Topudurti Prakash Reddy
-
సీఎం చొరవతోనే మీరు ప్రాణాలతో బయటపడ్డారు
చెన్నేకొత్తపల్లి: ‘సకాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించడం వల్లనే మీరు ప్రాణాలతో బయటపడ్డారు’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నది వరదలో చిక్కుకుపోయి సురక్షితంగా బయటపడిన 10 మందిని శనివారం ఆయన పరామర్శించారు. విషయం స్థానిక నాయకుల ద్వారా తెలిసినప్పుడు తాను అసెంబ్లీలో ఉన్నానన్నారు. వెంటనే సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దించారన్నారు. ప్రాణాలకు తెగించి తమిళనాడు వాసులను కాపాడేందుకు వెళ్లిన స్థానికులను, నాయకులను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం చిత్రావతిలో గంగపూజ చేశారు. రైతులను ఆదుకుంటాం వర్షాలకు దెబ్బతిన్న వరి పంట బాధిత రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. ముష్టికోవెల గ్రామంలో వర్షాలకు నేలకొరిగిన వరి పంటను, దెబ్బతిన్న చెరువు కట్టను ఆయన పరిశీలించారు. తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వెల్దుర్తి సర్పంచ్ జీవిత, జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డి, ఎంపీపీ శ్రీశైలం ప్రవీణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నర్సిరెడ్డి, నాయకులు సానే జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండగా ఉంటాం రామగిరి: మండల పరిధిలోని కుంటిమద్ది గ్రామంలో శనివారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పర్యటించారు. దెబ్బతిన్న ధర్మవరం–పేరూరు ప్రధాన రహదారిని పరిశీలించారు. నీటి ప్రవాహం తగ్గగానే మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జెడ్పీటీసీ నాగార్జున బాధితులకు దుప్పట్లతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుజాతమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమేష్, సర్పంచ్ నరేంద్ర, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీఓ మృతి బాధాకరం రాప్తాడు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో డ్వామా ఏపీఓ–2గా పనిచేస్తున్న శైలజ ఆకస్మిక మృతి బాధాకరమని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే అనంతపురంలోని ఏపీఓ నివాసానికి చేరుకుని మృతదేహానికి నివాళులు అర్పించారు. రామగిరిలో నిర్వాసితులకు కూరగాయలు, దుప్పట్లు అందిస్తున్న నాయకులు -
సీఎం వైఎస్ జగన్ మహిళలకు నేన్నునాను అని బరోసా ఇస్తున్నారు
-
‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు’
సాక్షి, అనంతపురం : రాప్తాడులో టీడీపీ నేతలు నకిలీ పాసుపుస్తకాలు తయారు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. రెవెన్యూ అధికారులను బెదిరించి భూ రికార్డులను తారుమారు చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో కోటీశ్వరులకు కూడా ఇళ్లు మంజూరయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు ఉన్నాయి. కఠిన చట్టాలు అవసరం. భూ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వ భూములను కాపాడాలి’ అని సూచించారు. చదవండి : మొసలి కన్నీరొద్దు సునీతమ్మా.. -
కర్ణాటక సీఎంతో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి భేటీ
సాక్షి, అనంతపురం: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చే కృష్ణా నీటిని మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి కర్ణాటకలోని తురకలాపట్నం, పెన్నానది మీదుగా పేరూరు డ్యాంకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా ఆయన బెంగళూరుకు వెళ్లి కర్ణాటక బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్‌తో కలిసి ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్పతో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం నీటి తరలింపు ప్రతిపాదనలపై కర్ణాటక సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను తీసుకొస్తామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు ఎక్కువగా ఖర్చు చేయకుండా హంద్రీనీవా నీటిని పేరూరు డ్యాంకు తీసుకొని వచ్చి ఈ ప్రాంత రైతులకు సాగునీటి కొరతను తీర్చాలన్నదే మా ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. -
పరిటాల శ్రీరాం ఓడిపోతాడనే దాడులు
అనంతపురం న్యూసిటీ: ‘‘రాప్తాడులో శాంతిభద్రతలు చచ్చిపోయాయి. ఖాకీ చొక్కా వేసుకున్న నిజమైన పోలీసులు కనపడి ఐదేళ్లు అయ్యింది.’’ అని వైఎస్పార్ సీపీ రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో గాయపడి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకులను ఆయన శనివారం పరామర్శించారు. గాయపడిన చింతకాయల పోతులయ్య ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన సేవలందించాలని కోరారు. అనంతరం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎన్ఎస్ గేట్లో దాడులకు పాల్పడిన వారిని ప్రజలే పట్టించినా ఎస్ఐ కనుసైగలు చేసి పారిపోమనే పరిస్థితులు ఉన్నాయి. గత ఐదేళ్లుగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోరు. ధర్మవరం డీఎస్పీ, ఆత్మకూరు సీఐ.. జిల్లా ఎస్పీ సహా తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరినైనా కొట్టచ్చు. వైఎస్సార్ సీపీ నాయకులు ప్రాణాలమీదకొచ్చినా, ఆస్పత్రుల్లో అడ్మిట్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ఒకవేళ కేసులు కట్టినా బెయిలబుల్ సెక్షన్ల(324, 326)తో సరిపెడుతారు. ఐదేళ్లలో నలుగురు నాయకులను పొట్టనపెట్టుకున్నారు. పోలీసులు కేఎన్ పాళ్యం, కందుకూరులో మర్డర్ కేసులో ఉన్న ముద్దాయిలను తీసుకొచ్చి ఓటు వేయించారు. ఈ విషయంలో స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. జిల్లాలో ఎక్కడ హత్య జరిగినా మంత్రి పరిటాల సునీత ఇంటి వద్ద ఆశ్రయమిస్తారు. ఆ విషయం జిల్లా ఎస్పీకి కూడా తెలుసు.’’ శ్రీరాం ‘బాబు’గానే కన్పిస్తాడు ‘రాప్తాడులో జరిగిన హత్యలకు ప్రధాన కారకుడు మంత్రి కుమారుడు పరిటాల శ్రీరాం అని తెలిసినా ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇదే విషయమై ఫిర్యాదు చేస్తే ఆ బాబు అలాంటి వ్యక్తి కాదని వెనుకేసుకొస్తారు. ఎస్పీకి శ్రీరాం ‘బాబు’గానే కన్పిస్తారు కానీ ముద్దాయిగా కన్పించడు. శవ పంచనామలో, ఎఫ్ఐఆర్లో శ్రీరాం పేరు నమోదు చేయాలని బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేసినా ఎక్కడా నమోదు చేయట్లేదు. రాప్తాడు నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరూ తిరగలేని పరిస్థితి. శ్రీరాం యువసేన పేరుతో రౌడీషీటర్లు(ధర్మవరం) అమాయకులపై దాడులు చేస్తున్నారు. ఎన్ఎస్ గేట్ యూత్ కన్వీనర్‌పై దాడిని స్థానిక ప్రజలు కండించడంతో పోలీసులు కేసు కట్టారు. కేసు కట్టనివి ఎన్నో ఉన్నాయి. తోపుదుర్తి గ్రామంలో పోలింగ్ రోజున పరిటాల శ్రీరాం వచ్చి ప్రజలపై రాళ్లు రువ్వి, దాడులు చేసినా ఆయనపై కేసు కట్టడంతో పాటు అమాయక ప్రజలపైనా కేసులు పెట్టారు. అదే గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకున్ని తెలుగుదేశం నాయకులు చెప్పుతో కొట్టారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. ఈ విషయమై డీఎస్పీ, సీఐను ఆరా తీస్తే ఎస్పీ ఒత్తిడి పెడుతున్నారని చెప్పారు. ఎస్పీ ప్రభుత్వంతో జీతం తీసుకుంటున్నారా? లేక ఎవరితో జీతం తీసుకుంటున్నారో ఆలోచన చేయాలి. ఎస్సీకి చెందిన దళిత రాజన్న అనే వ్యక్తి టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు.’ ఓటమి భయంతోనే దాడులు ‘‘ఈ ఎన్నికలు ప్రజలు, పరిటాల కుటుంబం మధ్య జరిగాయి. ఓటమి భయంతోనే పరిటాల శ్రీరాం ప్రతి గ్రామంలో వర్గాలు, కక్షలు రేకెత్తిస్తున్నారు. నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌కు తిరిగి బీజం వేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చట్టం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. సరైన పోలీసు అధికారులతో శాంతిభద్రతలు కాపాడుతాం.’’ అన్నారు. ప్రకాష్ రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, నాగసముద్రం యూత్ మండల కన్వీనర్ ఓబులేసు, తదితర గ్రామస్తులు ఉన్నారు. -
అది చంద్రబాబు ఎన్నికల స్టంట్ : తోపుదుర్తి
సాక్షి, అనంతపురం : జిల్లాకు సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే చంద్రబాబు వణికిపోతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేస్తానని మోసం చేశారని అన్నారు. పేరూరు డ్యాంకు నీటి తరలింపు కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని తెలిపారు. వైఎస్సార్ కృషి వల్లే అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయని వెల్లడించారు. డ్వాక్రా మహిళలను భయపెట్టి సీఎం సభలకు తరలిస్తున్నారని ఆరోపించారు. గత ఆరేళ్లుగా హంద్రీనీవా నీరు వస్తున్నా ఆయకట్టుకు ఎందుకు నీరివ్వలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై ఆర్థిక మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో కలసి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కాపులకు రిజర్వేషన్లను ఎందుకు సాధించలేకపోయిందని నిలదీశారు. 50 శాతం రిజర్వేషన్ కటాఫ్‌ను ఎత్తివేసేందుకు అన్ని పార్టీల మద్దతుతో ముద్రగడ పద్మనాభం పోరాడాలని సూచించారు. -
‘పరిటాల సునీతానే.. ఆయన చావుకు కారణం’
ఆత్మకూరు : ‘మంత్రి పరిటాల సునీత అధికార దాహానికి అంతు లేకుండా పోతోంది. భూ దాహంతో రైతుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. రైతు కేశవ్‌నాయక్ చావుకు మంత్రి సునీతే కారణం’ అంటూ వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. కేశవనాయక్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ముట్టడించారు. కార్యక్రమానికి సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ నాయకులు మద్ధతు పలికారు. మండలాలు పంచుకుని.. రాప్తాడు నియోజకవర్గంలోని ఒక్కొ మండలానికి ఇన్చార్జ్గా తన బంధువులను నియమించి మంత్రి సునీత పెత్తందారి పాలన సాగిస్తున్నారని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా అధికారులు ముందుగా మంత్రి గడప తొక్కాల్సి వస్తోందన్నారు. ఇన్పుట్ సబ్సిడీని మంత్రి సోదరుడు బాలాజీ చెప్పిన వారికే స్థానిక వ్యవసాయాధికారి పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఎంపీడీవో ఆదినారాయణ పచ్చ చొక్కా వేసుకున్న అధికార పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. సర్పంచ్‌లను కీలుబొమ్మలను చేసి ఆడిస్తున్నారన్నారు. టీడీపీలో చేరకపోతే చెక్ పవర్ రద్దు చేస్తామంటూ సాక్షాత్తూ ఓ అధికారి చెప్పడం సిగ్టుచేటన్నారు. అన్యాయాలపై పోలీసులు సైతం కళ్లు మూసుకున్నారన్నారు. అన్యాయాలపై ప్రజలు తిరగబడితే మంత్రి సునీతనే కాదు ఎవరూ కాపాడలేరంటూ బాలాజీకి హితవు పలికారు. నాలుగేళ్ల పాలనలో అక్రమాల పుట్ట నాలుగేళ్ల పాలనలో నియోజకవర్గంలో మంత్రి సునీత అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లుగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులు అడ్డుకున్నారన్నారు. వై.కొత్తపల్లిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను డి.నారాయణస్వామి చేస్తున్నాడని గుర్తు చేశారు. ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఈ పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కుర్లపల్లి వద్ద దళితులకు ఇచ్చిన భూమిని మంత్రి బంధువు లాగేసుకుని కంకర మిషన్ వేసి, సిద్ధరాంపురం వద్ద అనధికారికంగా గుట్టలను ఆన్లైన్లో వారి పేరుపై చేసుకున్నారన్నారు. పుట్టపర్తి వద్ద బైపాస్ నిర్మాణానికి ఎకరాకు రూ.23 లక్షలు ఇస్తుండగా ఆత్మకూరు వద్ద మాత్రం ఎకరాకు రూ.5 లక్షల ఇచ్చి అన్నదాతల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా తాము చేస్తున్నది అక్రమమని అధికారులు గుర్తించి, ప్రజలకు న్యాయం చేకూర్చకపోతే మండలంలో ఏ ఒక్క ప్రభుత్వాధికారిని తిరగబోనివ్వమని హెచ్చరించారు. రూ. 20 లక్షలు పరిహారం ఇవ్వండి ఆత్మహత్య చేసుకున్న రైతు కేశవనాయక్ కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారంతో పాటు ఐదు ఎకరాల పొలాన్ని ఇవ్వాలని ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన విషయం ముందుగానే తెలుసుకున్న తహసీల్దార్ మంగళవారం విధులకు రాలేదు. దీంతో ఆర్డీవో మలోలాతో ప్రకాష్‌రెడ్డి, సీపీఎం నేతలు నేరుగా ఫోన్లో మాట్లాడారు. అక్రమంగా భూమిని మరొకరి పేరుపై చేసిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్‌పై విచారణ జరిపి తహసీల్దార్‌పై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రాజారాం, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ముమ్మాటికీ ఇది హత్యే అధికారుల చేతిలో రూ. వెయ్యి పెడితే రాత్రికి రాత్రి ఒకరి పేరుమీద ఉన్న పొలాన్ని మరొకరి పేరు మీద మార్చేస్తున్నారు. ఇలా చేసే కేశవ్‌నాయక్ ప్రాణాన్ని బలిగొన్నారు. ఆయన భార్యబిడ్డల్ని రోడ్డన పడేశారు. ఇది ముమ్మాటికీ అధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేసిన హత్యే. ఆత్మహత్యతో ఈ అన్యాయం వెలుగు చూసింది. ఇలాంటి అన్యాయాలు ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి. బాధిత రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటూ పోతే శవాల గుట్టలు తేలుతాయి. ప్రభుత్వ కార్యాలయాలు టీడీపీ నాయకుల జాగీరు కాదు. నియంతృత్వ పాలన రాప్తాడు నియోజకవర్గంలో నియంతృత్వ పాలన సాగుతోంది, ఇంకా ఈ ప్రాంత ప్రజలకు స్వాతంత్య్రం రాలేదు. రామగిరి మండలంలో ఏవైనా కార్యక్రమాలకు వెళ్తే మంత్రి పరిటాల సునీత.. టీడీపీ గుండాలతో దాడులను ప్రోత్సహిస్తారు. అంటే మంత్రి సొంత మండలానికి వెళ్లాలంటే వీసాలు, పాస్‌పోర్టులు లాంటివి తీసుకెళ్లాలా? వీరి అక్రమాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇటీవల కనగానపల్లిలో ఓ రెవెన్యూ అధికారిని చెప్పుతో కొట్టారంటే ఇంత కన్నా అన్యాయం ఏముంటుంది? వైఎస్సార్ సీపీలో చేరిన ఎంపీపీని బెదిరించి, బలవంతంగా టీడీపీని వీడకుండా చేశారు. ప్రజలు ఐక్యమత్యంతో ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలి. -
చంద్రబాబే అసలైన ఫ్యాక్షనిస్టు
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలైన ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబును ఎన్టీఆర్ గాడ్సేతో పోల్చారని, దానికన్నా జగన్ తక్కువ మాట (ముఖ్య‘కంత్రి) అన్నారని టీడీపీ నేతలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై, ప్రత్యేకించి రాయలసీమపై ప్రభుత్వ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఉరవకొండ ధర్నాతో టీడీపీ పునాదులు కదులుతున్నాయన్న భయంతో ఎప్పుడూ కలవని టీడీపీ నేతలు వైఎస్ జగన్‌ను ఫ్యాక్షనిస్టుతో పోల్చడంపై అగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ‘మనసులో మాట’ అనే పుస్తకంలోని మాటల్ని మాత్రమే జగన్ ఉదహరించారని, దాన్ని మంత్రులు తప్పుపట్టడం హాస్యాస్పదమన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కానీ, ఆయన కుమారుడు జగన్ గానీ ఏది చెబుతారో, అది చేసి చూపిస్తారని చెప్పారు. అంతే కానీ టీడీపీ నేతల్లా ప్రజల సొమ్మును దోచుకుంటూ ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేయరని విమర్శించారు. ప్రాజెక్టులన్నీ వైఎస్సార్ పుణ్యమే అని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుగంగను ఎన్టీఆర్ మానసపుత్రికగా చెప్పుకుంటున్న టీడీపీ నేతలు ఆ ప్రాజెక్టులో అత్యధిక శాతం పనులు చేసింది వైఎస్సార్ అనే సంగతి తెలుసుకుంటే మంచిదన్నారు. -
పవన్‌కల్యాణ్‌పై మండిపాటు
అనంతపురం: పవర్ స్టార్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్‌పై వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అతిపెద్ద ఫ్యాక్షనిస్ట్ అని విమర్శించారు. దివంగత టిడిపి నేత పరిటాల రవి ద్వారా వందలాదిమందిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో శాంతిభద్రతలు బేషుగ్గా ఉన్నాయని చెప్పడం పవన్‌కే చెల్లిందని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పవన్‌కల్యాణ్‌కు గుండుకొట్టించారన్న ప్రచారం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇది వాస్తవమో కాదో కల్యాణే చెప్పాలని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు.