'హంద్రీనీవా ప్రాజెక్టు కోసం నిరాహార దీక్ష'
హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తిచేయాలనే డిమాండ్తో ఈ నెల 28, 29 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. 12 ఎమ్మెల్యే , 2 ఎంపీ స్థానాల్లో టీడీపీని గెలిపించిన అనంతపురం జిల్లా వాసులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విస్మరించారన్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారన్నారు. చంద్రబాబు అబద్ధాలకోరు అని విశ్వేశ్వర రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.