హంద్రీ–నీవాకు గుదిబండగా సొరంగం | handrineeva work delayed at tannel | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవాకు గుదిబండగా సొరంగం

Published Fri, Jul 22 2016 6:17 PM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM

పెద్దమండ్యం మండలంలో ఇబ్బందికరంగా మారిన టన్నల్‌ - Sakshi

పెద్దమండ్యం మండలంలో ఇబ్బందికరంగా మారిన టన్నల్‌

హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టు రెండోదశకు చిత్తూరుజిల్లాలోని సొరంగం (టన్నల్‌) పనులు గుదిబండగా మారాయి. ఈ ఆగస్టుకు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటిని అందించి తీరుతామని ప్రభుత్వం ప్రకటించింది.

– జిల్లాలో ప్రధానకాలువ పరిధిలో 2.1కిలోమీటర్ల సొరంగం  
–పనులు పూర్తి చే సేందుకు 2018 వరకు పడుతుంది
–ఇది పూర్తికాకుంటే శ్రీనివాసపురం, అడవిపల్లె రిజర్వాయర్లు,      
–ఉప కాలువలు ఒట్టిపోయాల్సిందే  
–తేల్చిచెప్పిన అధికారులు, అవాక్కయిన ముఖ్యమంత్రి 
 
బి.కొత్తకోట: 
హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టు రెండోదశకు చిత్తూరుజిల్లాలోని సొరంగం (టన్నల్‌) పనులు గుదిబండగా మారాయి. ఈ ఆగస్టుకు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటిని అందించి తీరుతామని ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్, చిత్తూరుజిల్లాలకు నీరు వెళ్లాలంటే తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలోని సొరంగం పనులు పూర్తి చేయాలి. తాజాగా ఈ పనులు పూర్తి చేసేందుకు రెండేళ్ల సమయం పడుతుందని తేల్చారు. ఈ పనులు పూర్తికాకనే ఆగస్టుకు ప్రభుత్వం నీళ్లేలా ఇస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.  పెద్దమండ్యం మండలంలోని గొళ్లపల్లె నుంచి వైఎస్సార్‌ జిల్లా చిన్నమండ్యం మండలం కొటగడ్డకాలనీ వరకు ప్రధానకాలువలో భాగంగా 5.1కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వేందుకు 2006లో రూ.47.57కోట్లతో ఎకేఆర్‌కోస్టల్‌ కంపెనీ ఒప్పందం చేసుకొంది. ఈ కంపెనీ రూ.18.97కోట్ల విలువైన 630మీటర్ల సొరంగం పనులు చేసి చేతులెత్తేసింది. మిగిలిన రూ.28.6కోట్ల పనులను 20ఎ ప్యాకేజీగా 2015లో ఆర్‌కేఇన్‌ఫ్రా సంస్థకు ఒప్పంద విలువతో అప్పగించారు. ఈ సంస్థ రూ.3.6కోట్ల విలువైన 800మీటర్ల సొరంగం పనులుచేసి ఆగిపోయింది. మిగిలిన 3.5కిలోమీటర్ల టన్నల్‌ పనుల్లో 2.1కిలోమీటర్ల పనులను 20బీ ప్యాకే జి కింద రూ.16.77కోట్ల పనికి రూ.70.82కోట్లకు పెంచి టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో ఒకేఒక సంస్థ పాల్గొనగా ప్రభుత్వం టెండర్‌ను రద్దుచే యడంతో మళ్లీ టెండర్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ టన్నల్‌ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లే దు. 2.1కిలోమీటర్ల మార్గంలో సొరంగం తవ్వాక పైనుంచి మట్టితో పూడిపోతూ సొరంగం నిలవడంలే దు. ఈ పనులను షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం నిబంధనలను సడలించింది. సొరంగం పరిశీలించిన సంస్థకు చెందిన టన్నల్‌ ఎక్స్‌పర్ట్‌ సత్యనారాయణ పనులు పూర్తిచేసేందుకు రెండేళ్ల సమయం పడతుందని తేల్చడంతో ఉన్నతాధికారులు షాక్‌కు గురయ్యారు. 
’రెండేళ్లు పడుతుంది
ప్రధానకాలువలో 5.1కిలోమీటర్ల సొరంగం పనుల్లో 1.6కిలోమీటర్లు తవ్వారు. 20ఎ ప్యాకేజికి చెందిన 1.4 కిలోమీటర్ల పనుల్లో రోజుకు ఒకటి లేదా మీటర్ల పనులే జరుగుతున్నాయి.  2.1కిలోమీటర్ల సొరంగం పనులు కష్టతరమైనవిగా గుర్తించారు. ప్రారంభంలో సొరంగం గట్టిపొర వచ్చిందని కార్మికులు పనులు చేస్తూ ముందుకు సాగాక సొరంగంలోకి గాలి సోకడంవల్ల పైపొరలు పెళుసుగా మారి కూలిపోతున్నాయి. దీనితో సొరంగం బురదగా మారిపోతోంది. పనులు చేసేందుకు అటంకంగా మారింది. ఈ సొరంగంలో 64వేల క్యూబిక్‌మీటర్ల టన్నల్‌ మట్టిపని, 32వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ లైనింగ్‌ పనులతోపాటు 18వేల క్యూబిక్‌మీటర్లు ఇతరా కాంక్రీట్‌ పనులు జరగాల్సివుంది. ఈ పనులు ఈ డిసెంబర్‌కల్లా పూర్తిచేయాలని గతంలో సీఎం ఆదేశించినా ఈ పనికి రెండేళ్లు పడుతుందని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ పనులకు గతనెలలో నిర్వహించిన టెండర్లలో మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ ఒక్కటే పాల్గొనడంతో ఆ టెండర్‌ను ప్రభుత్వం రద్దు చేయగా మళ్లీ టెండర్లు నిర్వహిస్తున్నారు. 
’ఒట్టిపోవాల్సిందే
ఈ సొరంగం పనులు పూర్తికాకుంటే రూ.1,550కోట్ల పనులు నిరుపయోగం అవుతాయి. ప్రధానకాలువలో భాగమైన సొరంగం ద్వారానే వైఎస్సార్‌కడపజిల్లాలోని శ్రీనివాసపురం రిజర్వాయర్, చిత్తూరుజిల్లాల్లోని అడివిపల్లె రిజర్వాయర్, వాయల్పాడు, నీవా ఉప కాలువలకు నీరు వెళ్లాలి. ఆగస్టుకు నీరిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేయకనే నీరిచ్చే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విజయవాడలో హంద్రీ–నీవా ప్రాజెక్టుపై    ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించగా పెద్దమండ్యం టన్నల్‌ ప్రస్తాపన తేచ్చారు. డిసెంబర్‌కు పూర్తి చేయాలని సూచించగా టెండర్ల నిర్వహణకే నెల అవుతుందని, పనిచేపట్టినా రెండేళ్లలోపు పూర్తిచేసే పరిస్థితులు లేవని స్పష్టం చేయడంతో సీఎం అవాక్కయినట్టు సమాచారం. ఇది పూర్తి చేయకుంటే ఇబ్బందికరమని, ఆలోచించి త్వరిగతిన పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారని అధికారులు చెబుతున్నారు.   
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement