వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
సాక్షి, అనంతపురం : జిల్లాకు సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే చంద్రబాబు వణికిపోతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేస్తానని మోసం చేశారని అన్నారు.
పేరూరు డ్యాంకు నీటి తరలింపు కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని తెలిపారు. వైఎస్సార్ కృషి వల్లే అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయని వెల్లడించారు. డ్వాక్రా మహిళలను భయపెట్టి సీఎం సభలకు తరలిస్తున్నారని ఆరోపించారు. గత ఆరేళ్లుగా హంద్రీనీవా నీరు వస్తున్నా ఆయకట్టుకు ఎందుకు నీరివ్వలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై ఆర్థిక మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు.
బీజేపీతో కలసి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కాపులకు రిజర్వేషన్లను ఎందుకు సాధించలేకపోయిందని నిలదీశారు. 50 శాతం రిజర్వేషన్ కటాఫ్‌ను ఎత్తివేసేందుకు అన్ని పార్టీల మద్దతుతో ముద్రగడ పద్మనాభం పోరాడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment