామకష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment