అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనంతపురం పర్యటనపై ఆ జిల్లాకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు తీవ్రగా వ్యతిరేకిస్తున్నాయి. అనంత కరువు నివారణలో చంద్రబాబు విఫలం అయ్యారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు పట్టించుకోలేదని జిల్లావ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు పర్యటను నిరసనగా సీపీఎం నేతలు కలెక్టరేట్ ముందు 20 గంటలు ప్రజా జాగరణ చేపట్టనున్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలన్న డిమాండ్తో ఆందోళన తీవ్రతరం చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. గుంతకల్లు, రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లో హంద్రీనీవా కాల్వ గట్టులపై నిద్ర చేపట్టనున్నట్టు వారు తెలిపారు.
సీఎం పర్యటనపై మండిపడుతున్న కమ్యూనిస్టులు
Published Fri, Apr 10 2015 7:38 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM
Advertisement
Advertisement