సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాలు విజయ యాత్ర చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన చేయూతతో ఎలా అభ్యున్నతి చెంది, సాధికారత సాధించాయో రాష్ట్రమంతా చాటి చెబుతున్నాయి. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రమంతా విజయవంతంగా సాగుతోంది.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనిస్తూ, కేబినెట్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకూ సింహభాగం పదవులివ్వడం ద్వారా పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ చేసిన సామాజిక న్యాయం ఆ వర్గాల ప్రజల్లో చైతన్యాన్ని రగల్చింది. సామాజిక సాధికార యాత్రలు జగన్నినాదమై ప్రతిధ్వనిస్తున్నాయి.
సామాజిక సాధికార యాత్ర శుక్రవారం అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లె, పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం నియోజకవర్గాల్లో జరిగింది. మూడు నియోజకవర్గాల్లో యాత్రకు జనం నీరాజనాలు పలికారు. ఆ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు ప్రజలు కడలిలా తరలివచ్చారు. నేతల ప్రసంగాల్లో సీఎం వైఎస్ జగన్ పేరును ప్రస్తావించినప్పుడల్లా ‘మా నమ్మకం నువ్వే జగన్.. జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ ప్రజలు ప్రతిస్పందించారు.
ఇదీ చదవండి: అమలు గ్యారంటీ
Comments
Please login to add a commentAdd a comment