హంద్రీనదిలో విద్యార్థి మృతి
Published Sun, Sep 18 2016 11:49 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
కృష్ణగిరి: హంద్రీనదిలో నీరు తాగడానికి వెళ్లి గుంతలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాదిగ కర్రెన్న, మరియమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు పవన్‌కుమార్ నందికొట్కూరులో ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్నవాడు చిన్న చరణ్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మూడో తరగతి చదవుతున్నాడు. తల్లిదండ్రులు ఇంటి వద్ద చరణ్‌కు భోజనం పెట్టి కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లవాడు కనిపించలేదు. గ్రామస్తులంతా సమీపంలోని కాల్వలు, హంద్రీలో ఉన్న ఇసుకగుంతలో గాలించగా శవమై తేలాడు. ఆదివారం సెలవు కావడంతో తోటి పిల్లలతో సమీపంలోని ఎల్లమ్మ గుడి సమీంలో అడుకుంటూ నీరు తాగేందుకు హంద్రీలోకి వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడి చరణ్(9)మృతి చెందాడు. కుమారుడు ఆకాల మరణంతో తల్లిదండ్రులు రోదన అందరిని కలిచివేసింది.
గుంతలే ప్రాణం తీశాయి..
హంద్రీలో ఇసుకను అమ్మకోవడంతో కొందరు పెద్ద గుంతలు తీశారు. ఇవి ప్రమాదకరంగా మారాయని 25రోజుల క్రితమే ‘సాక్షి’ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.నాలురోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి హంద్రీ పొంగి గుంతలో నీరు చేరింది. ఈ గుంతే చిన్నారి చరణ్ మృతికి కారణమైంది.
Advertisement