హంద్రీనీవా ఆయకట్టు సాధనకు ఐక్య ఉద్యమాలు
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ : హంద్రీనీవా కింద ప్రతిపాదించబడిన ప్రతి ఎకరాకూ సాగునీరు అందే వరకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం రాత్రి స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో హంద్రీనీవా ఆయుుకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన సవూవేశానికి ఎమ్మెల్యే వుుఖ్య అతిథిగా హాజరయ్యారు. హంద్రీనీవా ఆయకట్టు సాధన సమితి సభ్యులు లత్తవరం రావుూ్మర్తి అధ్యక్షతన జరిగిన సవూవేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వూట్లాడుతూ హంద్రీనీవా పూర్తి చేయుడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కాలువ పూర్తి చేసి ఆయుుకట్టుకు నీరు ఇవ్వాలని, ఉన్న నీళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పానికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగడుతూ రాయులసీవులోని టీడీపీ ప్రజాప్రతినిధులకు కనువిప్పు కల్గించేలా వురో ఉద్యవూనికి శ్రీకారంచుట్టడానికి అందరు సిద్ధంగా ఉండాలని తెలిపారు. దీనిపై ఈనెల 11న బెలుగుప్పలో జరిగే సవూవేశంలో ఉద్యవు కార్యచరణ హంద్రీనీవా సాధన సమితి రూపొందిస్తుందని తెలిపారు. కార్యక్రవుంలో హంద్రీనీవా ఆయుుకట్టు సాధన సమితి ప్రతినిధులు రాకెట్ల అశోక్, తేజోనాథ్, చిన్నవుూస్టురు సుంకన్న, సభ్యులు మోపిడి తిప్పన్న, కౌకుంట్ల సిద్దారెడ్డి, ఓబన్న, షేక్షానుపల్లి లింగన్న, లత్తవరం గోవిందులు పాల్గొన్నారు.