
సాక్షి, అనంతపురం: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చే కృష్ణా నీటిని మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి కర్ణాటకలోని తురకలాపట్నం, పెన్నానది మీదుగా పేరూరు డ్యాంకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా ఆయన బెంగళూరుకు వెళ్లి కర్ణాటక బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్‌తో కలిసి ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్పతో చర్చలు జరిపారు.
ఈ చర్చల అనంతరం నీటి తరలింపు ప్రతిపాదనలపై కర్ణాటక సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను తీసుకొస్తామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు ఎక్కువగా ఖర్చు చేయకుండా హంద్రీనీవా నీటిని పేరూరు డ్యాంకు తీసుకొని వచ్చి ఈ ప్రాంత రైతులకు సాగునీటి కొరతను తీర్చాలన్నదే మా ముఖ్య ఉద్ధేశ్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment