peruru dam
-
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పాదయాత్ర
పావగడ: పేరూరు డ్యామ్‌కు ప్రభుత్వం ఒక టీఎంసీ నీటిని కేటాయించడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. కర్ణాటకలోని నాగలమడక నుంచి పేరూరు వరకు చేపట్టిన 28 కి.మీ పాదయాత్రలో ఎంపీ మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తితో పాటు భారీ ఎత్తున రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ చలువతోనే ‘పేరూరు’కు నీళ్లు ప్రభుత్వ నిర్ణయంతో అనంతపురం జిల్లా సరిహద్దులోని నాగలమడక ఉత్తర పినాకిని నది వద్ద కృష్ణా జలాలకు గురువారం మంత్రి శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు గంగపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ.5,800 కోట్లు కేటాయిస్తే.. చంద్రబాబు హామీలిచ్చి రైతులను మోసం చేశారని ఆరోపించారు. కృష్ణా జలాలను నాగలమడక మీదుగా పేరూరు డ్యాంకు తరలించడానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కృష్ణా నీటిని నాగలమడక మీదుగా పేరూరు డ్యాంకు చేర్చడానికి టీడీపీ అడ్డుపడిందని, అయినా ప్రకాశ్‌రెడ్డి కృత నిశ్చయంతో నీటిని తరలించారని కొనియాడారు. ఇదిలాఉండగా.. స్థానిక నాయకుల గంగపూజ కార్యక్రమం అనంతరం అధికారులు హంద్రీనీవా నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా తురకలాపట్నం మీదుగా నాగలమడక చెక్‌డ్యాం వరకు, అక్కడి నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలిస్తున్నారు. చదవండి: సిగ్గుంటే రాజీనామా చెయ్.. రోడ్ల మరమ్మతులకు రూ.2,205 కోట్లు మంజూరు -
రాప్తాడును కోనసీమగా మారుస్తాం
హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను పారించి రాప్తాడు నియోజకవర్గాన్ని కోనసీమగా మారుస్తామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన పేరూరు డ్యాంను సందర్శించి గంగ పూజ నిర్వహించారు. ఇదే సమయంలో ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాక్షి, అనంతపురం: హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను పారించి రాప్తాడు నియోజకవర్గాన్ని కోనసీమగా మారుస్తామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. తొలిసారిగా హంద్రీనీవా కాలువ నుంచి పేరూరు డ్యాంకు కృష్ణా జలాలు వచ్చిన సందర్భంగా శనివారం రామగిరి మండలంలోని పేరూరు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును ఎమ్మెల్యే సందర్శించారు. గంగపూజ అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత వచ్చిన పాలకులు అలసత్వం ప్రదర్శించారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహానేత ఇచ్చిన హామీ మేరకు హంద్రీనీవా కాలువ ద్వారా మడకశిర బ్రాంచి కెనాల్ నుంచి పేరూరు డ్యాంకు నీరందించేందుకు జీఓ తీసుకొచ్చారన్నారు. కేవలం రూ.కోటిన్నర ఖర్చుతో పేరూరు డ్యాంకు నీరు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులను దోచుకునేందుకు మాజీ మంత్రి పరిటాల సునీత రూ.804 కోట్లతో జీఓ తీసుకొచ్చిందని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కృష్ణా జలాల ద్వారా 10 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రత్యక్షంగా, 40 వేల ఎకరాలకు పరోక్షంగా సాగు నీరందుతున్నారు. నియోకవర్గ పరిధిలో హంద్రీనీవా కింద మరో నాలుగు రిజర్వాయర్లు నిర్మిస్తామని, వీటి ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందించి సస్యశ్యామలం చేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ నాగేశ్వర రెడ్డి, నాయకులు క్రిష్ణారెడ్డి, వెంకటరాముడు, పసుపుల ఆది, వెంకటేష్, అమరనాథరెడ్డి, గోపాల్‌రెడ్డి, నరసింహారెడ్డి, మీనుగ నాగరాజు, నాగముని, గోవిందురెడ్డి, బాలపోతన్న, తదితరులు పాల్గొన్నారు. చదవండి: భరత్ అనే నేను.. -
కర్ణాటక సీఎంతో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి భేటీ
సాక్షి, అనంతపురం: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చే కృష్ణా నీటిని మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి కర్ణాటకలోని తురకలాపట్నం, పెన్నానది మీదుగా పేరూరు డ్యాంకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా ఆయన బెంగళూరుకు వెళ్లి కర్ణాటక బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్‌తో కలిసి ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్పతో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం నీటి తరలింపు ప్రతిపాదనలపై కర్ణాటక సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను తీసుకొస్తామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు ఎక్కువగా ఖర్చు చేయకుండా హంద్రీనీవా నీటిని పేరూరు డ్యాంకు తీసుకొని వచ్చి ఈ ప్రాంత రైతులకు సాగునీటి కొరతను తీర్చాలన్నదే మా ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. -
మంత్రి సునీతను నిలదీసిన తెలుగు తమ్ముళ్లు
పేరూరుకే కాదు.. మా చెరువులకూ నీరివ్వండి కళ్యాణదుర్గం : ‘అక్కా... పేరూరు డ్యామ్‌కే కాదు... మొదట మా కళ్యాణదుర్గం చెరువులకూ నీరివ్వండి’ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను తెలుగు తమ్ముళ్లు నిలదీశారు. ఆదివారం సివిల్ సప్లై గోదాముల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేరూరు డ్యామ్‌కి నీరు తీసుకొస్తే రైతు సమస్యలు తీరుతాయని మంత్రి పరిటాల సునీత చెప్పారు. కార్యక్రమం ముగిశాక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుమారుడు మారుతి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాదన్నలు కళ్యాణదుర్గం రైతుల కష్టాలు తీరాలంటే మొదట ఈ ప్రాంత చెరువులకు నీరందించాలని మంత్రిని డిమాండ్ చేశారు. ఇక్కడికి నీరిచ్చిన తర్వాతే పేరూర్ డ్యామ్‌కు తీసుకెళ్లండన్నారు. ఇందుకు స్పందించిన మంత్రి ఇది వరకే చేయించిన సర్వే ప్రకారం రూ.800కోట్లు ఖర్చు అవుతుందని, కళ్యాణదుర్గం మీదుగా చెరువులకు నీరు నింపి పేరూరుకు తీసుకెళ్లాలంటే నిధులు రెండింతలు కావాలని తెలపగా.. ఇదే ప్రతిపాదనను అమలు చేయాలని నాయకులు కోరారు.