చెరువులకు హంద్రీనీవా నీరు
Published Tue, Oct 4 2016 12:47 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
రెండు చెరువులను పరిశీలించిన కలెక్టర్
కర్నూలు సిటీ: హంద్రీనీవా కాలువ ద్వారా ప్రత్యేకాభివృద్ధి నిధులతో చెరువులకు నీరు నింపేందుకు చర్యలు తీసుకోవాలని చిన్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లను జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ ఆదేశించారు. సోమవారం బి.తాండ్రపాడు, తడకనపల్లె చెరువులను కలెక్టర్ పరిశీలించారు. ఈ చెరువులకు నీరు పంపింగ్ చేసేందుకు శాశ్వతంగా పంపింగ్ రూములు, మోటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తడకనపల్లె చెరువులో పూర్తి స్థాయిలో పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బి.తాండ్రపాడు చెరువు ఆక్రమణలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు భూమిలో ఎవరో బోర్డులు పెడుతుంటే మీరే చేస్తున్నారని తహసీల్దారు రమేష్‌బాబుపై మండిపడ్డారు. బోర్డులు తొలగించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎస్‌ఈ చంద్రశేఖర్ రావు, ఈఈ శ్రీనివాసులు, ఏఈఈ హసన్ బాషా తదితరులు ఉన్నారు.
Advertisement