కూడేరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విశ్వ, పీడీ రంగయ్య, కురుబ క్రిష్టప్ప
కూడేరు: రాష్ట్రాభివృద్ధిని మరిచి విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లడమే పనిగా సీఎం చంద్రబాబు పెట్టుకున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి, అనంతపురం పార్లమెంట్ సమన్వయ కర్త పీడీ రంగయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుబ క్రిష్టప్ప విమర్శించారు. మంగళవారం కూడేరులో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసులకు భయపడే నైజం జగన్‌లో లేదన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడడం బాబు అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధనకు పలుమార్లు ఢిల్లీలో దీక్షలు, ఆందోళనలు జగన్ చేపట్టారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి ఎంపీల చేత రాజీనామా చేయించిన ఘనత కూడా జగన్‌దేనన్నారు.ప్రత్యేక హోదా సాధన కోసమంటూ ధర్మపోరాటం పేరిట చంద్రబాబు దీక్ష చేపట్టి రూ.30 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. కేసులకు భయపడకుండా ఉంటే కోర్డు నుంచి స్టే ఎందుకు తెచ్చుకున్నారంటూ బాబుని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో కోట్లాది రూపాయలు దోచుకున్నారని, అమరావతి నిర్మాణం డిజైన్ కోసం ఇతర దేశాలకు ప్రత్యేక విమానాల్లో తిరిగి సుమారు రూ.100 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment