హంద్రీనీవా కాలువలో యువతి మృతి | young woman died in handrineeva | Sakshi
Sakshi News home page

హంద్రీనీవా కాలువలో యువతి మృతి

Published Tue, Jan 3 2017 12:08 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM

young woman died in handrineeva

నెహ్రూనగర్‌ (పగిడ్యాల): మతిస్థిమితం లేని ఓ యువతి ప్రమాదవశాత్తు హంద్రీనీవా కాలువలో పడి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం నెహ్రూనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన వీరమ్మ కూతురు తిరుపతమ్మ(22) పుట్టకతోనే మతిస్థిమితంతో బాధపడుతోంది. కుమార్తెను ఈమె జాగ్రత్తగా చూసుకునేది. అయితే సోమవారం..సీఎం బహిరంగ సభ కోసం ఆమె  ముచ్చుమర్రి వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చే సరికి కుమార్తె కనిపించలేదు. ఆచూకీ కోసం  బంధువులను, ఇరుగుపొరుగు వారిని విచారించినా జాడ కనిపించలేదు. అనుమానం వచ్చిన బంధువులు నివాస ప్రాంతాలకు సమీపంలోని హంద్రీనీవా కాలువ వెంబడి గాలించి తిరుపతమ్మ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై ముచ్చుమర్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బంధువులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement