![Minister Venugopala Krishna Comments On Eenadu Ramoji - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/20/Minister-Venugopala-Krishna.jpg.webp?itok=94JmhMqE)
సాక్షి, విజయవాడ: ఈ సమాజం ఎదగకూడదనేదే ఈనాడు పత్రిక ఆలోచన అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రామోజీకి మంచి జరిగితే నచ్చదని, చంద్రబాబుకు మద్దతుగా రాసేవన్నీ రోతరాతలేనని మత్రి దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమ్మ ఒడితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగిందని, ఈ సమాజానికి నీ రాతల వల్ల ఇచ్చే సందేశమేంటి రామోజీ.. అంటూ పశ్నించారు.
చంద్రబాబు చెప్పే అబద్ధాలను రాయడమే నీ పనా.. 2024లో నీ రోత రాతలకు కాలం చెల్లుతుంది. లక్షలాది మంది వస్తే తట్టుకోలేక తప్పుడు వార్తలు రాస్తావా? బాధ్యత మరిచి వార్తలు రాస్తున్న ఈనాడుని బహిష్కరించే రోజులు దగ్గర్లో ఉన్నాయ్. ఈనాడు వార్తలు అంబేద్కర్‌ను అవమానించినట్లుగానే మేం భావిస్తున్నాం. ఈనాడు పత్రిక తక్షణమే డా.బి.ఆర్.అంబేద్కర్‌కు క్షమాపణ చెప్పాలి’’ అని మంత్రి వేణు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment