ఉరవకొండ సమస్యలపై నేడు నిరవధిక మహాధర్నా | URAVAKONDA issues today indefinite mahadharna | Sakshi
Sakshi News home page

ఉరవకొండ సమస్యలపై నేడు నిరవధిక మహాధర్నా

Published Thu, Jul 28 2016 11:13 PM | Last Updated on Tue, Oct 30 2018 5:12 PM

URAVAKONDA issues today indefinite mahadharna

 
∙తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్న ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి∙రోడ్డు పైనే వంటా వార్పు
ఉరవకొండ: ఉరవకొండ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సవుస్యల పరి ష్కారం కోసం స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఉద్యమానికి సిద్ధమయ్యారు. శుక్రవారం వేలాది వుం ది ప్రజలతో కలిసి ఉరవకొండ తహశీల్దార్‌ కార్యాలయం  ఎదుట ప్రధాన రహదారిపై నిరవధిక వుహాధర్నా చేపడుతున్నారు. ఈయన ఈ నెల ఎనిమిది నుంచి ‘గడప గడపకు వైఎస్‌ఆర్‌’ కార్యక్రమాన్ని 
నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఉరవకొండలో పలు ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై పోరుబాట కుసిద్ధమయ్యారు. మహాధర్నాలో ప్రజలుపెద్దసంఖ్య లో పాల్గొని.. ప్రభుత్వం కళ్లు తెరి పించే లా చేద్దావుని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ప్రధాన డివూండ్లు ఇవే..
పట్టణంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం 2008 సంవత్సరంలో 83 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. అయితే ఇప్పటికీ అర్హులకు స్థలాలు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో అర్హులైన అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించాలి.∙చేనేత అప్పులు రద్దు చేయాలి. కార్మికులకు సబ్సిడీతో రేషం అందించాలి.∙పట్టణ ప్రజలకు పరిశుభ్రమైనlనీటిని సరఫరా చేయాలి. కొత్త ఓవర్‌హెడ్‌ 
ట్యాంకులు నిర్మించడంతో పాటు పాత పైప్‌లైన్‌ను వూర్చాలి.∙గతంలో ఉన్న సామూహిక మరుగుదొడ్లు తొలగించారు. దీనివల్ల బహిర్భూమికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ  వ్యక్తిగత వురుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలి.
∙అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్‌లు మంజూరు చేయాలి.∙ఉరవకొండలో అభివృద్ధి పనులకు తక్షణమే రూ.50 కోట్లు విడుదల చేయాలి.∙బాలికల జూనియర్‌ కాలేజీకి పక్కా భవనాలు నిర్మించాలి.∙వంద పడకల ఆస్పత్రి పనులు ప్రారంభించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement