వడ్డేమాన్ గ్రామంలోకి హంద్రీనీవా నీరు
వడ్డేమాన్ గ్రామంలోకి హంద్రీనీవా నీరు
Published Fri, Nov 4 2016 9:30 PM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM
గుర్తు తెలియని వ్యక్తులు కాలువ తూం గేటు ఎత్తివేత
–ముంపునకు గురైన పంట పొలాలు
- స్పందించి గేటు మూసేసిన హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు
నందికొట్కూరు: మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామ పొలిమేరలో ఉన్న హంధ్రీనీవా కాలువ తూం గేటును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ఎత్తేశారు. దీంతో ఉద్ధృతంగా ప్రవహిస్తూ కాలువ నీరు వడ్డేమాను గ్రామంలోకి చేరాయి. దాదాపు 30 ఎకరాల్లో పంటలు నీట మునగగా, పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఊహించని విధంగా గ్రామంలోకి నీరు రావడంతో ప్రజలు, రైతులు కొద్దిసేపు ఆందోళన గురయ్యారు. సమాచారం తెలుకున్న హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు హుటాహుట్టిన కాలువ వద్దకు చేరుకుని తూంను వెంటనే మూసివేశారు. దీంతో నీటి ఉద్ధృతి తగ్గిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వెంటనే స్పందించకపోయి ఉంటే వందల ఎకరాల పంట దెబ్బతినే అవకాశం ఉండేదని రైతులు తెలిపారు. గేటు ఎత్తేసిందేవరో గుర్తించడంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని వారు అధికారులకు కోరారు.
Advertisement