Handri Neeva Project (HNSS)
-
అది చంద్రబాబు ఎన్నికల స్టంట్ : తోపుదుర్తి
సాక్షి, అనంతపురం : జిల్లాకు సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే చంద్రబాబు వణికిపోతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేస్తానని మోసం చేశారని అన్నారు. పేరూరు డ్యాంకు నీటి తరలింపు కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని తెలిపారు. వైఎస్సార్ కృషి వల్లే అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయని వెల్లడించారు. డ్వాక్రా మహిళలను భయపెట్టి సీఎం సభలకు తరలిస్తున్నారని ఆరోపించారు. గత ఆరేళ్లుగా హంద్రీనీవా నీరు వస్తున్నా ఆయకట్టుకు ఎందుకు నీరివ్వలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై ఆర్థిక మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో కలసి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కాపులకు రిజర్వేషన్లను ఎందుకు సాధించలేకపోయిందని నిలదీశారు. 50 శాతం రిజర్వేషన్ కటాఫ్‌ను ఎత్తివేసేందుకు అన్ని పార్టీల మద్దతుతో ముద్రగడ పద్మనాభం పోరాడాలని సూచించారు. -
హంద్రీనీవా.. వాస్తవం కనవా!
హంద్రీనీవా నీటితో ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. అసంపూర్తి పనులతో ప్రజలను మభ్యపెడుతోంది. ఇంతకాలం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి.. ఇప్పుడేమో లేపాక్షి ఉత్సవాల నాటికి నీరంటూ నమ్మబలుకుతోంది. వాస్తవ పరిస్థితి చూస్తే అడుగడుగునా అవాంతరాలే. పది రోజుల్లో అన్నింటినీ అధిగమిస్తే తప్ప లక్ష్యం నెరవేరని పరిస్థితి. ఇంత చేసినా.. చెరువులకు నీరివ్వడం కష్టమే. ♦ మొదటి, రెండోదశ పనులు పూర్తి చేసి 2015 నాటికే 7లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం. ♦ 2014 సెప్టెంబర్‌లో అనంతపురంలో జల వనరుల శాఖమంత్రి ఉమామహేశ్వరావు ప్రకటన మూడు నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రతి చెరువునూ నీటితో నింపుతాం. ♦ 2015 ఫిబ్రవరిలో గవర్నర్ నరసింహన్ సాక్షిగా ముఖ్యమంత్రి హామీ ♦ 2016 డిసెంబర్లో గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద నీటిని విడుదల చేశారు. నేటికి 15 నెలలు కావస్తున్నా హిందూపురానికి చుక్క నీరు చేరలేదు. ఇక మడకశిర ప్రాంతానికి నీరు చేరడమూ అనుమానమే. హిందూపురం అర్బన్ : కరువు జిల్లాను కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేసేందుకు 40 టీఎంసీల సామర్థ్యంతో 1988లో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 1994లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను సాగునీటి నుంచి తాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చి ఐదు టీఎంసీల సామర్థ్యానికి కుదించారు. దీనిపై అప్పట్లో ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టడంతో పది టీఎంసీలకు మార్పు చేశారు. ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపన చేసిన చంద్రబాబు హంద్రీనీవా పనులను మాత్రం పూర్తి చేయలేకపోయారు. 2004లో అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం.. హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌కు పూర్తి స్థాయిలో జీవం పోసింది. 40 టీఎంసీల సామర్థ్యాన్ని పునరుద్ధరించడంతో పాటు రాయలసీమ మొత్తంగా 6.02లక్షల ఎకరాల ఆయకట్టును వైఎస్సార్ ప్రకటించారు. ఇందులో అనంత జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. జీడిపల్లి వరకు చేరిన కృష్ణా జలాలను పెనుకొండ సమీపంలో గొల్లపల్లి రిజర్వాయర్‌కు చేర్చడం ద్వారా మడకశిర సబ్ బ్రాంచ్ కెనాల్ నుంచి హిందూపురం, మడకశిర ప్రాంతాలకు సాగునీరు ఇచ్చేందుకు పనులు ప్రారంభించారు. దాదాపు 85 శాతం పనులను వైఎస్సార్ పూర్తి చేశారు. 2014 వరకు గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా 52 నుంచి 58వ ప్యాకేజీల్లో మడకశిర ప్రాంతం వరకు సుమారు 65 శాతం పనులు పూర్తయ్యాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన 35 శాతం పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆయకట్టు కుదింపు మడకశిర బ్రాంచ్‌కెనాల్ ద్వారా పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి, లేపాక్షి, హిందూపురం, పరిగి, మడకశిర, గుడిబండ, రొళ్ల, ఆగళి, అమరాపురం మండలాలకు నీరు అందించేలా ఈ ప్రాజెక్టులో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు పెనుకొండ మండలంలో 6,113 ఎకరాలు, రొద్దం మండలంలో 8,528 ఎకరాలు సోమందేపల్లి మండలంలో 18.344 ఎకరాలు, హిందూపురం 10.665 ఎకరాలు, లేపాక్షి మండలంలో 9,171 ఎకరాలు, పరిగి 6,971 ఎకరాలు, మడకశిర ప్రాంతంలో 18,108 ఎకరాల చొప్పున మొత్తం 77,900 ఎకరాలకు ఆయకట్టు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రణాళికలు మార్చేసి 32.227 ఎకరాలకు కుదించారు. చెరువుల సంఖ్య తగ్గింపు మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా పెనుకొండలో ఐదు చెరువులు, రొద్దంలో రెండు, గోరంట్ల మండలంలో 136, చిలమత్తూరు మండలంలో 28 చెరువులకు నీరు ఇచ్చేలా ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు పెనుకొండ, రొద్దం మండలాలకు మినహా మిగిలిన మండలాల చెరువులకు ఎగనామం పెట్టారు. పెనుకొండ మండలంలోనే గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించినప్పటికీ అక్కడ కేవలం కోనాపురం, మావటూరు, రేగడ, అడదాకులపల్లి, నాగలూరు చెరువులను మాత్రమే జాబితాలో చూపుతున్నారు. అయితే గొల్లపల్లి రిజర్వాయర్ కింద 10వేల ఆయకట్టును ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఒప్పందం ఏమైంది ఎవరూ చెప్పడం లేదు. రొద్దం మండలంలో తొలుత 8,528 ఎకరాల ఆయకట్టు ప్రకటించారు. అయితే తురకలాపట్నం, సానిపల్లి చెరువుల ఆయకట్టును మాత్రమే చూపుతూ.. మిగిలిన ఆయకట్టును ఎగ్గొట్టారు. నీటిని మొత్తం కియా కంపెనీకి నీరిచ్చే యోచనతోనే సంఖ్య కుదించినట్లు తెలుస్తోంది. పనులన్నీ అసంపూర్తి.. చాకర్లపల్లి రైల్వే ట్రాక్ వద్ద బాక్స్పుషింగ్ పనుల వద్ద సిమెంట్ ఫ్లోరింగ్ పనులు పూర్తి కాలేదు. లిఫ్టింగ్ మోటర్ల ఏర్పాటు పూర్తి స్థాయిలో కాలేదు. ఆరు పంపింగ్ మోటర్లకు గాను కేవలం ఒకట్రెండుతో సరిపెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమందేపల్లి రోడ్డు బ్రిడ్జి వద్ద కాలవ మట్టిగోడల నిర్మాణాలు పూర్తి కాలేదు. న్యాయమైన పరిహారం ఇవ్వకపోవడంతో రాచేపల్లి వద్ద మూడు ఎకరాల్లో కాలువ తవ్వకం పనులను రైతులు అడ్డుకున్నారు. కాలువ తవ్వే ప్రాంతంలో అటువైపు ఉన్న పొలాలకు రైతులు వెళ్లేందుకు అనువుగా వంతెన నిర్మాణాలు పూర్తి చేయలేదు. దేమకేతపల్లి వద్ద రెండు ఎకరాల పరిహారం కోసం రైతు కోర్టును ఆశ్రయించడంతో అక్కడ పనులు ఆగిపోయాయి. కిరికెర నుంచి మడకశిర వరకు 56, 58 ప్యాకేజీల పనులు ఇంకా పూర్తికాలేదు. పెన్న, జయమంగళీ నదుల్లో పైపులైన్లు వేయాల్సి ఉంది. అప్పలకుంట వద్ద కొంత భూమి సేకరణ చేయాల్సి ఉంది. అవాంతరలన్నీ పది రోజుల్లో తొలగిపోతే తప్ప లేపాక్షికి హంద్రీ–నీవా నీరు చేరే పరిస్థితి లేదు. ఒకవేళ ఇవన్నీ పూర్తి చేసినా.. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి లేపాక్షి వరకు మధ్యలో ఉన్న దాదాపు 35 చెరువులకు నీరు చేరే పరిస్థితి లేదు. -
బాబు పాలనలో 'ఆయ'కట్
ఉరవకొండ: చంద్రబాబు పాలనలో హంద్రీనీవా పరిధిలోని ఆయకట్టుకు నీరు రాకుండా పోయిందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. అసలు ఆయకట్టుకు నీరివ్వాలన్న చిత్తశుద్ధే ప్రభుత్వానికి లేనట్టుందని దుయ్యబట్టారు. హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో ‘జల సంకల్ప యాత్ర’ పేరిట విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం నింబగల్లుకు చేరింది. సర్పంచ్ వరలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకులు హనుమప్ప, చిదంబరి, రమేష్, ఈశ్వర్, వెంకటేష్, ఓబుళప్ప, శివరాజ్ తదితరులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ మండల కన్వీనర్ వెలిగొండ నరసింహులు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మార్చినాటికి హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదని విరుచుకుపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని గతంలో అనేక దీక్షలతో పాటు స్వయంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉరవకొండలో ధర్నాకు దిగినా ఈ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మాకు హక్కుగా ఇవ్వాల్సిన నీటిని ఒక నాయకుడు తాడిపత్రి, మరొకరు బుక్కపట్నం, ధర్మవరానికి తీసుకెళితే మేము చూస్తు ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే కరువు పీడిత అనంతపురం జిల్లాలోని 3.50లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో యువనేత నిఖిల్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కిసాన్‌సెల్ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, రైతు విభాగం రాయలసీమ జిల్లాల కన్వీనర్ తరిమెల శరత్‌చంద్రారెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు నారాయణరెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి, వైఎస్సార్సీపీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కె.వి.రమణ, రైతు సంఘం నాయకులు రాజారాం, నరేంద్రబాబు, బీసీ సెల్ నాయకులు అనిల్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. -
ప్రారంభించిన 24 గంటల్లోనే..
సాక్షి, విజయవాడ : ముచ్చమర్రి ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటి విడుదల నిలిచిపోయింది. సీఎం చంద్రబాబు నాయుడు ముచ్చుమర్రి నుంచి మోటార్లు ఆన్‌చేసి 24 గంటలు గడవక ముందే శనివారం అధికారులు నీటిని నిలిపివేశారు. ముచ్చుమర్రి నుంచి 4 పంపుల ద్వారా హంద్రీనీవాకు నీరు ఇచ్చి రాయలసీమ రైతులను ఆదుకుంటామని శుక్రవారం నీరు విడుదల సందర్భంగా చంద్రబాబు తెలిపారు. అయితే 24 గంటల్లోనే నీటిని నిలిపివేశారు. కాగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్లో నీళ్లు అందకపోవడంతోనే నీటిని నిలిపినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎత్తిపోతల నుంచి రెండు పంపుల ద్వారా కేసీ కెనాల్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. -
హంద్రీనీవా.. కన్నీటి తోవ
డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లొదిలే కుట్ర - ఇప్పటికే 2015లో జీఓ జారీ - తెరపైకి లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ - ఉరవకొండలో 20వేల హెక్టార్లకు రూ.899 కోట్లు కేటాయింపు - ఇందులో 50 శాతం నిధులతో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యే అవకాశం - ప్రభుత్వ తీరుతో రైతుల్లో గందరగోళం రాష్ట్ర ప్రభుత్వం అనంత రైతును దగా చేస్తోంది. హంద్రీనీవా ఆయకట్టుకు ఏడాదిలో నీరిస్తామని 2014లో హామీ.. ఆయకట్టుకు నీరిచ్చే డిస్ట్రిబ్యూటరీలు తీయొద్దని 2015లో జీఓ.. 2016 ఖరీఫ్‌కు నీరిస్తామని ఎస్ఈ, సీఈలతో ప్రకటన.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి భూమి సమతులంగా లేదని.. లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తున్నామని కొత్త పల్లవి. మొత్తంగా రూ.899 కోట్లకు ‘టెండర్’ పెడుతూ అస్మదీయులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షిప్రతినిధి, అనంతపురం: హంద్రీనీవా ద్వారా రాయలసీమలో 6.02లక్షల ఎకరాలకు నీరందించాలని సంకల్పిస్తే అందులో 3.45లక్షల ఎకరాల ఆయకట్టు ‘అనంత’లోనే ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫేజ్–1 పనులు 2012లోనే పూర్తయ్యాయి. ఐదేళ్లుగా జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరాయి. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే 1.18లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే వీలుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఏడాదిలో హంద్రీనీవా ఆయకట్టుకు నీళ్లిస్తామని సీఎం, మంత్రులు ప్రకటించారు. 2015 ఫిబ్రవరిలో కుప్పానికి నీళ్లు తీసుకెళ్లేదాకా ఆయకట్టుకు డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని జీఓ 22 జారీ చేశారు. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి. ఈ క్రమంలో 33, 34 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 33, 34 ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 28వేల ఎకరాలకు నీరందుతుంది. 33వ ప్యాకేజీని ఈపీఐఎల్(ఇంజనీరింగ్ ప్రాజñక్టు ఇండియా లిమిటెడ్), 34ను ఆర్‌వీసీపీఎల్(రెడ్డివీరన్న కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్) చేస్తున్నాయి. 33వ ప్యాకేజీలో 8.9 కిలోమీటర్లు ప్రధాన కాలువ తవ్వి.. ఆ పరిధిలో ఉప, పిల్లకాలువలు తవ్వాలి. ఈ పనులు పూర్తయితే 10,500 ఎకరాలకు నీరందుతుంది. అయితే పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కారణమేంటని ఆరా తీస్తే.. 5–6 కిలోమీటర్ మధ్య రాయి ఉంది. బ్లాస్టింగ్ చేయాలని అధికారులు చెప్పగా.. దీన్ని పక్కనపెట్టడంతో పాటు మేజర్ కెనాల్‌లోని కల్వర్టులను కూడా పూర్తి చేయని పరిస్థితి. ఈ పనులకు రూ.12కోట్లు ఇచ్చారని, 2004–05 రేట్ల ప్రకారం ఉండటంతో ఏజెన్సీ పనులు చేయకుండా వెనుదిరిగిందని అధికారులు మరోమాట చెప్పారు. 34వ ప్యాకేజీలో కూడా డిస్ట్రిబ్యూటరీ–1, డిస్ట్రిబ్యూటరీ–2 అని రెండు ప్రధాన కాలువలు తవ్వాలి. ఇందులో డీ–1, 8.25, డీ–2. 22 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ తవ్వాలి. డీ–1 కింద 5వేలు, డీ–2 కింద 12, 500 ఎకరాలకు ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పనులకు బ్రేక్ పడింది. ఇదేమంటే 33 ప్యాకేజీలాగే పాతరేట్లు అని కొర్రీ పెడుతున్నారు. నిజానికి కొత్తరేట్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కాబట్టి పనులు చేస్తే ఏజెన్సీలకు ఎలాంటి నష్టం రాదు.. లాభం తప్ప. వీటితో పాటు 36 ప్యాకేజీ మరొకటి ఉంది. రూ.336కోట్లు కేటాయిస్తూ దీనికి గతేడాది ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ మూడు ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సమతులం పేరుతో డిస్ట్రిబ్యూటరీలను తప్పించే ఎత్తుగడ ఉరవకొండ నియోజకవర్గంలో కమ్యూనిటీ లిఫ్ట్, డ్రిప్ ఇరిగేషన్(సీఎల్ఐడీ) పథకం పేరుతో రూ.899కోట్లు కేటాయిస్తూ ఈ నెల 5న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ ప్యాకేజీల్లో భూభాగం సమతులంగా లేకపోవడంతో 11,680 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొందని, అందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంది. అంటే ఈ ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు చేయమని చెప్పకనే చెప్పినట్లయింది. అలాగే ఈ ఆయకట్టుకు నీరిందంచడానికి కేటాయించిన 1.45టీఎంసీలు, డ్రిప్ ఇరిగేషన్ అమలు చేయడం వల్ల మిగిలే 0.24 టీఎంసీలు కలిపి 1.69టీఎంసీలతో 20వేల హెక్టార్లకు అందిస్తామని పేర్కొంది. ‘ఆలీ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు.. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేదు.. నీళ్లు ఇవ్వలేదు.. అప్పుడే 0.24 టీఎంసీలు మిగిలాయని ప్రభుత్వం ఎలా చెబుతుందో అంతుపట్టని పరిస్థితి. జీఓలో పేర్కొన్న అంశాలు, 33, 34 ప్యాకేజీల పురోగతి పరిశీలిస్తే డిస్ట్రిబ్యూటరీలను పక్కనపెట్టినట్టే అనేది సుస్పష్టమవుతోంది. ఆయకట్టు స్థిరీకరిస్తేనే నీటిపై హక్కు ఫేజ్–1లో 1.18 లక్షల ఎకరాలకు హంద్రీ–నీవాపై హక్కు రావాలంటే డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేసి ఆయకట్టును స్థిరీకరించాలి. అప్పుడే ఈ నీటిపై రైతులకు హక్కు వస్తుంది. అలా కాకుండా లిఫ్ట్, డ్రిప్ అంటూ డిస్ట్రిబ్యూటరీని పక్కనపెడితే ఆయకట్టు స్థిరీకరణ జరగదు. దీంతో నీటిపై రైతులు హక్కును కోల్పోతారు. పైగా లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్‌కు రూ.899కోట్లు కేటాయించారు. ఫేజ్–1లో పూర్తిగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసినా అందులో 50శాతం నిధులు కూడా ఖర్చు కావు. ‘అనంత’లో సాగునీరు అందక, ఏటా రైతులు ఆత్మహత్యలకు ఉపక్రమిస్తున్నా ప్రభుత్వం మాత్రం మానవీయ కోణంలో ఆలోచించి ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. డిస్ట్రిబ్యూటరీలతోనే చట్టబద్ధమైన హక్కులు చట్టబద్ధమైన హక్కులు రావాలంటే డిస్ట్రిబ్యూటరీలు తప్పనిసరి. లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇస్తే ఆయకట్టు స్థిరీకరణ జరగదు. రైతులకు హక్కు ఉండదు. దీనికి రూ.900కోట్లు ఖర్చు చేస్తున్నారు. రూ.20వేల ఎకరాలకు నీరిస్తామంటున్నారు. ఇందులో 50శాతం లోపు ఖర్చు చేస్తే ఫేజ్–1లోని రూ.1.18లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు. ఆపై లిఫ్ట్, డ్రిప్ అంటే నమ్మొచ్చు. డిస్ట్రిబ్యూటరీని పక్కనపెట్టి ఈ చర్యలకు ఉపక్రమిస్తే నిధులు దండుకునే ఉద్దేశం మినహా మరొకటి కాదు. – రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి నీళ్లున్నా ఆయకట్టుకు ఇవ్వని దౌర్భగ్యపు ప్రభుత్వం ఇదే.. హెచ్చెల్సీ ద్వారా 10, హంద్రీనీవా ద్వారా 34 కలిపి గతేడాది 44టీఎంసీల నీళ్లు వచ్చాయి. వీటితో 5–6లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు. కానీ డిస్ట్రిబ్యూటరీలు చేయకుండా ఎకరాకు కూడా నీళ్లివ్వని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదే. డిస్ట్రిబ్యూటరీలు చేయకుండా 0.24 టీఎంసీ మిగిలింది. వీటితో కలిపి 1.69టీఎంసీలను డ్రిప్ ద్వారా ఇస్తామంటున్నారు. దీనికే మిగులు జలాలు అని ఆలోచిస్తే పేరూరు, బీటీపీకి అవసరమయ్యే 5–10 టీఎంసీలను ఎలా కేటాయిస్తారు. మోసం చేయడం, డబ్బులు దండుకోవడం మినహా మరొకటి కాదు. ఆయకట్టు పూర్తి చేసి ఉంటే చంద్రబాబుకు మేమే హారతి పట్టేవాళ్లం. జలహారతి అవసరం లేదు. – అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
హంద్రీ-నీవా పనులు అడ్డుకున్న రైతులు
వజ్రకరూరు: మండల పరి«ధిలోని పొట్టిపాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న హంద్రీ-నీవా కాలువ వెడల్పు పనులను పలువురు రైతులు అడ్డుకున్నారు. కాలువ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల పొలాల్లో హంద్రీ-నీవామట్టి పడటంతో రైతులు పనులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న హంద్రీ-నీవా డీఈలు జగన్మోహన్రెడ్డి, కిరణ్ తదితరులు అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం పరిసరప్రాంతంలో అధికారులు సర్వేకూడా చేయించారు. ఈ సందర్భంగా రైతులు రవికుమార్, ముత్యాలయ్య, నరసింహారెడ్డి, అంజినయ్య, రుద్రప్ప, తిమ్మప్ప, కరిబసి, సుంకన్న, లింగన్న తదితరులు అధికారులతో మాట్లాడుతూ కాలువ వెడల్పులో భాగంగా జేసీబీలతో మట్టిని తీసి వేస్తుండగా అది పక్కన ఉన్న పొలాల్లోకి పడుతోందన్నారు. పొలాల్లోకి మట్టితో పాటు పెద్దపెద్ద రాళ్లు కూడా పడుతుండటంతో పంటసాగుకు అడ్డంకిగా మారాయన్నారు. దీనిపై డీఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగుచర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడండి : ఎమ్మెల్యే విశ్వ ఆదేశం రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అధికారులకు ఆదేశించారు. పొలాల్లోకి మట్టి పడిన విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సంబంధిత అ«ధికారులతో ఫోన్లో మాట్లాడి రైతులకు ఇబ్బందులు చూడాలని ఆదేశించారు. -
నత్తే నయం
- ముందుకు సాగని హంద్రీ-నీవా వెడల్పు పనులు - ఫలితమివ్వని 90 రోజుల కార్యచరణ - ఆందోళనలో రైతన్నలు – ఆయకట్టుకు నీరివ్వాలని వేడుకోలు అనంత రైతులకు హంద్రీ-నీవా జలాలు అందనంటున్నాయి. కార్యాచరణ ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితం కాగా...రైతుల ఆశలన్నీ నీరుగారుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించిన 90 రోజుల ప్రణాళిక కూడా ప్రశ్నార్థకంగా మారింది. సంవత్సరాల తరబడి సాగుతున్న పనులతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఉరవకొండ : ‘‘అనంత రైతాంగానికి హంద్రీ-నీవా జలాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం..90 రోజుల్లో డిస్ర్టిబ్యూటరీలను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తాం..పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం’’ మార్చి మొదటి వారంలో అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు అన్న మాటలివి. దీంతో అనంత రైతులంతా ఈ ఖరీఫ్‌కు హంద్రీ-నీవా జలాలు అందుతాయని ఆశగా ఎదురుచూశారు. కానీ పనులు ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా 90 రోజుల ప్రణాళిక ప్రకటించారు. అనంత రైతాంగానికి హంద్రీ-నీవా నీళ్లిచ్చి తీరుతామని గొప్పలు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా పనులు సా....గుతున్నాయి. జూన్ 10న ప్రారంభం హంద్రీ-నీవా కాలువ వెడల్పు పనులు జూన్ 10న యుద్ధప్రతిపాదికన ప్రారంభయ్యాయి. వారం రోజుల పాటు ఐదు చోట్ల భారీ యంత్రాలతో చురుగ్గా సాగినా.... ఆ తర్వాత ముందుకు సాగడం లేదు. 216 కిలోమీటర్లు కాలువ వెడల్పు పనులు మూడు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టుర్లకు అప్పగించినా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. 90 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమేనా? హంద్రీనీవా కాలువ తవ్వడానికి ఏడేళ్లు పట్టింది. అంతేస్థాయిలో ఉన్న కాలువ వెడల్పు పనులు మూడంటే మూడు నెలల్లో పూర్తి చేయడం సాధ్యమైయ్యే పనేనా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో కాలువను 10 మీటర్లు మేర(బెడ్ లెవెల్) తవ్వడానికే ఏడేళ్లు పట్టింది. ప్రస్తుతం కాలువ బెడ్‌ను 19.5 మీటర్లకు పెంచాల్సి ఉంది. అంటే గతంలో జరిగినంత మేర మళ్లీ ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏడేళ్లు సాగిన పనులను 90 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. పైగా నిధుల సమస్య, భూసేకరణ లాంటివి కుడా కాలువ వెడల్పు పనులకు ఆటంకం కల్పించనున్నాయి. పనుల కేటాయింపు ఇలా... 216 కి.మీ. నిడివి కలిగిన హంద్రీనీవా కాలువను వెడల్పు పనులు చేయడానికి మూడు ప్యాకేజీలుగా విభజించారు. కర్నూలు జిల్లా మాల్యాల నుంచి 64వ ప్యాకేజీని రిత్విక్ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్ సంస్థకు, 64వ కి.మీ. నుంచి 134 కి.మీ. వరకూ రెండవ ప్యాకేజీని హిందూస్థాన్ ఇంజనీర్స్ సిండికేట్ సంస్థకు. 134 కి.మీ. నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరుకు మూడవ ప్యాకేజీ పనులను ఎంఈఐఎల్ సంస్థకు అప్పగించారు. మన జిల్లా పరిధిలో 82 కి.మీ. కాలువ పనులను ఎంఈఐఎల్ సంస్థ చేపట్టింది. మట్టి తొలగించి కాలువ వెడల్పు చేసే పనులను ఆ సంస్థ ఐదు కంపెనీలు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. కాలువలో ఉన్న సిమెంట్ నిర్మాణాల వద్ద లైనింగ్, బెడ్డింగ్ పనులు మాత్ర సదరు సంస్థ స్వయంగా చేపట్టింది. ఇందులో భాగంగా కాలువలో 134, 176, 179, 180, 182 కి.మీ. వద్ద మట్టి తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. కానీ రాగులపాడు పంప్‌హౌస్ వద్ద హంద్రీ-నీవా కాలువ వెడల్పు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పాటు 34 ప్యాకేజీలో కాలువను ఎంత మేర వెడల్పు చేయాలో కనీసం మార్కింగ్ కూడా వేయలేదు. దీన్ని బట్టి చూస్తే హంద్రీ-నీవా జలాలు అనంత రైతులకు అందాలంటే ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పనులు వేగవంతానికి చర్యలు 90 రోజుల్లో హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనులు పూర్తి చేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. పనులపై ఏరోజుకారోజు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నాము. భారీ యంత్రాలతో పనులు ప్రారంభించాము. పనులు మందకొడిగా జరుగుతున్నాయనుకున్న చోట నిరంతర పర్యవేక్షణతో పనులు వేగవంతమయ్యేలా చూస్తాం. -రాజశేఖర్‌బాబు, కార్యనిర్వాహక ఇంజనీరు, హంద్రీనీవా -
హంద్రీనీవా కాలువ వద్ద ఉద్రిక్తత
– పరిహారం కోసం పనులు అడ్డుకున్న రైతులు – అధికారులు హామీతో కొనసాగింపు ముదిగుబ్బ : పరిహారం చెల్లించే వరకు పనులు చేయకూడదంటూ హంద్రీనీవా కాలువ నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్న సంఘటన మండలంలోని నాగారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం కాలువ పనులు చేయడానికి యంత్రాలతో కాంట్రాక్టర్ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కాపు సంఘం నాయకుడు నారాయణస్వామి, సుబ్బమ్మ, వెంకటరమణ తదితర రైతులు కాలువ నిర్మాణ పనులు జరుగకుండా యంత్రాలను అడ్డుకున్నారు. ఉదయం నుంచే కాలువ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కదిరి ఇన్చార్జ్ డీఎస్పీ ఖరీముల్లా షరీఫ్‌తో పాటు పది మంది ఎస్ఐలు, 200 మంది పోలీసులు అక్కడ బందోబస్తును నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ రెండు ఎకరాల పొలంలో మామిడి చెట్లు ఉన్నాయన్నారు. పొలం మధ్యలో కాలువ Ðð వెళితే తీవ్రంగా నష్టపోతానన్నారు. కాలువ నిర్మాణంలో అలైన్‌మెంట్‌ను మార్చాలని పలుసార్లు అధికారులకు విన్నవించానన్నారు. అయితే వారు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళా రైతు సుబ్బమ్మ మాట్లాడుతు తనకున్న ఒకటిన్నర ఎకరం కాలువ నిర్మాణం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. అయితే ఇంత వరకు నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. పరిహారం చెల్లించే వరకకూ పనులు చేయకూడదంటు ఆమె పనులను అడ్డుకున్నారు. మరో రైతు వెంకటనారాయణ మాట్లాడుతూ కాలువ కోసం ఎకరం పొలం పోతోందన్నారు. అయితే పరిహారం పంపిణీలో కొంత మొత్తం మాత్రమే ఇచ్చారన్నారు. మిగిలిన సొమ్ము ఇవ్వలేదన్నారు. కాలువ వద్దకు పెద్దఎత్తున రైతులు చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే ఉన్నతాధికారులతో చర్చించారు. వారు కొన్ని డిమాండ్లకు హామీ ఇవ్వడంతో పనులు కొనసాగించారు. -
కాంట్రాక్టర్ల కోసమే హంద్రీనీవా విస్తరణ పనులు
- నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పగిడ్యాల: కాంట్రాక్టర్లను బతికించడానికే రూ. 1000 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ విస్తరణ పనులను టెండర్లు పిలిచారని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య ఆరోపించారు. సోమవారం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమాదేవి స్వగృహంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హంద్రీనీవా కాలువకు సంబంధించి పిల్ల కాలువలు, నీటి కుంటలు, తూములు ఏర్పాటు చేయకుండా విస్తరణ పనులు చేసి పలమనేరుకు నీరు తరలించాలని చూస్తే సహించబోమన్నారు. విస్తరణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. రెండు పంప్‌లను పూర్తి చేయించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేయడంలోని ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. జూన్ ఒకటో తేదీన నందికొట్కూరు పట్టణం అక్షర శ్రీ పాఠశాలలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఫ్లీనరీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ మోసాలను ప్రజల ముందు ఉంచి పలు తీర్మానాలను చేస్తామన్నారు. టీడీపీ మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన హరికృష్ణ, బాలకృష్ణలకు ఆహ్వానించకపోవడం విచారకరమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు.. తన మూడేళ్ల పాలనలో ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు గంగి రవి, రమణారెడ్డి, వెంకటరామిరెడ్డి, భూపాల్‌రెడ్డి, చిట్టిరెడ్డి, కిరణ్‌రెడ్డి, డీలర్ నారాయణ, పక్కిరెడ్డి, ఇస్మాయిల్, నరసింహులు, బోయ జయరాముడు తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీ-నీవా వెడల్పునకు గ్రీన్‌సిగ్నల్
అనంతపురం సెంట్రల్ : హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం మొదటి దశ కాలువ వెడల్పునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు జిల్లా మల్యాల (1500 కిలో మీటర్లు) నుంచి జీడిపల్లి జలాశయం (216 కిలో మీటరు) వరకూ కాలువ వెడల్పునకు రూ. 1272.41 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ప్రతిపాదనలు పంపగా రూ. 1030 కోట్లుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి దశలో 31 ప్యాకేజీ వద్ద 145 కిలో మీటరు అనంతపురం జిల్లా ప్రారంభవుతుంది. కసాపురానికి సమీపంలోని బుగ్గసంగాల నుంచి జిల్లా మొదలవుతుంది. 134 కిలో మీటర్ల నుంచి 155 వరకూ రూ. 86.53 కోట్లు, 155 నుంచి 176 కిలో మీటరు వరకూ రూ.73.61 కోట్లు, 176 నుంచి 192 కిలో మీటర్లు వరకూ రూ. 54.23 కోట్లు, 192 నుంచి 210 కిలో మీటరు వరకూ రూ. 68 కోట్లు, 210 నుంచి రూ. 216 కిలో మీటరు వరకూ రూ. 34.45 కోట్లు కాలువ వెడల్పు చేసేందుకు నిధులు మంజూరు చేశారు. -
మిగిలింది కన్నీరే!
- హంద్రీ-నీవాకు పుష్కలంగా నీళ్లు - జిల్లాకు రికార్డు స్థాయిలో 26 టీఎంసీల సరఫరా - హంద్రీ-నీవా, హెచ్చెల్సీ ద్వారా మొత్తం 37.5 టీఎంసీల చేరిక -అయినా రైతులకు తప్పని కన్నీరు అనంతపురం సెంట్రల్ : ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది జిల్లా రైతుల పరిస్థితి. ఈ ఏడాది జిల్లాకు పుష్కలంగా నీళ్లొచ్చినా పంట పొలాలను మాత్రం బీడుపెట్టక తప్పలేదు. హంద్రీ-నీవా, హెచ్చెల్సీ ద్వారా వచ్చిన మొత్తం 37.5 టీఎంసీల నీటిని పాలకులు, అధికారులు కలిసి వృథా చేశారు. రైతుల నోట్లో మట్టికొట్టారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పడిపోవడంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకానికి శనివారం నుంచి నీటి సరఫరా ఆపేశారు. అయితే.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 37.5 టీఎంసీల నీటిని ఈ పథకం ద్వారా తీసుకున్నారు. ఇందులో జిల్లాకు దాదాపు 26.5 టీఎంసీలు వచ్చాయి. ఈ పథకం ప్రారంభం నుంచి అత్యధికంగా ఈ ఏడాదే రావడం గమనార్హం. దీంతో పాటు తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ద్వారా దాదాపు 11 టీఎంసీల నీళ్లొచ్చాయి. మొత్తమ్మీద జిల్లాకు 37.5 టీఎంసీల నీరు చేరినా.. ఆయకట్టు భూములు మాత్రం బీడుగానే దర్శనమిస్తున్నాయి. గతంలో 20 టీఎంసీలు వచ్చిన సందర్భాల్లోనూ జిల్లాలో గణనీయంగా పంటలు పండించారు. అలాంటిది 37.5 టీఎంసీలు వచ్చినా పంటలకు ఇవ్వకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ఇందుకు పాలకులు, అధికారుల వైఫల్యమే కారణమని రైతులు అంటున్నారు. ఎప్పుడూ పైరు పంటలతో కళకళలాడే కణేకల్లు, బొమ్మనహాళ్ ప్రాంతాల భూములు కూడా ఈ ఏడాది బీడుపడ్డాయి. హెచ్‌ఎల్‌ఎంసీ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ) కింద 31 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేసినా.. ప్రణాళిక లోపించడంతో చేతికొచ్చే సమయంలో నీటితడులు అందక పంటలు దెబ్బతిన్నాయి. లోపించిన ప్రణాళిక ఈ ఏడాది ఆరంభం నుంచే నీటి పంపిణీపై ప్రణాళిక లోపించిందని చెప్పవచ్చు. కనీసం సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం కూడా పూర్తిస్థాయిలో నిర్వహించలేదు. తొలుత సమావేశం ఏర్పాటు చేసినా అప్పటికి తుంగభద్ర ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో నీళ్లు రాలేదు. దీంతో తూతూమంత్రంగా ముగించేశారు. హంద్రీ-నీవా ద్వారా నీళ్లొచ్చిన తర్వాత కూడా వాటిని ఎలా ఉపయోగించుకుందామనే ఆలోచన చేయలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరికి వారు పట్టుదలతో తమ ప్రాంతాలకు నీటిని తరలించుకుపోయారు. ఆ నీటిని కూడా పొలాలకు ఇవ్వలేదు. చెరువులకు పరిమితం చేశారు. అధికారులు సైతం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పినట్లు నడుచుకున్నారు. ఫలితంగా జిల్లాలో అన్ని ప్రాంతాలకు సమానంగా నీటి పంపిణీ జరగలేదు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేశారు. తీవ్ర వర్షాభావం వల్ల మెట్ట రైతులు తీవ్రంగా నష్టపోగా.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల స్వార్థం, అధికారుల తీరు కారణంగా ఆయకట్టు రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. -
22వేల క్యూసెక్కుల నీటి విడుదల
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నుంచి గత బుధవారం నుంచి గురువారం వరకు దిగువ ప్రాంతాలకు 21,927 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన అనంతరం దిగువ నాగార్జున సాగర్‌కు 20,154 క్యూసెక్కుల నీటిని, బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ ప్రాంతాలకు హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 1,703 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 75 క్యూసెక్కులను విడుదల చేశారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6.026 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 3.994 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. గురువారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీటి పరిమాణాన్ని పెంచి 225 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 55.0461 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 842.10 అడుగులుగా నమోదైంది. -
కాలువా.. కష్టాలు కనవా!
హంద్రీనీవా పనులకు భూములిచ్చిన రైతులు ►నష్టపరిహారం కోసం ఏడాదిగా ఎదురు చూపులు ►కాళ్లరిగేలా తిరిగినా కనికరించని అధికారులు ► ఉపాధి కోసం పిల్లాపాపలతో పయనం ►8 గ్రామాల్లో జాడ లేని జనం ► ముఖం చాటేస్తున్న ఎస్వో కుప్పం నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. హంద్రీనీవా కాల్వ రాకతో భూములు కోల్పోయిన వీరు ఇప్పుడు ఉపా««ధి కూడా కోల్పోయారు. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాలకు పరుగు తీస్తున్నారు. సాగు, తాగు నీరందించే కాలువ దగ్గరకొచ్చిందని సంబర పడాలో... లేక..నిలువ నీడ కరువై గూడు చెదిరి బతుకు దెరువు కోసం వలసలు వెళ్లాలో అర్థం కాక ఈ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎనిమిది గ్రామాల్లో 80 శాతం జనం ఊళ్లు వదిలి వలస వెళ్లారు. ఉన్నకొద్ది మందీ ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. నేడో, రేపో నష్టపరిహారం చేతికందుతుందని నిరీక్షిస్తున్నారు. తిరుపతి/ కుప్పం : హంద్రీనీవా సుజల స్రవంతి పనుల్లో భాగంగా ప్రభుత్వం ఏడాది కిందట పేజ్–2 పనులు చేపట్టింది. ఇందులో భాగంగా పుంగనూరు బ్రాంచి కాల్వ నుంచి కుప్పం బ్రాంచి కాల్వ నిర్మా ణ పనులు చేపట్టింది. పెద్దపంజాణి మండలంలోని అప్పినపల్లి గ్రామం దగ్గరున్న పుంగనూరు బ్రాంచి కాల్వ 207వ కిలోమీటరు ఆఫ్‌టెక్ నుంచి ఈ కాల్వ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. 143 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ కాల్వ పెదపంజాణి, గంగవరం, బైరెడ్డిపల్లి, వీ. కోట, రామకుప్పం, శాంతిపురం, గుడు పల్లి, కుప్పం మండలాల పరిధిలోని 4.03 లక్షల మంది జనాభాకు తాగునీరు, 6,300 ఎకరాలకు సాగునీరందించాలన్నది లక్ష్యంగా నిర్ధేశించారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 8 గ్రామాల పక్కనుండే 1,048 ఎకరాలను కాల్వ కోసం భూసేకరణ జరిపారు. ఏడాది నుంచి కాల్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 63 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం జరగాల్సి ఉంది. ఇప్పటివరకూ 45 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఎకరాకు కనిష్టంగా రూ.6 లక్షలు.. కాల్వ పనుల కోసం ఏడాది కిందటే ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసింది. కుప్పం,రామకుప్పం,గుడుపల్లి, శాంతిపు రం మండలాలకు చెందిన 307 మంది రైతులకు ఎకరానికి రూ.6 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. భూములైతే తీసుకున్న సర్కారు నష్టపరిహారం చెల్లింపుల విషయంలో ఉదాసీనత కనబరుస్తోంది. ఇక్కడున్న కుప్పం ప్రత్యేక అధికారి (కడా) శ్యాం ప్రసాద్ రైతులకు అందుబాటులో ఉండకుండా, ఒకవేళ ఉన్నా సరైన సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ‘మదనపల్లె రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించండనే సమాధానమే శ్యాం ప్రసాద్ నుంచి ఎదురవుతోందంటున్నారు. నష్టపరిహారం అందుతుందో లేదోనన్న గుబులుతో పలువురు రైతులు అనారోగ్యానికి గురవుతున్నారు. పొలాలు పోయి.. గ్రామాలు ఖాళీ కాల్వ నిర్మాణం కోసం రైతుల పొలాలను తీసుకోవడమే కాకుండా వాటి పక్కనే ఉన్న కొద్దిపాటి మిగులు భూముల్లో కాల్వను తవ్వగా వచ్చిన మట్టి, ఇతర వ్యర్థాలను వేయడంతో రైతులకు సాగు చేసే భూములే లేకుండా పోయాయి. దీంతో జబ్జిగానిపల్లె, జోగిసలార్ల పల్లి, వడ్డిపల్లి, బిజ్జిగానిపల్లి, సీబండపల్లి, పెద్దవంక, 64 పెద్దూరు గ్రామా లు ఒక్కొక్కటీ ఖాళీ అవుతున్నాయి. కుప్పం మండలంలోని పది గ్రామాలకు చెందిన రైతులు సాగు చేసుకునే 99.57 ఎకరాల భూములు తీసుకున్నారు. 187 మంది రైతులకు రూ.5.79 కోట్ల నష్టపరిహారం అందాల్సి ఉంది. గుడుపల్లె మండలంలోని 173.46 ఎకరాలకు నష్టపరిహారం అందాల్సి ఉంది. రామకుప్పం మండలంలో 336 ఎకరాలకు 646మంది రైతుల పొలాలు హంద్రీ–నీవాకు తీసుకున్నారు. శాంతిపురం మండలంలోని 416 ఎకరాలను 720 మంది రైతుల నుంచి తీసుకున్నారు. ఇప్పటివరకుఏ పరిహారం అందలేదు. కొంతమందికి ఇచ్చామని అధికారులు చెబుతున్నా ఎవరికిచ్చారనే విషయం స్పష్టం చేయడం లేదు. -
నీళ్లివ్వకపోతే చూస్తూ ఊరుకోవాలా..?
- కళ్ల ముందు నీళ్లున్నా దొంగగా వాడుకోవాల్సిన దుస్థితేంటి? - హంద్రీనీటిని కుప్పంకు తరలిస్తే ఉద్యమిస్తాం - ఫిబ్రవరి 6న వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఉరవకొండలో మహాధర్నా - పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు తరలిరావాలి - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపు వజ్రకరూరు : ‘‘ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంకెన్నాళ్లు చూస్తూ ఊరుకోవాలి’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6వ తేదీ ఉరవకొండ పట్టణంలో వైఎస్సార్సీపీ అ«ధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండలంలోని పీసీ.ప్యాపిలి, రాగులపాడు, పందికుంట గ్రామాల్లో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి మహాధర్నాను విజయవంతం చేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు హంద్రీనీవా కాలువ ద్వారా అధికారికంగా సాగునీరు ఇవ్వాలని రైతులతో కలిసి జలజాగరణ, ధర్నాలు, నిరాహార దీక్షలు, పంప్ హౌస్ ముట్టడి తదితర కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని కూడా నేరుగా కలిసి సమస్యను విన్నవిస్తే... మీ విధానం, మా విధానం వేరని మాట్లాడారన్నారు. ఈ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వాలన్న చిత్తశుద్ధి సీఎంకు లేదని విమర్శించారు. ఈప్రాంత రైతులకు నీరు ఇవ్వకుండా కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నాడన్నారు. జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీరు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హంద్రీనీవా పనులు 95 శాతం పూర్తి చేస్తే మిగిలిన 5 శాతం పనులను పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలుగా మాల్యాల నుంచి జీడిపల్లికి నీరు వస్తున్నా వాడుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. దొంగగా వాడుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. జిల్లాకు నీళ్లు వస్తున్నాయంటే అది వైఎస్సార్ పుణ్యమేనన్నారు. చంద్రబాబు సర్కార్ కేవలం చెరువులకు నీరిచ్చి అంతా తామే చేశామంటూ రైతులను మభ్యపెట్టడం సరికాదని హితవు పలికారు. 2016 ఆగస్టులో ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పడంతో పాటు డిస్ట్రిబ్యూటరీ లను పూర్తిచేస్తామని చెప్పి ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. దీని వల్ల రైతులు నష్టపోయారన్నారు. అలాగే ఉరవకొండలో మహానేత వైఎస్ఆర్ హయాంలో కొనుగోలు చేసిన 89 ఎకరాల్లో ఇంతవరకు పేదలకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. దీని కోసం ఆందోళన చేసినా స్పందించలేదన్నారు. రైతులు, ప్రజలకు జరుగు తున్న అన్యాయన్ని ప్రశ్నించడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 6న ఉరవకొండకు వస్తున్నారని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు పూర్తిచేసి వెంటనే సాగునీరు ఇవ్వాలని, గుంతకల్ బ్రాంచ్‌కాలువ ఆధునీకరణ చేపట్టాలని, ఎకరాకు కనీసం రూ.15 వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, చేనేత కార్మికులకు ప్రతినెలా నూలు కొనుగో లుపై రూ. 1000 సబ్సిడీ ఇవ్వాలని, రైతుల రుణమాఫీ ఓకే విడతలో ఇవ్వాలని, కూలీలు వలస వెళ్లకుండా పనులు కల్పించాలని కోరుతూ ఈ ధర్నా చేపట్టడం జరుగుతోందన్నారు. -
కుప్పం కోసమే హంద్రీనీవా విస్తరణ
– జిల్లాలో చెరువులకు నీరు నింపిన తరువాతే కిందికి ఇవ్వాలి – లేని పక్షంలో విస్తరణ పనులను అడ్డుకుంటాం – 106 చెరువులు ప్రతిపాదనను పక్కన పెట్టారు – వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించేందుకే హంద్రీ నీవా విస్తర్ణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని వైఎస్ఆర్సీపీ జల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దశాబ్దాలుగా దగా పడ్డ రాయలసీమకు కృష్ణ జలాలు అందించి బంగారు పంటలు పండించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆ సమయంలో ఈ పథకాన్ని అడ్డుకనేలా తెలంగాణ టీడీపీ నేతలు, ఆంధ్రాకు చెందిన ఇప్పటి మంత్రి దేవినేఽని ఉమతో ఆందోళన చేయించిన ఘనత చంద్రబాబు అని గుర్తు చేశారు. 1996లో, 1999లో ఈ పథకానికి శంకుస్థాపన చేసిన ఆయన పనులు ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. జలయజ్ఞంలో భాగంగా మహానేత కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలో 6.025 లక్షల ఎకరాలకు శ్రీశైలం వెనుకటి జలాలను వరద రోజుల్లో 40 టీఎంసీలు తరలించాలనే ఉద్దేశంతో రూ. 6850 కోట్లతో పనులు ప్రారంభించారన్నారు. రూ. 4340.40 కోట్లు ఖర్చూ చేసి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన 20 శాతం పనులు ఏడేళ్లైనా నేటీకి పూర్తి కాలేదని విమర్శించారు. చెరువులు నింపరు.. పంట కాల్వలు పూర్తి చేయరు ఽహంద్రీనీవా పథకంలో భాగంగా చెరువులను నింపి పంట కాల్వలు నిర్మించి రైతులకు సాగునీరు అందించాల్సి ఉండగా ఇంత వరకు పనులు పూర్తి కాలేదని విమర్శించారు. హంద్రీనీవా కాలువ నుంచి జిల్లాకు 6 టీఎంసీలు సాగుకు, 1 టీఎంసీ నీరు తాగు నీటికి ఇవ్వాల్సి ఉందన్నారు. 80 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉండగా 13,500 ఎకరాలకు మించి ఇవ్వడం లేదన్నారు. పందికోన రిజర్వాయర్ కింద 65 వేల ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉండగా మూడేళ్లవుతున్న పంట కాల్వలు నిర్మించలేదన్నారు. అలాగే హంద్రీ నీవా నీటితో జిల్లాలో 106 చెరువులకు నీరు నింపేందుకు రూ.890 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి ఏడాదవుతున్నా ఇంత వరకు పైసా నిధులు ఇవ్వలేదన్నారు. సీఎం నియోజకవర్గానికి నీరు తరలించేందుకు 35 అడుగులు ఉన్న ప్రధాన కాల్వను 50 అడుగులకు విస్తరించేందుకు రూ. 1200 కోట్లతో అంచనాలు వేశారు. ఈ ప్రతిపాదన కంటే ముందుగానే చెరువులు నింపేందుకు పంపిన ప్రతిపాదనను ఎందుకు పక్కన పెట్టేశారన్నారు. చెరువులు నింపేందుకు కేటాయింపులు లేవని సీఈ లేఖ రాసినా టీడీపీ నేతలు స్పందించక పోవడం దారుణమన్నారు. జిల్లాలోని చెరువులను నింపిన తర్వాతే ఇతర జిల్లాలకు నీటిని మళ్లించాలని డిమాండ్ చేశారు. ఇందుకు భిన్నంగా విస్తరణ పనులను చేపడితే మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. -
అదృశ్యమైన విద్యార్థి మృతి
ఆలూరు రూరల్/పత్తికొండ టౌన్: మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆలూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి పత్తికొండ హంద్రీనీవా కెనాల్లో శవమై తేలాడు. పాములపాడు మండలం కృష్ణారావుపేటకు చెందిన మద్దిలేటి కుమారుడు మనోజ్ ఆలూరు కోయనగర్‌లో మిత్రులతో కలిసి అద్దె గదిలో ఉంటూ చదువుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం సొంతరులో పని ఉందని మిత్రులకు చెప్పి బయలుదేరాడు. మరుసటి రోజు కుమారుడు ఫోన్ పని చేయకపోవడంతో రూమ్‌లో ఉన్న మిత్రులకు మద్దిలేటి ఫోన్ చేశాడు. వారు ఇంటికి వెళ్లాడని చెప్పడం, రెండురోజులైనా రాకపోవడంతో అనుమానంతో విద్యార్థి తండ్రి ఆలూరుకు చేరుకుని కళాశాలలో విచారించారు. కుమారుడి ఆచూకీ లేకపోడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సోమవారం పత్తికొండ గ్రామ శివారులోని హంద్రీనీవా కెనాల్లో కొందరు యువకలు ఈత కొడుతుండగా గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహంపై ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా మృతుడు ఆలూరు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన మనోజ్‌గా గుర్తించారు. బ్యాగ్‌లోని రికార్డులు, మృతుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు పత్తికొండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పరీక్షల్లో తప్పినందుకేనా..? మృతుడు మనోజ్ ఆలూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా సివిల్ కోర్సులో ఏడాది క్రితం చేరాడు. మొదటి సంవత్సరం కోర్సులో (ఫస్ట్ సెమిస్టర్‌కు సంబంధించి) కొన్ని సబ్జెక్టులను తప్పినట్లు సమాచారం. ద్వితీయ సంవత్సరంలో రెండు, మూడు సెమిస్టర్ కోర్సులు ఉంటాయి. అందులో రెండో సెమిస్టర్లో కొన్ని సబ్జెక్టులను ఆ విద్యార్థి తప్పినట్లు తెలిసింది. దీంతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తోటి విద్యార్థులు తెలుపుతున్నారు. విద్యార్థులు పరీక్షల్లో రాణించేందుకు కళాశాల అధ్యాపకులు సరైన సమయంలో సిలబస్‌ను కంప్లీట్ చేయకపోవడం, పరీక్షా సమయాల్లో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని అధ్యాపకులు తీసుకురావడంతోనే మనోజ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
ఏపీకి 11.. తెలంగాణకు 2 టీఎంసీలు
జలాలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు మధ్యంతర ఉత్తర్వులు ఫిబ్రవరి 20 వరకు వినియోగానికి అనుమతి పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా కింద అధిక వినియోగం చేస్తున్నారంటూ ఏపీకి హెచ్చరిక శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటిని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు పంచుతూ కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో లభ్యతగా ఉన్న 53.49 టీఎం సీలలో తెలంగాణకు 2, ఏపీకి 11 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ తాగునీటి అవసరం నిమిత్తం ఏఎమ్మార్పీ కింద 2 టీఎం సీలు తెలంగాణకు కేటాయించగా.. ఏపీకి కృష్ణా డెల్టా కింద 6 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 5 టీఎంసీలు కేటాయించారు. ఈ నీటిని ఫిబ్రవరి 20 వరకు వాడుకోవాలని సూచించారు. సాగర్ ఎడమ కాల్వ కింద తెలంగాణ అవసరాలకు ఇంకా 9.94 టీఎం సీల నీటిని వినియోగించాల్సి ఉన్నందున.. ప్రస్తుతం కేటాయింపులు చేయలేదన్నారు. పోతిరెడ్డిపాడు కింద అధిక వినియోగం తాము గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ నీటిని వినియోగి స్తోందని బోర్డు స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు కింద 54 టీఎంసీలు కేటాయించగా, 64.44 టీఎంసీలు వినియోగించుకున్నారని, హంద్రీ నీవా కింద 29 టీఎంసీలు కేటాయిస్తే, 32.4 టీఎంసీలు వినియోగించుకున్నారని పేర్కొం ది. మొత్తంగా 13 టీఎంసీల అధిక విని యోగం ఉందని తెలిపింది. ఇక తెలంగాణ కల్వకుర్తి కింద 6.22 టీఎంసీలకుగాను 11.44 టీఎంసీలు వినియోగించుకుందని పేర్కొంది. ఈ నీటి విడుదల పూర్తిగా పవర్‌హౌస్‌ల ద్వారానే జరగాలని ఆదేశించింది. విద్యుదుత్పత్తిని ఎలా పంచుకోవాలన్న దానిపై ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించుకుని నిర్ణయానికి రావాలని సూచించింది. ప్రాజెక్టుల కింద కేటాయించిన నీటిని ఎలా వాడుతున్నా రన్నది ఈఎన్సీలు గమనిస్తూ ఉండాలని, విడుదలకు సంబంధించి సంయుక్త కమిటీ పర్యవేక్షిస్తుందని పేర్కొంది. 20న కృష్ణా వరదలపై సమావేశం ఈ 20న కృష్ణా వరదల పరిస్థితిపై కేంద్ర జల సంఘం సమీక్షించనుంది. పార్లమెంట్ సభ్యులతో ఉన్న పిటిషన్స్ కమిటీ సూచన మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. నీటి విడుదలకు చర్యలు తీసుకోండి శ్రీశైలం నుంచి సాగర్‌కు 30 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించినా 22.43 టీఎంసీ లనే విడుదల చేశారని.. మిగతా నీటి విడుదలపై చర్యలు తీసుకోవాలంటూ బోర్డు ఏపీకి లేఖ రాసింది. సాగర్ నుంచి ఎడమ కాల్వ కింద ఏపీ సరిహద్దు వరకు నీటిని విడుదల చేసేలా తెలం గాణ చర్యలు తీసుకోవాలంది. వీటితోపాటు ప్రాజెక్టులపై మార్గదర్శకాల తయారీకి సుంకేశుల, జూరాల, సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల కింద 30 ఏళ్ల నీటి ప్రవాహ లెక్కలు, ప్రాజెక్టుల వివరాలు అందించాలంటూ మరో లేఖ రాసింది. -
హంద్రీ-నీవాపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
రొద్దం : హంద్రీ-నీవా పనుల పూర్తిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, మడకశిర బ్రాంచ్ కెనాల్ (ఎంబీసీ) పనులు రెండు నెలలుగా నత్తనడకన సాగుతున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గురువారం వారు మండలంలోని బొక్సంపల్లి వద్ద ఎంబీసీ ఎల్–6 పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. రెండు నెలల క్రితం తాము ఈ పనులు చూశామని, అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రమూ పురోగతి లేదని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే పెనుకొండ ప్రాంతానికి నీరివ్వడానికి పాలకులు శ్రద్ధ చూపడం లేదని స్పష్టమవుతోందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఽకృషి వల్లే గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు. అయితే..సీఎం చంద్రబాబు, జిల్లా మంత్రులు తామే నీరు తెచ్చామంటూ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. హంద్రీ-నీవా ద్వారా వచ్చిన ప్రతి నీటి బొట్టు వైఎస్సార్ పుణ్యమేనని పునరుద్ఘాటించారు. ‘హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తొడలు కొట్టి డిసెంబర్లో హిందూపురానికి నీటిని తీసుకువస్తామని, పెనుకొండకు నీరిస్తామని చెప్పారు. జిల్లా మంత్రులు మడకశిరకు వెళ్లి అక్కడికి నీటిని తీసుకొస్తామన్నారు. అయితే ఇప్పటికీ కాలువ పనులే పూర్తి చేసిన పాపానపోలేదు. మడకశిర బ్రాంచ్ కెనాల్ త్వరతిగతిన పూర్తిచేస్తే కాలువ పక్కనున్న రొద్దం, సోమందేపల్లి చెరువులకు నీరివ్వాలని రైతులు డిమాండ్ చేస్తారన్న భయంతోనే ఇక్కడ పనులు వేగవంతంగా చేయడం లేదు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఇప్పటికీ కనీసం గుంతలు కూడా పూర్తిగా నిండలేదు. ఆరో పంప్‌హౌస్ పని కూడా పూర్తి కాలేద’ని వివరించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గొల్లపల్లి రిజర్వాయర్‌లో 1.9 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలన్నారు. ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారని మండిపడ్డారు. బుక్కపట్నం సభలో చంద్రబాబు 1,200 చెరువులకు నీరు ఇస్తానని చెప్పారని, కాలువ పనులు పూర్తి చేయకనే ఎక్కడి నుంచి నీరు ఇస్తావయ్యా అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, పెనుకొండ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, పెనుకొండ కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సాయికృష్ణ,జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కలిపి శ్రీనివాసులు, లక్ష్మినారాయణరెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి, వాల్మీకీ చంద్రశేఖర్, మంజుస్వామి, కాటిమ తిమ్మారెడ్డి, బీటీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీనీవా కాలువలో యువతి మృతి
నెహ్రూనగర్ (పగిడ్యాల): మతిస్థిమితం లేని ఓ యువతి ప్రమాదవశాత్తు హంద్రీనీవా కాలువలో పడి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం నెహ్రూనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన వీరమ్మ కూతురు తిరుపతమ్మ(22) పుట్టకతోనే మతిస్థిమితంతో బాధపడుతోంది. కుమార్తెను ఈమె జాగ్రత్తగా చూసుకునేది. అయితే సోమవారం..సీఎం బహిరంగ సభ కోసం ఆమె ముచ్చుమర్రి వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చే సరికి కుమార్తె కనిపించలేదు. ఆచూకీ కోసం బంధువులను, ఇరుగుపొరుగు వారిని విచారించినా జాడ కనిపించలేదు. అనుమానం వచ్చిన బంధువులు నివాస ప్రాంతాలకు సమీపంలోని హంద్రీనీవా కాలువ వెంబడి గాలించి తిరుపతమ్మ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై ముచ్చుమర్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బంధువులు పేర్కొన్నారు. -
ఆ మృతదేహం మా చెల్లిదే
- ఎస్పీకి ఫిర్యాదు చేసిన మృతురాలి అక్కలు - కేసు దర్యాప్తులో పురోగతి డోన్ టౌన్ : ఈ నెల 24వతేదీన వెల్దుర్తి మండలం అల్లుగుండు - మల్లెంపల్లె గ్రామాల మధ్య హంద్రీనీవా కాల్వలో లభ్యమైన మృతదేహం తమ చెల్లి తులసిదేనని ఆమె అక్కలు పుష్పలత, మాధవి గురువారం ఎస్పీ ఆకె రవికృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మండలంలోని సీసంగుంతల గ్రామానికి చెందిన ఆమె భర్త రాజశేఖరే హత్యచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తులసి అక్కల వివరాల మేరకు..సీసంగుంతలకు చెందిన అనంతయ్య ఆచారీ కుమారుడు రాజశేఖర్, డోన్‌కు చెందిన డేవిడ్, సుశీలమ్మ మూడవ కుమార్తె తులసిని ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నాడు. రాజశేఖర్ పంజాబ్‌లోని పటాన్ కోట్ మిలిటరీ బేస్‌లో జవాన్‌గా పనిచేస్తున్నారు. కొన్నాళకే వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయి. భర్త తనను వేధిస్తున్నట్లు తులసి గతంలో పెట్టిన కేసు కూడా ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. రెండు నెలల క్రితం ఒక్కగానొక్క కూతురు మైథిలీ (1) అనారోగ్యంతో మృతిచెందినా రాకపోవడంతో రాజశేఖర్ రాకపోవడంతో తులసి గత నెల 24వ తేదీన ఆయన వద్దకు వెళ్తున్నట్లు చెప్పి పటాన్ కోట్కు బయల్దేరివెళ్లింది. ఈ నెల 18వరకు తమకు ఫోన్లో అందుబాటులో ఉందని, తర్వాత ఎలాంటి సమాచారం రాలేదని పుష్పలత, మాధవి ఎస్పీకి తెలిపారు. -
ప్రభుత్వం మీనమేషాలు
వజ్రకరూరు : హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉరవకొండ మండల పరిధిలోని రేణుమాకులపల్లిలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. గ్రామంలోఇంటింటికీ వెళ్లి రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలను కలుసుకొని ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉరవకొండ ప్రాంతంలోని రేణుమాకులపల్లి, చీకలగురికి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆగస్టులో హంద్రీనీవా ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. హంద్రీనీవా ద్వార ఉరవ కొండ ప్రాంతంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అనేక రోజులు డిమాండ్ చేస్తున్నా దాన్ని అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. హక్కుగా ఇవ్వాల్సిన నీటి విషయంలో ప్రభుత్వం రైతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, ఉరవకొండ , బెళుగుప్ప మండలాల్లో హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులు లక్షలాది రూపాయలు వ్యయం చేసి పంటలు సాగుచేశారన్నారు. ప్రస్తుతం పంటలు మధ్యదశలో ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో రెవెన్యూ అధికారులు, హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి పైపులు ,మోటార్లు వెంటనే తీసివేయాలని లేని పక్షంలో స్వాదీనం చే సుకుంటామని హెచ్చ రించడం భాదకరమన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రబీ సీజన్లో రైతులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉన్నా ఇంత వరకు పట్టించుకోలేదన్నారు. నగదు రహితలావాదేవీలంటూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. సమావేశంలో ఉపసర్పంచు పెద్ద ఆంజనేయ, మాజీ సర్పంచు వీరభద్రప్ప, వైఎస్సార్సీపీ కిసాన్‌సెల్ రాష్ట్రకార్యదర్శి రాకెట్ల అశోక్, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, జెడ్పీటీసీ తిప్పయ్య, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న , వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు ఉన్నారు. -
రెండు మృతదేహాలు లభ్యం
- హత్య చేసినట్లు పడేసినట్లు అనుమానాలు - కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్దుర్తి రూరల్: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎన్ఎస్ఎస్(హంద్రీ నీవా కాలువ) మల్లెపల్లె పంపింగ్ స్టేషన్ (పీఎస్–3)వద్ద రెండు గుర్తు తెలియని మృతదేహాలు కనిపించారు. శనివారం ఉదయం మృతదేహాలను గమనించిన సిబ్బంది.. పోలీసులకు సమాచారమందించారు. డోన్ సీఐ శ్రీనివాసులు, వెల్దుర్తి ఎస్ఐ–2 నగేశ్, పోలీసులు మృతదేహాలను పంచాయతీ సిబ్బంది సహాయంతో వెలికితీసి విచారణ ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకరు మహిళగా, మరొకరు యువకునిగా గుర్తించారు. మహిళను టవల్‌తో గొంతుకు బిగించి హత్య చేసి.. గోనెసంచిలో కట్టి హంద్రీకాలువలో పడవేసినట్లు అనుమానముందన్నారు. గోనెసంచి విప్పి చూడగా ఆమె ఒంటిపై బ్లూ కలర్ చుడీదార్, రెడ్‌కలర్ పైజామా, పైన స్వెటర్లతో పాటు గొంతుకు టవల్ బిగించి ఉందన్నారు. వయసు 25నుంచి 30మధ్యలో ఉండొచ్చన్నారు. అలాగే యువకుని ఒంటిపై గీతల టీషర్ట్ ఉందని, బ్లాక్ కలర్ షార్ట్‌తో పాటు షూ వేసుకున్నాడన్నారు. వయసు 25నుంచి 35సంవత్సరాల లోపు ఉంటుందన్నారు. వీరి వద్ద నుంచి ఆధారాలు ఏవీ లభించలేదని, మృతదేహాలను కర్నూలు మార్చురీకి తరలిస్తున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. ఆనవాలు గుర్తించిన వారు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించవలసినదిగా వారు కోరారు. -
హంద్రీనీవా నీటి వినియోగంపై ఆంక్షలు
నీటిని పొలాలకు మళ్లించుకోరాదని హెచ్చరికలు పోలీసు బందోబస్తుతో పంట పొలాల్లో దాడులు ఉరవకొండ : హంద్రీనీవా ద్వారా నాలుగేళ్ల నుంచి కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నా ప్రతిపాదిత ఆయకట్టులో ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వలేదు. పొలాల పక్కనే నీరు పోతున్నా వాటిని మళ్లించుకునే అవకాశం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. హంద్రీనీవా మొదటి దశ కింద 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.అందులో అత్యధికంగా ఉరవకొండ నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాలు ఉంది. మొదటి దశలో 30 నుంచి 36 ప్యాకేజీ వరకు ఉన్నాయి. అందులో నియోజకవర్గంలో 33 ప్యాకేజీ పరిధిలో 20,900 ఎకరాలు, 34వ ప్యాకేజీ కింద 17,300 ఎకరాలు ఉన్నాయి. హంద్రీనీవా నీటివాడకంపై అధికారుల కొరడా : ఉరవకొండ నియోజవర్గంలో ఖరీఫ్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుతడి పంటలైన మిర్చి, వరి,ప్రత్తి పంటలు సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మోటార్లు, పైపులు కొనుగోలు చేశారు. పంటలకు కనీసం రెండు తడులైనా నీరు అందించాలని హంద్రీనీవా నీటిని వాడుకుంటున్నారు. పంట చేతికొస్తున్న సమయంలో అధికారులు ఉన్నఫలంగా మోటార్లతో నీటిని వాడుకుంటే చర్యలు తీసుకుంటామని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల పరిధిలోని కాలువ పొడువునా దాడులు చేయడానికి చర్యలు చేపట్టారు. వజ్రకరూరు మండలంలోని కడమలకుంట, రాగులపాడు, పీసీ ప్యాపిలి, ఉరవకొండ మండలంలోని లత్తవరం, చిన్నమూస్టురు, పెద్దమూస్టురు, ఇంద్రావతి గ్రామాల్లో ఇప్పటికే రైతులను అధికారులు మోటార్లు పెట్టుకోరావని హెచ్చరించారు. అధికారుల తీరుపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హక్కుగా వాడుకోవాల్సిన హంద్రీనీవా నీటిపై ఆంక్షలు పెట్టడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటలు పరిస్థితి ఎంటీ : నాగరాజు, రాయంపల్లి కొద్దో గొప్పో హంద్రీనీవా నీటితో పంటలకు నీరు అందుతుంది. ఇప్పడు మోటార్లు పెట్టి వాడుకోరాదు అంటే పంటలు పరిస్థితి ఎంటో అర్థం కావడం లేదు. అధికారులు రైతుల గురించి ఆలోచించాలి. మా వాటా నీరు ఇవ్వండి : లక్ష్మినారాయణ, ఆయకట్టు రైతు హంద్రీనీవా నీరు మాకు రావాల్సిన హక్కు. ఆయకట్టుకు నీరు ఇచ్చి మాకు న్యాయం చేయాల్సింది పోయి, ఇప్పుడు మోటార్లు పెట్టరాదంటూ అధికారులు చెప్పడం సరైంది కాదు. ఒక తడి ఇస్తే పంట చేతికొస్తుంది : గోవిందు, రైతు ప్రస్తుతం ఒక్క తడి నీరు అందితే మిర్చి పంట చేతికందే అవకాశం ఉంది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి, ఎంతో ఆశగా పంట చేతికొస్తుందని ఎదురుచూస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : బ్రహ్మయ్య, తహసీల్దార్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ నిబంధన అమలు చేస్తున్నాం. రైతులు ఎవ్వరు హంద్రీనీవా నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసుకోరాదు. రైతులు అధికారులకు సహకరించాలి. -
హంద్రీనీవా కాలువ నిర్మాణానికి సర్వే
చిలమత్తూరు : మండలంలోని దేమకేతేపల్లి, డి.గొల్లపల్లి, బ్రహ్మేశ్వరంపల్లి, గాడ్రాళ్లపల్లి, కొర్లకుంట గ్రామాల పరిసరాల్లో హంద్రీనీవా కాలువ నిర్మాణానికి శుక్రవారం హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఇంజనీర్లు యోగానంద్, సుధాకర్, కాంట్రాక్టు సిబ్బంది సుదర్శన్, సతీష్, గౌతమ్ సర్వే నిర్వహించారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే సర్వే పనులు చేయాలని రైతులు చిన్నప్ప, నాగరాజు, మంజునాథ్, బాలాజీరావు, శంకరప్ప, సంజీవరెడ్డి, అశ్వర్థ తదితరులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పనులు చేస్తున్నామని.. పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. మడకశిర నుంచి దేమకేతేపల్లి పంచాయతీలోని గ్రామాల వరకు 53 కిలోమీటర్ల కాలువ నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన 4 కిలోమీటర్ల కాలువ పనులకు సర్వే చేస్తున్నామని అధికారులు వివరించారు. 25 మంది రైతులకు నష్టపరిహారం పంపిణీ కాలేదన్నారు. ఎకరానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం లెక్కించి ఎన్ని సెంట్లు భూమి కాలువకు పోతుందో అంత పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాగా స్థానిక నాయకులు కల్పించుకుని కాలువ నిర్మాణాలకు సహకరించాలని కోరారు. తహశీల్దార్ ఇబ్రహీంసాబ్, ఎంపీపీ నౌజియాబాను తదితరులు కాలువ సర్వే పనులను ప్రారంభించారు. -
ఆయకట్టు.. బీడు పెట్టు..
ఐదేళ్లుగా జీడిపల్లికి.. నేటి నుంచి గొల్లపల్లికి హంద్రీ–నీవా నీరు అయినా ఆయకట్టుకు వదలని ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీ పనులపై నిర్లిప్తత కుప్పానికి తీసుకెళ్లేదాకా ఆయకట్టుకు ఇవ్వలేమని తేల్చిచెప్పిన చంద్రబాబు ఈ ఏడాది ఇప్పటి వరకూ హంద్రీ–నీవాకు 20 టీఎంసీలు...ఖర్చు రూ.240 కోట్లు డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరిస్తేనే 'అనంత'కు ఉపయుక్తం నేడు గొల్లపల్లికి సీఎం చంద్రబాబు రాక 'బావా.. ఈరోజు కోడికూర తిందాం రా!’.. 'కోడి ఎక్కడుంది బావా?! తట్టలో అన్నం మాత్రమే ఉంటేనూ!’.. ‘ఇదిగో పైన కోడి! దాన్ని చూస్తూ..కోడికూర తిన్నట్లుగా ఆస్వాదిస్తూ అన్నం తినేయాలి బావా!'.. – ‘అహనా పెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాసరావు, సుత్తి వీరభద్రరావు మధ్య సంభాషణ ఇది. అచ్చం ఇలాగే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా టీడీపీ నేతల పరిస్థితి. ‘ఇవిగో నీళ్లు..వీటితో రైతుల జీవితాలు సస్యశ్యామలం అవుతాయి.. జిల్లా నుంచి కరువును పూర్తిగా తరిమికొడతాం. కరువు భయపడేలా చేస్తాం..’అని పదేపదే వల్లెవేస్తున్నారు. ఐదేళ్లుగా కళ్లెదుట కృష్ణాజలాలు ఉన్నాయి. ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు ఇవ్వడంలేదు. నీళ్లు చూపించి...వాటితో రైతుల జీవితాలు బాగుపడతాయనేలా భ్రమింపజేస్తూ 'అనంత' రైతులను ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేస్తోంది. 'హంద్రీ–నీవా కాలువ వస్తే నీళ్లొస్తాయి! కాలువకు కొంత పొలం పోయినా, ఉన్న దాంట్లో పంటలు పండించుకోవచ్చు. మా బతుకులు బాగుపడతాయి' అని వేలాది ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారు. అనుకున్నట్లుగానే 2012లో జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు వచ్చాయి. నాలుగురోజులుగా గొల్లపల్లి రిజర్వాయర్‌కు కూడా నీటి విడుదల మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు(శుక్రవారం) గొల్లపల్లిలో గంగపూజ చేయనున్నారు. పూజలతో బతుకు పండుతుందా 'బాబూ'.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 'అనంత'లో గంగపూజలతో టీడీపీ నేతలు హల్చల్ చేస్తున్నారు. కృష్ణాజలాలను ఇష్టానుసారంగా తీసుకెళ్లడం, కుంటలు, చెరువుల్లో నింపి, వంకల్లో పారిస్తూ గంగపూజలు చేస్తున్నారు. కానీ ఎకరాకైనా నీళ్లిచ్చి పంటలను కాపాడదామనే ఆలోచన చేయలేదు. చివరకు బాధ్యత గల ముఖ్యమంత్రి కూడా ఇదే పంథా అనుసరిస్తున్నారు. గొల్లపల్లికి వచ్చి కృష్ణమ్మకు గంగపూజ చేయనున్నారు. పూజలు స్వీకరించిన కృష్ణమ్మ కాలువల వెంబడి బిరబిరా పరుగెడుతూ రైతులకు బంగరు పంటలు పండించాలి. కానీ కృష్ణమ్మ పొలాల వైపు వెళ్లకుండా చంద్రబాబు అడ్డుకట్ట వేస్తున్నారు.ఎంతకాలమైనా సరే కుప్పం వరకూ ప్రధాన కాలువ తవ్వాలి.. మధ్యలోని రిజర్వాయర్లు పూర్తి కావాలి.. అక్కడికి నీళ్లు తీసుకెళ్లాలి.. ఆ తర్వాతే 'అనంత' రైతులకు నీరు ఇవ్వాలా, వద్దా అనేది ఆలోచిస్తామన్న ధోరణితో ఉన్నారు. ఈ మాటను ఈ ఏడాది సెప్టెంబరు 1న జిల్లాలో చెప్పారు కూడా! దీనిపై పల్లెత్తు మాట అనకుండా జిల్లా రైతుల ప్రయోజనాలను చంద్రబాబు కాళ్లముందు తాకట్టుపెట్టారు మన ఘనత వహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 20 టీఎంసీల కృష్ణాజలాలు జిల్లాకు చేరాయి. ఇందుకోసం రూ.240 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. ఈ నీటితో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చు. కానీ ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువ పరిధిలో రెండు ఎకరాలకు కూడా ఇవ్వలేదు. మరో రెండేళ్లయినా నీళ్లిచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో నీళ్లు జీడిపల్లిలో ఉన్నా..గొల్లపల్లిలో ఉన్నా..రేపు చెర్లోపల్లిలో ఉన్నా ప్రయోజనం ఉండదు. హెచ్చెల్సీకి ఉపకాలువలుగా ఉపయోగించనున్నారా? హంద్రీ–నీవా ద్వారా ఫేజ్–1, ఫేజ్–2లో 3.75లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. ఇందులో ఫేజ్–1లో 1.18 లక్షలు, ఫేజ్-2లో 2.27లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఫేజ్–1 పనులు 2012లో పూర్తయినా ఆయకట్టుకు నీరివ్వలేదు. గొల్లపల్లి ఫేజ్–2లోకి వస్తుంది. ఇక జిల్లాలో మిగిలింది చెర్లోపల్లి రిజర్వాయర్, మడకశిర బ్రాంచ్ కెనాల్. ఈ రెండింటికి నీళ్లిస్తే జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయినట్లే. కానీ చంద్రబాబు అనుకున్నట్లు కుప్పం వరకూ నీళ్లు వెళ్లాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. భారీ టన్నెల్స్, అక్విడెక్టులతో పాటు చాలా నిర్మాణాలున్నాయి. అప్పటి వరకూ నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. 2012 నుంచి హంద్రీ–నీవా నీళ్లు పీఏబీఆర్‌కు మళ్లిస్తున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ నేతలు చెరువుల పేరుతో ఇష్టానుసారం తీసుకెళుతున్నారు. పోనీ చెరువుల కింద ఉన్న ఆయకట్టుకైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఈ నీళ్లు ఆయకట్టుకు వాడుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నాలుగేళ్లుగా హంద్రీ–నీవా నీటి వినియోగం, చంద్రబాబు తీరు నిశితంగా పరిశీలిస్తే హంద్రీ–నీవాను హెచ్చెల్సీకి ఉపకాలువగా మార్చడం మినహా స్థిరీకరించిన ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం లేదనేది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో మంత్రులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వద్ద గట్టిగా గళం విప్పి, డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయించి జిల్లా రైతుల అవసరాలు, హక్కులను కాపాడాల్సిన అవసరముందని విపక్షనేతలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
హంద్రీనీవాను పూడ్చకపోతే చాలు
- కాల్వ విస్తరణ విషయంపై చెరుకులపాడు నారాయణరెడ్డి - ఆలోచించాలని జిల్లా ప్రజాప్రతినిధులకు హితవు మద్దికెర : హంద్రీనీవా కాలువను ఇరువైపులా విస్తరిస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సాకుతో పూడ్చే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి ఆరోపించారు. ఆదివారం మద్దికెరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన హంద్రీనీవా కాలువను వైఎస్సార్ 90 శాతం పూర్తిచేశారన్నారు. మిగతా పనులు పూర్తి చేసి అనంతర ప్రభుత్వం నీటిని విడుదల చేసిందన్నారు. రైతులు, ప్రజలు వైఎస్‌ను తలుచుకుంటుంటే సహించలేక టీడీపీ ప్రభుత్వం కాలువ విస్తరణను తెరపైకి తెచ్చిందన్నారు. కాల్వను విస్తరించి 40 టీఎంసీల నీటిని వదులుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు కాల్వను గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాల్వను విస్తరించడానికి బదులు డోన్, ప్యాపిలి, గుత్తి మీదుగా కుప్పం వరకు కొత్త కాల్వను ఏర్పాటు చేసి నీటిని తీసుకుపోవచ్చన్నారు. వెడల్పు చేసేందుకు కనీసం పదేళ్లు పడుతుందని, అంతవరకు కాలువకు నీరు వదలరన్నారు. అదే జరిగితే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాల్వ విస్తరణకు భూసేకరణ చేపట్టాలని, అలాంటప్పుడు కొత్త కాలువ ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాల వారికి కూడా నీటిని అందించే అవకాశం ఉంటుందని, దీనిపై జిల్లాలోని ప్రజాప్రతినిధులు చర్చించాలన్నారు. విషయాన్ని సీఎంకు వివరించాలని డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కోరారు. విలేకరుల సమావేశంలో మండల కన్వీనర్ మురళీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, నాయకులు సర్కార్ వెంకటరాముడు, బాలచంద్ర, నాగేష్, చంద్రశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మంజునాథ్‌రెడ్డి, రామాంజులు, చౌరెడ్డి వన్నాల గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా..?
– హంద్రీ–నీవా లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు - వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం : 2012 నుంచి హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాకు నీళ్లు వస్తున్నా ఇప్పటిదాకా కనీసం ఒక ఎకరాకు నీళ్లిచ్చారా..? అని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవా లక్ష్యాన్ని అధికార పార్టీ నీరుగారుస్తోందని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. కేవలం ప్రచారం కోసం అప్పుడప్పుడు వంకలు, చెరువులకు నీళ్లిచ్చినట్లు ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా రైతాంగం బాగు పడాలనే తపనతో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పని చేయడం లేదన్నారు. హంద్రీ–నీవా నీటిని తామే తెప్పించామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మొదటి దశలో జీడిపల్లికి నీటిని తెచ్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. రెండోదశ పనులు రూ. 212 కోట్లతో 80 శాతం పూర్తయ్యాయన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో 1,7 ప్యాకేజీల్లో దాదాపు 1.72 కోట్ల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు ఈ ప్రభుత్వం రాకముందే పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ఈ రెండున్నరేళ్లలో కేవలం 20 శాతం పనులు చేసి అందుకోసం రూ. 200 కోట్లు ఖర్చు చేశారన్నారు. 20 శాతం పనులకు వందశాతం నిధులా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని చెప్పారు. జిల్లాకు వస్తున్న 17 టీఎంసీల నీటికి సంబంధించి టీఎంసీకి రూ. 12 కోట్లు కరెంటు ఖర్చు వస్తోందన్నారు. ఈ నీటిని ఖచ్చితంగా 2 లక్షల ఎకరాలకు ఇవ్వొచ్చన్నారు. ఆరుతడి పంటలకైతే 3 లక్షల ఎకరాలకు ఇవ్వొచ్చని తెలిపారు. పీఏబీఆర్ కుడికాలువకు నీళ్లిచ్చే విషయంలో నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. నీళ్లిస్తున్నా...ప్రకాష్‌రెడ్డికి కనిపించలేదా? అని మంత్రి సునీత అంటున్నారని ఆమె లష్కరు డ్యూటీ చేస్తోంది తప్ప ప్రత్యేకంగా తెప్పించిందేమీలేదని ఎద్దేవా చేశారు. 20న బస్సుయాత్ర డెల్టా ప్రాంతంలో ఆయకట్టు సాగు, పంట కాలువలు, పొలాలకు నీళ్లు ఎలా వెచ్చిస్తున్నారు తదితర అంశాలను పరిశీలించేందుకు ఈనెల 20న సాయంత్రం అనంతపురం నుంచి బస్సుయాత్ర చేపడుతున్నట్లు ప్రకాష్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల పాటు కృష్ణా, నాగార్జునసాగర్, గోదావరి డెల్టా ప్రాంతాలను సందర్శించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రెండు బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా నుంచి ఆసక్తిగల రైతు ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ఎన్జీఓలు, మీడియా ప్రతినిధులు రావొచ్చని తెలిపారు. రావాలనుకునే వారు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో కాని, 70325 81653, 86866 1086 నంబర్లలో సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్, నాయకులు వరప్రసాద్‌రెడ్డి, మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
వడ్డేమాన్ గ్రామంలోకి హంద్రీనీవా నీరు
గుర్తు తెలియని వ్యక్తులు కాలువ తూం గేటు ఎత్తివేత –ముంపునకు గురైన పంట పొలాలు - స్పందించి గేటు మూసేసిన హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు నందికొట్కూరు: మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామ పొలిమేరలో ఉన్న హంధ్రీనీవా కాలువ తూం గేటును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ఎత్తేశారు. దీంతో ఉద్ధృతంగా ప్రవహిస్తూ కాలువ నీరు వడ్డేమాను గ్రామంలోకి చేరాయి. దాదాపు 30 ఎకరాల్లో పంటలు నీట మునగగా, పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఊహించని విధంగా గ్రామంలోకి నీరు రావడంతో ప్రజలు, రైతులు కొద్దిసేపు ఆందోళన గురయ్యారు. సమాచారం తెలుకున్న హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు హుటాహుట్టిన కాలువ వద్దకు చేరుకుని తూంను వెంటనే మూసివేశారు. దీంతో నీటి ఉద్ధృతి తగ్గిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వెంటనే స్పందించకపోయి ఉంటే వందల ఎకరాల పంట దెబ్బతినే అవకాశం ఉండేదని రైతులు తెలిపారు. గేటు ఎత్తేసిందేవరో గుర్తించడంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని వారు అధికారులకు కోరారు. -
హంద్రీకాలువలో లభ్యమైన యువకుడి మృతదేహం ఆచూకీ లభ్యం
– నరబలి ఇచ్చారని తల్లి ఫిర్యాదు వెల్దుర్తి రూరల్: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువలో మల్లెపల్లె పంపింగ్ స్టేషన్ వద్ద గత ఆదివారం గుర్తుతెలియని యువకుడి, చిన్నారి మృతదేహాలు కొట్టుకువచ్చి తేలియాడుతూ కనిపించిన విషయం తెలిసందే. విచారణ చేపట్టిన ఎస్ఐ తులసీనాగప్రసాద్ బుధవారం మృతుని ఆచూకీ లభ్యమైనట్లు తెలిపారు. పత్రికల్లో గుర్తుతెలియని మృతదేహాలను వార్త రావడంతో అనుమానం వచ్చిన పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామానికి చెందిన మృతుని తల్లి నాగమ్మ, బంధువులు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. మృతుని దుస్తులు చూసి తల్లి నాగమ్మ తన కుమారుడు మాల వెంకటేశ్వర్లుగా(23) గుర్తించింది. డిగ్రీ పూర్తి చేసిన వెంఽకటేశ్వర్లు ఇటీవలే అదే గ్రామస్తుడు రమేష్‌కు చెందిన జేసీబీకి హెల్పర్‌గా నెలక్రితం చేరాడు. కాగా తన కుమారుడిని రమేష్‌తో పాటు జేసీబీ డ్రైవర్ చంద్ర కలిసి జేసీబీ యంత్రానికి నర బలి ఇచ్చారని తల్లి నాగమ్మ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా విచారణ చేపట్టినట్లు ఎస్ఐ -
అభివృద్ధి సమీక్ష సమావేశంలో రసాభాస
-
అభివృద్ధి సమీక్ష సమావేశంలో రసాభాస
అనంతపురం: అనంతపురం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. హంద్రినీవా ప్రాజెక్టు పనులపై మంత్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి నిలదీయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తిచేసి.. హంద్రినీవా నీటితో హెచ్ఎల్సీ ఆయకట్టును ఎందుకు కాపాడలేకపోయారని ఆయన ప్రశ్నించారు. హంద్రినీవా నీటిపై చంద్రబాబు ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక లేదని ఆయన విమర్శించారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డితో మంత్రి కామినేని శ్రీనివాస్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వాగ్వాదానికి దిగారు. గురువారం జరిగిన అనంతపురం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులతోపాటు ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్‌రెడ్డి, బాలకృష్ణ, యడగాపురం సురి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, యామినీ బాల, ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. -
ఆ శవం టైలర్‌ది
-గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభ్యం – విషాదంలో కుటుంబసభ్యులు పత్తికొండ టౌన్: మద్దికెర సమీపంలో హంద్రీనదిలో తేలిన గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభ్యమైంది. నాలుగురోజుల క్రితం హంద్రీకాలవలో దూకి ఆత్మహత్య చేసుకున్న పత్తికొండకు చెందిన టైలర్ రామకృష్ణగా గుర్తించారు. పత్తికొండ పట్టణం సవారమ్మ కాలనీకి చెందిన ముద్దన్న, చెన్నమ్మల రెండవ కుమారుడైన రామకృష్ణ (38) స్థానికంగానే పవన్‌టైలర్స్ పేరుతో సొంతంగా షాప్ పెట్టుకున్నాడు. ఇతనికి భార్య హనుమంతమ్మ, నలుగురు కుమార్తెలు సంతానం. టైలర్‌గా పనిచేస్తూనే వారిని బాగా చూసుకునేవాడు. అయితే, గత కొన్నాళ్ల నుంచి రామకృష్ణ తాగుడుకు బానిస అయ్యాడు. పని వదిలివేసి, ప్రతిరోజు తాగివచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గత 15వ తేదీన శనివారం రాత్రి ఫుల్‌గా మద్యం తాగివచ్చిన రామకృష్ణ అకారణంగా గొడవ పెట్టుకుని భార్య హనుమంతమ్మను చితకబాదాడు. ఆమె సృహ తప్పిపడిపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రామకృష్ణ ఆదోని రోడ్డులో ఉన్న హంద్రీకాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలువలో నీటిప్రవాహం అధికంగా ఉండటంతో మృతదేహం కొట్టుకుపోయి 2రోజుల తర్వాత సోమవారం మద్దికెర మండలం హంప వద్ద తేలింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ బంధువులు అనుమానంతో మద్దికెరకు వెళ్లి గుర్తుతెలియని శవాన్ని గుర్తించారు. మృతుడి తండ్రి ముద్దన్న ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న మద్దికెర ఎస్ఐ అబ్దుల్‌జహీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంట్లో గొడవపడి వెళ్లిన రామకృష్ణ బంధువుల ఊరికి వెళ్లి ఉంటాడని భావించిన కుటుంబసభ్యులకు ఊహించని విధంగా శవమై కనిపించడంతో వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని టైలర్స్ అసోసియేషన్ తాలుకా అధ్యక్షుడు ఇస్మాయిల్ శరీఫ్, కార్యదర్శి తిక్కస్వామి, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
హంద్రీనీవా పంపుల ద్వారా కేసీకి నీటి విడుదల
– రెండు పంపుల ద్వారా 670 క్యుసెక్కుల నీరు – ఏట్టకేలకు ఫలించిన కేసీ రైతుల పోరాటం కర్నూలు సిటీ: హంద్రీనీవా సుజల స్రవంతి పథకం మాల్యాల పంపు నుంచి రెండు పైపుల ద్వారా మంగళవారం కేసీ కెనాల్‌కు నీటిని విదుదల చేశారు. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. దీంతో కేసీ ఆయకట్టుకు గతంలో ఎన్నడూ లేనంతగా సాగునీటి ఇబ్బందులు వచ్చాయి. హంద్రీనీవా నుంచి రెండు పైపుల ద్వారా కృష్ణా జలాలను మళ్లిచాలని 2014లో చేసిన ప్రతిపాదనపై వైఎస్ఆర్సీపీ నేతలు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, కేసీ రైతులు భారీ ఎత్తున పోరాటాలు చేశారు. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. హంద్రీనీవా నుంచి రెండు పంపులు ద్వారా నీరు కేసీకి మళ్లించేందుకు శరవేగంగా పనులు చేపట్టి గత నెలలో పూర్తి చేసి ట్రయల్ రన్ చేశారు. వర్షం రావడంతో ఇంత వరకు ఆయకట్టుకు నీరు ఇచ్చారు. ఎగువ నుంచి నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో ఇటీవలే కేసీకి నీటిని బంద్ చేశారు. దీంతో పంటల స్థితిని దృష్టిలో పెట్టుకొని హంద్రీనీవా సుజల స్రవంతి పథకం మాల్యాల లిఫ్ట్ నుంచి రెండు పంపుల ద్వారా 670 క్యుసెక్కుల నీటిని వదిలారు. ఈ నీరు 150 కి.మీ వరకు ఉన్న ఆయకట్టుకు అందుతుంది. 0నుంచి 67కి.మీ(మాల్యాల లిఫ్ట్ వరకు) వరకు ఉన్న ఆయకట్టుకు సుంకేసుల బ్యారేజీ నుంచి కలెక్టర్ ఆదేశాలతో 505 క్యుసెక్కుల నీటిని విడుదల చేశారు. -
చెరువులకు హంద్రీనీవా నీరు
రెండు చెరువులను పరిశీలించిన కలెక్టర్ కర్నూలు సిటీ: హంద్రీనీవా కాలువ ద్వారా ప్రత్యేకాభివృద్ధి నిధులతో చెరువులకు నీరు నింపేందుకు చర్యలు తీసుకోవాలని చిన్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లను జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ ఆదేశించారు. సోమవారం బి.తాండ్రపాడు, తడకనపల్లె చెరువులను కలెక్టర్ పరిశీలించారు. ఈ చెరువులకు నీరు పంపింగ్ చేసేందుకు శాశ్వతంగా పంపింగ్ రూములు, మోటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తడకనపల్లె చెరువులో పూర్తి స్థాయిలో పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బి.తాండ్రపాడు చెరువు ఆక్రమణలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు భూమిలో ఎవరో బోర్డులు పెడుతుంటే మీరే చేస్తున్నారని తహసీల్దారు రమేష్‌బాబుపై మండిపడ్డారు. బోర్డులు తొలగించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎస్ఈ చంద్రశేఖర్ రావు, ఈఈ శ్రీనివాసులు, ఏఈఈ హసన్ బాషా తదితరులు ఉన్నారు. -
హంద్రీనీవాకు మరో 5 టీఎంసీలు
కర్నూలు సిటీ: హంద్రీనీవా కాలువ ద్వారా మరో 5 టీఎంసీల నీరు వాడుకునేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు అంగీకరించింది. ఈ కాలువ కింద కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన ఆయకట్టుకు సాగు నీరు ఇస్తున్నారు. ఈ ఖరీఫ్ మొదట్లో తొమ్మిది టీఎంసీల నీటిని వాడుకునేందుకు బోర్డు అనుమతులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ నీటిని ఆరు పంపుల ద్వారా కాలువకు ఎత్తిపోశారు. కేటాయించిన నీరు సోమవారంతో పూర్తయింది. అనంతపురం జిల్లాలోని చెరువులన్నీ హంద్రీనీవా నీటితో నింపుతున్నారు. ఇలాంటి సమయంలో కాల్వకు నీరు బంద్ అయితే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే నీటి విడుదలను కొనసాగించాలని బోర్డును కోరారు. ఈ మేరకు మరో ఐదు టీఎంసీల నీటిని వాడుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అధికారికంగా నేడు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. -
హంద్రీనదిలో విద్యార్థి మృతి
కృష్ణగిరి: హంద్రీనదిలో నీరు తాగడానికి వెళ్లి గుంతలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాదిగ కర్రెన్న, మరియమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు పవన్‌కుమార్ నందికొట్కూరులో ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్నవాడు చిన్న చరణ్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మూడో తరగతి చదవుతున్నాడు. తల్లిదండ్రులు ఇంటి వద్ద చరణ్‌కు భోజనం పెట్టి కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లవాడు కనిపించలేదు. గ్రామస్తులంతా సమీపంలోని కాల్వలు, హంద్రీలో ఉన్న ఇసుకగుంతలో గాలించగా శవమై తేలాడు. ఆదివారం సెలవు కావడంతో తోటి పిల్లలతో సమీపంలోని ఎల్లమ్మ గుడి సమీంలో అడుకుంటూ నీరు తాగేందుకు హంద్రీలోకి వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడి చరణ్(9)మృతి చెందాడు. కుమారుడు ఆకాల మరణంతో తల్లిదండ్రులు రోదన అందరిని కలిచివేసింది. గుంతలే ప్రాణం తీశాయి.. హంద్రీలో ఇసుకను అమ్మకోవడంతో కొందరు పెద్ద గుంతలు తీశారు. ఇవి ప్రమాదకరంగా మారాయని 25రోజుల క్రితమే ‘సాక్షి’ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.నాలురోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి హంద్రీ పొంగి గుంతలో నీరు చేరింది. ఈ గుంతే చిన్నారి చరణ్ మృతికి కారణమైంది. -
హంద్రీనీవా కాలువలో యువకుడు గల్లంతు
ఓర్వకల్లు /కల్లూరు: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు హంద్రీనీవా కాలువలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన బోయ శ్రీరాములు, చిట్టెమ్మ దంపతుల కుమారుడు రమేష్(16) తన స్నేహితులైన శివ, హనుమంతు, నగేష్, ఆనంద్‌లతో కలసి శుక్రవారం మధ్యాహ్నం సరదాగా ఈతకు వెళ్లాడు. కల్లూరు మండలం తడకనపల్లె గ్రామ సమీపంలో గల హంద్రీనీవా కాలువలో రమేష్ రెండుసార్లు ఈత కొట్టి పైకి వచ్చాడు. మూడోసారి గట్టుపైనుంచి కాలువలోకి దూకిన అనంతరం వెలుపలికి రాలేదు. దీంతో తోటి మిత్రుడు అతని కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. వెంటనే నన్నూరు గ్రామానికి చేరుకుని స్థానికులకు సమాచారం అందజేశారు. ఆ మేరకు గ్రామానికి చెందిన కొందరు ప్రజలు హంద్రీనీవా కాలువ గట్టుకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తడకనపల్లె గ్రామం నుంచి వెల్దుర్తి మండలం వద్దనున్న మల్లేపల్లి వరకు గాలించారు. ఈ విషయాన్ని ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం చేరవేసినప్పటికీ తమ పరిధిలోకి పోలీసులు చెప్పడంతో కర్నూలు తాలూకా రూరల్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేశారు. సాయంత్రం చీకటి పడటంతో ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, మల్లేపల్లి వద్దనున్న ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద అధికారులకు గ్రామస్తులు వివరాలను అందజేసి వెనుదిరిగివచ్చారు. రమేష్ ఆచూకీ కోసం శనివారం ప్రయత్నం చేస్తామని పోలీసులు, సంబంధిత అధికారులు తెలిపినట్లు సమాచారం. -
హంద్రీనీవా నుంచి కేసీకి సాగునీరు
పాములపాడు: మల్యాల ఎత్తిపోతల పథకం హంద్రీనీవా నుంచి కేసీకి సాగునీరు పంపింగ్ చేయనున్నట్లు ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు. లింగాల గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులతో కలిసి తాను జిల్లా కలెక్టరును కలిశానన్నారు. మల్యాల ఎత్తిపోతల పథకంలోని హంద్రీనీవాలో రెండు పంపులు కేసీ కెనాల్లోకి మళ్లించాలని ఇటీవల కలెక్టరు, ఇరిగేషన్ అధికారులను కలిసి విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఒక్కొక్క పంపు నుంచి 350 క్యూసెక్కుల చొప్పున నీరు పంపింగ్ చేస్తారని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. 120 కిలో మీటరు వరకు కేసీ కెనాల్‌కు నీరందుతుందని రైతులు పంటలు సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్‌తో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ పూర్తిగా మునిగి పోయిందని పనులు మళ్లీ ప్రారంభం కావాలంటే ఆలస్యమవుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు చౌడయ్య, నాయకులు అంబయ్య, నాగేశ్వరమ్మ తదితరులు ఉన్నారు. -
పెళ్లింట విషాదం
–హంద్రీనీవా కాలువలో గల్లంతైన విద్యార్థుల్లో ఒకరి మృతదేహం లభ్యం – మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు – శోక సంద్రంలో కుటుంబసభ్యులు పత్తికొండ టౌన్: పెళ్లింట విషాదం అలుముకుంది. పట్టణ సమీపంలో బైపాస్‌రోడ్డు పక్కనే ఉన్న హంద్రీనీవా ప్రధాన కాల్వలో మంగళవారం పుష్కరస్నానానికి వెళ్లిన పెళ్లికుమారుడు తమ్ముడు, బామ్మర్ది గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో ఒకరు బుధవారం శవమై కనిపించారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే.. పత్తికొండ పట్టణం తేరుబజారులో ఆర్టిస్టు మోహన్‌రాజు నివాసమంటున్నాడు. ఇతని అన్న బ్రహ్మనందరాజు కడప జిల్లా బద్వేలులో స్థిరపడ్డాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటిభార్య కుమారుడు రవికుమార్ హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్లో నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని వివాహం ఈనెల 21న కడపలో నిర్వహించారు. బంధువులంతా పత్తికొండలో ఉండటంతో తిరుగు పెళ్లి సోమవారం చిన్నాన మోహన్‌రాజు ఇంట్లో నిర్వహించారు. మంగళవారం ఉదయం పుష్కరాలు చివరి రోజు కావడంతో బ్రహ్మనందరాజు రెండోభార్య కుమారుడు ఇంటర్‌ఫస్టియర్ చదువుతున్న పామూరు జ్ఞానేశ్వర్‌రాజు 16), రాజంపేటకు చెందిన మోహన్ చెల్లెలు వాణి కుమారుడు ఇంటర్ సెంకడియర్ చదువుతున్న అవధానం తేజస్వరూప్(17) హంద్రీనీవా ప్రధాన కాల్వకెళ్లి స్నానాలు చేస్తుండగా నీటి ప్రవాహం అధికమై అందులో కొట్టుకోపోయారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గాలించినా జాడ దొరకలేదు. బుధవారం ఉదయం నుంచే సీఐ బీవీ విక్రంసింహ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, పలువురు యువకులు కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. కాలువ దిగువలో రెండు, మూడుచోట్ల అడ్డంగా వలలను కట్టించారు. బుధవారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో తేజస్వరూప్ మతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కనిపించని జ్ఞానేశ్వర్ జాడ: హంద్రీనీవా కాలువలో ఎంత వెతికినా పామూరు జ్ఞానేశ్వర్‌రాజు జాడ దొరకలేదు. బంధువులు కాలువగట్టు వద్దనే బుధవారం రాత్రి వరకు గాలించారు. జ్ఞానేశ్వర్‌రాజు అనంతపురంలో విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేసే ఈ విద్యార్థి తండ్రి బ్రహ్మనందరాజు కొన్నేళ్లక్రితం అనారోగ్యంతో మతిచెందగా, తల్లి విజయ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు నీటిలో కొట్టుకోపోవడంతో ఆమె దుఃఖసాగరంలో మునిగిపోయారు. శోకసంద్రంలో తేజ కుటుంబం వైఎస్ఆర్ కడప జిల్లాలో టీచర్‌గా పనిచేస్తున్న అవధానం చలపతిరాజు, వాణి దంపతులకు ఇద్దరు కుమారులు తేజస్వరూప్, విష్ణుస్వరూప్. పెద్దవాడైన తేజస్వరూప్ ప్రస్తుతం నెల్లూరులోని నారాయణ కళాశాలలో ఇంటర్(ఎంపీసీ) సెకండియర్ చదువుతున్నాడు. ఫస్టియర్‌లో 470కు 467 మార్కులు తీసుకొచ్చాడు. ఇంతటి ప్రతిభ గల కుమారుడు పుష్కరస్నానానికి వెళ్లి మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు, బంధువులు శోఖసంద్రంలో మునిగిపోయారు. -
హంద్రీనీవాకు 30 టీఎంసీలు కేటాయించాలి
అనంతపురం సెంట్రల్ : కరువు జిల్లా ‘అనంత’ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం నుంచి హంద్రీనీవా సుజలస్రవంతి పథకం ద్వారా 30 టీఎంసీలు కేటాయించాలని జలసాధన సమితి జిల్లా అధ్యక్షులు రామ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలో తాగునీటికే 10 టీఎంసీలు అవసరమవుతాయన్నారు. యుద్ధప్రాతిపదికన హంద్రీనీవా పనులు పూర్తి చేయాలని, 30 టీఎంసీలు తీసుకొచ్చి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. -
డిసెంబరులోగా కుప్పానికి కృష్ణా జలాలు
– రాష్ట్రమంతా పశువులకు దాణా భద్రత – త్వరలో మగాళ్ల తాగుడుకి తాళాలు – బెల్టుషాపులు పెట్టి మద్యం అమ్మితే ఉపేక్షించం – రాష్ట్రంలో ఈ ఏడాది 7 వేల అంగన్వాడీ భవనాలు – కుప్పంలో అత్యాధునిక ఈఎస్ఐ ఆస్పత్రి – బంద్‌ల పేరుతో బస్సుల జోలికి రాకుండా చట్టం – ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నా – కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబునాయుడు సాక్షి ప్రతినిధి, తిరుపతి,/ కుప్పం డిసెంబరులోగా కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. హంద్రీనీవా పనుల వేగాన్ని పెంచి డిసెంబరు మూడో వారంలో కుప్పానికి నీరందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కుప్పం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబునాయుడు కమతమూరు, సామగుట్టపల్లి క్రాస్‌ల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాష్ట్రమంతా పశుదాణా భద్రత కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అజోలా,సైలేజ్, పచ్చగడ్డిలతో కూడిన దాణా మిశ్రమాన్ని మిక్స్డ్ ఫీడ్‌గా తయారుచేసి పశుపోషకులకు అందజేయడం ద్వారా మంచి ప్రయోజనాలు కనిపించే వీలుందన్నారు. దీనివల్ల పాలదిగుబడి రెట్టింపయ్యే వీలుందని శాస్త్రీయంగా గుర్తించామన్నారు. ఈనేపథ్యంలో 50 శాతం సబ్సిడీతో ఇంటికే దాణా సరఫరా చేసేందుకు యోచిస్తున్నామన్నారు. రాష్ట్రమంతా గొర్రెలు, ఫౌల్ట్రీ పెంపకాలతో పాటు హార్టికల్చర్, సెరీకల్చర్ రంగాల అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 7 వేల అంగన్వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. రేపో, ఎల్లుండో రెండో విడత డ్వాక్రా రుణమాఫీ కోసం నిధులు విడుదలు చేయనున్నామన్నారు. ఈసారి డ్వాక్రా మహిళలు మాఫీ సొమ్మును వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. మగాళ్ల తాగుడు వల్ల వేల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయన్న సీఎం చంద్రబాబు తాగుబోతులైన భర్తలకు తిండిపెట్టడం మానేస్తే గానీ దారికి రారని మహిళలకు సూచించారు. త్వరలో మగాళ్ల తాగుడికి తాళాలు వేయాల్సిన అవసరముందనీ, ఆ దిశగానే తాను యోచిస్తున్నానన్నారు. గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా మద్యం అమ్మితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ షాపులను ధ్వంసం చేయండని మహిళామణులకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎకై ్సజ్ అధికారులనూ వదలననీ, తప్పు చేస్తే ఉద్యోగం గోవిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నా... ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతూనే ఉన్నాన ని సీఎం పునరుద్ఘాటించారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే వరకూ హోదా అవసరమన్న విషయాన్ని కేంద్రం దగ్గర ప్రస్తావిస్తూనే ఉన్నానన్నారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తనను ఇబ్బంది పెట్టలేవన్నారు. తన హయాంలో బంద్‌లు, ధర్నాలను సహించబోనన్నారు. వీలైతే రైల్వేచట్టాలను లె చ్చి బంద్‌ల రూపేణా ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల జోలికి పోకుండా చేయాల్సిన అవసరముందన్నారు. బస్సుల జోలికెళ్తే చేతులు కాలేలా ప్రత్యేక చట్టం తేవాల్సి ఉందన్నారు. పట్టిసీమ పనులకు రాక్షసుల్లా అడ్డుపడ్డ వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు మొన్నటికి మొన్న రాత్రిపూట పోలవరం కుడికాల్వకు గండి పెట్టారని ఆరోపించారు. దొరికితే వీళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. కుప్పంలో ఈఎస్ఐ ఆస్పత్రి.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మరోసారి కుప్పం నియోజకవర్గానికి వరాలు ప్రకటించారు.గతంలో ఇచ్చిన హామీల సంగతి ప్రస్తావించకుండానే కొత్త వాగ్దానాలను గుప్పించారు. కుప్పం పరిసరాల్లో ఉండే అసంఘటిత కార్మికుల ప్రయోజనార్థం త్వరంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించనున్నామన్నారు. అదేవిధంగా రూ.10 లక్షలతో కార్మిక భవన్ నిర్మాణం, రెస్కో ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందజేస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కమతమూరు, సామగుట్టపల్లి క్రాస్, శాంతిపురం మండలాల్లో పర్యటించి రూ.2.40కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సీఎం వెంట మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు తలారి మనోహర్, అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీటీడీ ఛైర్మన్ చదలవాడ కష్ణమూర్తి, జెడ్పీ ఛైర్మన్ గీర్వాణి చంద్రప్రకాశ్, కలెక్టర్ సిద్ధార్థజైన్, సబ్‌కలెక్టర్ కృతికాభాత్రాలు ఉన్నారు. -
హంద్రీనీవా..హామీతో సరి!
– 60 వేల ఎకరాలకు నీరిస్తామన్న సీఎం – 18వేల ఎకరాలకే సాధ్యమంటున్న అధికారులు – పూర్తికాని పంట కాల్వ పనులు – త్వరలో నీరు విడుదల కర్నూలు సిటీ: హామీ ఇదీ.. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు వచ్చిన వెంటనే హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 60 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తాం. – ఇటీవల జిల్లాకు వచ్చిన సమయంలో సీఎం చంద్రబాబు అన్న మాటలివి. వాస్తవం ఇదీ.. – హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 18 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చేందుకు పంట కాల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 60 వేల ఎకరాలకు ఇవ్వడం సాధ్యం కాదు. – ఇరిగేషన్ అధికారుల వ్యాఖ్య ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే.. కృష్ణానదిలో నీటి ప్రవాహం మొదలు కావడంతో శ్రీశైలం ప్రాజెక్టు మట్టం రోజురోజుకూ పెరుగుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో మరో నాలుగు రోజుల్లో శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది. దీంతో హంద్రీనీవా కాల్వకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కాల్వపై ఉన్న పంప్‌హౌస్‌లలోని మోటర్లను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రధాన కాల్వలో ఉన్న కంప చెట్లను కూడా తొలగించారు. ఈ వారం చివరిలో కాల్వకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఈ ఏడాది కనీసం 8 పంప్‌లతో నీటిని లిఫ్ట్ చేయాలనే అలోచనలో ఉన్నారు. చిక్కు ఎక్కడ వస్తుందంటే.. హంద్రీనీవా ఫేజ్–1 ప్రధాన కాల్వతో పాటు పంట కాల్వలకు 10285.55 ఎకరాలు అవసరం. ఇప్పటి వరకు సుమారు 9243.74 ఎకరాలు మాత్రమే సేకరించారు. పత్తికొండ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల కిందే పంట కాల్వలకు 1800 ఎకరాలకుగాను 500 ఎకరాలు కూడా భూసేకరణ చేయలేక పోయారు. ఇందుకు రైతులు సహకరించడం లేదనే కుంటి సాకులు చెబుతున్నారు. భూములు కోల్పోయే రైతులు అడుగుతున్న పరిహారాన్ని ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రైతులతో కలెక్టర్ సమావేశాలు ఏర్పాటు చేసినా.. డిమాండ్ మేరకు పరిహారం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. భూములు సేకరించిన చోట తీస్తున్న పంట కాల్వల వల్ల 14400 ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుకునేందుకు 60 వేల ఎకరాలకు నీరు ఇస్తామని ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. జిల్లాలో ప్రవహించే 144 కి.మీ ప్రధాన కాల్వపై 12 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. అధిక శాతం పందికోన రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల కిందనే అధికంగా ఉన్నాయి. మొత్తం 277 కి.మీ పంట కాల్వలు తీయాల్సి ఉండగా...20 కి.మీ కూడా తీయలేదు. పనులు వేగంగా చేస్తున్నాం పత్తికొండ ప్రాంతంలో పంట కాల్వలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వేగంగానే ఈ కాల్వల పనులు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న కాల్వలతో 18 వేల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చు. దీనికి మరో 10 వేల ఎకరాలకు ఈ ఏడాది నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంది. – కె.జలంధర్, హంద్రీనీవా సీఈ ప్రాజెక్టు స్వరూపం – వైఎస్సార్ హయాంలో 2004లో రూ. 1305 కోట్లతో ఈ కాల్వ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. – రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేది లక్ష్యం – శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను 120 వరద రోజుల్లో 40 టీయంసీలు తరలించాల్సి ఉంది. – ఈ కాల్వ కింద కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. – నందికొట్కూరు మండలం మాల్యాల దగ్గర మొదలైన ఈ కాల్వ జిల్లాలో 144 కి.మీ ప్రయాణించి అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుంది. -
హంద్రీ–నీవాకు గుదిబండగా సొరంగం
– జిల్లాలో ప్రధానకాలువ పరిధిలో 2.1కిలోమీటర్ల సొరంగం –పనులు పూర్తి చే సేందుకు 2018 వరకు పడుతుంది –ఇది పూర్తికాకుంటే శ్రీనివాసపురం, అడవిపల్లె రిజర్వాయర్లు, –ఉప కాలువలు ఒట్టిపోయాల్సిందే –తేల్చిచెప్పిన అధికారులు, అవాక్కయిన ముఖ్యమంత్రి బి.కొత్తకోట: హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టు రెండోదశకు చిత్తూరుజిల్లాలోని సొరంగం (టన్నల్) పనులు గుదిబండగా మారాయి. ఈ ఆగస్టుకు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటిని అందించి తీరుతామని ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్, చిత్తూరుజిల్లాలకు నీరు వెళ్లాలంటే తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలోని సొరంగం పనులు పూర్తి చేయాలి. తాజాగా ఈ పనులు పూర్తి చేసేందుకు రెండేళ్ల సమయం పడుతుందని తేల్చారు. ఈ పనులు పూర్తికాకనే ఆగస్టుకు ప్రభుత్వం నీళ్లేలా ఇస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పెద్దమండ్యం మండలంలోని గొళ్లపల్లె నుంచి వైఎస్సార్ జిల్లా చిన్నమండ్యం మండలం కొటగడ్డకాలనీ వరకు ప్రధానకాలువలో భాగంగా 5.1కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వేందుకు 2006లో రూ.47.57కోట్లతో ఎకేఆర్కోస్టల్ కంపెనీ ఒప్పందం చేసుకొంది. ఈ కంపెనీ రూ.18.97కోట్ల విలువైన 630మీటర్ల సొరంగం పనులు చేసి చేతులెత్తేసింది. మిగిలిన రూ.28.6కోట్ల పనులను 20ఎ ప్యాకేజీగా 2015లో ఆర్‌కేఇన్‌ఫ్రా సంస్థకు ఒప్పంద విలువతో అప్పగించారు. ఈ సంస్థ రూ.3.6కోట్ల విలువైన 800మీటర్ల సొరంగం పనులుచేసి ఆగిపోయింది. మిగిలిన 3.5కిలోమీటర్ల టన్నల్ పనుల్లో 2.1కిలోమీటర్ల పనులను 20బీ ప్యాకే జి కింద రూ.16.77కోట్ల పనికి రూ.70.82కోట్లకు పెంచి టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో ఒకేఒక సంస్థ పాల్గొనగా ప్రభుత్వం టెండర్‌ను రద్దుచే యడంతో మళ్లీ టెండర్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ టన్నల్ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లే దు. 2.1కిలోమీటర్ల మార్గంలో సొరంగం తవ్వాక పైనుంచి మట్టితో పూడిపోతూ సొరంగం నిలవడంలే దు. ఈ పనులను షాపూర్జీ పల్లోంజీ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం నిబంధనలను సడలించింది. సొరంగం పరిశీలించిన సంస్థకు చెందిన టన్నల్ ఎక్స్పర్ట్ సత్యనారాయణ పనులు పూర్తిచేసేందుకు రెండేళ్ల సమయం పడతుందని తేల్చడంతో ఉన్నతాధికారులు షాక్‌కు గురయ్యారు. ’రెండేళ్లు పడుతుంది ప్రధానకాలువలో 5.1కిలోమీటర్ల సొరంగం పనుల్లో 1.6కిలోమీటర్లు తవ్వారు. 20ఎ ప్యాకేజికి చెందిన 1.4 కిలోమీటర్ల పనుల్లో రోజుకు ఒకటి లేదా మీటర్ల పనులే జరుగుతున్నాయి. 2.1కిలోమీటర్ల సొరంగం పనులు కష్టతరమైనవిగా గుర్తించారు. ప్రారంభంలో సొరంగం గట్టిపొర వచ్చిందని కార్మికులు పనులు చేస్తూ ముందుకు సాగాక సొరంగంలోకి గాలి సోకడంవల్ల పైపొరలు పెళుసుగా మారి కూలిపోతున్నాయి. దీనితో సొరంగం బురదగా మారిపోతోంది. పనులు చేసేందుకు అటంకంగా మారింది. ఈ సొరంగంలో 64వేల క్యూబిక్‌మీటర్ల టన్నల్ మట్టిపని, 32వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ లైనింగ్ పనులతోపాటు 18వేల క్యూబిక్‌మీటర్లు ఇతరా కాంక్రీట్ పనులు జరగాల్సివుంది. ఈ పనులు ఈ డిసెంబర్‌కల్లా పూర్తిచేయాలని గతంలో సీఎం ఆదేశించినా ఈ పనికి రెండేళ్లు పడుతుందని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ పనులకు గతనెలలో నిర్వహించిన టెండర్లలో మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ ఒక్కటే పాల్గొనడంతో ఆ టెండర్‌ను ప్రభుత్వం రద్దు చేయగా మళ్లీ టెండర్లు నిర్వహిస్తున్నారు. ’ఒట్టిపోవాల్సిందే ఈ సొరంగం పనులు పూర్తికాకుంటే రూ.1,550కోట్ల పనులు నిరుపయోగం అవుతాయి. ప్రధానకాలువలో భాగమైన సొరంగం ద్వారానే వైఎస్సార్కడపజిల్లాలోని శ్రీనివాసపురం రిజర్వాయర్, చిత్తూరుజిల్లాల్లోని అడివిపల్లె రిజర్వాయర్, వాయల్పాడు, నీవా ఉప కాలువలకు నీరు వెళ్లాలి. ఆగస్టుకు నీరిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేయకనే నీరిచ్చే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విజయవాడలో హంద్రీ–నీవా ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించగా పెద్దమండ్యం టన్నల్ ప్రస్తాపన తేచ్చారు. డిసెంబర్‌కు పూర్తి చేయాలని సూచించగా టెండర్ల నిర్వహణకే నెల అవుతుందని, పనిచేపట్టినా రెండేళ్లలోపు పూర్తిచేసే పరిస్థితులు లేవని స్పష్టం చేయడంతో సీఎం అవాక్కయినట్టు సమాచారం. ఇది పూర్తి చేయకుంటే ఇబ్బందికరమని, ఆలోచించి త్వరిగతిన పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారని అధికారులు చెబుతున్నారు. -
హంద్రీ – నీవా పూర్తి చేస్తాం
పుట్టపర్తి అర్బన్: హంద్రీ–నీవాను 2016 ఆఖరుకు పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కష్టా, గోదావరి నదులను అనుసంధానం చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక చారిత్రక ఘట్టానికి తెర లేపారన్నారు. రాబోవు రోజుల్లో చెరువులను కూడా అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీటిని అందించాలన్న ధృడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చేసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఇటీవల ప్రకటించిన డిజిటల్ ఇండియా ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం తీసుకురావడంలో కషి చేసిన మంత్రిని టీడీపీ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్టా ఓబులరెడ్డి, నాయకులు శ్రీరాంరెడ్డి,ఆదినారాయణరెడ్డి, చెన్నకేశవులు,కొనంకి గంగాధర్‌నాయుడు,ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జయరాంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీనీవా..చెరువులకేనా!
► ప్రాజెక్టు ఉద్దేశాన్ని మారుస్తున్న ప్రభుత్వం ► డిస్ట్రిబ్యూటరీలకు నీరు ఇచ్చేందుకు విముఖత ► చెరువులకు మాత్రమే నీరిచ్చేలా ప్రణాళిక ► పంట కాల్వల భూసేకరణ పూర్తి కాలేదని సాకు ► నెపం రైతులపై నెడుతున్న పాలకులు ► ఆయకట్టు అన్నదాతల్లో ఆందోళన హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు కరువు సీమకు తరలించి సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావులు పదేపదే చెబుతున్నారు. మాటలతో రాయలసీమపై ఎంతో ప్రేమను ఒలకబోస్తున్న వీరు.. ఆచరణలో మాత్రం కరువు సీమకు అన్యాయం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద కాల్వల ద్వారా నీరందించాల్సింది పోయి..చెరువులు నింపుతాం, భూగర్భజాలు పెంచుతాం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రాజెక్టు అసలు ఉద్దేశాన్ని అటకెక్కించి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. కర్నూలు సిటీ: రాయలసీమకు కృష్ణా జలాలు అందించి బంగారు పంటలు పండించాలనే ఉద్దేశంతో హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి వైఎస్సార్ శ్రీకారం చూట్టారు. నాడు ప్రతి పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణకు చెందిన తన పార్టీ నాయకులతో హంద్రీనీవాకు వ్యతిరేకంగా ఆందోళనలూ చేపట్టింది. ఈ కాల్వకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 1996 మార్చి 11వతేదీన, 1999 జూలై9న రెండు సార్లు శంకుస్థాపక చేశారు. కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చి..హంద్రీనీవా ఉద్దేశాన్నే మార్చేశారు. అది ఎలాగంటే.. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది హంద్రీనీవా లక్ష్యం. శ్రీశైలం వెనుక జలాలను వరద రోజుల్లో 40 టీఎంసీలు తరలించాలనేది ఈ పథక ఉద్దేశం. ఇందుకు రూ. 6850 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో రూ. 4340.40 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన 20 శాతం పనులు ఏడేళ్లయినా పూర్తికాలేదు. మాల్యాల దగ్గర మొదలు అయ్యే కాల్వ 144 కి.మీ వద్ద అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ప్రధాన కాల్వకు మొత్తం 12 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. వీటి కింద పంట కాల్వలు తీసి నీరు ఆందించాలి. అయితే భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదనే సాకుతో పంట కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. హంద్రీనీవా నుంచి చెరువులకు నీరు నింపి భూగర్భ జలాన్ని పెంచుతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అసలు ఉద్దేశాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం జరిగిందంటే.. హంద్రీనీవా ప్రధాన కాల్వతో పాటు పంట కాల్వలకు 9781.06 ఎకరాలు అవసరం. ఇప్పటి వరకు 8700 ఎకరాలు సేకరించారు. పత్తికొండ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల కింద పంట కాల్వల నిర్మాణానికి 1800 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే 500 ఎకరాలు కూడా సేకరించలేకపోయారు. రైతులు సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం భూసేకరణ పరిహారం కోస్తా ప్రాంతంలో ఒకరకంగా, రాయలసీమలో మరో రకంగా ఇస్తోంది. పరిహారంలో పేచీ రావడంతో పంట కాల్వ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హంద్రీనీవా నీరు నింపేందుకు ఇప్పటికి 106 చెరువులను గుర్తించారు. ఇందుకు సుమారు రూ.1060 కోట్లతో డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) తయారు చేశారు. అంత మొత్తం ప్రభుత్వం ఇవ్వదని చెప్పడంతో అత్యంత ప్రాధాన్యం కింద 17 చెరువులకు నీరు ఇచ్చేందుకు రూ. 155 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇటీవలే పంపించారు. దీని బట్టి చూస్తే సాగునీటి కాల్వ.. వాటర్ రీచార్జీ కెనాల్‌గా మారుతోందని చెప్పవచ్చు. భూసేకరణ పూర్తి కాలేదు హంద్రీనీవా ప్రధాన కాల్వపై మొత్తం 12 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. పనులు దాదాపు పూర్తి అయ్యాయి. అయితే పంట కాల్వకు అవసరమైన భూసేకరణ పూర్తి కాలేదు. పత్తికొండ రిజర్వాయర్ కిందే అధిక శాతం పెండింగ్‌లో ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకపోయాం.- శ్యాంసుందర్, హంద్రీనీవా ఫేజ్-1 ఎస్ఈ -
హంద్రీనీవా పనుల్లో అపశృతి
-జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరికి గాయాలు వి.కోట: హంద్రీనీవా పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. చిత్తూరు జిల్లా వి.కోట మండలం పత్తేర్లమాకులపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. హంద్రీనీవా కాలువలో అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్‌తో పేలుళ్లు జరిపారు. దీంతో బండ రాళ్ల ముక్కలు ఎగిరి సమీపంలోని రైతుల ఇళ్లపై పడ్డాయి. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం(55), నరేంద్ర (16)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఆగ్రహంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. . -
కందకాలు తవ్వుదాం.. కదలిరండి
► జల సిరుల కోసం ‘సాక్షి’ ఉద్యమం ► రేపు మదనపల్లె, తంబళ్లపల్లెలో ప్రత్యేక రైతు సదస్సులు ► నిపుణులు, అనుభవజ్ఞుల ద్వారా సూచనలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : వ్యవసాయ క్షేత్రాల్లో జల సిరుల సంరక్షణే లక్ష్యంగా ‘సాక్షి’ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రైతులను సమీకరించి వర్షపు నీటి పరిరక్షణకు దోహదపడే కందకాల తవ్వకాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కలిగిం చి ఆ దిశగా అన్నదాతలను కార్యోన్ముఖుల్ని చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం మదనపల్లి, తంబళ్లపల్లెలో ప్రత్యేక రైతు అవగాహన సదస్సులను నిర్వహించనుంది. వర్షపునీటి సంరక్షణలో అనుభవజ్ఞులు, రిటైర్డ్ ఇంజినీర్లతో రైతులకు తగిన సూచనలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేసింది. చిత్తూరు జిల్లాలో సాగు యోగ్యమైన భూమి 7,12,093 ఎకరాలు ఉంది. ఇందులో నీటిపారుద ల సౌకర్యం ఉన్న భూ విస్తీర్ణం 6,35,163 ఎకరా లు. చెరువుల, బోర్లకింద సాగయ్యే పొలాలే ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా సాలీనా సగ టు వర్షపాతం 934 మి.మీ. వర్షం రూపేణా కురిసే నీరు 49515 హెక్టారు మీటర్లు కాగా, ఇందులో 40 శాతం నీరు ఆవిరై పోతుంది. ఏటా భూమిలో ఇంకే నీరు మాత్రం 5447 హెక్టారు మీటర్లేనని జల వనరులు, భూగర్భ జల శాఖల గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో పడమర మండలాలైన మదనపల్లి, తంబళ్లపల్లి ప్రాంతాల్లో టమాట ఇతరత్రా వాణిజ్య, కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. సరైననీటి సదుపాయం లేక, భూగర్భ జలాలు అందుబాటులో లేక రైతులు విలవిల్లాడుతున్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితేనే ఈ ప్రాంతాలకు సాగునీటి సదుపాయం లభించే వీలుంది. ఈ నేపథ్యంలో దిగాలుపడ్డ రైతున్నల్లో భరోసా నింపి అధిక దిగుబడుల సాధన దిశగా వీరిని ప్రోత్సహించేందుకు ‘సాక్షి’ నడుం బిగించింది. జిల్లాలు, మండలాలవారీగా రైతులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి చేను కింద కందకాల ఆవశ్యకతను వివరిస్తోంది. ముందుకొచ్చిన రైతులకు దగ్గరుండి కందకాల తవ్వకంలో సహకారం అందించనుంది. -
డ్రైవర్ కుటుంబానికి కలెక్టర్ పరామర్శ
రాళ్లబూదుగూరు (శాంతిపురం) : తన వద్ద పని చేస్తున్న డ్రైవర్‌కు కష్టం రావటంతో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నేరుగా వచ్చి ఆ కుటుంబాన్ని పరావుర్శించారు. వుంగళవారం సాయుంత్రం వుండలంలోని రాళ్లబూదుగూరుకు కలెక్టర్ వచ్చారు. ఆయన డ్రైవర్‌నాగరాజు కువూరుడు వుునీశ్వర్(7) రెండు వారాల క్రితం మృతి చెందటంతో నేరుగా వారి ఇంటికి వెళ్లారు. కుటుంబ పరిస్థితులను ఆరా తీశారు. ఇద్దరు కువూర్తెలను బాగా చదివించాలని నాగరాజుకు సూచించారు. వుంగళవారం కూడా కలెక్టర్ వాహనానికి నాగరాజే డ్రైవర్. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ కృతికా బాత్రా, కడా ఎస్వో శ్యాంప్రసాద్,సీడీసీఎంఎస్ చైర్మన్ శ్యావురాజు, తహశీల్దార్ కల్పనాకువూరి ఉన్నారు. హడావుడిగా పర్యటన కలెక్టర్ వస్తున్నారన్న సవూచారంతో వుధ్యాహ్నం నుంచి వుండల అధికారులు ఎదురు చూశారు. పర్యటన వివరాలు తెలియుక తికవుక పడ్డారు. తీరా సాయుంత్రం వచ్చిన ఆయున వుండల కేంద్రంలో ఆగకుండా ఏడో మైలు మీదుగా రాళ్లబూదగూరుకు వెళ్లి నడింపల్లి మీదుగా తిరుగు పయునవుయ్యూరు. మిగతా అధికారులు ఆయున వాహనం వెంట వెళ్లి వూర్గం వుధ్యలో జల్లిగానిపల్లి, చిన్నారిదొడ్డి వద్ద కారులోంచే హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించారు. -
ఈ నెల 7,8 తేదీల్లో 'జల జాగరణ'
అనంతపురం: హంద్రీనీవా కింద ప్రతిపాదించబడిన ప్రతి ఎకరాకూ సాగునీరు అందే వరకు పోరుబాటను తీవ్రతరం చేస్తున్నామని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఈ నెల 7, 8 తేదీల్లో బెలుగుప్పలో 'జల జాగరణ' కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. హంద్రీనీవా ఆయనకట్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘ అనంత’ ప్రజల నోట్లో మట్టి కొట్టిన సీఎం
సీపీఐ జిల్లా కార్యదర్శి డీ.జగదీష్ గుంతకల్లు: సీఎం చంద్రబాబునాయుడు కరువు సహాయక చర్యలు, హంద్రీనీవా పనులకు అవసరమైన నిధులు ప్రకటించకుండా ప్రజల నోట్లో మట్టి కొట్టారని సీపీఐ జిల్లా కార్యదర్శి డీ.జగదీష్ ఆరోపించారు. స్ధానిక సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హంద్రీ నీవా పూర్తి కావాలంటే రూ.5వేల కోట్లు అవసరమన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.504 కోట్లు కరెంటు బిల్లులకు సరిపోవని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నపుడు ఎన్టీఆర్ సాగునీటి ప్రాజెక్టును కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చి జిల్లాకు అన్యాయం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకూడదని జీవో నం-22ను విడుదల చేసి డిస్ట్రిబ్యూటరీ పనులు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. హంద్రీ నీవా పూర్తి కావడానికి నిధులు విడుదల చేసి రాజశేఖర్‌రెడ్డి సహకరిస్తే చంద్రబాబు దీనిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జిల్లాకు రావల్సిన 24 టీఎంసీలు కేటాయించి తర్వాత కుప్పానికి నీటిని తరలిస్తే అభ్యంతరం లేదన్నారు. అనంతపురం జిల్లా భవిష్యత్తు కృష్ణ జలాల పైనే ఆధారపడి ఉందన్నారు. మేలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. సీపీఐ జిల్లా సమితి సభ్యుడు అబ్దుల్వహాబ్, పట్టణ కార్యదర్శి ఎం.వీరభద్రస్వామి, సహాయ కార్యదర్శి బి.మహేష్, నాయకులు ఎస్ఎండీ గౌస్ పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యం
తిరుపతి: సీఎం త్వరపెడుతున్నా హంద్రీనీవా పనుల్లో వేగం పెరగాల్సిందిపోయి.. రోజురోజుకూ తగ్గుతోంది. కాంట్రాక్టర్లు అంతా అధికార పార్టీనేతలు కావడమే ఇందుకు ప్రధాన కారణం. పనుల ఆలస్యంపై అధికారులు కాంట్రాక్టర్లను గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో కాంట్రాక్టు సంస్థలను అధికారులు ప్రాధేయపడినా లెక్క చేయడం లేదు. పనులు సంస్థ పేరుతో ఉంటే.. పనులు నిర్వహించే వారంతా సబ్కాంట్రాక్టర్లే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి పనుల పరిశీలనా నిమిత్తం మదనపల్లెకు వచ్చిన సందర్భంలో ప్రధాన కాంట్రాక్టర్లు సైతం ముఖం చాటేశారు. దీంతో అధికారులకు మాత్రం తిప్పలు తప్పడంలేదు. ఇదిగో సాక్ష్యం.. మదనపల్లె సమీపంలోని టన్నెల్ పనులను రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకొంది. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీనేతకు వారు సబ్‌కాంట్రాక్టు కట్టబెట్టారు. ఆ సబ్ కాంట్రాక్టర్ పనులు చేయకుండా మరొకరికి అప్ప జెప్పారు. దీంతో ఎక్కడిపనులు అక్కడే ఆగిపోతున్నాయి. అధికారులు ప్రశ్నిస్తే.. మందకొడిగా సాగుతున్నాయి. రోజుకు 24 మీటర్ల మేర టన్నెల్ పని చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు మేనెల చివరికి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. పనుల వేగం మొదట్లో ఓ మాదిరిగా ఉన్నా చివరికి వచ్చేసరికి వేగం పూర్తిగా తగ్గింది. అందులో భాగంగా జనవరిలో రోజుకు సరాసరిన 16 మీటర్లు, ఫిబ్రవరిలో 12 మీటర్లు, మార్చిలో 8 మీటర్లకు తగ్గిపోయింది. కాంట్రాక్టర్లను అడిగేదెవరు.. కుప్పం బ్రాంచికెనాల్ పనులను ఆర్కె ఇన్ఫ్రా దక్కించుకోగా, ఆ సంస్థ మరో సంస్థకు పనులను కట్టబెట్టినట్టు సమాచారం. పనులు నత్తనడకన జరుగుతండటంతో అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారే పనులు చేసేదంతా అధికార పార్టీ కాంట్రాక్టర్లని, వారితో అధికారులకు ఏమాత్రం పనిచేయించే సామర్థ్యం లేదని సీఎంకు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం టన్నెల్ పనుల పరిశీలన నిమిత్తం వచ్చిన సీఎం సబ్ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పనులు చేయగలిగి ఉండి కొంతమంది చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మదనపల్లె పర్యటనలో సైతం ప్రధాన కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు హాజరు కాలేదని తెలిసింది. గడువులోపు పూర్తి చేయాల్సిందే.. టన్నెల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను సీఎం హెచ్చరించారు. మ్యానువల్ పద్ధతిలో పనులు చేస్తే ఎప్పటికి పూర్తవుతాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి బూమర్లు ఏర్పాటు చేసి రోజు 24 మీటర్లు పనిచేయాని అధికారులను ఆదేశించారు. బూమర్లు దొరకడం లేదని 15 వతేది నుంచి టన్నెల్ పనుల వేగం అందుకోవడం కష్టమేననని నీటిపారుదలశాఖ సిబ్బందిలో చర్చ సాగుతోంది. -
‘హంద్రీ-నీవా నీటిని తరలిస్తే అడ్డుకుంటాం’
పెనుకొండ : హంద్రీనీవా సుజల స్రవంతి పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చలువేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. ఈ కాలువ నీటిని కుప్పంకు తరలించాలని చంద్రబాబు చేస్తున్న కుటిల యత్నాలను అడ్డుకుంటామన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలే కరులతో మాట్లాడారు. వైఎస్సార్ హ యాంలో హంద్రీ నీవా కాలువ పనులు 80 శాతం పూర్తయితే నేడు పైపూత పనులు చేస్తున్న చంద్రబాబు హంద్రీనీవాట ఘనత తనదేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని తాగునీటి పథకంగా మారుస్తూ కుప్పంకు తాగునీటిని తరలించే కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఈ నీటిని తరలించడానికి సీఎం ప్రత్యేక జీవో సిద్ధం చేస్తున్నారన్నారు. జిల్లా ప్రజలకు, రైతులకు అన్యాయం చేస్తే వామపక్షాలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడ తామన్నారు. 9 యేళ్లు రాష్ట్రాన్ని పాలిం చిన చంద్రబాబు కేవలం రూ. 9 కోట్లు హంద్రీనీవాకు నిధులు ఇస్తే, మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రూ.6 వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. హంద్రీనీవాకు తగిన నిధులు ఇవ్వకుండా తగుదునమ్మా .... అంటూ అనంతపురం జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టి నీరు కుప్పం తరలించాలని చూస్తే ప్రజలు, రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర లీగల్ కార్యదర్శి న్యాయవాది భాస్కరరెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, టౌన్ క న్వీనర్ ఇలియాజ్, మాజీ మార్కెట్‌యార్డ్ చైర్మన్ నాగలూరు బాబు, బీసీసెల్ పట్టణాధ్యక్షుడు యస్‌బీ.శీనా, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు రాజగోపాలరెడ్డి, ముఖ్య నాయకులు గౌస్‌లాజం, శ్యాంనాయక్,ప్రసాద్, కొండలరాయుడు, బాబు, శ్రీరాములు, సోమశేఖరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. -
ఆగస్టు లోపు హంద్రీ-నీవా పూర్తి చేస్తా
మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయరు పనులు త్వరలో ముగింపు టేకుమంద- కీరమందల వద్ద రూ.9 కోట్లతో చెరువుల అభివృద్ధి వచ్చే సీజన్ నాటికి చెరువులు తెగకుండా చర్యలు తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం జిల్లాలో పర్యటించారు. మదనపల్లెలో హంద్రీ-నీవా టన్నెల్ పనులను పరిశీలించారు. అనంతరం చిత్తూరులో జరిగిన నీరు-ప్రగతి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాపై ప్రేమ చాటేలా మాట్లాడారు. మదనపల్లెలో మాట్లాడుతూ హంద్రీ-నీవా రెండో దశ పనులను ఆగస్టు లోపు పూర్తిచేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తికాకపోతే వేటు తప్పదని కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీచేశారు. అడవిపల్లె రిజర్వాయరు వద్ద పెండింగ్‌లో ఉన్న టెన్నల్ పనులను 45 రోజుల్లోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. బాలాజీ రిజర్వాయరు, మల్లెమడుగు, గాలేరు పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. సోమశిల-స్వర్ణముఖి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఐదు నెలల్లో పూర్తిచేసి, గాలేరు-నగరి కాలువకు కలుపుతామని పేర్కొన్నారు. బంగారుపాళెం మండలం టేకుమంద-కీరమందల వద్ద రూ.9 కోట్లతో చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే వారిని ఎవరినైనా పైన కూర్చొని పెట్టే అవకాశం కల్పిస్తామంటూ, భూగర్భ జలాలు పెంపొందేందుకు కృషి చేసిన పలమనేరుకు చెందిన మల్లేశ్వర రెడ్డి అనే రైతును పక్కన కూర్చోపెట్టుకుని అభినందించారు. భూగర్భ జలాలను పెంపొందించాలి ప్రతి ఒక్కరూ భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని ముఖ్య మంత్రి కోరారు. పుంగనూరు సుగాలిమిట్ట వద్ద 80 మీటర్ల లోతుకు నీరు పడిపోయిందన్నారు. ఆ నీరు తాగితే కీళ్ల నొప్పులతో పాటు వారు వికలాంగులయ్యే అవకాశముందన్నారు. మామిడి చెట్లు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. జిల్లాలో నీరు-ప్రగతి, నీరు-చెట్టు, పంట సంజీవని కార్యక్రమాల ద్వారా భూగర్ఫ జలాలను పెంపొందించేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. గొలుసుకట్టు చెరువుల మరమ్మతులు, చెరువుల్లో పూడిక తీత, పంటసంజీవని పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చెరువులు తెగకుండా చూడాలి జిల్లాలో వచ్చే సీజన్‌కు ఒక్క చెరువుకూడా తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో సాగునీటి సంఘాలు, జన్మభూమి కమిటీలు, ఉపాధి సూపర్వైజర్లు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి పేర్కొన్నారు. జిల్లాలో గత ఏడాది 3,700 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేశామని తెలిపారు. రైతులకు ఎదురుప్రశ్న.. జిల్లాలో చెరువులు తెగిపోయానని, కాళంగి రిజర్వాయరు గేట్లు కొట్టుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని, కొంతమంది రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోయే ప్రయత్నం చేశారు. అయితే ఆయన చెరువులు తెగిపోయాయంటే మీరేం చేశారో చెప్పండి అంటూ ఎదురు్ర పశ్నించారు. దీంతో రైతులు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు డీఏ. సత్యప్రభ, సుగుణమ్మ, ఎంపీ శివప్రసాద్, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీరామకృష్ణ, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ సంచాలకులు శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లక్ష్మీ, ఉద్యానవన శాఖ డీడీ ధర్మజ తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీనీవా ఆయకట్టు సాధనకు ఐక్య ఉద్యమాలు
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ : హంద్రీనీవా కింద ప్రతిపాదించబడిన ప్రతి ఎకరాకూ సాగునీరు అందే వరకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం రాత్రి స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో హంద్రీనీవా ఆయుుకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన సవూవేశానికి ఎమ్మెల్యే వుుఖ్య అతిథిగా హాజరయ్యారు. హంద్రీనీవా ఆయకట్టు సాధన సమితి సభ్యులు లత్తవరం రావుూ్మర్తి అధ్యక్షతన జరిగిన సవూవేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వూట్లాడుతూ హంద్రీనీవా పూర్తి చేయుడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కాలువ పూర్తి చేసి ఆయుుకట్టుకు నీరు ఇవ్వాలని, ఉన్న నీళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పానికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగడుతూ రాయులసీవులోని టీడీపీ ప్రజాప్రతినిధులకు కనువిప్పు కల్గించేలా వురో ఉద్యవూనికి శ్రీకారంచుట్టడానికి అందరు సిద్ధంగా ఉండాలని తెలిపారు. దీనిపై ఈనెల 11న బెలుగుప్పలో జరిగే సవూవేశంలో ఉద్యవు కార్యచరణ హంద్రీనీవా సాధన సమితి రూపొందిస్తుందని తెలిపారు. కార్యక్రవుంలో హంద్రీనీవా ఆయుుకట్టు సాధన సమితి ప్రతినిధులు రాకెట్ల అశోక్, తేజోనాథ్, చిన్నవుూస్టురు సుంకన్న, సభ్యులు మోపిడి తిప్పన్న, కౌకుంట్ల సిద్దారెడ్డి, ఓబన్న, షేక్షానుపల్లి లింగన్న, లత్తవరం గోవిందులు పాల్గొన్నారు. -
3నెలల్లో హంద్రీ-నీవా పూర్తికావాలి
► పనులపై జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అసంతృప్తి ► వేగం పెంచండి, ఇంకొన్ని యంత్రాలు వాడండి ► ఇసుక అక్రమ రవాణాపై 1100,100కు ఫోన్‌చేయండి మదనపల్లె రూరల్: కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేయాలి, 3 నెలల్లో మదనపల్లె-కుప్పం హంద్రీ-నీవా పనులు పూర్తి కావాలి’ అని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ చెప్పారు. మదనపల్లె సమీపంలోని కోళ్లబైలు, పొన్నేటి పాళెం గ్రామాల్లో జరుగుతున్న హంద్రీ-నీవా కాలువ పనులను ఆయన, సబ్ కలెక్టర్ కృతికా బాత్రా కలిసి ఆకస్మికంగా తనిఖీచేశారు. కాట్లాటపల్లె, రామిరెడ్డిగారిపల్లె వద్ద టన్నెల్ (సొరంగం) పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. హంద్రీ-నీవా, రెవెన్యూ, అధికారులతో పాటు రైతుల నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా మార్గం సుగుమం చేసినా ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. టన్నెల్ పనులు మొత్తం 500 మీటర్ల వరకు జరగాల్సి ఉండగా, 200 మీటర్ల పనులే జరగడంపై మండిపడ్డారు. కాంట్రాక్టర్లు ఇంకా యంత్రాలను రంగంలోకి దించాలని సూచించారు. అవసరమైతే మరో మూడు బూమర్లు తెచ్చి స్పీడు పెంచాలని సూచించారు. హంద్రీ-నీవా కాలువ ఎస్ఈ మురళీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 2014-15లో రూ.100 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించగా, తాము రూ.272 కోట్లను ఖర్చు చేశామని చెప్పారు. 2015-16లో రూ 212 కోట్లను కేటాయించగా, రూ.540 కోట్లు ఖర్చుచేసి పనులను వేగవంతం చేశామని తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1600 కిలోమీటర్ల సీసీ రోడ్లు అవసరం ఉందన్నారు. ప్రస్తుతం 400 కిలోమీటర్లు వేయగా, రానున్న ఆర్థిక సంవత్సరంలో మరో 600 కిలోమీటర్ల సీసీ రోడ్లను వేయనున్నట్లు చెప్పారు. రైతులు వరితో పాటు ఉద్యాన పంటలను అధికంగా సాగుచేసి ఆర్థికంగా రాణించాలని సూచించారు. ఇసుకను గృహ నిర్మాణలకే వినియోగించాలన్నారు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తే కఠినంగా చర్యలుంటాయన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే కాల్ సెంటర్1100, 100 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. మండలాలవారీగా రీచ్‌లను గుర్తించి వాటి వివరాల బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. టమాట మార్కెట్లో 10 శాతం కమీషన్ తీసుకుంటే వ్యాపారుల లెసైన్సులు రద్దు చేస్తామన్నారు. ఈఈ రామిరెడ్డి,డీఈఈ హరినాథ్‌రెడ్డి, తహశీల్దార్ శివరామిరెడ్డి, ఆర్ఐ సయ్యద్ ఉన్నారు. -
హంద్రీ-నీవా పనులు వేగవంతం చేయండి
అనంతపురం అర్బన్: హంద్రీ-నీవా పనులు వేగవంతం చేయాలని ప్రాజెక్టు ఇంజనీర్లను కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హంద్రీ-నీ వా పనుల పురోగతిపై ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. ఆ దిశగా అధికారులు పనిచేయాలన్నారు. ప్యాకేజీల వారీగా పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు డిజైన్లను ప్యాకేజీల వారీగా మూడు రోజుల్లో అనుమతి మంజూరు చేయించుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అక్విడెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. రైల్వే క్రాసింగ్లను జాగ్రత్తగా పరిశీలించి పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్‌ను ఆదేశించారు. హంద్రీ-నీవా పూర్తి చేసి బుక్కపట్నం చెరువుకి నీరిస్తే జిల్లా రైతాంగాన్ని కరువు బారిన నుంచి కాపాడుకోవచ్చన్నారు. సమావేశంలో సీఈ జలందర్, ఎస్ఈ సుధాకర్‌బాబు, ఈఈ సుభాష్‌చంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డీఈఈ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
చిత్తూరు జిల్లా మదనపల్లిలోని హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ కుప్పం బ్రాంచ్ 12 డీఈఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించారు. ఈ కార్యాలయంలో డీఈఈగా పనిచేస్తున్న మద్దిలేటి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బెంగళూరులోని ఎస్ఆర్పురంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు సమాచారం. అలాగే ఆయన నివాసంలోనూ సోదాలు చేపట్టారు. -
రాయలసీమ అభివృద్ధికి సమరశీల పోరాటం
కర్నూలు(అర్బన్): అధికార పార్టీ దగాకోరు విధానాలకు వ్యతిరేకంగా రాయలసీమ అభివృద్ధికకి సమరశీల పోరాటం నిర్వహిద్దామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కె. రామాంజనేయులు, కె. ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభివృద్ధిని అడ్డుకుంటే సహించమన్నారని, అయితే వారు చేసిన అభివృద్ధి ఏమిటీ? ఎవరు అడ్డుకున్నారో తెలియజేయాలని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో నిర్వహించిన ఆగష్టు 15 వేడుకల్లో ఇచ్చిన హామీలను ఏనాడైనా ఆయనను అడిగే ప్రయత్నం చేశారా? అని గఫూర్ కేఈని ప్రశ్నించారు. ఇప్పటి వరకు గుండ్రేవుల, పాలహంద్రీ, వేదావతి, హంద్రీనీవా తదితర నీటి ప్రాజెక్టుల ఊసే లేదన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఎయిమ్స్ తరహాలో తీర్చిదిద్దుతామని, కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. అభివృద్ధి మొత్తాన్ని అమరావతిలో కేంద్రీకరిస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని సీమప్రాంతానికి చెందిన అధికారపార్టీ నాయకులను ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ, టీడీపీ ప్రస్తుతం రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి, నేటి వరకు ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు. ప్రజల అవసరాలకు కాకుండా పాలకుల ఆడంబరాలకు నిధులను వాడుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి రూ.12 కోట్లు ఖర్చు చేసి, ఉపయోగించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం తాత్కాలిక రాజధానికి మరో రూ.300 కోట్లు ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర నాయకులు బీమలింగప్ప మాట్లాడుతూ ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సీమ సమాగ్రాభివృద్ధికి ఈ నెల 20 నుంచి మార్చి 5వ తేదీ వరకు బస్సు యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాత్ర 5న కర్నూలుకు చేరుకుంటుందన్నారు. అదే రోజు ముగింపు సభ జరగనుందని, ఈ సభకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి హాజరవుతున్నట్లు చెప్పారు. సమావేశంలో నాయకులు టి. షడ్రక్, గౌస్‌దేశాయ్, రమేష్‌కుమార్, రాధాకృష్ణ, ఎస్ మునెప్ప, లెనిన్‌బాబు, రామాంజనేయులు, సాయిబాబా, రాముడు, అంజిబాబు, ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
జలజాగరణ విజయవంతం
పెద్దసంఖ్యలోతరలివచ్చిన అన్నదాతలు ఎమ్మెల్యే విశ్వకు అన్ని వర్గాల నుంచి సంఘీభావం వజ్రకరూరు : హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నాయకత్వంలో చేపట్టిన ‘రైతుల జలజాగరణ దీక్ష’ విజయవంతమైంది. వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామం వద్ద శనివారం సాయంత్రం ప్రారంభమైన దీక్ష ఆదివారం ఉదయం ముగిసింది. ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో రైతులు, వివిధ పార్టీల నాయకులు, హంద్రీ-నీవా సాధన సమితి సభ్యులు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమం ప్రారంభం నుంచి ముగిసే దాకా మొక్కవోని దీక్షతో జాగరణ చేశారు. హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై దుమ్మెత్తి పోశారు. మొదటి దశ కింద డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువలు వెంటనే నిర్మించి..ఆయకట్టుకు నీరివ్వాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని పక్షాలను కలుపుకుని జిల్లావ్యాప్తంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో హంద్రీ-నీవాపై ప్రత్యేక శ్రద్ధ చూపారని గుర్తు చేశారు. ఆయన హయాంలోనే కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులను పూర్తి చేసి.. ఆయకట్టుకు నీరివ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ మాట్లాడుతూ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. వరుస కరువులతో అల్లాడుతున్న రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే హంద్రీ-నీవాతోనే సాధ్యమన్నారు.కార్యక్రమంలో రాయుదుర్గం వూజీ ఎమ్మెల్యే కాపు రావుచంద్రారెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ అదనపు సవున్వయుకర్త రమేష్‌రెడ్డి, పార్టీ యుువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు అశోక్, దుద్దేకుంట రావూంజినేయుులు, వెంకట్‌రెడ్డి, కాకర్ల నాగేశ్వరావు, రాజశేఖర్‌రెడ్డి, జిల్లా నేత ఆలవుూరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎగ్గుల శ్రీనివాసులు, పెన్నోబులేసు, జయురాం, ఎమ్మెల్యే విశ్వ తనయుుడు వై.ప్రణయ్కువూర్రెడ్డి, వజ్రకరూరు ఎంపీపీ కొర్ర వెంకటవ్ము, వైస్ ఎంపీపీ నారాయుణప్ప, వూజీ ఎంపీపీ శైలజారెడ్డి, పార్టీ వుహిళా కన్వీనర్ భూవూ కవులారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీ-నీవాపై అలసత్వమెందుకు?
జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేదాకా పోరాటం నేడు వజ్రకరూరు మండలం పొట్టిపాడు వద్ద రైతుల జలజాగరణ ‘అనంత’ అన్నదాతలంతా పాల్గొని విజయవంతం చేయాలి ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు కూడేరు :హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం పనులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం కూడేరులో విలేకరులతో మాట్లాడారు. హంద్రీ-నీవాపై ప్రభుత్వానికి ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. హంద్రీ-నీవా సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)లో జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టు వ్యవస్థలు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధాన కాలువ పనులు మాత్రమే చేస్తూ జిల్లాలో సాగునీరిచ్చే విషయాన్ని గాలికి వదిలేసిందన్నారు. డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పక్కన పెట్టాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని, అందుకే వాటి కోసం టెండర్లు పిలవలేదని వివరించారు. అత్యంత తక్కువగా సాగునీటి సౌకర్యమున్న జిల్లాలో హంద్రీ నీవాపై నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీబీ డ్యాం నుంచి రాయలసీమ జిల్లాలకు రావాల్సిన నీటిలో 30 టీఎంసీలను కోల్పోతున్నామన్నారు. ఈ నికరజలాలను హంద్రీ- నీవాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు ఇవ్వాల్సిన 25 టీఎంసీల నీటిని కచ్చితంగా సరఫరా చేయాలని, కానీ సీఎం చంద్రబాబు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో హంద్రీ-నీవాను ఐదు టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా కుదించే ప్రయత్నాన్ని బాబు చేశారని, మళ్లీ ఇప్పుడు చెరువులకు మాత్రమే నీరంటూ జిల్లాకు పది టీఎంసీలతోనే సరిపెట్టే కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి హంద్రీ-నీవా ద్వారా సాగునీటిని పొందేందుకు రైతులతో కలిసి దశలవారీ ఆందోళనలు చేపడతామన్నారు. ఇందులో భాగంగానే శనివారం వజ్రకరూరు మండలం పొట్టిపాడు వద్ద ‘రైతుల జాగరణ’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, అఖిలపక్ష నేతలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేతలు అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు చాంద్‌బాషా, జయరాం, ఎమ్మెల్సీ గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పార్టీ నేత వై.మధుసూదన్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జగదీష్, రాంభూపాల్‌తో పాటు పలువురు హాజరవుతున్నట్లు తెలిపారు. -
రేపు జలజాగరణ
హంద్రీనీవా కోసం వైఎస్సార్ సీపీ నిరసన బాట చంద్రబాబు కపటనాటకం ఆపాలన్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పట్టిసీమపై ఉన్న చిత్తశుద్ధి హంద్రీనీవాపై లేదని ఆగ్రహం అనంతపురం అగ్రికల్చర్: హంద్రీనీవా ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలంటూ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిరసన బాట పట్టారు. ఈ సంవత్సరంలోనే హంద్రీనీవా పూర్తిచేసి 80 వేల ఎకరాలకు నీరివ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో రేపు (శనివారం) సాయంత్రం 4 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామం వద్ద రైతులతో కలిసి జలజాగరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం జిల్లాకు సాగునీరు, తాగునీటి కేటాయింపుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కపటనాటకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టుపై ఉన్న చిత్తశుద్ధి జిల్లా వరప్రదాయనిగా భావిస్తున్న హంద్రీ-నీవా సుజల స్రవంతిపై కనబర్చడం లేదని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే హంద్రీ-నీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందన్నారు. కళ్లముందే కృష్ణాజలాలు జిల్లాకు వస్తున్నా పొలాలకు మాత్రం నీరు రావడం లేదన్నారు. దీంతో ఏటా రూ. వేల కోట్లు విలువ చేసే పంటలు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డిస్ట్రిబ్యూటరీల నుంచి పిల్లకాలువలు, పంట కాలువలు తవ్వితే 33, 34 ప్యాకేజీ కింద వజ్రకరూరు, విడపనకల్, ఉరవకొండ మ ండలాల్లో 40 వేల ఎకరాలకు నీరు అందింవచ్చన్నారు. అలాగే 36వ ప్యాకేజీలో కాలువ పనులు పూర్తీ చేస్తే బెళుగుప్ప మండలంలో 30 వేల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయవచ్చన్నారు. అదే విధంగా హంద్రీ-నీవా రెండో దశ పూర్తీ చేస్తే కూడేరు మండలంలోని అన్ని చెరువులకు నీళ్లు నింపవచ్చని చెప్పారు. పట్టసీమ ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో పది శాతం వ్యయం చేసినా ఇవన్నీ పూర్తీ చేయవచ్చన్నారు. జిల్లాకు నీరివ్వకుండా చిత్తూరు జిల్లా కుప్పంకు నీరు తలరించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. జలజాగరణతో 2016లో బడ్జెట్లో హంద్రీ-నీవాకు ప్రాధాన్యత ఇచ్చేలా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జీబీసీ కాలువ ఆధునీకరణకు వెంటనే నిధులు ఇవ్వాలని, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే తుంగభద్ర ఎగువకాలువ ఆధునీకరణ పూర్తీ చేయాలని, పీఏబీఆర్ నుంచి ఉరవకొండ నియోజక వర్గంలో గ్రామాలకు తాగునీరు అందించే పైప్‌లైన్ యుద్ధప్రాతిపదికన పూర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జలజాగరణ కార్యక్రమానికి అన్ని పార్టీలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మద్ధతు ప్రకటించాలని కోరారు. విలేకరుల సమావేశంలో నియోజక వర్గ నాయకులు రాధాకృష్ణ, హెచ్.చౌదరి, జి.ఉమాపతి, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీనీవా నుంచి నీటి విడుదల
పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండలోని హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి పందికోన రిజర్వాయర్‌కు శుక్రవారం ఉదయం నీటిని విడుదల చేశారు. 300 క్యూసెక్కుల నీటిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కలెక్టర్ మోహన్ విడుదల చేశారు. హంద్రీనీవా కాలువ ద్వారా నీరు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికోన రిజర్వాయర్‌కు చేరనుంది. దీంతో కోడుమూరు, దేవరకొండ, గోనెగండ్ల, ఢోన్ తదితర ప్రాంత ప్రజలకు తాగు నీటిని అందించడానికి వీలవుతుంది. -
శ్రీశైలం జలశయానికి స్వలంగా పెరిగిన ఇన్‌ఫ్లో
శ్రీశైలం: శ్రీశైలం జలశయానికి ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత నీటిమట్టం 842.60 అడుగులు ఉన్నట్టు తెలిపారు. అయితే నీటి నిల్వ 65.85 టీఎంసీలు ఉండగా, ఇన్‌ఫ్లో 10.280 అయితే ఔట్‌ఫ్లో 1,690 క్యూసెక్కుల నీరు హంద్రీనీవాకు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. -
ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు నివారిస్తా
- మార్చికల్లా కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు - సోమశిల-స్వర్ణముఖితో తిరుపతి, శ్రీకాళహస్తి, నగరికి నీళ్లు - కుప్పం పర్యటనలో చంద్రబాబు సాక్షి, చిత్తూరు : వచ్చే మార్చి నాటికి హంద్రీనీవా పనులు పూర్తిచేసి కుప్పానికి తాగునీరు తెస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలో తొలిరోజు పర్యటనలో పలు కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. హంద్రీ-నీవా పనుల కు సంబంధించి పది రోజుల్లో టెండ ర్లు పిలవనున్నట్లు తెలిపారు. మార్చి నాటికి పనులు పూర్తిచేసి కుప్పంతో పాటు మదనపల్లె, పుంగనూరు, చిత్తూ రు ప్రాంతాలకు నీళ్లిచ్చి జిల్లాలో కరువును పారదోలతారన్నారు. సోమశిల- స్వర్ణముఖి ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి పట్టణాలకు, కల్యాణిడ్యామ్, బాలాజీ రిజర్వాయర్‌తోపాటు నగరి నియోజకర్గానికి సైతం నీటిని మళ్లిస్తామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సాగిందిలా ... మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి హెలిక్యాప్టర్‌లో కుప్పంలోని కేఈఎస్ మెడికల్ కళాశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి ఆ తరువాత ఆర్టీసీ బస్టాండు సెంటర్లో మహిళలు ఏర్పాటు చేసిన పోటేళ్లు, మన కోళ్లు స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలకు దీపం గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. అనంతరం కుప్పం సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి ఆ తరువాత కుప్పం శివారులోని అణినిగానిపల్లె గ్రామంలో ఎస్సీ కుటుంబంతో కలిసి భోజనం చేశారు. గ్రామంలో ఎన్టీఆర్ సుజల పథకం తాగునీటి పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వాణి మహల్లో జరిగిన అగ్నికుల క్షత్రియ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఆ తరువాత బీసీఎన్ కన్వెక్షన్ సెంటర్లో జరిగిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ,జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టు..కనికట్టు
అభివృద్ధి పేరిట ప్రభుత్వం హడావుడి చేయడం.. అందుకు తగినట్లుగా అధికారులు అంకెల గారడీ చేయడం పరిపాటిగా మారింది. వాస్తవ విషయానికొస్తే.. కాగితాల్లో చూపిన లెక్కలేవీ కార్యరూపం దాల్చని పరిస్థితి. ఇదేమంటే ప్రభుత్వం ఏమి చేస్తారంటే నివేదిక రూపంలో పంపామని.. అమలు తమ చేతుల్లో లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో అదనపు ఆయకట్టు అభివృద్ధి ఈ కోవకే చెందుతుంది. కర్నూలు సిటీ: కరువు నేలపై కన్నీళ్లు పారించయినా ఈ ఏడాది అదనపు ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయింది. ఆ మేరకు జల వనరుల శాఖ అధికారులు జిల్లా వాస్తవ పరిస్థితి తెలిసీ.. రెండంకెల అభివృద్ధి పేరిట సాగునీటి ప్రాజెక్టుల కింద అదనపు ఆయకట్టు అభివృద్ధికి గత జూన్‌లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఏడాది జిల్లాలోని వివిధ కాలువ కింద 1.92 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేస్తామని అందులో వెల్లడించారు. ఇందులో ఎస్ఆర్బీసీ కింద 1,703 ఎకరాలు, తెలుగుగంగ కింద 39,160, హంద్రీనీవా కింద 73వేలు, గురురాఘవేంద్ర కింద 37వేలు, సిద్ధాపురం ఎత్తిపోతల కింద 21,300, చిన్ననీటి పారుదల శాఖ పరిధిలోని చెరువుల కింద 20వేల ఎకరాలను అదనంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అయితే జిల్లాలో వివిధ కాల్వల కింద మొత్తం 7,79,136 ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇందులో గత ఏడాది వివిధ కారణాలతో 4.28 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారు. మిగిలిన ఆయకట్టును అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ఆయా ప్రాజెక్టుల పనులు సక్రమంగా చేపట్టకపోవడమే అందుకు కారణమైంది. అలాంటప్పుడు అదనపు ఆయకట్టు అభివృద్ధి ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకమైంది. ఈనెల 13న నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశం(ఐఏబీ)లోనూ అదనపు ఆయకట్టు ఊసే కరువైంది. ప్రభుత్వానికి ప్రతిపాదించిన విధంగా అదనపు ఆయకట్టు ప్రస్తావనే లేకుండా సమావేశం సాగింది. సగం ఆయకట్టుకే గతి లేదు.. తుంగభద్ర దిగువ కాల్వ కింద ఖరీఫ్, రబీ సీజన్లలో స్థిరీకరించిన ఆయకట్టు 1,51,134 ఎకరాలు. ఇందులో రెండు సీజన్లకు కలిపి 60వేల ఎకరాలకు మించి నీరివ్వలేకపోతున్నారు. కాల్వను పూర్తి స్థాయిలో ఆధునీకరించకపోవడం, కన్నడిగుల జలచౌర్యాన్ని నిలువరించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కేసీ కాల్వ కింద జిల్లాలో 1,84,209 ఎకరాలకు గాను 1.50 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. కెనాల్ డిస్ట్రిబ్యూటరీలకు మరమ్మతులు చేయకపోవడం వల్ల చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరు సరఫరా కావడం లేదు. శ్రీశైలం కుడి గట్టు కాలువ కింద 1వ బ్లాక్ నుంచి 16 బ్లాకుల వరకు 1,53,936 ఎకరాల ఆయకట్టు ఉం డగా.. గతేడాది ఖరీఫ్‌లో 1వ బ్లాకు నుంచి 11 బ్లాకు వరకు 81879 ఎకరాలు, 12 నుంచి 16 వరకున్న బ్లాకులకు 33,150 ఎకరాల ఆయకట్టు సాగయింది. ప్రస్తుతం ఈ కాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెండింగ్ పనులు పూర్తయితే తప్ప.. పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందని పరిస్థితి. తెలుగుగంగా కాల్వ కింద మొత్తం 1,14,500 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇందులో 75,340 ఎకరాల ఆయకట్టు మాత్రమే యేటా సాగవుతోంది. కెనాల్‌కు డిస్ట్రిబ్యూటరీ ఉన్నా.. పిల్ల కాలువలు లేకపోవడంతో 39,160 ఎకరాలకు నీరు కరువైంది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద జిల్లాలో 80వేల ఎకరాల ఆయకట్టు ఉంది. డిస్ట్రిబ్యూటరీలు, సబ్ కెనాల్స్, పిల్ల కాలువలు లేకపోవడం, ఇందుకు అవసరమైన భూములను సేకరించకపోవడంతో గతేడాది ప్రతిపాదించిన 14,500 ఎకరాలను ఈ ఏడాది కూడా ప్రతిపాదించడంతో సరిపెట్టారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద 50వేల ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా.. ప్రాజెక్టు కింద చేపట్టిన ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి కాకపోవడంతో 13వేల ఎకరాలకే పరిమితమవుతోంది. చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువుల కింద 84వేల ఎకరాలు గాను, 40 వేలకు మించి సాగు కావడం లేదు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు వల్ల 16వేల ఎకరాలు అదనంగా ఆయకట్టును అభివృద్ధి చేయాలని అధికారులు ప్రతిపాదించారు. వర్షాలు కురిస్తేనే అదనపు ఆయకట్టు వర్షాలు సమృద్ధిగా కురిసి జలశయాలు నిండితేనే అదనపు ఆయకట్టు అభివృద్ధి చెందుతుంది. ఒక్క కాల్వల ద్వారానే కాకుండా చెక్‌డ్యాంలు, ఫారంపాండ్స్, చెరవుల ద్వారా భూగర్భ జలాలు పెరిగితే ఆయకట్టు మెరుగవుతుంది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద చేపట్టిన మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా మాత్రమే అదనపు ఆయకట్టు అబివృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఆయకట్టు అభివృద్ధికి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. - చిట్టిబాబు, చీఫ్ ఇంజనీర్ -
హంద్రీ - నీవా సర్వే పనులకు రైతుల బ్రేక్
అలైన్మెంట్ వూర్చారంటూ నిరసన అధికారులను తిప్పిపంపేశారు గుర్రంకొండ : హంద్రీ-నీవా సర్వే పనులను రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. అలైన్మెంట్ వూర్చారంటూ నిరసన తెలియుజేశారు. పనులు చేయనీయకుం డా అధికారులను వెనక్కు పంపేశారు. ఈ సంఘటన గుర్రంకొండ వుండలంలోని రావూపురం గ్రావుంలో జరిగింది. శుక్రవారం ఆ గ్రావూనికి సమీపంలో గతంలో నిలిచిపోరుున కాలువ పనుల వద్దకు హంద్రీ-నీవా అధికారులు, సర్వేయుర్లు చేరుకున్నారు. సమీప పొలాల్లో సర్వే చేస్తుండగా విషయుం తెలుసుకున్న రైతులు అక్కడికి వచ్చారు. గతంలో ఇచ్చిన అలైన్మెంట్ (రూట్ వ్యూప్) ప్రకారమే సర్వే చేయూలని పట్టుబట్టారు. ఇద్దరు భూస్వావుుల పొలాలు కాపాడేందుకే సర్వే వూర్చుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తవు పొలాల్లో సర్వే చేయువద్దంటూ అడ్డుకున్నారు. ప్రస్తుతం వూర్చి చేస్తున్న సర్వేతో తవుకున్న కొద్దిపాటి పొలాలు పోగొట్టుకుంటావుని ఆవేదన చెందారు. గతంలో ఇచ్చిన వూర్కింగ్ ప్రకారమే సర్వేచేసి పనులు చేపట్టాలని, లేని పక్షంలో పనులు జరగనివ్వబోవుని హెచ్చరించారు. అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయుత్నం చేశారు. అరుునా రైతులు వెనక్కి తగ్గకుండా సర్వే పనులు అడ్డుకుని నిరసన తెలియుజేశారు. అధికారులు సర్వేపనులు నిలిపివేసి వెళ్లిపోయూరు. -
హంద్రీనీవాకోసం ఆగస్టు 2 నుంచి ఉద్యమం
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టు సాధన కోసం ఆగస్టు 2 నుంచి ఉద్యమం చేస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతకు నీరివ్వాలని చంద్రబాబు మనసులో లేదు కాబట్టే ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా ఆయకట్టుకు నీరిచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని, లేదంటే ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. -
నిధులు ఇవ్వకుండా నీళ్లు ఇస్తారా ?
-
'హంద్రీనీవాను త్వరగా పూర్తిచేస్తాం'
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు. రామగిరి మండలం కుంటిమద్దిలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. నాగసముద్రం వద్ద అకాల వర్షాలకు దెబ్బతిన్న బొప్పాయి, అరటి తోటలను ఆయన పరిశీలించారు. పంటనష్టపోయిన రైతులకు మేలోగా ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తామని చంద్రబాబు తెలిపారు. -
సీఎం పర్యటనపై మండిపడుతున్న కమ్యూనిస్టులు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనంతపురం పర్యటనపై ఆ జిల్లాకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు తీవ్రగా వ్యతిరేకిస్తున్నాయి. అనంత కరువు నివారణలో చంద్రబాబు విఫలం అయ్యారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు పట్టించుకోలేదని జిల్లావ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు పర్యటను నిరసనగా సీపీఎం నేతలు కలెక్టరేట్ ముందు 20 గంటలు ప్రజా జాగరణ చేపట్టనున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఆందోళన తీవ్రతరం చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. గుంతకల్లు, రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లో హంద్రీనీవా కాల్వ గట్టులపై నిద్ర చేపట్టనున్నట్టు వారు తెలిపారు. -
కడప పర్యటనలో వైయస్ జగన్
-
హంద్రినీవా, గండికోటపై వైఎస్ జగన్ సమీక్ష
కడప : వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం హంద్రినీవా, గండికోట ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన కడప స్టేట్ గెస్ట్ హౌస్‌లో అధికారులతో భేటీ అయ్యారు. రాయలసీమకు ప్రధానమైన ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఉన్న అడ్డంకులపై ఆయన ఆరా తీశారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కావలసిన వివరాలు, ఇతర అనుమతుల అంశాలపై వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. ప్రభుత్వం కేవలం 20 శాతం నిధులు ఇస్తే...ప్రాజెక్టులు పూర్తి అవుతాయి కదా అని ఆయన అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ మూడో రోజు కూడా బిజీబిజీగా గడపనున్నారు. ఆయన పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలను పరామర్శించనున్నారు. వేములపల్లి మండలం గొల్లపల్లిలో సూర్యనారాయణ కుటుంబంతో పాటు, రాజారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. -
హంద్రినీవా పూర్తయ్యేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తా'
-
'హంద్రినీవా పూర్తయ్యేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తా'
అనంతపురం:హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ తన పోరాటాన్ని కొనసాగిస్తానని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టుకు తక్షణం రూ.100 కోట్లు కేటాయించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గురువారం నిరహారదీక్ష విరమించిన అనంతరం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తానని తెలిపారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ సోదరులు రాజ్యంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. హంద్రినీవా ప్రాజెక్టు చేయాలనే డిమాండ్ తో విశ్వేశ్వరరెడ్డి బుధవారం దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆయన 25 గంటల దీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. -
'బాబుకు మహిళల ఉసురు తగులుతుంది'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్రానికి ఉన్న పరువును, గుర్తింపును కుక్కలు చింపిన విస్తరి చేశారని ఆమె గురువారమిక్కడ మండిపడ్డారు. ఓ వైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే...మరోవైపు చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరగడం అవసరమా అని రోజా సూటిగా ప్రశ్నించారు. పాలన గాలికి వదిలేసిన చంద్రబాబు...రాజధాని భూముల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని రోజా విమర్శించారు. మహిళలను కంటతడి పెట్టించిన వారెవ్వరూ బాగుపడరని, చంద్రబాబుకు ఆడవాళ్ల ఉసురు తప్పక తగులుతుందని అన్నారు. రాయలసీమకు గుండెకాయల్లాంటి హంద్రీనీవాను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు రెండుసార్లు అనంతపురం జిల్లాకు వచ్చారని, ఇంతవరకు జిల్లాకు చేసింది ఏమీ లేదని కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా అన్నారు. -
'హంద్రీనీవా ప్రాజెక్టు కోసం నిరాహార దీక్ష'
హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తిచేయాలనే డిమాండ్‌తో ఈ నెల 28, 29 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. 12 ఎమ్మెల్యే , 2 ఎంపీ స్థానాల్లో టీడీపీని గెలిపించిన అనంతపురం జిల్లా వాసులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విస్మరించారన్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారన్నారు. చంద్రబాబు అబద్ధాలకోరు అని విశ్వేశ్వర రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
‘హంద్రీ నీవాను పూర్తి చేస్తాం’
గుంతకల్లు : హంద్రీనీవాను పూర్తి చేసి నీటి సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. అనంతపురం, కర్నూలు జిల్లాలకు వరప్రసాదిని అయిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల హడావుడిగా పూర్తి చేయడంతో అనేక చోట్ల గండ్లు పడుతున్నాయన్నారు. అనంతపురం జిల్లాపై చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం ఉందని, అందులో భాగంగానే సోలార్‌హబ్, ఫుడ్‌పార్కు, టెక్స్‌టైల్స్‌పార్కు తదితర పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ కుదింపునకు గురికాకుండా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అంతకుముందు ఆలయ ఈఓ ఎంవీ సురేష్‌బాబు, అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఈఓతో పాటు ప్రధాన అర్చకులు వసుధ రాజాచార్యులు డిప్యూటీ సీఎంను సన్మానించారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ కోడెల అపర్ణ, వైస్ చైర్మన్ శ్రీనాథ్ గౌడ్, ఆర్డీఓ హుస్సేన్‌సాబ్, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆ హామీల విలువ రూ.7,070 కోట్లు
-
ఆ హామీల విలువ రూ.7,070 కోట్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తొమ్మిదేళ్ల పాలనలో ఆచితూచీ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అడిగిందే తడువుగా వరాల వర్షం కురిపించేస్తున్నారు. ఆ హామీల అమలును దాటవేస్తూ వస్తున్నారు. రాజధాని ఎంపికపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు సెప్టెంబరు 4న ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాకుండా ఇప్పటిదాకా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించకపోవడమే అందుకు తా ర్కాణం. బుధవారం జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగాంగా సీఎం చంద్రబాబు కురుబలకోట మండలం అంగళ్లులో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రజాప్రతినిధులు అడిగినని.. అడగని వాటికీ అమలు ఇచ్చేశారు. రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీళ్లు.. 30 లక్షల మందికి తాగునీళ్లు అందించే హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం తొలి దశ పాక్షికంగా పూర్తయింది. రెండో దశ పూర్తిచేయాలంటే రూ.4,500 కోట్లు అవసరం. ఈ ప్రాజెక్టుకు 2014-15 బడ్జెట్లో కనీసం రూ.750 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు పరిశీలించి చంద్రబాబు ప్రభుత్వం.. ఆగస్టు 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.100.28 కోట్లనే కేటాయించడ గమనార్హం. ఆ నిధులు కూడా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడానికే సరిపోయాయి. ఇది చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ.. బుధవారం అంగళ్లు సభలో చంద్రబాబు మాట్లాడుతూ దుర్భిక్ష జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నా.. పశ్చిమ మండలాల ప్రజల దాహార్తి తీర్చాలన్నా హంద్రీ-నీవా ఒక్కటే శరణ్యమన్నారు. రూ.4,500 కోట్లను ఖర్చు చేసి ఏడాదిలోగా హంద్రీ-నీవాను పూర్తిచేసి.. కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొస్తామని స్పష్టీకరించారు. ఇది సాధ్యం కావాలంటే ఇప్పటి నుంచి ప్రతి నెలా సగటున రూ.375 కోట్లను హంద్రీ-నీవాకు విడుదల చేయాలి. 2014-15 బడ్జెట్లో రూ.100.28 కోట్లే కేటాయించిన చంద్రబాబు.. ప్రతి నెలా ఒక్క హంద్రీ-నీవాకే రూ.375 కోట్లు ఎలా కేటాయిస్తారన్నది అంతుచిక్కడం లేదు. హంద్రీ-నీవాకు సమాంతరంగా వాటర్ గ్రిడ్‌ను కూడా చేపట్టి పశ్చిమ మండలాల దాహార్తి తీర్చుతామని హామీ ఇవ్వడం గమనార్హం. బెంగుళూరు నుంచి అనంత మీదుగా కుప్పం వరకూ ... బెంగుళూరు-అనంతపురం-మదనపల్లె-పలమనేరు-కుప్పం మీదుగా రింగ్ రోడ్డును నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ రింగ్ రోడ్డు పూర్తయితే.. ఆలోగా కృష్ణా జలాలను రప్పిస్తే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తోడు ఫార్మాసూటికల్ పరిశ్రమలు కూడా పశ్చిమ మండలాలకు భారీ ఎత్తున తరలివస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇది ఉపాధికి కొదువ లేకుండా చేస్తుందని జోస్యం చెప్పారు. ఈ రింగ్ రోడ్డును నిర్మించాలంటే కనిష్ఠంగా రూ.రెండు వేల కోట్లు అవసరం అవుతాయని ఆర్అండ్బీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఇక మన జిల్లా పాడి పరిశ్రమకు పెట్టింది పేరు. ప్రస్తుతం రోజుకు 22 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తవుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ 400 నుంచి 500 పశువులకు వసతి కల్పించేలా ఊరి బయట హాస్టల్స్ నిర్మించి.. 50 నుంచి 60 ఎకరాల్లో సామూహికంగా పశుగ్రాసాన్ని పెంచి.. మిషన్ల ద్వారా పాలను పితికి డెయిరీలకు విక్రయించి.. పాల ఉత్పత్తిని 50 లక్షల లీటర్లకు పెంచుతామని.. ఇందుకోసం జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని చెప్పారు. ఈ పైలట్ ప్రాజెక్టు అమలుకు కనిష్ఠంగా రూ.500 కోట్లు అవసరం అవుతాయని పశుసంవర్ధకశాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. జిల్లాలో టమాట పంటలో పోస్ట్ హార్వెస్టింగ్‌లో సాంకేతిక విధానాలను అందిపుచ్చుకుని.. టమాటాలను కొంత కాలం నిల్వ ఉంచగలిగితే మంచి ధరను పొందవచ్చునన్నారు. ఇందుకోసం టమాట ప్యాకేజీ కింద రూ.పది కోట్లను మంజూరుచేస్తామన్నారు. జిల్లాను హర్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఉన్న ఊరి నుంచే ఆన్లైన్లో పండ్లను అమ్ముకునే వెసులుబాటును రైతులకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టమాట రైతు రుణాలను మాఫీ చేయాలన్న ప్రజాప్రతినిధుల డిమాండ్‌పై చంద్రబాబు నే రుగా స్పందించలేదు. ఉద్యానపంట కింద ట మోటా వస్తుందని.. రైతులకు న్యాయం చేసేం దుకు ప్రయత్నిస్తామని చెప్పడం గమనార్హం. తంబళ్లపల్లెపై హమీలవాన తంబళ్లపల్లె నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.50 కోట్లను మంజూరు చేస్తున్నట్లు సీ ఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ నిధులు ఎ ప్పటిలోగా విడుదల చేస్తారు.. ఎప్పటిలోగా రో డ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తారన్నది స్పష్టం చేయలేదు. బి.కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు కనీసం రూ.ఐదు కోట్లు అవసరం అవుతాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు. బి.కొత్తకోటలో డిగ్రీ కాలేజీని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఇందుకు కూడా కనీసం రూ.ఐదు కోట్లు అవసరం అవుతాయి. మొత్తమ్మీద బుధవారం చంద్రబాబు ఇచ్చిన హామీల విలువ రూ.7,070 కోట్లకు చేరింది. సెప్టెంబరు 4న చంద్రబాబు శాసనసభలో ఇచ్చిన హామీ విలువ రూ.25 వేల కోట్లకుపైగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. శాసనసభలో సెప్టెంబరు 4న ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీనీ అమలుచేసే దిశగా చంద్రబాబు కనీసం ప్రయత్నాలు కూడా చేయకపోవడం గమనార్హం. -
హంద్రీనీవా జల చౌర్యం
గుంతకల్లు రూరల్ : ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఒత్తిళ్లకు తలొగ్గి అనంతపురం జిల్లాకు అందాల్సిన కృష్ణ జాలలను కర్నూలుకు మళ్లించి జల చౌర్యానికి తెరతీశారని, దీనిని సహించబోమని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు. హంద్రీనీవా నుంచి తూము ద్వారా ఏబీసీకి విడుదలవుతున్న కృష్ణా జలాలను పది రోజుల్లో నిలిపివేయాలని లేనిపక్షంలో తామే తూమును మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం జి.కొట్టాల సమీపంలోనున్న హంద్రీనీవా కాలువను సోమవారం ఆయన సందర్శించారు. కృష్ణా జలాలను ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు నీటి మళ్లింపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అతి తక్కువ వర ్షపాతంతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాను ఆదుకోవాలనే లక్ష్యంతో హంద్రీనీవా కాలువ నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. కానీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎక్కడపడితే అక్కడ దౌర్జన్యంగా హంద్రీనీవా నీటిని మళ్లించుకుంటూ జలచౌర్యానికి పాల్పడుతున్నారన్నారు. కర్నూలు జిల్లాకు తుంగభద్ర నీటితోపాటు, పోతురెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణాజలాలను అధికంగా కేటాయించారన్నారు. అయితే ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు తుంగభద్ర నీరు రావడంలేదన్న ఉద్దేశంతో కర్నూలు జిల్లా నాయకులు అనంతపురం జిల్లాకు రావలసిన కృష్ణాజలాలను దౌర్జన్యంగా మళ్లించుకోవడం దారుణమన్నారు. గుంతకల్లు నియోజకవర్గంలోని చాంద్రాయుని గుట్టతోపాటు దాదాపు 20 వేల ఎకరాల ఆయకట్టుకుగుంతకల్లు సబ్ బ్రాంచ్ కెనాల్ ద్వారా అందాల్సిన తుంగభద్ర నీరు అందడంలేదన్నారు. దానికి హంద్రీనీవా నీరు ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లాకు రావలసిన తుంగభద్ర జలాలను ఓవైపు కర్ణాటక, హంద్రీనీవా జలాలను మరోవైపు కర్నూలు చౌర్యం చేస్తూపోతే జిల్లా వాసుల పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాలువను పరిశీలించిన వారిలో సీపీఐ నియోజక వర్గం కార్యదర్శి గోవిందు,పట్టణ కార్యదర్శి అబ్దుల్ వహాబ్,జాయింట్ సెక్రెటరి గుత్తి బాషా,ఎఐవైఎఫ్ నాయకుడు గౌస్ ఉన్నారు.