అనంతపురం: అనంతపురం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. హంద్రినీవా ప్రాజెక్టు పనులపై మంత్రులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి నిలదీయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తిచేసి.. హంద్రినీవా నీటితో హెచ్‌ఎల్‌సీ ఆయకట్టును ఎందుకు కాపాడలేకపోయారని ఆయన ప్రశ్నించారు. హంద్రినీవా నీటిపై చంద్రబాబు ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక లేదని ఆయన విమర్శించారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డితో మంత్రి కామినేని శ్రీనివాస్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వాగ్వాదానికి దిగారు.
గురువారం జరిగిన అనంతపురం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులతోపాటు ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్‌రెడ్డి, బాలకృష్ణ, యడగాపురం సురి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, యామినీ బాల, ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి సమీక్ష సమావేశంలో రసాభాస
Published Thu, Oct 20 2016 8:04 PM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM
Advertisement