హంద్రీనీవాకు మరో 5 టీఎంసీలు | 5 tmcs for handrineeva | Sakshi
Sakshi News home page

హంద్రీనీవాకు మరో 5 టీఎంసీలు

Published Tue, Oct 4 2016 12:40 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM

5 tmcs for handrineeva

కర్నూలు సిటీ: హంద్రీనీవా కాలువ ద్వారా మరో 5 టీఎంసీల నీరు వాడుకునేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు అంగీకరించింది. ఈ కాలువ కింద కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన ఆయకట్టుకు సాగు నీరు ఇస్తున్నారు. ఈ ఖరీఫ్‌ మొదట్లో తొమ్మిది టీఎంసీల నీటిని వాడుకునేందుకు బోర్డు అనుమతులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ నీటిని ఆరు పంపుల ద్వారా కాలువకు ఎత్తిపోశారు. కేటాయించిన నీరు సోమవారంతో పూర్తయింది. అనంతపురం జిల్లాలోని చెరువులన్నీ హంద్రీనీవా నీటితో నింపుతున్నారు. ఇలాంటి సమయంలో కాల్వకు నీరు బంద్‌ అయితే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే నీటి విడుదలను కొనసాగించాలని బోర్డును కోరారు. ఈ మేరకు మరో ఐదు టీఎంసీల నీటిని వాడుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అధికారికంగా నేడు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement