
'ధైర్యం లేని బాబు.. ఢిల్లీకి ఎందుకు?'
గుంటూరు: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఏపీకి అదనంగా నిధులు అడిగే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు. ప్రజల వత్తిడి వల్లే చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళుతున్నారని చెప్పారు.
అసలు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబునాయుడు ఏం సాధిస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.