
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో బీసీ కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదలకు ఉన్నత చదువులు అందుతున్నాయన్నారు.
ప్రభుత్వ పథకాలు ఎల్లో మీడియాకు కనపడటం లేదా అంటూ మంత్రి ప్రశ్నించారు. అమ్మఒడి, చేయూత, జగనన్నతోడు వంటి పథకాలతో అండగా నిలుస్తున్నాం. వైఎస్ జగన్ పాలనలో అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఎన్టీఆర్ తెచ్చిన టీడీపీ ఇప్పుడు లేదు. చంద్రబాబు అంటే కుట్ర, వెన్నుపోటు. చంద్రబాబు కోసమే ఈనాడు తప్పుడు కథనాలు రాస్తోంది’’ అని వేణుగోపాలకృష్ణ దుయ్యబట్టారు.
చదవండి: ముందస్తు ఎన్నికలపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు