Venugopala Krishna
-
డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు ..
-
కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు, హత్యలు
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం రూరల్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు.తప్పు చేయమని చంద్రబాబే చెప్తారు.. నేరాలు కట్టడి చేస్తున్నట్టు నాటకాలాడతారు.. అలా అని పచ్చ పత్రికల్లో రాయిస్తారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, కూటమి నేతలు రూ.కోట్లు కొల్లగొట్టేందుకు వారికి అనుకూలమైన మద్యం, ఇసుక పాలసీలను రూపొందించారని ఆరోపించారు. మద్యం షాపులు దక్కించుకునేందుకు టెండర్ వేసే వారి నుంచి 30 శాతం వాటా ఇవ్వాలని బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. వీటన్నింటిపై ప్రశ్నించాల్సిన పవన్ ఏమైపోయారని ప్రశ్నించారు. 80 లక్షల టన్నుల ఇసుక ఏమైంది..? రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేస్తే.. కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడ్డారని వేణు విమర్శించారు. ఇదంతా సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే జరిగిందన్నారు. నూతన మద్యం, ఇసుక పాలసీ టీడీపీ, కూటమి నేతలు బాగుపడేందుకు తెచ్చినవేగానీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సంపద సృష్టిస్తానన్న బాబు.. కార్యకర్తల బాగు కోసం సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు.కేవలం రెండు రోజుల్లోనే ఇసుక టెండర్లు ఎలా పూర్తిచేస్తారని ప్రశ్నించారు. సామాన్యులకు టెండర్లు వేసే అవకాశం లేకుండా చేశారన్నారు. గతంలో రూ.10 వేలకు వచ్చే ఇసుక.. ప్రస్తుతం రూ.30 వేలు పలుకుతుందంటే.. అది ఉచితమా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అప్పులను పదే పదే ప్రస్తావించిన చంద్రబాబు.. అప్పులతోనే ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక కొరతకు కారణమేంటన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలని సూచించారు. -
‘చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజలకు కష్టాలు’
తూర్పుగోదావరి, సాక్షి: పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచించారని, దాని వల్లే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. దీనికి తోడు తన అనాలోచిత నిర్ణయాల వల్ల మరింత నష్టం తెచ్చిపెట్టారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వేణుగోపాలకృష్ణ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వాలు జాగ్రత్తగా పని చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చటానికి తనకున్న మీడియా బలాన్ని ఉపయోగిస్తోంది. దీనివల్ల ఇబ్బంది పడేది ప్రజలే. 2014లో రాష్ట్రం కోల్పోయిన ఆదాయం పోలవరం పూర్తి అయితే వస్తుందని ఆశించాం. కానీ, అలా జరగలేదు. బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రాన్ని విడదీసేది సమయంలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. టీడీపీకి సహాయంగా ఉన్న జనసేన కూడా కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు ఇచ్చి పూర్తి చేయాలి’’ అని అన్నారాయన. చంద్రబాబుపై ఫైర్.. 2016 మే 2 న పోలవరం పనులు ప్రారంభించిన సమయంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రమే చేపడుతుందని ప్రకటించారు. పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచించారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో నష్ట పోయారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా ఆర్ అండ్ ఆర్ గురించి కూడా ఆలోచించాలి. కాపర్ డ్యామ్ చేపట్టే నాటికే స్పిల్ వే పూర్తయి ఉండాలి. కానీ, కాపర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు ను చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ నేరుగా ఆరోపించారు. చంద్రబాబు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం భారీగా ప్రజాధనాన్ని నష్టపోయింది. చంద్రబాబు ఈ ప్రాజెక్టులో వచ్చే ఆదాయాన్ని గురించి మాత్రమే ఆలోచించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండా చంద్రబాబు అనాలోచితంగా తీసుకున్న చర్యల వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అని వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు. -
జోగి రాజీవ్ అరెస్ట్ పై.. చెల్లుబోయిన వార్నింగ్
-
మేమంతా సిద్ధం బస్సుయాత్రకు విశేష స్పందన: చెల్లుబోయిన వేణు
-
ఆ మాటలు గుర్తున్నాయా చంద్రబాబూ.. మంత్రి వేణు ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు బీసీల ద్రోహి అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ‘‘నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నాడు. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నాడు. తన అన్న మాటలను మరిచిపోయి ప్రజలు దగ్గరికి వచ్చి సూక్తులు చెబుతున్నాడంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు. ‘‘తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి. ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు ఎలా చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదు. చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా?. తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా.? 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు..?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘బీసీలకు పెన్షన్ పెంపు అని చెబుతున్నావు.. ఇదో పెద్ద అబద్ధం.. జన్మభూమి కమిటీలతో నువ్వు చేసిన వికృత క్రీడలు జనం మర్చిపోలేదు. ఐదేళ్ల నీ పరిపాలన కాలంలో పెన్షన్ పెంపు గురించి ఆలోచించావా.. సీఎం జగన్ పింఛన్లు పెంచితే దానిపై అక్కసు చూపిస్తావా.. మీ పార్టీ ఏనాడైన బీసీలకు రాజ్యసభ స్థానాలు కేటాయించావా?. ఇవాళ సీఎం జగన్ నలుగురు బీసీలకు రాజ్యసభ స్థానాలు ఇచ్చారు. సోషల్ ఇంజనీరింగ్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక సీటు శెట్టిబలిజలకు కేటాయించలేకపోయాడు. రెండు సామాజిక వర్గాలను విడదీసి నీ పబ్బం గడుపుకుంటున్నావ్. కులాల మధ్య గొడవలు సృష్టించడం ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం నీ ఆలోచన. ఫీజు రీయింబర్స్మెంట్ సగానికి సగం తగ్గించి బీసీలను ఉన్నత విద్యకు దూరం చేయాలనుకున్నావు’’ అంటూ మంత్రి వేణు దుయ్యబట్టారు. -
ఈసీకి కంప్లైంట్ పై చెల్లుబోయిన ఫైర్
-
లిస్ట్ విడుదలపై చెల్లుబోయిన ఫస్ట్ రియాక్షన్
-
బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమే
-
బీసీలను అణచివేసింది చంద్రబాబే: మంత్రి వేణు
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని.. బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కీలకమైన శాఖలన్నీ బీసీల వద్దే ఉన్నాయన్నారు. సీఎం జగన్ పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో ఉన్నారన్న మంత్రి వేణు బీసీలను అణచివేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. విజయవాడ: ప్రతిపక్షాలు కూటములుగా ఏర్పడి నీచ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వారాల అబ్బాయిలాగా అప్పుడప్పుడు సినిమా సెలవుల్లో విజయవాడ వస్తాడంటూ ఎద్దేవా చేశారు. ‘‘175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని పార్టీ జనసేన. పవన్ పదేళ్ల రాజకీయ జీవితంలో అనుసరించిన ఎజెండా ఏంటో ఎవరికీ తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కేఏ పాల్‌తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు. ప్రజల ఎజెండా లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్.. చంద్రబాబులు. సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. రాజకీయాల్లో మాత్రం పూర్తిగా జీరో అయ్యాడు. పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్. నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదు’’ వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. -
బాబు,పవన్‌ను ఏకిపారేసిన చెల్లుబోయిన
-
ఓట్ల కోసం కాదు ఏపీలో కులగణనపై మంత్రి క్లారిటీ
-
చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్ట్రాంగ్ కౌంటర్
-
అందుకే చంద్రబాబు, పవన్ భయపడుతున్నారు: మంత్రి వేణు
సాక్షి, తూర్పుగోదావరి: కుల గణనపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలని, అవగాహన రాహిత్యంతో పవన్ కులగణనపై వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేస్తున్నాం. బీహార్‌లో కులగణనపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కులగణన జరుగుతుంది. రాష్ట్ర పౌరుల సామాజిక, విద్యా, నివాస స్థితి తెలుసుకోవడంలో తప్పేముంది?. చంద్రబాబు, పవన్ కుల గణనతో భయపడుతున్నారు. అందుకే ఇలాంటి ప్రశ్నలు చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కులగణన ఎక్కడ జరగలేదు. ఏపీలో మాత్రమే సాహసోపేతంగా చేస్తున్నాం’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. సామాజిక, న్యాయ, రూప శిల్పం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజున రాష్ట్రంలో కులగణన చేపట్టాం. రాష్ట్రంలో 67 శాతం కుల గణన పూర్తైంది. కోటి 20 లక్షల కుటుంబాలకు ఇప్పటికే కులగణన పూర్తయింది. కులగణన జరిగితే బీసీలు టీడీపీకి దూరమవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు.. జనసేన కార్యకర్తలను మోసం చేయడానికే టికెట్లు ముందు ప్రకటించారు. చంద్రబాబు ఎనౌన్స్ చేసే సీట్ల సంఖ్యకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ అదే సంఖ్య ప్రకటించే ధైర్యం ఉందా?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘15 లేదా 20 సీట్లలో పవన్ కళ్యాణ్ దిగజారి పోటీ చేస్తారు. అంతకు మించి ఏమీ లేదు. సీఎం జగన్‌ని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు తప్పితే ప్రజలపై చిత్తశుద్ధి లేదు’’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్ మరో నాటకం -
రోత రాతల రామోజీ.. మంచి జరిగితే నచ్చదా?: మంత్రి వేణు
సాక్షి, విజయవాడ: ఈ సమాజం ఎదగకూడదనేదే ఈనాడు పత్రిక ఆలోచన అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రామోజీకి మంచి జరిగితే నచ్చదని, చంద్రబాబుకు మద్దతుగా రాసేవన్నీ రోతరాతలేనని మత్రి దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమ్మ ఒడితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగిందని, ఈ సమాజానికి నీ రాతల వల్ల ఇచ్చే సందేశమేంటి రామోజీ.. అంటూ పశ్నించారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలను రాయడమే నీ పనా.. 2024లో నీ రోత రాతలకు కాలం చెల్లుతుంది. లక్షలాది మంది వస్తే తట్టుకోలేక తప్పుడు వార్తలు రాస్తావా? బాధ్యత మరిచి వార్తలు రాస్తున్న ఈనాడుని బహిష్కరించే రోజులు దగ్గర్లో ఉన్నాయ్. ఈనాడు వార్తలు అంబేద్కర్‌ను అవమానించినట్లుగానే మేం భావిస్తున్నాం. ఈనాడు పత్రిక తక్షణమే డా.బి.ఆర్.అంబేద్కర్‌కు క్షమాపణ చెప్పాలి’’ అని మంత్రి వేణు మండిపడ్డారు. -
చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు: మంత్రి వేణుగోపాలకృష్ణ
-
కులగణన చారిత్రాత్మక నిర్ణయం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
-
చంద్రబాబు, టీడీపీ నేతలపై మంత్రి వేణుగోపాల కృష్ణ ఫైర్
-
ఏపీ ప్రజలకు శుభవార్త.. మరో కొత్త పథకం..!
-
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!
-
శ్రీవారి సన్నిధిలో పలువురు ప్రముఖులు..!
-
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వేణుగోపాల కృష్ణ
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ స్వాగతం పలికారు. మంత్రి ముందుగా తులాభారం మొక్కులు తీర్చుకుని, ధ్వజ స్తంభమునకు మొక్కిన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా డిప్యూటీ ఈవో తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. -
పేదవర్గాలకు భరోసాను కల్పించే అద్భుతమైన బడ్జెట్ ఇది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో గురువారం రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ 2023-24 సంవత్సరానికి 2 లక్షల 79వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద వర్గాలకు భరోసాను కల్పించే బడ్జెట్‌గా రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, బీసీ సంక్షేమం,, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి సిహెచ్. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదరికంపై పోరాటం చేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పేదల సంక్షేమానికి మంచి బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. ఈ బడ్జెట్ ప్రసంగాన్ని వినకుండానే బడ్జెట్‌ను చూడకుండానే ప్రతిపక్ష సభ్యులు సభలో గొడవ చేసి సభ నుండి సస్పెండ్ చేయించుకుని వళ్ళిపోడవం చాలా దురదృష్టకరమని దీనిని ప్రజలు గమనించాలని సూచించారు.బడ్జెట్ ప్రసంగం అయ్యాక బాధ్యత గల ప్రతిపక్షంగా వారి అభిప్రాయాలను తెలియ జేయవచ్చు గాని ఆవిధంగా చేయకుండా ముందుగానే సభ నుండి వెళ్ళిపోయారని చెప్పారు. ప్రస్తుత బడ్జెట్లో 2లక్షల 79 వేల కోట్ల రూ.లు బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని ఏకంగా 80 వేల కోట్ల రూ.లు కేటాయించడం అభినందనీయమని మంత్రి వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. అదే విధంగా వ్యవసాయ రంగానికి కూడా అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి 43వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. బడ్జెట్లో అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యతను కల్పించడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలులో ముఖ్యంగా సంక్షేమ పధకాలు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకే అందేలా ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)విధానం ద్వారా అర్హులైన పేదలందరికీ అందేలా చేయడం జరుగుతోందన్నారు.పేదరిక నిర్మూలకు ధనం,విద్య అత్యంత ప్రధానం అని భావించి ఆదిశగా పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు, మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి తగిన రీతిలో నిధులు కేటాయిండం అభినందనీయమని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బీసీలు, బడుగు బలహీన వర్గాల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఏపీ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు అంశాలకు ఆమోద ముద్ర పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. దీనిలో భాగంగా కేబినెట్ భేటీ అనంతరం మంత్రి వేణు గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి జగన్‌ను మంత్రులు అభినందించారని వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాట బృందానికి ముఖ్యమంత్రి కేబినెట్లో అభినందనలు తెలిపారన్నారు.. ఏప్రిల్ 1వ తేదీన ఆర్బీఐ సెలవు, రెండో తేదీన ఆదివారం కావడంతో ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ 3వ తేదీన ఉంటుందన్నారు. విశాఖను రాజధానిగా ఆహ్వానించారు పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర మంత్రులు కూడా విశాఖను రాజధానిగా ఆహ్వానించిన విషయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ మరోసారి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లోనూ విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని చెప్పారన్నారు. ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా టీడీపీ సభ్యులు ఎందుకు వెళ్లిపోయారో అర్థం కాలేదన్నారు మంత్రి. వారు రాజకీయ పరిణితి కోల్పోయినట్లు కనిపిస్తోందని, పోలవరంలో తప్పులు చేసింది చంద్రబాబేనన్నారు. ఏపీ కేబినెట్లో ఆమోదించిన పలు అంశాలు ఇవే.. జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది.. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్ అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు - 2023 కు ఆమోదం ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక నాయీ బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు. పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం -
చంద్రబాబుకు ఆ మాట చెప్పే ధైర్యం ఉందా?: మంత్రి వేణు
సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ‘‘అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే. రుణ మాఫీపై రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు?. బాబు అబద్ధాలు విని మోసపోయిన ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. చంద్రబాబు ఏనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు’’ అని మంత్రి దుయ్యబట్టారు. ‘‘పెత్తందార్ల కోసం చంద్రబాబు, ఎల్లో మీడియా పని చేస్తోంది. లోకేష్ పాదయాత్ర వలన ఎవరికీ ప్రయోజనం లేదు. పవన్, చంద్రబాబు చేసే కుట్ర రాజకీయాలను ప్రజలు గుర్తించారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను ఎంతగా పీడించారో అందరికీ గుర్తుంది. ఈ రోజు అలాంటి పరిస్థితులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందుతున్నాయి. లబ్ది పొందిన వారంతా జగన్ వెన్నంటే ఉన్నారు. లోకేష్‌ని సీఎం చేస్తానని చంద్రబాబు చెప్పగలడా?. లేదా పవన్‌ని చేస్తానని చెప్తారా? ఏదీ చెప్పే ధైర్యం లేని వారు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని’’ మంత్రి ఎద్దేవా చేశారు. చదవండి: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్