
ఈ నెల 7,8 తేదీల్లో 'జల జాగరణ'
అనంతపురం: హంద్రీనీవా కింద ప్రతిపాదించబడిన ప్రతి ఎకరాకూ సాగునీరు అందే వరకు పోరుబాటను తీవ్రతరం చేస్తున్నామని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఈ నెల 7, 8 తేదీల్లో బెలుగుప్పలో 'జల జాగరణ' కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. హంద్రీనీవా ఆయనకట్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.