![Ex Minister Chelluboina Venugopala Krishna Fires On Chandrababu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/Venu1.jpg.webp?itok=lyxMiFiD)
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ఎన్నికల హామీల్లో భాగంగా కల్లుగీత కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో 20 శాతం కేటాయించాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాజాగా కల్లుగీత కార్మికులకు కేవలం 10 శాతం మేరకే మద్యం దుకాణాలను కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని అన్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్లుగీత కార్మికులపై తెలుగుదేశం నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని తెలిపారు.
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇంకా ఏం మాట్లాడారంటే..:
గీత కార్మికులకు చంద్రబాబు మోసం:
మద్యం పాలసీలో భాగంగా ఎన్నికలకు ముందు కల్లుగీత సొసైటీలకు 20 «శాతం మద్యం దుకాణాలు కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిందాన్ని విస్మరించి కేవలం 10 శాతం దుకాణాలను మాత్రమే గీత కార్మికులకు కేటాయిస్తూ తాజాగా జీఓ జారీ చేశారు. ఇది బీసీలను అన్యాయం చేయడం, మోసం చేయడం కాదా? ఆ 10 శాతం దుకాణాలు కూడా సక్రమంగా మద్యం విక్రయాలు లేని చోట్ల, దుకాణాలకు నష్టాలు వస్తున్న చోట్లను ఎంపిక చేసీ గీత కులాలకు అంటగడుతున్నారు. మద్యం విక్రయాల్లో మార్కెట్ బాగున్న చోట్ల దుకాణాలను కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు ౖMðవసం చేసుకున్నారు.
బీసీల పట్ల టీడీపీ చిన్నచూపు:
కల్లుగీత సొసైటీల్లో పని చేస్తున్న గీత కార్మికులకు కల్లు విక్రయాలు తగ్గిపోయి, ఉపాధి కొరవడుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయం చూపించేందుకే మద్యం దుకాణాలను కేటాయిస్తున్నామని చెబుతున్నారు. అటువంటప్పుడు మద్యం పాలసీని ప్రకటించి, దుకాణాలకు టెండర్లు పిలిచిన సందర్భంలోనే గీత కార్మికులకు ఎందుకు దుకాణాలను కేటాయించలేదు? దీనికి ఆరు నెలల సమయం కావాల్సి వచ్చిందా? మాచర్లలో లైసెన్స్ కోసం ఒక కల్లుగీత కార్మికుడు వెడుతుంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనివాసరెడ్డి బెదిరింపులకు గురి చేసిన సంగతి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించారు.
దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయింది. మద్యం దుకాణాల నుంచి పైవాళ్లకు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. మద్యం దుకాణాలకు వేలం కోసం దరఖాస్తు చేసే సమయం నుంచి వారికి కేటాయింపులు జరిగితే స్థానిక ఎమ్మెల్యేలకు లాభాల్లో వాటాలు ఇవ్వాలి. బెల్ట్ షాప్‌లు నిర్వహించుకునేందుకు దగ్గర ఉండి వేలం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఇప్పుడు లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్న వారిపైన కూడా దౌర్జన్యాలకు పాల్పడటం బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిన్నచూపుకు నిదర్శనం.
బీసీ రిజర్వేషన్లపైనా పచ్చి అబద్దాలు:
స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారంటూ ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాశారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ, ఆ సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపలేదు. 2019లో సీఎం అయిన శ్రీ వైయస్ జగన్, బీసీలకు అదే 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో చంద్రబాబు తన అనుయాయుడు సుధాకర్ రెడ్డి చేత పిల్ వేయించి రిజర్వేషన్లు దక్కుండా కుట్రలు చేయడం వల్ల 24 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిపించాల్సిన పరిస్థితి కల్పించారు. ఇప్పుడు అదే చంద్రబాబు బీసీలకు మేలు చేసే నేతగా ఎల్లో మీడియా చిత్రీకరిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో ఉంది. చంద్రబాబు బీసీల విషయంలో చెబుతున్న ప్రతిమాటా ఒక అబద్దమే.
జాకీ మీడియా తప్పుడు కథనం:
చంద్రబాబు అబద్దాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది. దీనిలో భాగంగానే ప్రతికలో బీసీలపై వైసీపీ కత్తి’ అనే శీర్షికన ఒక వార్తను ప్రచురించారు. తెలుగుదేశం పాలనలో బీసీలపై ఎంత నీచంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. తమ సమస్యలను ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు వివరించేందుకు ఆనాడు సచివాలయంకు వెళ్ళిన నాయీబ్రాహ్మణులను మీ తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తాను అని, మత్స్యకారులు వెడితే వారిని తోలు తీస్తాను అని చంద్రబాబు హెచ్చరించిన సంగతి రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment